twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘A1 ఎక్స్‌ప్రెస్’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్

    |

    Rating:
    2.5/5
    Star Cast: సందీప్ కిషన్, లావణ్య త్రిపాఠి, మురళీ శర్మ తదితరులు
    Director: డెన్నీస్ జీవన్ కనుకొలను

    సందీప్ కిషన్ హీరోగా సక్సెస్ కొట్టేందుకు చాలా కాలమే ఎదురుచూశాడు. అయితే ల్యాండ్ మార్క్ చిత్రాలపై కాస్త ఎక్కువగా ఫోకస్ పెడుతుంటారు హీరోలు. అలా సందీప్ కిషన్ తన ల్యాండ్ మార్క్ 25వ చిత్రంగా A1 ఎక్స్‌ప్రెస్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ప్రయోగాల జోలికి ఎందుకు వెళ్లడమని తమిళంలో హిట్ అయిన సినిమానే తెలుగులో రీమేక్ చేశాడు. నిర్మాతగా, హీరోగా A1 ఎక్స్‌ప్రెస్ సందీప్ కిషన్‌కు ఎలాంటి ఫలితాన్ని ఇచ్చిందో ఓ సారి చూద్దాం.

    కథ..

    కథ..

    సంజు (సందీప్ కిషన్) అలా జాలీగా కాలాన్ని గడిపే ఓ కుర్రాడు. ఓ పని మీద యానాంకు వెళ్తాడ. అలా హ్యాపీగా సాగుతున్న సందీప్ జీవితంలోకి లావణ్య (లావణ్య త్రిపాఠి) ఎంట్రీ ఇస్తుంది. ఆమె హాకీ క్రీడాకారిణి. ఆమెతో ప్రేమలో పడటం, ఆమె ద్వారా హాకీ కోచ్, రిటైర్డ్ ఆర్మీ అధికారి మురళీ శర్మ పరిచయం అవుతాడు. మరో వైపు రాజకీయ నాయకుడైన రావు రమేష్ కన్ను హాకీ గ్రౌండ్ మీద పడుతుంది. అతడి నుంచి సంజు ఆ హాకి గ్రౌండ్‌ను కాపాడతాడు.

    కథలో ట్విస్టులు..

    కథలో ట్విస్టులు..

    సందీప్ హాకీ ఆటకు ఎందుకు దూరంగా ఉన్నాడు? దానికి వెనుకున్న అసలు కథ ఏంటి? చివరకు మళ్లీ హాకీ ఆటను సందీప్ ఆడేందుకు ఒప్పుకుంటాడా? గ్రౌండ్‌ను కబ్జా చేయాలని రాజకీయ నాయకుడు రావు రమేష్ చేసే ప్రయత్నాలను ఎలా అడ్డుకున్నాడు? చివరకు సందీప్ ఇచ్చే మెసెజ్ ఏంటి? చివరకు లావణ్య సందీప్ ప్రేమ కథ ఏమవుతుంది?వంటి పలు ఆసక్తికర అంశాలకు సమాధానమే A1 ఎక్స్‌ప్రెస్.

    ఫస్టాఫ్‌ అనాలిసిస్..

    ఫస్టాఫ్‌ అనాలిసిస్..

    సంజు జాలీ లైఫ్, లావణ్య త్రిపాఠి పరిచయం, ప్రేమ వంటి సీన్లతో ప్రథమార్థం అలా ముందుకు సాగుతూ ఉంటుంది. హాకీ క్రీడా నేపథ్యంలో కథనం సాగుతూ ఉండటం కాస్త కొత్తగా అనిపిస్తుంటుంది. అయితే అన్నింటికంటే ముఖ్యంగా ఇంటర్వెల్ బ్యాంగ్ మాత్రం సందీప్ కెరీర్‌లో హైలెట్ అయ్యేలా ఉంది. సాంగ్స్ తెరకెక్కించిన విధానం కూడా అందరినీ ఆకట్టుకుంటుంది. మొత్తానికి ఫస్టాప్ ఓ మోస్తరుగా అందరినీ కట్టిపడేసేలానే ఉంది.

    సెకండాఫ్ అనాలిసిస్..

    సెకండాఫ్ అనాలిసిస్..

    ద్వితీయార్థంలోనే అసలు కథ రక్తి కడుతుంది. హాకీ క్రీడకు సందీప్ ఎందుకు దూరమయ్యాడు.. అసలు ఇండియాలో ఆటలు ఆడాలంటే ఎలాంటి పరిస్థితులు ఎదురువుతాయి.. వివక్ష ఎంతటి స్థాయిలో ఉందనే విషయాలను వివరిస్తూ కథనం ముందుకు సాగుతూ ఉంటుంది. ఇక ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్‌లో సందీప్ కిషన్ నటన అదిరిపోతుంది. చివరకు రాజకీయ నాయకుల గురించి చెప్పే మాటలు అందరినీ ఆలోచించేలా చేస్తాయి. ప్రథమార్థం కంటే ద్వితీయార్థంలోనే కథ వేగంగా బిగిగా సాగుతుందనిపిస్తోంది.

    నటీనటులు..

    నటీనటులు..


    A1 ఎక్స్‌ప్రెస్ సినిమాలో సందీప్ కిషన్ ఆల్ రౌండర్ అనిపిస్తాడు. అల్లరి చేసినా, సీరియస్‌గా ఆట ఆడినా, ప్రేమ, యాక్షన్, ఎమోషనల్ ఇలా ప్రతీ సీన్‌లోనూ సందీప్ కిషన్ అదరగొట్టేశాడు. ఈ
    సినిమా ల్యాండ్ మార్క్‌గా ఎంచుకోవడంతో సందీప్ కిషన్ కెరీర్‌లో మైల్ స్టోన్ అయ్యేలా ఉంది. ఇక లావణ్య త్రిపాఠి తన అందం, నటనతో ఆకట్టుకుంటుంది. మిగిలిన పాత్రల్లో మురళీ శర్మ, రావు రమేష్, పోసాని, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ఇలా అందరూ కూడా తమ పరిధిలో గుర్తుండిపోయేలా నటించారు.

    దర్శకుడి పనితీరు..

    దర్శకుడి పనితీరు..

    తెలుగులో స్పోర్ట్స్ డ్రామా చిత్రాలు రావడమే అరుదు. అయితే తమిళంలో ఇలాంటి ప్రయోగాలు ఎక్కువగా జరుగుతుంటాయి. అందుకే అక్కడ హిట్ అయిన నట్పే తునై సినిమాను ఇక్కడ A1 ఎక్స్‌ప్రెస్‌గా రీమేక్ చేశారు. అయితే ఎక్కువగా కష్టపడకుండా తెలుగు నేటివిటీకి కావాల్సిన కమర్షియల్ అంశాలు జోడించారు. తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టు తెరకెక్కించడంలో దర్శకుడు డెన్నీస్ సక్సెస్ అయ్యాడని చెప్పవచ్చు. రీమేక్ కథలను అందరికీ నచ్చేలా చెప్పడం కూడా అంత సులభమేమీ కాదు. కానీ ఆ విషయంలో డెన్నీస్ పాసైపోయాడు. కమర్షియల్ అంశాలు జొప్పిస్తూనే కథలోని ఆత్మని పట్టుకున్నాడు.

    సాంకేతిక విభాగాల పనితీరు

    సాంకేతిక విభాగాల పనితీరు

    A1 ఎక్స్‌ప్రెస్ సినిమాపై మొదటగా హైప్ తీసుకొచ్చింది సంగీతమే. హిప్ హప్ తమిళ అందించిన సంగీతం, దాన్ని తెరపై అంతే అందంగా చూపించి సినిమాటోగ్రఫర్ కెవిన్ తమ సత్తాను ప్రదర్శించారు. ఇక ఫస్టాప్ కాస్త బోరింగ్‌గా అనిపిస్తుంటుంది. ఆ విషయంలో ఎడిటర్ ఇంకాస్త దృష్టిపెడితే బాగుండేది. డైలాగ్స్ ఆలోచనలు రేకెత్తించేలా ఉన్నాయి. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.

    బలం బలహీనతలు..

    బలం బలహీనతలు..


    ప్లస్ పాయింట్స్
    సందీప్ కిషన్
    కథ
    సంగీతం

    మైనస్ పాయింట్స్
    ప్రథమార్థం
    ఊహకందేలా సాగే కథనం

    ఫైనల్‌గా..

    ఫైనల్‌గా..

    సందీప్ కిషన్ ల్యాండ్ మార్క్ సినిమాగా A1 ఎక్స్‌ప్రెస్‌ను ఎంచుకోవడం సరైన నిర్ణయమే. తన దారిలో నడుస్తూనే కొత్తగా ప్రయత్నించి సందీప్ కిషన్ సక్సెస్ కొట్టేశాడు. అయితే మరీ టైటిల్‌లో ఉన్నంత ఎక్స్ ప్రెస్‌గా దూసుకుపోలేదు. అయితే ఈ A1 ఎక్స్‌ప్రెస్‌‌లో ప్రయాణం మాత్రం అంతగా బోర్ కొట్టదు.

    నటీనటులు

    నటీనటులు

    సందీప్ కిషన్, లావణ్య త్రిపాఠి, మురళీ శర్మ తదితరులు
    దర్శకత్వం : డెన్నీస్ జీవన్ కనుకొలను
    నిర్మాత : టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్, సందీప్ కిషన్, దయా పన్నెన్
    మ్యూజిక్ : హిప్ హప్ తమిళ
    సినిమాటోగ్రఫి : కెవిన్ రాజ్
    ఎడిటింగ్ : చోటా కే ప్రసాద్
    రిలీజ్ డేట్ : 2021-03-05

    English summary
    A1 Express is an Telugu language mass action And Sports Drama written and directed by Dennis jeevan. The film stars Sundeep kishan, Lavanya Tripati, Murali sharma
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X