800 Movie Review గుండెను పిండేసే ముత్తయ్య మురళీధరన్ బయోపిక్.. 800 సినిమా రివ్యూ!

Rating:
3.0/5

నటీనటులు: మధుర్ మిట్టల్, మహిమా నంబియార్, ఆడుక్కాలమ్ నరేన్ తదితరులు
రచన, దర్శకత్వం: ఎంఎస్ శ్రీపతి
నిర్మాత: వివేక్ రంగాచారి
సమర్పణ: శివలెంక కృష్ణ ప్రసాద్
సినిమాటోగ్రఫి: ఆర్డీ రాజశేఖర్
ఎడిటింగ్: ప్రవీణ్ కేఎల్
మ్యూజిక్: జిబ్రాన్
బ్యానర్: మూవీ ట్రైన్ మోషన్ పిక్చర్స్
రిలీజ్ డేట్: 2023-10-06

తేయాకు తోటల్లో పనిచేసేందుకు వెళ్లిన తమిళ కుటుంబానికి చెందిన ముత్తయ్య ఫ్యామిలీ శ్రీలంకలో బిస్కెట్ వ్యాపారంతో స్థిరపడుతుంది. శ్రీలంకలో తమిళ, సింహళీయలు మధ్య జాత్యాంహంకార ఘర్షణల నుంచి తప్పించుకొనేందుకు ముత్తయ్య కుమారుడు మురళీధరన్ క్రిస్టియన్ చర్చ్ స్కూల్‌లో చేరుతాడు. అక్కడ క్రికెట్ ఆటకు ఆకర్షితుడై స్కూల్ జట్టులో ఆటగాడిగా చేరుతాడు. శ్రీలంక జట్టు సభ్యుడిగా మారడానికి ఎన్నో అవమానాలను అధిగమిస్తాడు.

800 Movie Review and Rating:  Muthiah Muralidarans Biopic is highly emotional ride

శ్రీలంక జట్టులో చేరిన తర్వాత ముత్తయ్య మురళీధరన్‌ను ఎలాంటి సమస్యలు చుట్టుముట్టాయి? ఇంగ్లాండ్ టూర్‌కు వెళ్లిన తర్వాత జట్టు నుంచి ఎలా స్థానాన్ని కోల్పోయాడు. మళ్లీ శ్రీలంక జట్టులో ఎలా చోటు సంపాదించాడు? శ్రీలంకలో తమిళులపై చూపించే వివక్ష వల్ల మురళీధరన్ మనసు ఎలాంటి గాయాలకు లోనైంది. వివక్ష, అవమానాలు తట్టుకొని శ్రీలంక జట్టులో ఎలా రాణించాడు? ఆస్ట్రేలియాలో చకింగ్ అవమానాలను మురళీధరన్ ఎలా ఎదుర్కొన్నాడు? శ్రీలంకలోని ఎల్టీటీఈ సమస్యపై ప్రభాకరన్‌తో మురళీధరన్ ఎలా స్పందించాడు? 800 వికెట్లు సాధించే క్రమంలో ప్రతీ అవమానాన్ని అధిగమించి.. ఎదుటి వాళ్ల ఆరోపణలు తప్పు అని మురళీధరన్ ఎలా నిరూపించుకొన్నాడు అనే ప్రశ్నలకు సమాధానమే 800 మూవీ కథ.

మురళీధరన్ బాల్యం నుంచి క్రికెటర్‌గా ఎదిగే నేపథ్యంగా కథ చాలా ఎమోషనల్‌గా సాగుతుంది. శ్రీలంకలో తమిళులు, సింహాళీయుల మధ్య ఘర్షణల మధ్య మురళీధరన్ ప్రయాణం కొనసాగుతుంది. క్రికెట్ జట్టులో సింహళీయుల అధిపత్యం నడుమ ఏకైక తమిళుడిగా జట్టులో మురళీ చోటు సంపాదించిన తీరు ఆకట్టుకొంటుంది. క్రికెటర్‌గా రాణించడానికి పడిన ప్రతీసారి మురళీ తిరిగి పుంజుకొన్న తీరు నేటితరానికి స్పూర్తి కలిగించేలా ఉంది.

800-Movie-Review

ఇక ముత్తయ్య మురళీధరన్ జీవితంలో రెండో భాగం అత్యంత కీలకంగా ఉంటుంది. ఆస్ట్రేలియాలో చకింగ్ ఆరోపణలు మురళీధరన్‌ను ఆత్మ సంరక్షణలో పడేస్తాయి. ఆ సమయంలో అర్జున రణతుంగ వ్యవహరించిన తీరు హృదయాన్ని పిండేస్తుంది. అర్జున రణతుంగ క్యారెక్టర్ ఈ సినిమాకు మరో హీరోలా కనిపిస్తుంది. ఎల్టీటీఈ అధినేతతో ముత్తయ్య మురళీధరన్ చర్చలు జరిపిన తీరు ఆయనలోని మానవీయ కోణాన్ని, మానవత్వాన్ని నిదర్శనంగా నిలుస్తుంది. 800 వికెట్లు సాధించే జర్నీలో ప్రతీ అడుగు ఓ ఛాలెంజ్‌లా ఉంటుంది. ఆ సవాళ్లను అధిగమించిన విధానం ముత్తయ్య మురళీధరన్‌ రియల్ హీరో అనేలా చేస్తుంది.

800 Movie Review and Rating:  Muthiah Muralidarans Biopic is highly emotional ride

ముత్తయ్య మురళీధరన్‌గా మధుర్ మిట్టల్ పరకాయ ప్రవేశం చేశాడు. స్క్రీన్ మీద మధుర్‌గా కాకుండా ముత్తయ్య మాదిరిగానే జీవించాడు. ఎమోషనల్ సీన్లలో తన ఫెర్పార్మెన్స్‌తో ఆకట్టుకోవడం కాదు.. గుండెలను పిండేసే నటనను ప్రదర్శించాడు. భార్యగా మహిమ నంబియార్ పాత్ర చిన్నదైనా గుర్తుండిపోతుంది. అర్జున రణతుంగ పాత్రను పోషించిన నటుడు అద్బుతంగా రాణించాడు. మిగితా పాత్రలన్నీ తమ పరిధి మేరకు న్యాయం చేశారు.

800 Movie Review and Rating:  Muthiah Muralidarans Biopic is highly emotional ride

ముత్తయ్య మురళీధరన్ 800 వికెట్లు సాధించిన క్రికెటర్‌గానే మనకు తెలుసు. కానీ ఆయన జీవితానికి మరో వైపు ఉన్న భావోద్వేగమైన సన్నివేశాలు, ఉద్వేగంతో కూడిన క్షణాలు గుండెను పిండేస్తాయి. అలాంటి కాంప్లికేటెడ్ కథను దర్శకుడు ఎంఎస్ శ్రీపతి బ్యాలెన్స్‌గా తెర మీద తీర్చి దిద్దారు. జిబ్రాన్ సంగీతం, ఆర్డీ రాజశేఖర్ సినిమాటోగ్రఫి, ప్రవీణ్ ఎడిటింగ్ ఈ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్. నిర్మాణ విలువలు అద్బుతంగా ఉన్నాయి.

800 Movie Review and Rating:  Muthiah Muralidarans Biopic is highly emotional ride

800 మూవీ భావోద్వేగంతో సాగే ఓ స్పూర్తిదాయకమైన కథ. ముత్తయ్య మురళీధరన్ జీవితంలో ఎన్ని మలుపులు, ఎన్ని రకాల వివక్షలు ఉన్నాయనే విషయం ఈ సినిమా చూస్తే తెలియదు. లెజెండరీ క్రికెటర్‌గా పిలుచుకొనే ముత్తయ్య మురళీధరన్ ఎన్ని వివాదాలను దాటుకొంటూ తనకు తాను నిజాయితీ పరుడని నిరూపించుకొన్న తీరుకు హ్యాట్సాఫ్ చెప్పాలి. నటీనటులు ఫెర్ఫార్మెన్స్, దర్శకుడి టేకింగ్ ఈ సినిమా అత్యంత బలంగా నిలిచాయి. బయోపిక్స్ అంటే ఇష్టపడే వారు, ఎమోషనల్ కంటెంట్‌తో సినిమాను ఆదరించే వారు తప్పకుండా 800 మూవీ చూడాల్సిందే. ఈ సినిమా ప్రతీ ఒక్కరిని ఆకట్టుకోవడమే కాకుండా గుండెను భావోద్వేగంతో తడిపేస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X