twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    7 days 6 nights movie యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్.. ఎంఎస్ రాజు టేకింగ్ ఎలా ఉందంటే?

    |

    Rating:
    2.5/5

    Recommended Video

    Sammathame,Chor Bazaar Movie Review | Kiran Abbavaram | Akash Puri *Reviews |FilmiBeat Telugu

    టాలీవుడ్‌ ఇండస్ట్రీలో మహేష్ బాబు, ప్రభాస్ లాంటి హీరోలకు స్టార్ స్టేటస్ అందించిన నిర్మాత ఎంఎస్ రాజు దర్శకుడిగా మారి యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకొంటున్నారు. ఆయన రూపొందించిన డర్టీ హరి చిత్రం సక్సెస్ తర్వాత మరోసారి యూత్, ఫ్యామిలీ ఆడియెన్స్ టార్గెట్‌గా 7 డేస్ 6 నైట్స్ మూవీని అందించారు. జూన్ 24వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలాంటి అనుభూతిని అందించిందనే విషయాన్ని తెలుసుకొందాం...

    7 డేస్ 6 నైట్స్ మూవీ కథ..

    7 డేస్ 6 నైట్స్ మూవీ కథ..

    ఆనంద్ (సుమంత్ అశ్విన్) సినిమా డైరెక్టర్ కావాలనే ఔత్సాహిక యువకుడు. యాక్టర్ కావాలనుకొనే కుమార మంగళం అలియాస్ మంగళం (రోహన్) ఇద్దరు ప్రాణ స్నేహితులు. రోహన్‌కు వారం రోజుల్లో పెళ్లి అనగా బ్యాచలర్ పార్టీ కోసం ఇద్దరు గోవాకు వెళ్తారు. వారం రోజుల్లో పెళ్లి అవ్వాల్సిన రోహన్ గోవాలో అమియా (కృతికా శెట్టి) అనే యువతితో ప్రేమలో పడుతాడు. అయితే అక్కడ ఎదురైన పరిస్థితుల కారణంగా ఆనంద్ సూసైడ్ చేసుకొనేంతగా ఆలోచనల్లో పడుతాడు.

    7 డేస్ 6 నైట్స్ ట్విస్టులు

    7 డేస్ 6 నైట్స్ ట్విస్టులు

    నిర్మాతకు కథ చెప్పిన ఆనంద్‌ డైరెక్టర్‌గా మారాడా? రోహన్, ఆనంద్ మధ్య స్నేహం ప్రాణం కంటే మిన్నగా ఎందుకు మారింది? ఎలాంటి పరిస్థితుల్లో పెళ్లికి ముందు రోహన్ మరో అమ్మాయి ఆకర్షణకు గురయ్యాడు? ఆనంద్‌కు విన్నీ ఎందుకు దూరమైంది. ప్రేమ విఫలమైన ఆనంద్ గోవాలో పరిచయమైన రితిక (మెహర్ చాహల్)‌తో పరిచయం ఎంత వరకు వెళ్లింది? చివరకు రోహన్ పెద్దలు నిశ్చయించిన పెళ్లి చేసుకొన్నాడా? గోవాలో పరిచయమైన అమియాతో రోహన్ రిలేషన్‌ ఎక్కడ వరకు వెళ్లింది? అనే ప్రశ్నలకు సమాధానమే 7 days 6 nights కథ.

    7 డేస్ 6 నైట్స్ ఎలా ఉందంటే?

    7 డేస్ 6 నైట్స్ ఎలా ఉందంటే?

    డైరెక్షన్ ఛాన్స్‌ కోసం ఎదురు చూస్తూ ఓ రకమైన ప్రస్టేషన్‌లో ఉంటూ.. అతి తినడం.. అతిగా మద్యం సేవించడం.. ఆ అలవాట్ల నుంచి బయటపడేందుకు ఆనంద్ ప్రయత్నించడం అనే అంశాలతో కథ ఫీల్‌గుడ్‌తో మొదలవుతుంది. రోహన్ ఎంగేజ్‌మెంట్, గోవా ట్రిప్‌కు బయలుదేరడం ఫన్‌గా సాగుతుంది. అయితే ఇద్దరి మధ్య డైలాగ్ డ్రామా బాగానే ఉన్నప్పటికీ.. కొంత సాగదీయడం.. కథలో బలమైన, ఎమోషనల్‌గా ఆకట్టుకొనే సన్నివేశాలు లేకపోవడం వల్ల ఫస్టాఫ్ కథ సాదాసీదా.. చిన్న హ్యుమర్ సంఘటనలతో ముందుకెళ్తుంది. కానీ సెకండాఫ్‌కు వచ్చే సరికి ఆనంద్‌లో భావోద్వేగాలు, మానసిక సంఘర్షణ కథకు బలంగా మారాయనిపిస్తుంది. రోహన్ రొమాంటిక్ వ్యవహారం ఇంకాస్త ఘాటుగా ఉంటే.. కథకు మరింత ఫీల్‌గుడ్ ఫ్యాక్టర్ పెరిగి ఉండేదనిపిస్తుంది. క్లైమాక్స్‌లో దర్శకుడు సెన్సిటివ్‌గా డీల్ చేసిన అంశాలు యూత్‌కు మంచి ఫీల్‌ను కలిగిస్తాయి.

    సుమంత్, ఇంకా ఇతర నటీనటుల గురించి

    సుమంత్, ఇంకా ఇతర నటీనటుల గురించి

    7 days 6 nights మూవీని ఆనంద్ పాత్రలో కనిపించిన సుమంత్ ఆశ్విన్ ఎమోషనల్‌గా మార్చేశాడని చెప్పవచ్చు. ఇప్పటి వరకు సాఫ్ట్ లవర్ బాయ్‌గా కనిపించిన సుమంత్.. భారమైన పాత్రలో ఎమోషనల్‌గా మెప్పించాడు. నటనపరంగా సుమంత్‌ కొత్తగా కనిపిస్తాడు. ఇక మంగళంగా రోహన్ ఎనర్జీ బాగుంది. తన పాత్ర ద్వారా మంచి ఫన్ క్రియేట్ చేశాడు. మొదటి సినిమా అయినప్పటికి అనుభవం ఉన్న నటుడిగా తెరపైన కనిపించాడు. రొమాంటిక్ సీన్లలోను, డైలాగ్, హావభావాలు, యాటిట్యూడ్ పరంగా ఆకట్టుకొన్నాడు. రితిక అలియాస్ రాట్స్‌గా నటించిన మెహర్ చాహల్‌లో గ్లామర్ ఫైర్ ఉంది. కానీ దర్శకుడు ఎంఎస్ రాజు సాఫ్ట్‌గా డీల్ చేయడం వల్ల మెహర్ గ్లామర్ ట్రీట్ పూర్తిగా అందించలేకపోయిందనే నిరాశ కనిపించింది. కెరీర్‌ను పక్కాగా ప్లాన్ చేసుకొంటే.. ఇండస్ట్రీకి మంచి హీరోయిన్‌గా మారే అవకాశాలు ఉన్నాయి. గోపరాజు రమణ, మిగితా క్యారెక్టర్లు కథకు బలంగా కనిపించే క్యారెక్టర్లుగా ఉన్నాయి.

    దర్శకుడు ఎంఎస్ రాజు టేకింగ్

    దర్శకుడు ఎంఎస్ రాజు టేకింగ్

    దర్శకుడు ఎంఎస్ రాజు ఎంచుకొన్న పాయింట్.. కథను డ్రైవ్ చేసిన విధానం చాలా బాగుంది. కథకు ఇంకొన్ని ఎమోషనల్ మూమెంట్స్.. ఆనంద్ ఫ్యాష్ బ్యాక్ స్టోరిని విజువల్‌గా డిజైన్ చేసి ఉంటే.. ఆ పాత్రపై సింపతీ క్రియేట్ అయ్యేది. ఆనంద్, మంగళం లైఫ్ ట్రావెల్‌లో ఫన్, హ్యుమర్ డోస్ పెంచి ఉంటే.. మంచి ఎంటర్‌టైనర్ అయి ఉండేది. ప్రజెంట్ డే యూత్‌ ఆలోచనలను చక్కగా తెరమీద పెట్టారు. ఇంకాస్త కంటెంట్ జొప్పించి ఉంటే.. మంచి ఫీల్‌గుడ్ ఎంటర్‌టైనర్‌గా నిలిచేదనే ఫీలింగ్ కలుగుతుంది.

    టెక్నికల్ అంశాల పనితీరు..

    టెక్నికల్ అంశాల పనితీరు..

    సాంకేతిక నిపుణుల పనితీరు విషయానికి వస్తే.. సమర్థ్ మ్యూజిక్ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్. జునైద్ ఎడిటింగ్ బాగుంది. ఇక నాని సినిమాటోగ్రఫి అదనపు ఆకర్షణ. గోవాలోని కొత్త ప్రదేశాలను, అందాలను తెరపైన కనులకు విందుగా మార్చడంలో నాని పనితీరు బాగుంది. సాహిత్యం, డైలాగ్స్ పరంగా చూస్తే.. చాలా క్లీన్ కంటెంట్‌ను ఇవ్వడానికి ఎంఎస్ రాజు తన అనుభవాన్ని రంగరించినట్టు కనిపిస్తుంది. వైల్డ్ హనీ ప్రొడక్షన్స్, వింటేజ్ పిక్చర్స్ & ఎబిజి క్రియేషన్స్ నిర్మాణ విలువలు బాగున్నాయి.

    ఫైనల్‌గా కథ ఏమిటంటే?

    ఫైనల్‌గా కథ ఏమిటంటే?

    ఫ్రెండ్ షిప్, లవ్, ఫ్యామిలీ వ్యాల్యూస్‌తో కూడిన చిత్రం 7 days and 6 nights. ఇంకా ఈ కథకు ఎమోషనల్ పాయింట్స్ జోడించి ఉంటే.. బెటర్ రోడ్ జర్నీ, ట్రావెలగ్ మూవీ అయి ఉండేది. డిఫరెంట్ స్క్రీన్ ప్లే, యూత్‌ను టార్గెట్ చేసే అంశాలు ఈ సినిమాకు ప్లస్ పాయింట్స్. విజువల్ పరంగా బాగుంది. వీకెండ్‌లో ఫ్యామిలీ, యూత్ కలిసి చూడదగిన చిత్రం. ఎలాంటి అంచనాలు లేకుండా వెళితే.. తప్పకుండా సినిమా మంచి అనుభూతిని కలిగిస్తుంది.

    నటీనటులు, సాంకేతిక నిపుణులు

    నటీనటులు, సాంకేతిక నిపుణులు

    నటీనటులు: సుమంత్ అశ్విన్, మెహర్ చాహల్, రోహన్, కృతికా శెట్టి, సుష్మ, రిషికా బాలి, 'మిడిల్ క్లాస్ మెలోడీస్' ఫేమ్ గోపరాజు రమణ తదితరులు
    రచన - దర్శకత్వం: ఎంఎస్ రాజు
    నిర్మాతలు: సుమంత్ అశ్విన్, రజనీకాంత్ ఎస్
    సంగీతం: సమర్థ్ గొల్లపూడి
    సినిమాటోగ్రఫి: నాని చమిడిశెట్టి
    ఎడిటింగ్: జునైద్ సిద్ధిఖీ
    ప్రొడక్షన్ డిజైనర్: భాస్కర్ ముదావత్
    స్టిల్స్: ఎం రిషితా దేవి
    పీఆర్వో: పులగం చిన్నారాయణ
    డిజిటల్ ప్రమోషన్స్: సుధీర్ తేలప్రోలు
    పబ్లిసిటీ డిజైనర్: ఈశ్వర్ అందే
    కో-డైరెక్టర్: యువీ సుష్మ
    స్పెషల్ పార్టనర్: రఘురాం టీ
    కో-ప్రొడ్యూసర్స్: జె. శ్రీనివాసరాజు, మంతెన రాము
    నిర్మాణ సంస్థలు: వైల్డ్ హనీ ప్రొడక్షన్స్, వింటేజ్ పిక్చర్స్ & ఎబిజి క్రియేషన్స్
    సమర్పణ: సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్
    రిలీజ్ డేట్: 2022-24-06

    English summary
    7 days 6 nights movie review and rating: Does MS Raju hits the bulls eye?
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X