35: Chinna Katha Kaadu Review: 35 చిన్న కథ కాదు రివ్యూ అండ్ రేటింగ్

Rating:
3.0/5

35-చిన్న కథ కాదు
నటీనటులు: నివేద థామస్, ప్రియదర్శి, విశ్వదేవ్, గౌతమి, భాగ్యరాజ్
నిర్మాత: రానా దగ్గుబాటి, సృజన్ యరబోలు, సిద్ధార్థ్ రాళ్లపల్లి
దర్శకుడు: కిషోర్ ఈమాని
బ్యానర్: న్యూ ఏజ్ క్లీన్ ఎంటర్‌టైనర్, సురేష్ ప్రొడక్షన్స్, ఎస్ ఒరిజినల్స్, వాల్టెయిర్ ప్రొడక్షన్స్
సినిమాటోగ్రఫి: నికేత్
మ్యూజిక్: వివేక్ సాగర్
రిలీజ్ డేట్: 2024-09-05

తిరుపతిలో ఆర్టీసీ కండక్టర్‌గా పనిచేసే ప్రసాద్ (విశ్వదేవ్), సరస్వతి (నివేదా థామస్) మధ్య తరగతి కుటుంబంతో ఇద్దరు పిల్లలతో సాఫీగా జీవితాన్ని కొనసాగిస్తుంటాడు. ఇద్దరు కొడుకులు స్కూల్‌లో చదువుతుంటారు. 11 ఏళ్ల పెద్దబ్బాయి అరుణ్ శర్మ‌కు మ్యాథమెటిక్స్‌ సబ్జెక్ట్ అంటే చాలా భయం. ప్రతీ క్లాస్‌లోను ఫెయిల్ అవుతుంటూ వస్తుంటాడు. అలా 5వ తరగతి వరకు కూడా లెక్కల్లో సున్నా మార్కులే వస్తాయి. దాంతో ఆ అబ్బాయిని స్కూల్ నుంచి పంపించాలని టీచర్ చాణక్య ( ప్రియదర్శి) నిర్ణయం తీసుకొంటాడు.

35  Chinna Katha Kaadu Movie Review in Telugu  Nivetha Thomas excellent performance

అరుణ్ శర్మకు లెక్కల సబ్జెక్ట్‌ అంటే ఎందుకు ఇష్టం ఉండదు? స్కూల్‌లో అరుణ్ శర్మ ప్రవర్తనతో చాణక్య ఎలా విసిగిపోయాడు? చాణక్యను అరుణ్ ఎలా ఇబ్బంది పెట్టాడు? చదువులో వెనకబడి ఉన్న కొడుకును చూసి ప్రసాద్ ఎలా మనస్తాపం చెందారు. తన కొడుకు పరిస్థితి చూసి సరస్వతి ఎలాంటి నిర్ణయం తీసుకొన్నది? చివరకు లెక్కల సబ్జెక్ట్‌లో అరుణ్ శర్మ ఎలాంటి పురోగతి సాధించాడు? మ్యాథమెటిక్స్‌లో అరుణ్ పాస్ అయ్యాడా? అనే ప్రశ్నలకు సమాధానమే 35 ఒక చిన్న కథ కాదు సినిమా.

స్కూల్‌లో దాదాపు ఎక్కువ మంది విద్యార్థులకు లెక్కల సబ్జెక్ అంటే భయం. ఆ పాయింట్‌ను తీసుకొని దానికి మధ్య తరగతి జీవితం చుట్టూ అల్లుకొన్న కథ, పాత్రలు బాగున్నాయి. తిరుపతి బ్యాక్ డ్రాప్ కావడంతో కొంత ఆడియెన్స్‌కు ఫీల్ గుడ్ ఫ్యాక్టర్‌గా మారింది. అయితే అరుణ్ పాత్ర పోషించిన అబ్బాయితో దర్శకుడు కిషోర్ ఈమాని నటన రాబట్టుకొన్న విధానం ఈ సినిమాకు అత్యంత బలంగా మారింది. అలాగే తల్లి పాత్రకు నివేదా థామస్‌ను, తండ్రి పాత్రకు విశ్వదేవ్ పాత్రలను ఎంచుకోవడంతోనే సగం సక్సెస్ కొట్టాడని చెప్పవచ్చు.

35 చిన్న కథ కాదు సినిమా ఫస్టాఫ్ చాలా ఫన్నీగా, ఫ్యామిలీ ఎమోషన్స్‌తో సరదాగా సాగిపోతుంది. నివేదా థామస్, విష్ణుదేవ్ మధ్య మిడిల్ క్లాస్ లైఫ్‌లో ఉండే అనూభూతులను చక్కగా తెర మీద పలికించారు. వారిద్దరి మధ్య కెమిస్ట్రీ అద్బుతంగా పండింది. ఇక అరుణ్ కారెక్టర్ చేసే అల్లరి.. ప్రియదర్శి నటన, బాడీ లాంగ్వేజ్ చాలా బాగుంది. ఇక సెకండాఫ్‌లో ఫ్యామిలీలో జరిగే భావోద్వేగ సన్నివేశాలు మనసును హత్తుకొంటాయి. కొన్ని సీన్లు హృదయాన్ని కలిచివేస్తాయి.

35  Chinna Katha Kaadu Movie Review in Telugu  Nivetha Thomas excellent performance

ఇక నివేదా థామస్ సరస్వతి పాత్రలో అద్బుతంగా నటించింది. తన కెరీర్‌లో బెస్ట్ ఫెర్ఫార్మెన్స్ ఇచ్చిందనే ఎలాంటి అనుమానాలు లేకుండా చెప్పవచ్చు. సెకండాఫ్‌లో ఆమె సినిమాను మరో లెవెల్‌కు తీసుకెళ్లారు. సరస్వతి పాత్రలో ఉండే మానసిక సంఘర్షణను సహజసిద్దంగా తెరపైన చూపించారు. విష్ణుదేవ్, అరుణ్ పాత్రలో నటించిన అబ్బాయి ఎవరూ ఊహించని విధంగా తమ ఫెర్ఫార్మెన్స్‌తో అదరగొట్టారు. ఎప్పటికప్పుడు సరికొత్త పాత్రలతో ప్రయోగం చేస్తున్న ప్రియదర్శి.. చాణక్యగా మరింత మెచ్యురిటీతో నటించాడు. మిగితా పాత్రల్లో నటించిన వారందరూ అద్బుతంగా కనిపించారు.

సాంకేతిక విభాగాల పనితీరు విషయానికి వస్తే.. నికేత్ అందించిన సినిమాటోగ్రఫి చక్కగా ఉంది. తిరుపతిలో ఉండే దివ్యత్వాన్ని, అందాలను కెమెరాలో చక్కగా బంధించారు. మిడిల్ క్లాస్ లైఫ్ ప్రతిబింబిచేలా సన్నివేశాలను అందించారు. వివేక్ సాగర్ మ్యూజిక్ మరో స్పెషల్ ఎట్రాక్షన్. క్లైమాక్స్‌లో సన్నివేశాలను అద్బుతంగా ఎలివేట్ చేశారు. రానా దగ్గుబాటి, సృజన్ యరబోలు, సిద్ధార్థ్ రాళ్లపల్లి, న్యూ ఏజ్ క్లీన్ ఎంటర్‌టైనర్, సురేష్ ప్రొడక్షన్స్, ఎస్ ఒరిజినల్స్, వాల్టెయిర్ ప్రొడక్షన్స్ బ్యానర్లు అందించిన నిర్మాణ విలువలు బాగున్నాయి.

35  Chinna Katha Kaadu Movie Review in Telugu  Nivetha Thomas excellent performance

ఫ్యామిలీ ఎమోషన్స్, చైల్డ్ సైకాలజీ, ఫన్, మదర్ సెంటిమెంట్ లాంటి అంశాలతో రూపొందించిన చిత్రం 35: చిన్న కథ కాదు. సరదాగా సాగిపోతూ అప్పుడప్పుడు సున్నితమైన అంశాలతో మనసును తట్టిలేపే చిత్రం. అయితే కథలోని మెయిన్ పాయింట్ విషయంలో కొంత లాజిక్ మిస్ అయ్యారనే ఫీలింగ్ కలుగుతుంది. దానిని సరిపెట్టడానికి ఎమోషన్స్ దట్టించిన తీరు బాగుంది. లాజిక్‌లు వెతక్కుండా చూస్తే మంచి ఫీల్ గుడ్ చిత్రం. ఈ మధ్య కాలంలో వచ్చిన మరో మంచి ఫ్యామిలీ డ్రామా. ముఖ్యంగా పిల్లలు, తల్లిదండ్రులు కలిసి చూడాల్సిన చిత్రం. నివేదా థామస్ ఫెర్ఫార్మెన్స్‌ను ఇష్టపడేవారు మీరీ చూడాల్సిన చిత్రం. థియేట్రికల్ వాచ్ ఉన్న సినిమా ఇది. మంచి అనుభూతిని పొంది బయటకు వచ్చే సినిమా అని చెప్పుకోవచ్చు. ఇది ఏ మాత్రం చిన్న సినిమా కాదు..

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X