సెన్స్ లేని ...('సెవెంత్ సెన్స్' రివ్యూ)

By Srikanya

Surya
బ్యానర్ :లక్ష్మి గణపతి ఫిలింస్
నటీనటులు : శృతిహాసన్, సూర్య, అభినయ,జానీ తదితరులు.
సంగీతం: హ్యారీస్ జైరాజ్
మాటలు : రామకృష్ణ
ఎడిటింగ్: ఆంధోని
కెమెరా: రవి కే చంద్రన్
ఆర్ట్ :రాజీవన్
నిర్మాత :ఉదయగిరి స్టాలిన్
కథ,స్క్రీన్ ప్లే, దర్శకత్వం: ఎ.ఆర్.మురగదాస్

"తెలుగు ప్రేక్షకులకు ఉన్నంత విశాల హృదయం ఎవరికీ లేదు.వాళ్లకి మంచి సినిమా చూపిస్తే చాలు నెత్తిన పెట్టుకుని ఆదరిస్తారు.తీసెందవరూ..నటించింది ఎవరు అని కూడా చూడరు" అంటూ తమిళ దర్శకుడు మురగదాస్ ఎంతో నమ్మకంగా 'సెవెంత్ సెన్స్' సినిమా రిలీజ్ సందర్భంగా చెప్పుకొచ్చాడు.గజనీ చిత్రాన్ని వంద రోజులు ఆడించిన తెలుగు ప్రేక్షకుల మీద ఆయన పెట్టుకున్న నమ్మకం కరెక్టే కావచ్చు . కానీ మరీ సెన్స్ లేకుండా తీసే చిత్రాలను కూడా అంతే వేగంగా క్రింద పడేస్తారని,ఆ సమయంలో తెలుగులో తమ అభిమాన పెద్ద హీరోలను కూడా పట్టించుకోరని చాలా సార్లు రుజువైన విషయమేది గుర్తు చేసుకోవాల్సిన విషయం.ఇక ఆయన తాజా చిత్రం సెవెంత్ సెన్స్..చిత్రం విషయానికి వస్తే కాన్సెప్టు పరంగా బాగున్నా ట్రీట్మెంట్ దగ్గరకి వచ్చేసరికి హీరో పాత్ర పూర్తి స్ధాయి ప్యాసివ్ గా మారిపోయి..విలన్ హైలెట్ అయ్యిపోయాడు.విచిత్రమైన శక్తులున్న విలన్ ని ఎదిరించటానికి తనకు శక్తులు ఎప్పుడొస్తాయా అని హీరో క్లైమాక్స్ దాకా ఎదురుచూస్తూండిపోయాడు.అయితే హీరోకు ఉన్న ఓపిక,ఎదురుచూపుల మీద ఉన్న నమ్మకం దురదృష్టవశాత్తు ప్రేక్షకులకు లేకుండాపోయింది.

ఆరవ శతాబ్దానికి చెందిన పల్లవరాజు భోధి దమ్మ(సూర్య) మార్షిల్ ఆర్ట్స్ ని,చరకసంహిత(వైధ్య శాస్తం)ని ఔపోసన పట్టిన అధ్బుత వ్యక్తి. పరోపకార పరాయణుడు అయిన ఆయన తన గురువు ఆజ్ఞ మేరకు చైనా వెళ్లి అక్కడ విచిత్రమైన రోగంతో అట్టుడుకుపోతున్న ఓ గ్రామాన్ని తన వైద్యంతో బ్రతికిస్తాడు.అంతేగాక ఆ ఊరి జనాల్ని ఇబ్బంది పెడుతున్న దుష్టుల నుంచి రక్షించి,అక్కడున్న వారికి తన మార్షిల్ ఆర్ట్స్ విద్యను నేర్పి,అక్కడ షావోలిన్ గుడిని నిర్మించి కాలం చేస్తాడు. ప్రస్తుత కాలానికి వస్తే ఇప్పుడు చైనా బయో వార్ తో ఇండియాని తన చేతుల్లో పెట్టుకోవాలని ప్లాన్ చేస్తుంది.ఆ క్రమంలో ఆరవ శతాబ్దంలో వచ్చిన వైరస్ ని మళ్లీ నిద్రలేపి ఇండియాని రోగాలు పాలు చేయాలని నిర్ణయించుకుంటుంది.అందుకు డోంగ్ లీ (జానీ ట్రై)అనే మార్షిల్ ఆర్ట్స్ నిపుణుడ్ని ఇండియాకు పంపుతుంది. ఈ పరిస్ధితుల్లో మళ్లీ భోధి దమ్మ అవసరం ఇండియాకు వస్తుంది. ఆయన బ్రతికి వస్తేనే ఆ రోగాన్ని కుదర్చగలరు. ఆ భోధి దమ్మ వంశానికి చెందిన వాడే అరవింద(సూర్య). ఆ విషయాన్ని భోధిధమ్మ డిఎన్ ఎ పై పరిశోధన చేస్తున్న సైంటిస్టు శుభ(శృతిహాసన్) తెలుసుకుంటుంది. అప్పుడు ఆమె ఏం చేసింది. భోధిదమ్మని మళ్లీ ఈ కాలానికి తీసుకువచ్చారా.. ఎలా దేశాన్ని రక్షించారు అనేది మిగతా కథ.

ఇక ఈ సెన్స్ ఫిక్షన్ చిత్రానికి ఎప్పటిలాగే మురగదాస్ ...విభన్నమైన పాయంట్ తీసుకుని,దానికి రెగ్యులర్ మసాలా ట్రీట్ మెంట్ ఇచ్చే ప్రయత్నం చేసాడు. అయితే ఈ సారి మసాలా కథలో కలవలేదు సరికదా అదే అడ్డమై కూర్చుంది.జేమ్స్ కెమెరాన్ ..అవతార్ సినిమాలోలాగ.. కథ ప్రకారం హీరో ...అవతారం ఎత్తిన తర్వాత ఏం జరుగుతుందనే చూడటానికి జనం ఆసక్తి చూపుతారు.ఆ అవతారం ఎత్తటానికి జరిగే ప్రాసెస్ బోర్ ఎలిమెంట్.తప్పదు కాబట్టి కొంతవరకూ భరిస్తారు.అయితే ఈ సినిమాలో భోధదమ్మగా హీరో మారి ఫైట్ చేయగానే సినిమా అయ్యిపోతుంది.అప్పటివరకూ భోధిదమ్మగా మారాల్సిన వ్యక్తి ఇతనే అని హీరోయిన్ తెలుసుకోవటం, వెతకటం, అతన్ని ట్రాప్ చేయటం, ఆ విషయం హీరోకి తెలియటం,నిలదీయటం, ఆ తర్వాత నిజం తెలుసుకుని హీరో సహకరించటం, ఈలోగా విలన్..వచ్చి భోధిదమ్మగా మారకండా అడ్డుపడటం ఇవే సినిమా చివరిదాకా సాగాయి. దాంతో ఇది నిజానికి హీరోయిన్ ఓరియెంటెడ్ కథలా అయ్యింది. అదే హీరోయిన్ పాయింటాఫ్ లో ఈ కథని చెప్పి ఉంటే కరెక్టుగా ఉండేది. హీరో వైపునుంచి కథ ఓపెన్ చేసి,హీరోయిన్ వైపు నుంచి నడపటమే ఇబ్బందికరంగా మారింది. దాంతో హీరో..ఏమీ చెయ్యలేక హీరోయిన్ ఏం చెప్పితే అలా చేస్తూ..సంఘటనలు ప్రతిస్పందిస్తూ..కథకు అణుగుణంగా ముందుకు వెళ్లాడు.అంతేగాని తన చర్యలతో సంఘటనలు పుట్టించలేకపోయాడు. ఇది స్టోరీ సెన్స్ మిస్సవటంతో వచ్చిన కథన సమస్య.

అలాగే సినిమా చూస్తూంటే దశావతారం ఛాయలు కనపడటం మరో విచిత్రం. దశావతారం సినిమా ప్రారంభంలో వచ్చే రాజుల కాలం నాటి ఎపిసోడ్.అలాగే అక్కడ కూడా వైరస్ చుట్టూ కథ నడవటం.దాన్ని ఆపాలని హీరో తిరగటం..మరో ప్రక్క అమెరికా నుంచి విలన్ ఇక్కడ తిరుగుతూ హీరో,హీరోయిన్స్ ని చంపాలని తిరగటం(ఇక్కడా చైనా నుంచి విలన్ వచ్చి తిరుగతూంటాడు), సినిమా చివరలో సైన్స్ కి, మన శాస్తాలకి ముడి పెట్టే ప్రయత్నం చేస్తూ హీరో స్పీచ్ వంటివి గుర్తుకు వస్తాయి.అలాగే విలన్ ఎపిసోడ్..HAUNTERS(2010) లో వచ్చిన కొరియా చిత్రంని పూర్తిగా గుర్తు చేస్తుంది. విలన్ ఎపిసోడ్ కథకు కలవలేదనిపిస్తుంది. విలన్ ...ఎదుటివారి కళ్లల్లోకి చూస్తూ హిప్నాటైజ్ చేసి వాళ్లను వాళ్లే చంపేసుకునేలా చేయటం వంటివి బాగోలేదు.

ఇక సూర్య ,మురగదాస్ ఇద్దరి సినిమాలు దాదాపుగా మ్యూజికల్ హిట్స్ . ఈసారి అదీ మిస్ అయ్యింది.అయితే సూర్య మాత్రం ఈ పాత్రకు అద్బుతంగా ఇమిడిపోయాడు. పల్లవరాజుగా,భోధి దమ్మగా అద్బుతంగా నటించాడు..అనే కంటే జీవించాడు అనాలి. అయితే సర్కస్ ఫీట్స్ మాత్రం సినిమాకు ప్లస్ కాలేదు.సూర్యని ఎలివేట్ చెయ్యలేకపోయాయి. శృతిహాసన్ సినిమాకి పెద్ద మైనస్ అని చెప్పాలి. ఆమె చాలా నీరసంగా నటిస్తూ,నీర్సిస్తూ,సీన్స్ ని జీవం లేకుండా మార్చేసింది. ఇక గజనిలో వర్కవుట్ అయ్యింది..ముఖ్యంగా లవ్ స్టోరీ.అదీ ఇక్కడ పేలలేదు(ధ్రిల్లర్ కాబట్టి లవ్ స్టోరీని ఎక్సపెక్ట్ చెయ్యకూడదనుకోండి). హెలెట్స్ లో ...రోడ్డుపై సూర్యని,శృతి హాసన్ ని చంపటానకి విలన్ ..రోడ్డుపై ఉన్న జనాలందరిని హిప్నాటైజ్ చేసి రెచ్చగొట్టే ఎపిసోడ్ బాగుంది. అలాగే.. క్లైమాక్స్ లో భోధిదమ్మగా మారుతున్నప్పుడు సూర్యలో వచ్చే మార్పులుకు కూడా ప్రేక్షకులనుంచి మంచి రెస్పాన్సే వచ్చింది.కెమెరా,ఎడిటింగ్ వంటివి భారీ చిత్రానికి తగిన రేంజిలో మాత్రం లేవు.ఓకే అన్నట్లున్నాయి.

ఫైనల్ గా ఒక విషయంలో మనం మురగదాస్ ని మెచ్చుకోవాలి.తమ తమిళ చరిత్రను తవ్వి,భోధి దమ్మ అనేవాడు..తమ తమిళవాడేనని చెప్పే ప్రయత్నం చేసి తమ జాతిలో ఉత్సాహాన్ని నింపే ప్రయత్నం చేసినందుకు ఆయనకు హాట్సాఫ్.అలాగే చాలా చోట్ల...చరిత్రను మరిచిన జాతి మనదంటూ,తమిళ భాషపై తమకున్న అబిమానాన్ని (తెలుగులో ఆ డైలాగులు వర్కవుట్ కాలేదు) చెప్పటం వంటివి ఆయనకు తమ సంస్కృతిపై ఉన్న మమకారాన్ని తెలియచేస్తుంది. ఇక ఈ సినిమాని చూడాలనుకుంటే ప్రారంభంలో వచ్చే ఎపిసోడ్ మాత్రం మిస్ కాకండి.ఇక తమిళ చరిత్రను తెలుసుకోవటం కోసం మన డబ్బులు ఖర్చుపెట్టడం ఎందుకంటారా...అప్పుడు భారతదేశ చరిత్రలో కొంత భాగం తెలుసుకున్నామని ఆనందపడేందుకు వెళ్లండి. పనిలో పనిగా డిఎన్ ఎ గురించి,బయో వార్ గురించి కూడా వివణాత్మంగా చెప్పుకొచ్చారు కాబట్టి అదీ తెలుస్తుంది. ఫక్తు ఎంటర్టైన్మెంట్ కోసమే అయితే ఈ సినిమాకి వెళ్లేటప్పుడు ఆప్షన్ వెతుక్కోండి.

-జోశ్యుల సూర్య ప్రకాష్

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X