28 Degrees Celsius Movie Review: 28 డిగ్రీస్ సెల్సియస్ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
నటీనటులు: నవీన్ చంద్ర, దేవయాని శర్మ, ప్రియదర్శి పులికొండ, జయప్రకాశ్, హర్ష చెముడు, షాలిని వడ్నికట్టి, రాజా రవీంద్ర తదితరులు
రచన, దర్శకత్వం: అనిల్ విశ్వనాథ్
నిర్మాత: సాయి అభిషేక్
సహ నిర్మాత: విక్రమ్ జూపుడి, సంజయ్ జూపుడి
మ్యూజిక్: శర్వన్ భరద్వాజ్
బ్యాక్ గ్రౌండ్ స్కోర్: శ్రీ చరణ్ పాకాల
సినిమాటోగ్రఫి: వంశీ పచ్చి పులుసు
ఎడిటింగ్: గ్యారీ బీహెచ్
బ్యానర్: వీరాంజనేయ ప్రొడక్షన్స్, రివర్ సైడ్ సినిమాస్
రిలీజ్ డేట్: 2025-04-04
మెడికల్ స్టూడెంట్స్ అయిన కార్తీక్ (నవీన్ చంద్ర), అంజలి (శాలిని) ఇద్దరు ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకొంటారు. అంజలి ఓ అరుదైన వ్యాధితో బాధపడుతుంటుంది. ఆమె వ్యాధికి జార్జియాలో ట్రీట్‌మెంట్ ఉందని తెలియడంతో ఇద్దరు అక్కడికి వెళ్తారు. ట్రీట్‌మెంట్ జరుగుతున్న సమయంలో హఠాత్తుగా అంజలి మరణిస్తుంది.

కార్తీక్, అంజలి మధ్య లవ్ అఫైర్ ఎలా కుదిరింది? అంజలిని వేధించే అరుదైన వ్యాధి ఏమిటి? జార్జియాకు వెళ్లిన తర్వాత అంజలికి ఎదురైన అనుభవాలు ఏమిటి? అంజలి ఏ పరిస్థితుల్లో చనిపోయారు. తన ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన అంజలి మరణించిన తర్వాత కార్తీక్ పరిస్థితి ఏమిటి? అంజలి మరణం విషయంలో కార్తీక్‌కు తెలిసిన షాకింగ్ న్యూస్ ఏమిటి? అంజలిది సహజ మరణం కాదని తెలిసిన తర్వాత కార్తీక్ ఏం చేశాడు? అనే ప్రశ్నలకు సమాధానమే 28 డిగ్రీస్ సెల్సియస్ సినిమా కథ.
పొలిమేర వెబ్ సిరీస్‌తో పాపులారిటిని సాధించిన దర్శకుడు అనిల్ విశ్వనాథ్. 28 డిగ్రీస్ సెల్సియస్ సినిమాకు ఎంచుకొన్న పాయింట్ బాగుంది. పాయింట్‌లో వైవిధ్యం లేకపోయినా.. కథను చెప్పిన విధానం బాగుంది. పాత్రలకు ఎంపిక చేసుకొన్న నటీనటుల పెర్ఫార్మెన్స్ సినిమాకు ప్లస్‌గా మారింది. ఈ సినిమా కథలో కొత్తదనం లేకపోయినా.. 28 డిగ్రీస్ సెల్సియస్ అనే పాయింట్‌ను స్టోరీకి కనెక్ట్ చేసిన విధానం బాగుంది. ఫస్టాఫ్ రొటీన్‌గా సాగినా.. సెకండాఫ్‌లో దర్శకుడు తన ప్రతిభను చాటుకొన్నాడు. కొన్ని కమర్షియల్ అంశాలు జొప్పించి ఉంటే.. ఈ సినిమా మంచి ఫీల్ గుడ్ లవ్ స్టోరీ అయి ఉండేదనిపిస్తుంది.

నవీన్ చంద్ర గురించి కొత్తగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎలాంటి పాత్రనైనా ఓ రేంజ్‌కు తీసుకెళ్లే సత్తా ఉంటుంది. ఇటీవల కాలంలో మాస్, యాక్షన్ క్యారెక్టర్లలో నటించే ఆయనను లవర్ బాయ్‌గా, భగ్న ప్రేమికుడిగా చూపించిన విధానం బాగుంది. భగ్న ప్రేమికుడిగా మంచి ఫీల్‌తో నటించాడు. ఇక శాలిని కూడా తన పాత్ర పరిధి మేరకు ఫర్వాలేదనిపించింది. ఈ సినిమాలో ప్రధానమైన ట్విస్ట్‌తో దేవయాని శర్మ స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలుస్తుంది. మిగితా నటీనటులు ఒకే అనిపించారు.
టెక్నికల్ అంశాల విషయానికి వస్తే.. మ్యూజిక్, సినిమాటోగ్రఫి, డైలాగ్స్ ప్లస్ పాయింట్స్. సాగర తీర అందాలను, జార్జియా నగరంలోని లొకేషన్లను ఈ సినిమాలో చాలా అద్బుతంగా చూపించారు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. కానీ పాటలు అంతగా గుర్తుండిపోయేలా లేవు. ఎడిటింగ్, ఇతర విభాగాల పనితీరు బాగుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.
లవ్, హ్యుమన్ ఎమోషన్స్‌తో రూపొందించిన ఫీల్ గుడ్ మూవీ 28 డిగ్రీస్ సెల్సియస్. నవీన్ చంద్ర, టెక్నికల్ అంశాలు ఈ సినిమాకు ప్లస్ పాయింట్స్, కథలో వైవిధ్యం లేకపోవడం.. ముగింపు చప్పగా ఉండటం, కమర్షియల్ వాల్యూస్ లేకపోవడం ఈ సినిమాకు మైనస్‌గా చెప్పుకోవచ్చు. ఒకే పాయింట్ మీద స్లోగా నడిచే సినిమాలను, ఫీల్ గుడ్ లవ్ స్టోరీలను ఇష్టపడే వారికి ఈ సినిమా నచ్చుతుంది. కాలక్షేపం కోసం థియేటర్‌లో ఏదైనా సినిమా చూడాలనుకొంటే.. ఈ సినిమాను చివరి ఆప్షన్‌గా పెట్టుకోవచ్చు.


Click it and Unblock the Notifications











