A.R.M Movie Review: ఏఆర్‌ఎమ్ సినిమా రివ్యూ అండ్ రేటింగ్.. టొవినో థామస్ హిట్టు కొట్టాడా?
మూవీ: అజయంతే రాండమ్ మోషనమ్ (ARM)
నటీనటులు: టోవిన్ థామస్, కృతిశెట్టి, ఐశ్వర్య రాజేశ్, సురభి లక్ష్మీ, బాసిల్ జోసెఫ్, జగదీష్, కబీర్ దుహన్ సింగ్, రోహిణి తదితరులు
దర్శకత్వం: జతిన్ లాల్
రచన: సుజిత్ నంబియార్
నిర్మాత: లిస్టిన్ స్టీఫెన్
సినిమాటోగ్రఫి: జామన్ టీ జాన్
ఎడిటింగ్: దిబు నైనన్ థామస్
బ్యానర్: మ్యాజిక్ ఫ్రేమ్స్, ఫైవ్ స్టార్ కే సెంథిల్, మైత్రీ మూవీ మేకర్స్
రిలీజ్ డేట్: 2024-09-12
బ్రిటీష్ కాలంలో ఆ పాలకుల నుంచి ఇడుక్కి మహారాజుకు కష్టం వస్తుంది. ఆ కష్టం నుంచి కుంజి కేలు అనే యోధుడు (టొవినో థామస్) ఆ రాజును కాపాడుతాడు. బ్రిటీష్ పాలకుల నుంచి కాపాడినందుకు ఏదైనా కోరుకోమని ఇడుక్కి రాజు అడుగుతాడు. అయితే తమ వద్ద ఉన్న శ్రీబోది దీపం (విగ్రహం) ఇస్తే తాను నివసించే హరిపురం ప్రాంతంలో ప్రతిష్టించాలని ఉందని కోరిక కోరుతాడు. దాంతో అద్బుతమైన మహిమ ఉన్న ఆ దీపాన్ని కేలీకి అందిస్తాడు. ఆ విగ్రహాన్ని పట్టుకొని తన ఊరికి వచ్చిన తర్వాత ఓ షాకింగ్ విషయం తెలుస్తుంది.

ఇడుక్కి మహారాజును కుంజు కేలు ఎలా కాపాడాడు. శ్రీబోది విగ్రహాన్ని ఇచ్చినప్పటికీ అతడికి ఆ మహారాజు చేసిన మోసం ఏమిటి? తన తండ్రికి జరిగిన మోసానికి ఆ రాజ వంశానికి కేలీ కుమారుడు మణియన్ (టొవినో థామస్) ఎలాంటి గుణపాఠం నేర్పాడు. శ్రీ బోది విగ్రహాన్ని మణియన్ తనవద్దే ఎందుకు ఉంచుకొన్నాడు? ఆ విగ్రహం వల్ల మణియన్ ఎలా ప్రాణాలు కోల్పోయాడు. తాత, తండ్రి వల్ల తమ కుటుంబానికి జరిగిన అన్యాయానికి అజయన్ ఎలా ప్రతీకారం తీర్చుకొన్నాడు? అజయన్ చేసిన మొదటి దొంగతనం ఏమిటి? రెండో దొంగతనం ఏ పరిస్థితుల్లో ఆయన చేశాడు అనే ప్రశ్నలకు సమాధానమే అజయంతే (A) రాండమ్ (R) మోషనమ్ (M) సినిమా కథ.
ఏఆర్ఎమ్ సినిమా విషయానికి వస్తే.. బ్రిటీష్ వారిపై కుంజి కేలుతో మంచి యాక్షన్ ఎపిసోడ్‌తో గ్రాండ్‌గానే సినిమాను ఓపెన్ చేశాడు. కానీ కథను ముక్కలు ముక్కలుగా చెప్పడం ద్వారా ఆ స్టోరీలో ఉండే ఎమోషన్స్ తేలిపోయాయనే ఫీలింగ్ కలగడమే కాకుండా సినిమా నుంచి డిస్ కనెక్ట్ అయ్యేలా చేశాయని చెప్పవచ్చు. అంతేకాకుండా మణియన్, అజయన్ పాత్రలకు సంబంధించిన సన్నివేశాలు అంత బలంగా లేకపోవడంతో కథ ఎటువైపు సాగుతుందో కొంత కన్‌ఫ్యూజన్ ఏర్పడుతుంది. కథలో ట్విస్టులు, టర్నులు పెద్దగా ఏమీ లేకపోవడం వల్ల సాదాసీదా సినిమా చూసినట్టు అనిపిస్తుంది.

ఇక ఏఆర్ఎమ్ సినిమాకు సాంకేతిక విభాగాల పనితీరు బలంగా మారింది. సినిమాటోగ్రఫి, వీఎఫ్ఎక్స్ సినిమా, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, ప్రొడక్షన్ వాల్యూస్ సినిమాకు ప్లస్ పాయింట్స్. కథ, కథనాలు, బలమైన సన్నివేశాలు లేకపోవడం ఈ సినిమాకు మైనస్. మొత్తంగా ఇలాంటి ప్లస్, మైనస్ ఉన్న సినిమాను టోవినో థామస్ తన ఫెర్ఫార్మెన్స్‌తో నిలబెట్టే ప్రయత్నం మెచ్చుకోదగిన అంశం. శృతిశెట్టి, ఐశ్వర్య రాజేశ్ పెద్దగా ప్రాధాన్యం లేని పాత్రల్లో నటించారనే చెప్పాలి. సురభీ లక్ష్మీ కొంత మేరకు తన నటనతో మెప్పించారు. రోహిణి, ఇతర పాత్రల్లో నటించిన వారు ఒకే అనిపించారు.
లవ్, కుల వివక్ష లాంటి అంశాలతో దైవత్వంతో కూడిన పాయింట్ చుట్టు అల్లుకొన్న ఓ దొంగ కథ. దొంగ జీవితంలో జరిగిన సంఘటనలు, అతడి జీవితంలోకి వచ్చిన జమీందారి కూతురు, వారిద్దరి ప్రేమ చుట్టు అల్లుకొన్న సన్నివేశాలతో ఈ సినిమా సాగుతుంది. టెక్నికల్‌గా బాగుంది. స్టోరీ పరంగా వీక్. తెలుగు నెటివిటి దూరంగా ఉండటం మరో మైనస్. టొవినో థామస్ ఫ్యాన్స్‌కు నచ్చే అవకాశం ఉంది. అలాగే మలయాళ సినిమాలను అభిమానించే వారికి మూవీ నచ్చడానికి స్కోప్ ఉంది. చేతిలో తగినంత సమయం ఉంటే.. ఓసారి థియేటర్లలో మూవీపై లుక్కేయండి..


Click it and Unblock the Notifications











