twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    విభిన్నమైన చిత్రం

    By Staff
    |

    9 Nelalu
    -జలపతి గూడెల్లి
    చిత్రం: 9 నెలలు
    నటీనటులు: సౌందర్య, విక్రమ్‌, ఎమ్మెస్‌ నారయణ
    సంగీతం: ఆర్‌.పి.పట్నాయక్‌
    కథ, స్క్రీన్‌ ప్లే, నిర్మాత, దర్శకత్వం: క్రాంతికుమార్‌

    గతంలో ఎన్నో అర్ధవంతమైన చిత్రాలను నిర్మించిన క్రాంతికుమార్‌ మరో ప్రయోగాత్మక చిత్రాన్ని అందించారు. స్వాతి వంటి ఉత్తమ చిత్రాలకు దర్శకత్వం వహించిన క్రాంతికుమార్‌ ఈ చిత్రంలోనూ సున్నితమైన సమస్యను ఎంచుకున్నారు. సరోగేట్‌ మదర్‌ (గర్భాన్ని అద్దెకు ఇవ్వడం) అనే అంశాన్ని తీసుకొని కన్వీన్సింగ్‌ గా చెప్పడంలో ఆయన సఫలీకృతమయ్యారు. అయితే ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకోవడం కష్టమే. కాస్త ఆర్ట్‌ ఫిలిం తరహాలో ఉండడం వల్ల మహిళా ప్రేక్షకులు కూడా ఆదరిస్తారో లేదో చెప్పలేం. అక్కడక్కడా అసహజత్వం, కృత్రిమత్వం ఉన్నప్పటికీ మొత్తమ్మీద 9 నెలలు మంచి చిత్రమనే చెప్పొచ్చు.

    సౌందర్య ఒక అనాథ. దూరపు బంధువుల దగ్గర ఆ పని, ఈ పని చేసుకుంటూ బతుకుతూ ఉంటుంది. వీరు ఉండే రెసిడెన్సియల్‌ కాంప్లెక్స్‌ లోని వారందరికీ అన్ని పనులు చేసి పెడుతుంది. విక్రమ్‌ కంప్యూటర్‌ ప్రొఫెషనల్‌. వర్చువల్‌ రియాలిటీ టెక్నాలజీలో మంచి మేధావి. సౌందర్య పనిచేసే కాంప్లెక్స్‌ లోనే విక్రమ్‌ కూడా ఉంటాడు. విక్రమ్‌ పనిచేసే ఆఫీస్‌ లో ఆఫీస్‌ అటెండెంట్‌ గా పనిచేసే ఎమ్మెస్‌ నారయణతో సౌందర్యకు పెళ్లి చేసేందుకు వారు బంధువులు ప్రయత్నిస్తారు. ఎమ్మెస్‌ నారయణ మంచి వాడు కాదనీ, పచ్చి తాగుబోతని విక్రమ్‌ చెపుతాడు. సౌందర్యను విక్రమ్‌ పెళ్ళి చేసుకుంటాడు. దాంతో ఎమ్మెస్‌ నారయణ్‌ విక్రమ్‌ పై కక్ష గడుతాడు. విక్రమ్‌ చేసిన కంప్యూటర్‌ ప్రాజెక్ట్‌ ను విఫలం అయ్యేలా చేస్తాడు. దాంతో విక్రమ్‌ సస్పెండ్‌ అవుతాడు.

    ఆ బాధలో ఇంటికి వెళ్తుండగా యాక్సిండెట్‌ అవుతుంది. ఆపరేషన్‌ చేస్తేనే బతుకుతాడని డాక్టర్లు చెపుతారు. దానికి 7 లక్షలు కావాల్సి ఉంటుంది. ప్రాణాపాయ స్థితిలో ఉన్న భర్తను రక్షించుకునేందుకు సౌందర్య సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంటుంది. సరోగేట్‌ మదర్‌ అయ్యేందుకు ఒప్పుకుంటుంది. దాని ద్వారా వచ్చిన డబ్బుతో భర్తను రక్షించుకుంటుంది. కానీ సరోగేట్‌ మదర్‌ అంటే వేరే వాడితో కడుపు చేయించుకోవడమనుకునే సమాజం నుంచి ఛీత్కారాలను చవిచూడాల్సి వస్తుంది. ఈ అవమానం భరించలేక అబార్షన్‌ చేసుకోమని విక్రమ్‌ కోరుతాడు. అందుకు సౌందర్య ఒప్పుకోదు. దాంతో విడాకులు కావాలని కోరుతాడు. సౌందర్య చేసిన దాంట్లో తప్పేమీ లేదని కోర్టు తీర్పు ఇస్తుంది. ఆ తర్వాత ఇద్దరు విడిపోతారు.

    ఇందులో సౌందర్య పాత్ర పేరు సావిత్రి. సావిత్రిలాగే చాలా సహజంగా నటించింది. సౌందర్య భర్తగా విక్రమ్‌ నటనా చాలా బావుంది. నేపథ్యంలో వచ్చే చిన్న పాటలు తప్ప ఇందులో పాటలు లేకపోవడం విశేషం. ఈ సినిమా కథకు తగ్గట్లే ఈ చిత్రాన్ని 35ఎం.ఎంలో తీయడం వల్ల డ్రామా బాగా ఎలివేట్‌ అయింది. కొద్దిగా సీరీయస్‌ నెస్‌ ను తగ్గిస్తే చిత్రం అందరి ఆదరణ పొందేది.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X