A.R.M Movie Twitter Review: టొవినో థామస్ మూవీ హిట్టా? ఫట్టా?
మలయాళంలో స్టార్ హీరో టోవినో నటించిన చిత్రం A.R.M (Ajayante Randam Moshanam). టోవినో థామస్ కెరీర్‌లో 50వ సినిమాగా రూపొందిన ఈ చిత్రంలో కృతి శెట్టి, ఐశ్వర్య రాజేష్, సురభి లక్ష్మి హీరోయిన్స్‌గా నటించారు.
తొలి చిత్ర దర్శకుడు జితిన్ లాల్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని డాక్టర్ జకారియా థామస్‌తో కలిసి మ్యాజిక్ ఫ్రేమ్స్, UGM మోషన్ పిక్చర్స్ బ్యానర్లపై లిస్టిన్ స్టీఫెన్ నిర్మించారు. ఈ సినిమాను తెలుగులో మైత్రీ మూవీ మేకర్స్ డిస్ట్రిబ్యూటర్స్ గ్రాండ్‌గా రిలీజ్ చేశారు. ARM సెప్టెంబర్ 12న విడుదలైంది. ఈ సందర్బంగా సోషల్ మీడియాలో నెటిజన్లు అభిమానులు వెల్లడించిన రివ్యూ వివరాల్లోకి వెళితే..
ARM సినిమా చూశాను. మూవీలో కొన్ని ఇంట్రెస్టింగ్ అంశాలు ఉన్నాయి. కానీ ఈ సినిమా ఎంగేజింగ్ ఎక్స్‌పీరియెన్స్ అందించడంలో ఫెయిల్ అయింది. సెకండాఫ్‌లో కొన్ని మూమెంట్స్ బాగున్నాయి. అయినా మూవీపై ఇంపాక్ట్ చూపించలేకపోయాయి. బలహీనమైన క్యారెక్టర్లు, ఎమోషన్స్ పండలేదు. నత్తనడకన సాగే కథ, కథనాలు సినిమాకు మైనస్ అని ఓ నెటిజన్ తన రివ్యూను అందించారు.
కాన్సెప్ట్ బాగుంది కానీ వండి వండని వంటకాన్ని అందించినట్టు సినిమా ఉంది. ఆడియెన్‌పై బలంగా ప్రభావం చూపే స్క్రీన్ ప్లే మిస్ అయింది. క్లైమాక్స్ కూడా అంతగా లేదు. కాకపోతే టెక్నికల్‌గా స్టన్నింగ్. ఎప్పటిలానే టొవినో ఫెర్ఫార్మెన్స్‌తో ఇరుగదీశాడు. ఓవరాల్‌గా యావరేజ్ సినిమా అని చెప్పవచ్చు అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.
ARM మూవీ విజువల్‌గా బాగుంది. గ్రామీణ నేపథ్యం ఉన్న కథగా ఫర్వాలేదనిపిస్తుంది. యాక్షన్ సీన్లు బాగున్నాయి. సెకండాఫ్‌లో ట్రెజర్ హంట్ థ్రిలింగ్‌గా అనిపించింది. కొంత మేరకు ఎంగేజింగ్‌గా అనిపిస్తుంది. తొలి చిత్ర దర్శకుడిగా డైరెక్టర్ జతిన్ లాల్ పాస్ అయ్యాడనే చెప్పాలి. సినిమాటోగ్రపి, విజువల్‌గా రిచ్‌గా ఉంది. కృతి, సురభి వారి పాత్రల మేరకు ఫర్వాలేదనిపించారు అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.
అజయంతే రాండమ్ మోషనమ్ (ARM) మూవీ బాగుంది. టోవినో థామస్ కెరీర్‌లో బెస్ట్. మణియన్ పాత్రలో బాగా నటించాడు. జతిన్ లాల్ డైరెక్షన్ బాగుంది. విజువల్స్, ప్రొడక్షన్ వాల్యూస్, బీజీఎం సినిమాకు సూపర్‌గా ఉన్నాయి. ఫస్టాఫ్ కంటే సెకండాఫ్ బాగుంది. 3డీలో కొన్ని సమస్యలు ఉన్నాయి. కొన్ని క్యారెక్టర్లను వేస్ట్ చేశారు. స్క్రీన్ ప్లే బాగలేదు. ఓవరాల్‌గా సూపర్బ్‌గా ఉంది అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.

ARM సినిమాకు సూపర్ స్టార్ మోహన్‌లాల్ సహాయం చేయడంపై హీరో టొవినో థామస్ ఎమోషనల్‌గా స్పందించారు. ట్విట్టర్‌లో పోస్ట్ చేసి.. ఏఆర్ఎమ్ సినిమాకు ఆయన గొంతును ఇవ్వడం చాలా గర్వంగా ఉంది. ఆయన ఐకానిక్ వాయిస్ మా సినిమాకు కొత్త రూపం తీసుకొచ్చింది. నా సినిమా జర్నీలో భాగమైనందుకు థ్యాంక్యూ సార్ అని ట్వీట్‌లో పేర్కొన్నారు.
తమిళంలో ఏఆర్ఎమ్ సినిమాకు స్టార్ హీరో విక్రమ్ తన గొంతును అరువుగా ఇచ్చి సహాయం చేశారు. దానిపై టోవినో థామస్ స్పందించారు. చియాన్ విక్రమ్ ఈ సినిమాకు గొంతును అరువు ఇవ్వడంపై భావోద్వేగంగా స్పందించారు. మా సినిమాకు సహాయం చేయడం గర్వంగా ఉంది అని అన్నారు.
ఇక కన్నడలో ఏఆర్ఎమ్ సినిమాకు సూపర్ స్టార్ శివ రాజ్ కుమార్ తన గొంతును ఇచ్చారు. కాస్మిక్ క్రియేటర్‌గా తన వాయిస్‌ను ఇవ్వడంపై ఆయన గర్వంగా ఉందని అన్నారు.


Click it and Unblock the Notifications











