3 BHK Movie First Review: 3 BHK మూవీ ఫస్ట్ రివ్యూ
దక్షిణాదిలో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకొన్న సిద్దార్థ్, కన్నడ హీరోయిన్ చైత్ర జే ఆచార్ జంటగా నటించిన చిత్రం 3 BHK. యువ నిర్మాత అరుణ్ విశ్వ నిర్మించిన ఈ చిత్రంలో శ్రీ గణేష్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో శరత్ కుమార్, దేవయాని, మీతా రఘునాథ్ తదితరులు నటించారు. ఈ సినిమా జూలై 4వ తేదీన గ్రాండ్‌గా రిలీజ్ అవుతున్నది. ఈ సినిమా ఇటీవల సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకొన్నది. ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ రిపోర్టు, అధికారులు రివ్యూ వివరాల్లోకి వెళితే..
3 BHK సినిమా కథ విషయానికి వస్తే.. వాసుదేవన్ (శరత్ కుమార్) (భార్యగా దేవయాని) దంపతులకు ప్రభు (సిద్దార్థ్) ఆరతీ (మీతా రఘనాథ్) సంతానం ఉంటుంది. మధ్య తరగతి కుటుంబానికి ఎప్పటికైనా సొంత ఇంటిని సాకారం చేసుకోవాలనే కల ఉంటుంది. చేతికి అంది వచ్చిన కొడుకు ప్రభుకు చదువు పట్ల ఇంట్రెస్ట్ లేకపోవడం వాసుదేవన్‌ను ఆందోళనకు గురి చేసింది. తండ్రి ఆలోచనలకు ప్రభు దూరంగా ఉంటే.. తండ్రి ఆశయాలను నెరవేర్చేందుకు ఆరతీ కష్టపడుతుంటుంది. ఈ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో సాగే ఎమోషనల్ స్టోరీలో సొంత ఇంటిని సాకారం చేసుకొన్నారా? లేదా అనేది మూవీ కథ.

ఈ సినిమాకు సాంకేతిక నిపుణులు పనితనం ప్రత్యేక ఆకర్షణగా ఉందనే టాక్ వినిపిస్తున్నది. దినేష్ బీ కృష్ణన్, జితిన్ స్టాన్సియాస్ సినిమాటోగ్రఫి, గణేష్ శివ ఎడిటర్‌గా, అమ్రిత్ రామ్‌నాత్ సంగీతం అందించారు. మిడిల్ క్లాస్ డ్రామాను ఈ ప్రధాన సాంకేతిక విభాగాలు భావోద్వేగాలను తెరపైన చూపించడంలో సక్సెస్ అయ్యారనే ప్రశంస సెన్సార్ వర్గాల నుంచి వచ్చిందని చిత్ర యూనిట్ వెల్లడించింది.
ఇక నటీనటుల విషయానికి వస్తే.. తండ్రి, కొడుకుల మధ్య మానసిక సంఘర్షణగా నడిచే ఈ కథలో తల్లి దేవయాని పడే వేదన కట్టిపడేస్తుంది. తండ్రి ఆలోచనలు ఒకరంగా ఉంటే.. అందుకు భిన్నంగా కొడుకు సిద్దార్థ్ పాత్ర ఉంటుంది. నేటి తరం యువకుల తీరుకు ప్రభు పాత్ర అద్దం పడుతుంది. అలాగే ఆరతీ పాత్ర కూడా ఈ తరం అమ్మాయిల మనస్తత్వాన్ని ప్రతిబింబించేలా ఉండటం.. ఇలాంటి అంశాలన్నీ సెన్సార్ అధికారులను మెప్పించాయి. వారు ఈ సినిమా వీక్షించిన అనంతరం పూర్తిగా సంతృప్తిని వ్యక్తం చేశారు అని చిత్ర యూనిట్ పంచుకొన్నది.
ఇక ఈ సినిమాలోని కొన్ని డైలాగ్స్, సన్నివేశాల విషయంలో సెన్సార్ కొంత అభ్యంతరం వ్యక్తం చేశారు. కానీ చిత్ర యూనిట్ ఇచ్చిన వివరణతో వాటిని పెద్దగా పట్టించుకోలేదు. ఈ సినిమాకు యూ సర్టిఫికేట్ కేటాయించారు. ఈ సినిమాకు యూ (U) సర్టిఫికెట్ లభించింది. ఇది మీ కథ ("U"r Story too) అంటూ శ్రీ శాంతి టాకీస్ బ్యానర్ ఓ పోస్టర్‌ను ట్వీట్ చేసింది.
తమిళం, తెలుగు భాషల్లో రిలీజ్ అవుతున్న ఈ చిత్రం జూలై 4వ తేదీన రిలీజ్ అవుతున్నది. ఈ సినిమా ప్రమోషన్స్‌ను భారీగా సిద్దార్థ్ నిర్వహిస్తున్నారు. మానవ సంబంధాలు, కుటుంబ సభ్యుల మధ్య ఉండే భావోద్వేగాలను ప్రతిబింబిచే ఈ సినిమా రన్ టైమ్ 2.30 నిమిషాలు అంటే.. సుమారుగా 150 నిమిషాల నిడివికి సెన్సార్ అధికారులు యూ సర్టిఫికెట్‌తో రిలీజ్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు అని చిత్ర యూనిట్ వెల్లడించింది.


Click it and Unblock the Notifications











