3 BHK Movie Critics Review: 3 BHK సినిమా క్రిటిక్స్ రివ్యూ అండ్ రేటింగ్

దక్షిణాదిలో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకొన్న సిద్దార్థ్, కన్నడ హీరోయిన్ చైత్ర జే ఆచార్ జంటగా నటించిన చిత్రం 3 BHK. యువ నిర్మాత అరుణ్ విశ్వ నిర్మించిన ఈ చిత్రంలో శ్రీ గణేష్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో శరత్ కుమార్, దేవయాని, మీతా రఘునాథ్ తదితరులు నటించారు. ఈ సినిమా ఇటీవల సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని జూలై 4వ తేదీన గ్రాండ్‌గా రిలీజ్ అవుతున్నది. ఈ సినిమా కథ ఏమిటి? ఈ సినిమా ప్రీమియర్స్ తర్వాత క్రిటిక్స్, సెలబ్రిటీస్ చేసిన ట్వీట్స్ వివరాల్లోకి వెళితే..

3 BHK సినిమా కథ విషయానికి వస్తే.. వాసుదేవన్ (శరత్ కుమార్) (భార్యగా దేవయాని) దంపతులకు ప్రభు (సిద్దార్థ్) ఆరతీ (మీతా రఘనాథ్) సంతానం ఉంటుంది. మధ్య తరగతి కుటుంబానికి ఎప్పటికైనా సొంత ఇంటిని సాకారం చేసుకోవాలనే కల ఉంటుంది. చేతికి అంది వచ్చిన కొడుకు ప్రభుకు చదువు పట్ల ఇంట్రెస్ట్ లేకపోవడం వాసుదేవన్‌ను ఆందోళనకు గురి చేసింది. తండ్రి ఆలోచనలకు ప్రభు దూరంగా ఉంటే.. తండ్రి ఆశయాలను నెరవేర్చేందుకు ఆరతీ కష్టపడుతుంటుంది. ఈ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో సాగే ఎమోషనల్ స్టోరీలో సొంత ఇంటిని సాకారం చేసుకొన్నారా? లేదా అనేది మూవీ కథ.

3 BHK Movie Review by Film critics

3BHK మూవీ చూశాను. గుండెను పిండేసే అందమైన సినిమా ఇది. నిన్ను ఎమోషనల్ జర్నీకి తీసుకెళ్తుంది. సిద్దార్థ్, శరత్ కుమార్ తమ పాత్రల్లో జీవించి భావోద్వేగమైన నటనను ప్రదర్శించారు. శ్రీగణేష్, శాంతి టాకీ్స్ నిర్వాహకులు, టీమ్‌ సభ్యులందరికీ కంగ్రాట్స్. ఆల్ ది బెస్ట్ అంటూ హీరో శింబు ట్వీట్ చేసి ప్రశంసించారు.

సిద్ధార్థ్ నటించిన 3BHK మూవీ చూశాను. థియేటర్ బయటకు వచ్చినా ఆ అనుభూతి, ఆ భావోద్వేగాలు నన్ను వెంటాడుతూనే ఉన్ నాయి. అవుట్ స్టాండింగ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చిన సిద్దార్థ్, శరత్ కుమార్‌కు నా అభినందనలు. ఇలాంటి సెన్సిబుల్ సబ్జెక్ట్ అందించిన అరుణ్ విశ్వ గారికి కంగ్రాట్స్. శ్రీ గణేష్‌కు, చిత్ర యూనిట్‌కు నా ధన్యవాదాలు అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేసింది.

3BHK సినిమాను చూడటం పూర్తయింది. ఈ మూవీ చాలా అద్బుతంగా ఉంది. చెల్లాచెదురైన కలలు, ఆస్థిత్వ పోరాటం, ఊరించిన విజయం లాంటి అంశాల మధ్య కొట్టుమిట్టాడిన మధ్య తరగతి కుటుంబం కథ. కొన్ని సినిమాలు అరుదుగా వస్తాయి. అందులో డజనకు పైగా సన్నివేశాలు మన వ్యక్తిగత జీవితాలకు రిలేట్ అయి ఉండటంతో బాగా కనెక్ట్ అవుతాం. సొంత ఇంటి కల సాకారం అనే పాయింట్‌తొ వచ్చిన ఈ కథ మిమ్మల్ని సర్‌ప్రైజ్ చేస్తుంది. గుండెను తాకే అనుభవంగా మిగుల్చుతుంది. ఈ సినిమాను అందించిన శ్రీ గణేష్ నిజమైన విజేత అనేది నా అభిప్రాయం అని ఓ క్రిటిక్ ట్వీట్ చేశాడు.

నా జీవితంలో నేను ఎప్పుడూ కూడా అద్దె ఇంటిలో లేను. కానీ ఇప్పుడు రెంటెడ్ హౌస్‌లో ఉంటున్నాను. 3BHK మూవీ చూసిన తర్వాత చాలా విషయాలు రిలేట్ చేసుకొంటున్నాను. నా జీవితానికి సరిపడే అనుభవాలను గుర్తుంచుకొనేలా.. ఈ సినిమా నాకు స్పూర్తిని ఇస్తున్నది అని హీరో జయం రవి చెప్పిన విషయాన్ని క్రిటిక్ ఆముత భారతీ తెలిపారు.

గుండెను పిండేసే మధ్య తరగతి కుటుంబ కథ 3BHK. సొంత ఇంటిని సాకారం చేసుకొనే వారి కల. ఈ సినిమాలోని ఎమోషన్స్ రోలర్ కోస్టర్‌గా ఉంటాయి. యాక్టర్ల పెర్ఫార్మెన్స్ అద్బుతంగా ఉన్నాయి. మ్యూజిక్ ఎక్స్రార్డినరీగా ఉంది. స్క్రీన్ ప్లే భావోద్వేగానికి గురి చేస్తుంది. మంచి మధురమైన మూవీ. శ్రీ గణేష్‌కు గొప్ప విజయం చేకూరబోతున్నది అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.

రియలిస్టిక్ ఎమోషనల్ మూవీ 3 BHK. చాలా సంవత్సరాల తర్వాత శరత్ కుమార్ పోషించిన అద్బుతమైన పాత్రను తెరపైన చూశాను. సిద్దార్థ్ మరోసారి సూపర్బ్ పెర్ఫార్మెన్స్‌ను ఇచ్చారు. మీతా రంగనాథ్ బోల్డ్‌గా నటించింది. పాటల ప్లేస్ మెంట్ చాలా నీట్‌గా ప్లాన్ చేశారు. నిజ జీవితానికి అతి దగ్గరగా ఉండే సన్నివేశాలు చాలా ఉన్నాయి. 3 BHK సినిమా కాదు.. ఓ జీవితం. తప్పకుండా చూడాల్సిన సినిమా ఇది అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.

More from Filmibeat

Read more about: siddharth Sri Ganesh 3 BHK
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X