7:11 PM Review టైమ్ మిషన్ ట్రావెల్ ఎలా జరిగిందంటే? 7:11 PM మూవీ ఎలా ఉందంటే?

Rating: 2.75/5

నటీనటులు: సాహస్ పగడాల, దీపికా రెడ్డి, టెస్ వాల్ష్, రఘు కారుమంచి, భరత్ రెడ్డి, రైజింగ్ రాజు తదితరులు
దర్శకత్వం: చైతూ మాదాల
నిర్మాతలు: నరేన్ యనమదల, మాధురీ రవిపాటి, వాణి కన్నెగంటి
మ్యూజిక్: గ్యాని
సినిమాటోగ్రఫి: శివ శంకర్, ఫాబియో కాపోడివెంటో
ఎడిటర్: శ్రీను తోట
సౌండ్ డిజైన్: విష్ణు విశాల్, అభ్యు తుమ్మల
ఆర్ట్ డైరెక్టర్: కిరణ్ కుమార్ మన్నె, జై లోగిశెట్టి
రిలీజ్ డేట్: 2023-07-07

హంసలదీవి అనే ఊరిలో రవి ప్రసాద్ (సాహస్) అనే యువకుడు ఆటో గ్యారేజ్‌లో పని చేస్తూ 1997 సంవత్సరంలో ఐపీఎస్ కావాలనే లక్ష్యంతో సివిల్ సర్వీస్ పరీక్ష కోసం ప్రిపేర్ అవుతుంటాడు. అదే గ్రామానికి చెందిన విమల (దీపికా రెడ్డి), రవి పీకల్లోతు ప్రేమలో ఉంటారు. స్థానిక ఎమ్మెల్యే బసవపున్నయ్య, కృష్ణ (భరత్ రెడ్డి) మధ్య రాజకీయాలు రంజుగా సాగుతుంటాయి. స్థానిక ఎమ్మెల్యే అండతో రాజేశ్ అనే వ్యక్తి అపరిమితం అనే ఫైనాన్స్ కంపెనీ నడుపుతూ గ్రామస్థులను మోసగించే సిద్దమవుతాడు. ఆ మోసాన్ని అడ్డుకొనే ప్రయత్నంలో టైమ్ మిషన్ రూపంలో ఉండే బస్సును ఎక్కిన రవి ప్రసాద్ తెల్లవారి నిద్ర లేచే సరికి మెల్‌బోర్న్‌లో ప్రత్యక్షమై 2024 సంవత్సరంలోకి వెళ్తాడు.

7:11 PM Movie Review

హంసలదీవికి టైమ్ మిషన్ ఎందుకు వచ్చింది? టైమ్ మిషన్‌ను ఎందుకోసం తెచ్చారు? ఎమ్మెల్యే బసవపున్నయ్య ఎలాంటి మోసాలకు పాల్పడుతుంటాడు? విమల, రవి ప్రసాద్ ప్రేమ వ్వవహరం ఎలా సాగింది? ఊరి పెద్ద కృష్ణ (భరత్ రెడ్డి) ఎలాంటి పనుల చేస్తుంటాడు? అపరిమితం ఫైనాన్స్ కంపెనీ నడిపే రాజేష్ ఎన్ని కోట్ల కుంభకోణం చేయాలని ప్రయత్నించాడు? టైమ్ మిషన్‌లో 25 సంవత్సరాల ముందుకు వెళ్లిన రవి ప్రసాద్‌కు ఎలాంటి భయంకర విషయాలు తెలిసాయి? 2024 నుంచి 1997 రవి ప్రసాద్ వచ్చాడా? 25 సంవత్సరాలు మళ్లీ వెనక్కి వెళ్లి అక్రమాలను అడ్డుకోవడానికి ఏం చేశాడు? విమలను ఓ పెద్ద ఆపద నుంచి ఎలా కాపాడి తన ప్రేమను నిలుపుకొన్నాడు? ఆస్ట్రేలియాలో సారా ఎలాంటి హెల్ప్ చేసింది? అనే ప్రశ్నలకు సమాధానమే 7:11 సినిమా కథ.

7:11 PM సినిమా ఫస్టాఫ్ విషయానికి వస్తే.. గ్రామ రాజకీయాలు, రవి ప్రసాద్, విమల లవ్ ట్రాక్ రెగ్యులర్ టచ్‌తో సాగుతుంటాయి. హంసలదీవికి టైమ్ మిషన్ వచ్చే తీరుతో కథలో ఏదో కొత్తదనం చూడబోతున్నామనే ఫీలింగ్‌ కలుగుతుంది. ఇక సెకండాఫ్‌ విషయానికి వస్తే.. టైమ్ మిషన్ ద్వారా మెల్ బోర్న్‌కు వెళ్లిన తర్వాత కథలో చోటు చేసుకొనే సన్నివేశాలు బాగున్నాయి. ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ వరకు మరింత బెటర్‌గా చేసి ఉండాల్సిందనే ఫీలింగ్ కలుగుతుంది.

దర్శకుడు చైతూ మాదాల ఎంచుకొన్న పాయింట్‌ సరికొత్తగా.. మంచి థ్రిల్లింగ్‌గా అనిపిస్తుంది. కానీ ఆ పాయింట్‌ను పూర్తి స్థాయి కథగా విస్తరించడంలో కొంత తడబాటు కనిపిస్తుంది. కానీ తొలి చిత్ర దర్శకుడిగా కథను డీల్ చేసిన విధానం, పలు పాత్రలను డిజైన్ చేసిన విధానం బాగుంది. ప్రతీ పాత్రకు ఓ డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్‌తో కథను నడిపించిన తీరు కొత్త అనుభూతిని కలిగిస్తుంది. కథలో వేరియేషన్స్, పాత్రలు ఎక్కువ కావడం వల్ల కొంత గందరగోళంగా అనిపిస్తుంది.ఇక నటీనటులు పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే.. రవి ప్రసాద్‌గా సాహస్ తన పాత్రలో ఒదిగిపోవడమే కాకుండా కథా భారాన్ని ఒక్కరే మోస్తూ సినిమాను ముందుకు తీసుకెళ్లారు. కొన్ని కీలక సన్నివేశాల్లో యాక్టింగ్ పరంగా ఆకట్టుకొన్నారు. విమలగా దీపికా రెడ్డి గ్లామర్ పరంగానే కాకుండా పెర్ఫార్మెన్స్ పరంగా కూడా ఆకట్టుకొన్నారు. సాహస్, దీపిక మంచి కెమిస్ట్రీతో ఆకట్టుకొన్నారు. కృష్ణగా భరత్ రెడ్డి సర్‌ప్రైజింగ్ క్యారెక్టర్‌లో ఫుల్ లెంగ్త్ రోల్‌తో మెప్పించారు. రాజేశ్, బసవపున్నయ్య పాత్రలు చేసిన వారు వారి పాత్రలకు న్యాయం చేశారు. రైజింగ్ రాజు, రఘు కారుమంచి ఉన్న కాసేపు నవ్వులు పూలు పూయించారు.

7:11 PM సినిమా సాంకేతిక విషయాల్లోకి వస్తే.. ఈ మూవీలో సినిమాటోగ్రఫి స్పెషల్ ఎట్రాక్షన్. శివశంకర్, ఫాబియో రూరల్, అర్బన్ సిటీల్లో ఉండే వేరియన్స్ చక్కగా చూపించారు. గ్యానీ మ్యూజిక్ బాగుంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా సన్నివేశాలను బాగా ఎలివేట్ చేయడమే కాకుండా ఫీల్‌గుడ్ ఫ్యాక్టర్‌గా మారింది. ఎడిటింగ్, సౌండ్ డిజైన్, ఆర్ట్, వీఎఫ్ఎక్స్ విభాగాల పనితీరు క్వాలిటీగానే కాకుండా హై స్టాండర్డ్స్ మెయింటెన్ చేశారు.

స్పేస్, టైమ్ మిషన్ కాన్సెప్ట్‌తో గ్రామీణ నేపథ్యంతో కూడిన లవ్, యాక్షన్, సస్పెన్స్, థ్రిల్లర్ చిత్రం 7:11 PM. యంగ్ టాలెంట్ తమను తాము నిరూపించుకొనేందుకు చేసిన ప్రయత్నం ఆకట్టుకొనేలా ఉంది. మంచి సినిమాను ప్రేక్షకులకు అందించాలనే తపన ప్రతీ ఫ్రేమ్‌లో కనిపించింది. నిర్మాతలు నరేన్ యనమదల, మాధురీ రవిపాటి, వాణి కన్నెగంటి అనుసరించిన నిర్మాణ విలువలు బాగున్నాయి. కథ, కథనాలపై మరింత వర్క్ చేసి ఉంటే టైమ్ మిషన్ కాన్సెప్ట్‌తో వచ్చిన సినిమాల్లో ది బెస్ట్ అయి ఉండేదనిపిస్తుంది. ఎలాంటి అంచనాలు లేకుండా వెళ్తే థ్రిల్ అవ్వడమే కాకుండా మంచి అనుభూతిని కూడా పొందడానికి చాలా అంశాలు ఉన్నాయి. కాబట్టి థియేట్రికల్ ఎక్స్‌పీరియెన్స్ కోసం 7:11 PM థియేటర్‌లోనే చూడండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X