For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Aa Ammayi Gurinchi Meeku Cheppali review భావోద్వేగమైన ప్రేమ కథ.. ఇంద్రగంటి తరహా మ్యాజిక్!

  |

  Rating: 2.75/5

  నటీనటులు: సుధీర్ బాబు, కృతిశెట్టి, శ్రీనివాస్ అవసరాల, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ తదితరులు
  కథ, దర్శకత్వం: మోహనకృష్ణ ఇంద్రగంటి
  నిర్మాత: బీ మహేంద్ర బాబు, కిరణ్ బల్లపల్లి
  సినిమాటోగ్రఫి: పీజీ విందా
  ఎడిటర్: మార్తాండ్ కే వెంకటేష్
  మ్యూజిక్: వివేక్ సాగర్
  బ్యానర్: బెంచ్‌మార్క్ స్టూడియోస్, మైత్రీ మూవీ మేకర్స్
  రిలీజ్: 2022-09-16

  కథ ఏమిటంటే?

  కథ ఏమిటంటే?

  నవీన్ (సుధీర్ బాబు) టాలీవుడ్‌లో చెత్త కథలను తీసి హిట్టు కొట్టిన టాప్ డైరెక్టర్. అయితే తనపై వస్తున్న విమర్శలకు చెక్ చెప్పి మంచి కథతో సినిమా తీయాలనే ప్రయత్నంలో ఒక రీల్ దొరుకుతుంది. ఆ రీల్‌లో నటించిన అమ్మాయి (కృతిశెట్టి)ని చూసి హీరోయిన్‌గా ఫిక్స్ అవుతాడు. అయితే ఆ అమ్మాయి గురించి వెతకడం ప్రారంభించిన తర్వాత ఆమె కంటి డాక్టర్ అలేఖ్య అని తెలుస్తుంది. అయితే నవీన్ కష్టపడి అలేఖ్యను నటించమని అప్రోచ్ అయితే తనకు ఇష్టం లేదని రిజెక్ట్ చేస్తుంది.

  కథ, కథనాల్లో ట్విస్టులు

  కథ, కథనాల్లో ట్విస్టులు


  రీల్‌లో నటించిన అమ్మాయి, కంటి డాక్టర్ అలేఖ్య ఒకరేనా? డాక్టర్ అలేఖ్య నవీన్ ఆఫర్‌ను ఎందుకు రిజెక్ట్ చేసింది. అలేఖ్యను ఒప్పించడానికి నవీన్ ఎలాంటి ప్రయత్నాలు చేశారు. అలేఖ్య తల్లిదండ్రులను కలిసి ఒప్పించడానికి చేసిన ప్రయత్నాలు వర్కవుట్ అయ్యాయా? చివరకు అలేఖ్యతో సినిమా తీశారా? ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి అనే చిత్రం చివరకు దర్శకుడు నవీన్‌కు ఎలాంటి ఫలితాన్ని అందించింది అనే భావోద్వేగమైన ప్రశ్నలకు సమాధానమే ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమా కథ.

  ‘ఆ అమ్మాయి’ మూవీ ఎలా ఉందంటే

  ‘ఆ అమ్మాయి’ మూవీ ఎలా ఉందంటే

  ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమా సినిమా పరిశ్రమపై సెటైర్లు, అంతర్గత వ్యవహారాలు, దర్శకుడు నవీన్ ఇగోలతో కొంత ఫన్ రైడ్‌తో మొదలవుతుంది. రీల్ లభించిన తర్వాత కథ ఓ ఆసక్తికరమైన జోన్‌లోకి ప్రవేశిస్తుంది. అక్కడ నుంచి అలేఖ్యను ఒప్పించడానికి చేసే ప్రయత్నాలు రొటీన్‌గా ఉన్నప్పటికి సీన్లలో ఫన్ కొంత క్యూరియాసిటిని క్రియేట్ చేస్తుంది. అయితే ఇంటర్వెల్‌లో మంచి ట్విస్టుతో సినిమా సెకండాఫ్‌పై మంచి అంచనాలు పెంచే ప్రయత్నం చేశారు. ఇక సెకండాఫ్‌లో కథను డ్రైవ్ చేసిన ఎమోషనల్ ఎలిమెంట్ హైలెట్ నిలుస్తాయి. చివరి 20 నిమిషాల్లో ఇంద్రగంటి మోహనకృష్ణ చేసిన మ్యూజిక్ వర్కవుట్ కావడంతో సినిమా ఫీల్‌గుడ్, ఎమోషనల్ ఎంటర్‌టైనర్‌ సంతృప్తిని కలిగిస్తుంది.

  దర్శకుడు ఇంద్రగంటి టేకింగ్

  దర్శకుడు ఇంద్రగంటి టేకింగ్

  దర్శకుడు ఇంద్రగంటి అనుకొన్న పాయింట్.. దానిని కథగా విస్తరించుకొంటూ పోయిన విధానం సినిమాకు ప్లస్ అయిందని చెప్పవచ్చు. కథను మెల్లమెల్లగా ఇంజెక్ట్ చేస్తూ.. భావావేశాలను కలిగిస్తూ.. కథను ప్రేక్షకుడికి కనెక్ట్ చేసిన విధానమే సినిమాకు పాజిటివ్ అని చెప్పవచ్చు. ఇక కృతిశెట్టి, సుధీర్ బాబు నుంచి రాబట్టుకొన్న పెర్ఫార్మెన్స్ సినిమా మరో మెట్టు ఎక్కించదని చెప్పవచ్చు. శ్రీకాంత్ అయ్యంగార్‌ పాత్రను చాలా కంట్రోల్‌గా, బ్యాలెన్స్ చేస్తూ సినిమాను ఎమోషనల్‌గా మార్చడం దర్శకుడిగా అతడి ప్రతిభకు మరోసారి అద్దం పట్టింది. కృతిశెట్టి పాత్రకు సంబంధించిన ట్విస్టును చాలా జాగ్రత్తగా డీల్ చేయడం సినిమాకు ఫీల్‌గుడ్‌గా మారింది. సీన్, సీన్‌కు, ఎపిసోడ్, ఎపిసోడ్‌కు సినిమాను లేపిన విధానం ఈ సినిమా సక్సెస్‌కు కారణం అని చెప్పవచ్చు.

  సుధీర్, కృతిశెట్టి ఫెర్ఫార్మెన్స్ అదుర్స్

  సుధీర్, కృతిశెట్టి ఫెర్ఫార్మెన్స్ అదుర్స్

  ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమాకు బలం కృతిశెట్టి, సుధీర్ బాబు పెర్ఫార్మెన్స్. సుధీర్ బాబు విషయానికి వస్తే.. డైరెక్టర్‌గా యాటిట్యూడ్, ఇగోను పర్‌ఫెక్ట్‌గా తెరపైన చూపించాడు. సెకండాఫ్‌లో సినిమాను తన ఫెర్ఫార్మెన్స్‌తో మరో లెవెల్‌కు తీసుకెళ్లాడు. ఇక కృతిశెట్టి విషయానికి వస్తే.. ఉప్పెన తర్వాత కెరీర్ పరంగా కొంత తడబాటుకు గురవుతున్న ఆమెకు మరోసారి చెలరేగిపోయేలా పాత్ర లభించింది. రెండు విభిన్నమైన షేడ్స్ ఉన్న పాత్రలతో నటనపరంగా చక్కగా మెప్పించింది. గ్లామర్ హీరోయిన్‌గా కాకుండా పెర్ఫార్మర్‌గా తాను రాణించగలని మరోసారి ప్రూవ్ చేసింది.

  వెన్నెల కిషోర్ ఫన్.. శ్రీకాంత్ ఎమోషనల్‌గా

  వెన్నెల కిషోర్ ఫన్.. శ్రీకాంత్ ఎమోషనల్‌గా

  మిగితా పాత్రల విషయానికి వస్తే.. సీరియస్‌గా సాగే కథను వినోదంగా మార్చడంలో వెన్నెల కిషోర్ మరోసారి రెచ్చిపోయారు. సెటైర్స్, కామెడీ టైమింగ్ అన్ని కుదరడంతో వెన్నెల కిషోర్ మంచి వినోదాన్ని పంచాడు. చివర్లో అవసరాల శ్రీనివాస్ తన వంతు ఫన్‌ను క్రియేట్ చేశారు. శ్రీకాంత్ అయ్యంగార్ మెచ్యురిటీతో ఉన్న క్యారెక్టర్‌తో అద్భుతంగా ఎమోషన్స్ పలికించాడని చెప్పవచ్చు. ఇతర పాత్రల్లో నటించిన వారు తమ పాత్రల పరిధి మేరకు ఒకే అనిపించారు.

  బ్యాక్ గ్రౌండ్ స్కోర్ స్పెషల్‌గా

  బ్యాక్ గ్రౌండ్ స్కోర్ స్పెషల్‌గా

  సాంకేతిక విభాగాల విషయానికి వస్తే.. వివేక్ సాగర్ బీజీఎం సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్. కొన్ని సన్నివేశాలను తన రీరికార్డింగ్‌తో బాగా ఎలివేట్ చేశారు. ఇక పీజీ విందా ఎప్పటిలానే సినిమాను అందంగా, రిచ్‌గా తీర్చిదిద్దారు. సన్నివేశాలను ఆహ్లాదకరంగా మార్చడానికి ఉపయోగించిన కలర్ ప్యాలెట్ బాగుంది. ఎడిటింగ్, ఇతర విభాగాలు కూడా రాణించాయి. మహేంద్ర, కిరణ్ అనుసరించిన నిర్మాణ విలువలు బాగున్నాయి. సినిమా కోసం కథను ఎంచుకొన్న విధానం.. వారి అభిరుచికి అద్దంపట్టింది.

  ఫైనల్‌గా

  ఫైనల్‌గా

  సినిమా బ్యాక్‌డ్రాప్‌తో ఎమోషన్స్, ఫన్ అంశాలను కలిపి చేసిన చిత్రం ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి. ఫస్టాఫ్ చాలా స్లోగా సాగినట్టు అనిపిస్తుంది. కానీ సెకండాఫ్‌లో పాత్రల మధ్య సంఘర్షణ, భావోద్వేగాలు హృదయాన్ని టచ్ చేస్తాయి. మంచి ఫీల్ గుడ్ ఫ్యాక్టర్స్ ఉన్న చిత్రం. ఫ్యామిలీ, యూత్ ఆడియెన్స్ నచ్చే అంశాలు చాలా ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కమర్షియల్‌గా ఎలా ఉంటుందో ఒకటి రెండ్రోజులు ఆగితే బాక్సాఫీస్ ఫలితం తెలుస్తుంది. మంచి థియేట్రికల్ ఎక్స్‌పీరియెన్స్ ఉన్న చిత్రం. వారాంతంలో ఫ్యామిలీ అంతా చూడదగిన చిత్రం.

  బలం, బలహీనతలు

  బలం, బలహీనతలు


  ప్లస్ పాయింట్స్
  సుధీర్ బాబు, కృతిశెట్టి ఫెర్ఫార్మెన్స్
  ఇంద్రగంటి టేకింగ్
  పీజీ విందా సినిమాటోగ్రఫి
  సెకండాఫ్

  మైనస్ పాయింట్స్
  ఫస్టాఫ్‌లో స్లో నేరేషన్

  English summary
  Mohana Krishna Indraganti, Krithi Shetty and Actor Sudheer Babu's latest movie is Aa Ammayi Gurinchi Meeku Cheppali. This movie is coming on September 16th. Here is the exclusive review of the movie by Telugu filmibeat.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X