3 BHK Movie Review: 3 BHK మూవీ రివ్యూ అండ్ రేటింగ్

నటీనటులు: సిద్దార్థ్, శరత్ కుమార్, దేవయాని, చైత్ర జే ఆచార్, మీతా రఘునాథ్, యోగిబాబు తదితరులు
దర్శకత్వం: శ్రీ గణేష్
నిర్మాత: అరుణ్ విశ్వ
మ్యూజిక్: అమృత్ రమానాథ్
సినిమాటోగ్రాఫర్: దినేష్ బీ కృష్ణన్, జితిన్ స్టానిస్లాయాస్
ఎడిటింగ్: గణేష్ శివ
డైలాగ్స్: రాకేందు మౌళి
ఆర్ట్: వినోద్ రాజ్‌కుమార్ ఎన్
బ్యానర్: శాంతి టాకిస్
రిలీజ్ డేట్: 2025-07-04

మధ్య తరగతి కుటుంబమైన వాసుదేవన్ (శరత్ కుమార్), శాంతి (దేవయాని) దంపతులకు ప్రభు (సిద్దార్థ్), కొడుకు, కూతురు ఆరతి (మీతా రఘునాథ్) ఉంటారు. ఎప్పటికైనా సొంత ఇంటిని సాకారం చేసుకోవాలని కల కంటుంటారు. ఏదో అడ్డంకులు, అవాంతరాలు వచ్చి ఆ కల.. కలగానే మిగిలిపోతుంది. గొప్పగా చదువుకొని మంచి ఉద్యోగం చేస్తాడుకొన్న కొడుకు ప్రభు అంచనాలకు తగినట్టుగా లేకపోవడం.. జీవితాంతం కష్టపడిన డబ్బుతో పెళ్లి చేస్తే.. కూతురు జీవితం ప్రశ్నార్థకంగా మారడం అంశాలు వాసుదేవన్‌ను కుంగదీస్తాయి.

3 BHK Tamil Movie Review

వాసుదేవన్ సొంత ఇంటి కల ఎందుకు సఫలం కాలేదు? స్టడీస్‌లోను, ఉద్యోగాల ఇంటర్వ్యూల్లోను ప్రభు ఎందుకు వెనుకబడ్డాడు? కూతురు పెళ్లి విషయంలో ఏం జరిగింది? తండ్రి ఆశలు, అంచనాలను ప్రభు ఎందుకు చేరుకోలేకకపోయాడు? తండ్రి కొడుకుల మధ్య ఎలా దూరం పెరిగింది? మంచి జీతంతో కూడిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగాన్ని ప్రభు ఎందుకు వదులుకొన్నాడు? చివరకు తండ్రి చిరకాలపు సొంత ఇల్లు కలను ప్రభు తీర్చాడా? స్కూల్ సమయంలో లవర్ ఐశ్వర్య (చైత్ర ఆచార్) ప్రభు జీవితంలోకి ఎలా వచ్చింది? అనే ప్రశ్నలకు సమాధానమే 3 BHK మూవీ కథ.

వాసుదేవన్ ఫ్యామిలీలో విభేదాలు.. అకౌంటెంట్‌గా ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ మధ్య తరగతి జీవితాన్ని అనుభవిస్తున్న కుటుంబానికి సొంత ఇల్లు కొనుక్కోవాలనే ఆశతో కథ ఎమోషనల్‌గా ప్రారంభమవుతుంది. అయితే పిల్లల్ని బాగా చదివిస్తే.. మంచి ఉద్యోగాలు చేసి అండగా నిలుస్తారని ప్రతీ తండ్రి కోరుకొన్నట్టే వాసుదేవన్ ఫీలవ్వడం సినిమాను కనెక్ట్ అయ్యేలా చేస్తుంది. చాలా సన్నివేశాలు మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఉండే అంశాలే కథ కోసం ఎంచుకోవడంతో ఫస్టాఫ్‌లో స్టోరీ సాఫీగా సాగిపోతుంది.

ఇక సెకండాఫ్‌లో కూడా ఎమోషనల్ అంశాలతో కథ సాగినప్పటికీ.. స్టోరీలో స్పీడ్ తగ్గడం, అలాగే కథను సాగదీసి చెప్పినట్టు అనిపించడంతో ఈ సినిమా క్లైమాక్స్ ఏం చేస్తాడనే విషయం కోసం ఎదురు చూపులు చూడాల్సి వస్తుంది. కొంత సాగదీత తర్వాత అసలు కథలోకి వెళ్లిన దర్శకుడు గణేష్ భావోద్వేగాలను భారీగానే గుప్పించాడు. దాంతో ఓ ఫీల్ గుడ్ మూవీని చూశామనే తృప్తితో బయటకు వచ్చేలా డైరెక్టర్ తన టాలెంట్‌ను ప్రదర్శించాడనిపిస్తుంది.

ఈ సినిమాకు శరత్ కుమార్ సర్‌ప్రైజ్ ఎలిమెంట్. రకరకాల గెటప్స్, అనేక రకాలు ఎమోషన్స్‌తో సినిమా భారన్నంత మిడిల్ క్లాస్ తండ్రి మాదిరిగానే తన భుజాల మీద మోశాడు. ఇక సిద్దార్థ్ కూడా బాయ్ నెక్ట్స్ డోర్ మాదిరిగా మారోసారి తన పెర్ఫార్మెన్స్‌తో చెలరేగిపోయారు.మీతా రఘునాథ్ కూడా చక్కగా తన పాత్రలో ఒదిగిపోయి నటించింది. దేవయాని పాత్రను చూస్తే.. మన ఇంట్లో పెద్దమ్మనో, పిన్నినో, తల్లినో, అమ్మమ్మనో చూసిన ఫీలింగ్ కలుగుతుంది. ఇక పాత్ర చిన్నదైనా చైత్ర ఆచార్ గుర్తుండిపోతుంది. మిగితా పాత్రల్లో కనిపించిన వారంతా ఫర్వాలేదనిపిస్తారు.

ఇక ఈ సినిమాకు సంగీతం ప్రాణంగా నిలిచింది. అమృత్ రమానాథ్ అందించిన మ్యూజిక్ పలు సన్నివేశాలను భావోద్వేగంగా మార్చింది. కథకు అత్యంత బలంగా నిలిచిన మిడిల్ క్లాస్ ఎన్విరాన్‌మెంట్‌ను సినిమాటోగ్రాఫర్స్ దినేష్ బీ కృష్ణన్, జితిన్ స్టానిస్లాయాస్ క్రియేట్ చేయడంలో తన సత్తాను చాటుకొన్నారు. సెకండాఫ్‌లో కొంత లెంగ్త్ పెరిగిందనే ఫీలింగ్ కలుగుతుంది. కాబట్టి కొన్ని చోట్ల కత్తెర్లు వేయాల్సి ఉండేదనిపిస్తుంది. అరుణ్ నిర్మాతగా తన అభిరుచిని చాటుకొంటూ నిర్మాణ విలువలను హైస్టాండర్డ్‌లో మెయింటెన్ చేశారు.

మిడిల్ క్లాస్ ఎన్విరాన్‌మెంట్‌తో కూడిన కంటెంట్, ఎమోషన్స్ జొప్పించిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ 3 BHK. శరత్ కుమార్, సిద్దార్థ్, మీతా రఘునాథ్ పోటాపోటీగా నటించారు. బెస్ట్ టెక్నికల్ అంశాలు ఉన్నాయి. హృదయాన్ని తట్టి లేపే అంశాలు మనసులను కదిలిస్తాయి. ఈ మధ్య కాలంలో అన్ని కమర్షియల్ వాల్యూస్‌తో వచ్చిన మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. ఈ సినిమాను మిస్ చేసుకొంటే.. మంచి అనుభూతిని మిస్ అవుతారు. వీలైతే మీ దగ్గర్లో ఉన్న థియేటర్‌లో చూడండి. ఈ వారం చూసే సినిమాల లిస్టులో ఈ మూవీని ఎలాంటి సందేహాలు లేకుండా చేర్చుకోవచ్చు.

More from Filmibeat

Read more about: siddharth Sri Ganesh 3 BHK
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X