3 BHK Movie Twitter Review: 3 BHK మూవీ ట్విట్టర్ రివ్యూ

తమిళ స్టార్ హీరో సిద్ధార్ధ్, కన్నడ నటి చైత్ర జే ఆచార్ జంటగా నటించిన చిత్రం 3 BHK. శాంతి టాకీస్ పతాకంపై అరుణ్ విశ్వ నిర్మించిన ఈ చిత్రంలో శ్రీ గణేష్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో శరత్ కుమార్, దేవయాని, మీతా రఘునాథ్, యోగిబాబు, సుబ్బు, వివేక్ ప్రసన్న తదితరులు కీలకపాత్రలు పోషించారు. టీజర్, ట్రైలర్, ప్రమోషనల్ కార్యక్రమాలతో 3 BHKపై బజ్ నెలకొంది. ఇటీవలే ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది.

3 BHK చిత్రానికి అమృత్ రామ్‌నాథ్ సంగీత సారథ్యం వహించగా.. దినేష్ బీ కృష్ణన్, జితిన్ స్టాన్సిలస్‌లు సినిమాటోగ్రఫీ అందించారు. ఈ సినిమాను జూలై 4వ తేదీన ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ చేశారు. ఈ 3 BHK మూవీ యూఎస్ ప్రీమియర్‌కు సంబంధించిన నెటిజన్ల అభిప్రాయాలు, రివ్యూల వివరాల్లోకి వెళితే..

3BHK Movie Twitter Review in Telugu  Will Siddharth hits the bulls eye

3BHK అంటే ప్రేమ, 3BHK అంటే వాస్తవం, 3BHK అంటే జీవితం. అన్ని రకాల భావోద్వేగాలను అందిస్తూ నటీనటులు ప్రతి ఒక్కరూ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. వీరిలో ఎవరు బాగా నటించారో మీరు గుర్తించడం కష్టమని ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు.

3BHK Movie Twitter Review in Telugu  Will Siddharth hits the bulls eye

3BHK విడుదల సందర్భంగా నటుడు సూరి చిత్ర యూనిట్‌కు కంగ్రాట్స్ చెప్పారు. ప్రతి కుటుంబం తమ ఇంటి కలను నెరవేర్చుకోవడానికి చేసే ప్రయాణాన్ని అందంగా చిత్రీకరించారని ట్వీట్‌లో పేర్కొన్నారు. దర్శకుడు శ్రీ గణేష్ సృజనాత్మకత అతని చిత్రానికి ప్రాణం పోస్తుందన్నారు. 3 BHKతో పాటు ఈరోజు విడుదలవుతున్న పరదుపో చిత్రానికి కూడా సూరి ఆల్ ది బెస్ట్ చెప్పారు.

ఇప్పుడే 3 BHK సినిమా చూశానని.. ప్రేక్షకుల్ని భావోద్వేగ ప్రయాణంలోకి తీసుకెళ్లే ఓ అందమైన చిత్రమని కోలీవుడ్ స్టార్ హీరో శింబు ట్వీట్ చేశారు. సిద్ధార్ అద్భుతంగా నటించారని.. దర్శకుడు శ్రీగణేష్, నిర్మాణ సంస్ధ శాంతి టాకీస్‌, చిత్ర యూనిట్‌కు శింబు అభినందనలు తెలియజేశారు.

భావోద్వేగాలతో నిండి, మీ హృదయాన్ని స్పృశించే చిత్రం ఈ రోజు థియేటర్లలోకి వచ్చింది మిస్ అవ్వొద్దని ఓ నెటిజన్ పోస్ట్ పెట్టాడు.

చప్పట్లు కొట్టే డైలాగులు, మధ్యతరగతి వారికి సంబంధించిన కంటెంట్ ఈ సినిమాలో ఉందని ఫిల్మ్ క్రిటిక్ అశోక్ తన రివ్యూ ఇచ్చారు. భావోద్వేగాలతో నిండిన అనుసంధానం ఈ చిత్రాన్ని ఫ్యామిలీ డ్రామాగా మార్చిందని ట్వీట్ చేశారు.

మౌన పోరాటాలు, చిరకాల కలలు, దైనందిన జీవితంలో భావోద్వేగాలను ఉత్కంఠభరితంగా 3 BHK సినిమాలో చూపించారని ఫిల్మ్ జర్నలిస్ట్ రాజేష్ కుమార్ రెడ్డి రివ్యూ ఇచ్చారు. అందరూ బ్రిలియంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు.. ఇల్లు అనేది భావోద్వేగం, మిస్ అవ్వొద్దని తెలిపారు.

3 BHK నవ్వించింది, ఏడిపించింది ముఖంపై చిరునవ్వుతో థియేటర్ నుంచి బయటకు వెళ్లేలా చేసింది. ఫస్ట్ హాఫ్ అంతమాత్రంగా ఉన్నా.. సెకండాఫ్ మాత్రం ఫీల్ గుడ్ ఫర్ఫార్మెన్స్ కనిపించిందని ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు.

3 BHK బాగుందని.. ఏళ్లనాటి కలలను, రోజువారి జీవితంలోని భావోద్వేగాలను దర్శకుడు శ్రీ గణేష్ అద్భుతంగా చూపించారని డైరెక్టర్ రత్న కుమార్ ట్వీట్ చేశారు. 24 క్రాఫ్ట్స్‌పై ఆయన పట్టు కనిపించిందని.. అమృత్ రామన్ ఈ సినిమాకు ఆత్మ.. ఆయన పాటలు, సంగీతంతో కట్టిపడేశాడు. కథను నమ్మి పూర్తి నమ్మకంతో తెరపైకి తెచ్చినందుకు నిర్మాత అరుణ్ విశ్వకు హ్యాట్సాఫ్. ఇల్లు ఒక భావోద్వేగం.. వెళ్లాల్సిందేనని రత్నకుమార్ రాసుకొచ్చారు.

More from Filmibeat

Read more about: siddharth 3 BHK
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X