twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    చుట్టం చూపే... ('చుట్టాలబ్బాయి' రివ్యూ)

    By Srikanya
    |

    Rating:
    2.5/5

    సన్నాఫ్ సాయికుమార్ గా ఎంట్రీ ఇచ్చిన హీరో ఆది.. లెక్కకు మించి సినిమాలు చేసినప్పటికీ ఇప్పటికీ అదే ముద్రతో చెలామణి అవుతున్నాడు. అంతేకాని తనూ లెక్కల్లో మనిషి అనిపించుకోవటానికి, నా టాలెంట్ ఇదీ, నా సామర్ద్యం ఇదీ అని ఐడిండెటీ చూపెట్టే ఒక్క సినిమా కూడా అతని కెరీర్ లో చేయలేకపోయాడు.ఎంతసేపూ మిగతా హీరోలు అరిగ తీసి పారేసిన ఫార్ములాతో రఫ్ ఆడించేద్దాం అనుకోవటమే,బోల్తాపడటమే. ఇప్పుడు మరోసారి మరో మూస కథతో,ప్రాస డైలాగులతో వచ్చాడు. చూస్తూంటే భాక్సాఫీస్ వద్ద ఈ సినిమా చుట్టపు చూపే కానీ, కొద్దికాలం నిలబడేటట్లు కనపడటం లేదు.

    రికవరీ ఏజెంట్ బాబ్జీ(ఆది) అనుకోకండా ఏసీపీ కమ్‌ ఎన్‌కౌంటర్‌ స్పెషలిస్టు (అభిమన్యుసింగ్‌) కి విరోధమవుతాడు. అందుకు కారణం బాబ్జీ తన చెల్లెలు కావ్య (నమిత ప్రమోద్‌) కు లైన్ వేస్తున్నాడేమో అనే డౌట్. కావ్య ఓసారి బాబ్జీతో చనువుగా ఉండడం చూసి బాబ్జీకి వార్నింగ్‌ ఇస్తాడు ఏసీపీ. నిజానికి కావ్య.. బాబ్జీల మధ్య చిన్న ప్రెడ్షిప్ కూడా ఉండదు. తమది ప్రేమ కాదని ఏసీపికు చెప్పి క్లారిటీ ఇచ్చే సమయానికి ఇంటి నుంచి పారిపోయే ప్రయత్నం చేస్తుంది కావ్య.

    కావ్య ఇంటిలో నుంచి పారిపోవటానికి కారణం...ఆమెకు ఇష్టం లేకుండా తన అన్న పెళ్లి ఫిక్స్ చేయటమే. అయితే కో ఇన్సిడెంటల్ గా అక్కడికి వచ్చిన బాబ్జీ అక్కడికి వచ్చి ఆమెను కనిపిస్తాడు.దాంతో 'వాళ్లిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకొని పారిపోతున్నార'ని ఫిక్సయిపోతారు మన ఎసిపీ. అక్కడ్నుంచి బాబ్జీ.. కావ్యల వెంటపడతారు పోలీసులు. వాళ్లని తప్పించుకొనే ప్రయత్నంలో ఉండగానే మరో గ్యాంగ్ కూడా కావ్య కోసం వెదుకుతూ ఎదురవుతుంది.

    ఇదిలా ఉంటే దొరబాబు (సాయికుమార్‌) మనుషులు బాబ్జీ.. కావ్యలను కిడ్నాప్‌ చేసేస్తారు. మధ్యలో ఈ దొరబాబు ఎవరు? ఆమె వెనక పడుతున్న ఆ గ్యాంగ్ ఎవరు...హీరో ఏం చేసాడు..అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

    ఈ సినిమా లవ్ ట్రాక్, ఎసిపి ట్రాక్ యాజటీజ్ మొత్తం కన్నడంలో 2012 లో శ్రీహరి, ప్రియమణి, శ్రీనగర్ కిట్టి కాంబినేషన్ లో వచ్చిన 'కో కో కోలి కోతి' అనే చిత్రం నుంచి లిప్ట్ చేసిందే అని స్పష్టంగా అర్దమవుతుంది. మిగతాదంతా మన తెలుగు రొటీన్ కామెడీలోకి వచ్చేసాడు. అందుకేనేమో ఫస్టాఫ్ బాగుంది అన్న ఫీల్ వచ్చింది. సెకండాఫ్ తేడా కొట్టిందని తెలుస్తుంది. అలాగే విలన్ పాత్ర చూస్తూంటే రీసెంట్ గా అల్లరి నరేష్ హీరోగా వచ్చిన సెల్ఫీ రాజాలో విలన్ ట్రాక్ గుర్తుకు వస్తూంటుంది. ఇంకేం ఉంది ఈ సినిమా లో కొత్తగా అనిపిస్తూంటుంది.

    స్లైడ్ షోలో మిగతా రివ్యూ

    హైలెట్

    హైలెట్

    ధర్టీ ఇయిర్స్ ఇండస్ట్రీ ఫృద్వీ చేసిన ఇగో రెడ్డి పాత్రే సినిమాను ఆ మాత్రమైనా చూసేలా చేసింది. ఆ పాత్ర లేని సీన్స్ చప్పగా ఉన్నాయంటేనే అర్దం చేసుకోవచ్చు. పరిస్దితి ఏంటో

    పరమ బోరింగ్

    పరమ బోరింగ్

    సెకండాఫ్ లో అలీ పై వచ్చే కామెడీ సన్నివేశాలు ఎంత బోరింగ్ గా ఉన్నాయంటే..కామెడీ అంటే వెగటు పుట్టిస్తుంది. దాన్ని తొలిగిస్తే బాగుంటుంది.

    రొటీన్ క్యారక్టర్

    రొటీన్ క్యారక్టర్

    సినిమా రిలీజ్ కు ముందు సాయి కుమార్ క్యారక్టర్ అంత కాదు ఇంత అని వాయించారు కానీ సినిమాలో ఉన్న తెలుగు సినిమా స్టాక్ క్యారక్టర్స్ అది ఒకటి అని పాత్ర ఎంట్రీ ఇచ్చిన పది సెకన్లకే అర్దమైపోతుంది.

    అదే దెబ్బ కొట్టింది

    అదే దెబ్బ కొట్టింది

    దర్శకుడు వీరభధ్రం కామెడీతో సినిమాను హిట్ బాటలోకి తీసుకెళ్దామని డైలాగులు తో పంచ్ లేసాడు కానీ రొటీన్ కథని ఎంచుకోవటమే రొటీన్ గా దెబ్బ కొట్టింది.

    గ్రిప్రింగ్ మిస్సైంది

    గ్రిప్రింగ్ మిస్సైంది

    దర్శకుడు సినిమా మొదట్లో చూపించిన గ్రిప్ ..తర్వాత మెల్లిమెల్లిగా పట్టు వదులుతూ పోయి..పేలవంగా మార్చేసాడు. ఏవో జోక్స్ వస్తూంటాయి..పోతూంటాయి అన్నట్లుంది.

    స్రీన్ ప్లే మైనస్

    స్రీన్ ప్లే మైనస్

    సెకండాఫ్ లో విజృభించే విలన్ పాత్ర కథలో కలవలేదు. ఎక్కడో ఎసిపి తన తమ్ముడుని ఎనకౌంటర్ చేసి చంపేసాడని, ఎసిపి చెల్లిని టార్గెట్ చేయటం పండలేదు. నెగిటివ్ క్యారక్టర్ సరిగా లేకపోవటంతో సినిమా ఎక్కడా స్ట్రాంగ్ గా లేదు.

    క్లైమాక్స్ నీరసం

    క్లైమాక్స్ నీరసం

    ఫస్టాఫ్ ఫరవాలేదు,సెకండాప్ సోసో గా ఉంది, క్లైమాక్స్ ఇరగతీస్తాడేమో అనుకుంటే అది మరిత నీరసంగా ఉండి, డివైడ్ టాక్ పుట్టించేదిగా ఉంది.

    టెక్నికల్ డిటేల్స్

    టెక్నికల్ డిటేల్స్

    అరుణకుమార్ ఫొటోగ్రఫి ఓకే అనిపిస్తే , శేఖర్ ఎడిటింగ్..పై కోపంవస్తుంది. ఇంకాస్త ట్రిమ్ చేస్తే ఈయన సొమ్ము ఏం పోయింది. బోర్ తగ్గేదిగా అనిపిస్తుంది.

    డైరక్షన్, డైలాగులు,మ్యూజిక్

    డైరక్షన్, డైలాగులు,మ్యూజిక్

    సినిమాకు కీలకంగా నడిచే ఈ మూడు డిపార్టమెంట్ లు కొంత అతి,మరింత మితి అన్నట్లుగా ఉన్నాయి. తమన్ సంగీతం నుంచి ఎక్సపెక్ట్ చేసినంత లేదు. పూల రంగడు తరహాలో భధ్రం డైరక్షన్ లేదు. ఇక డైలాగులు అయితే అన్నీ పంచ్ లు కోసం రాసుకున్నవే. అంతేతప్ప ఎవరూ సవ్యంగా మాట్లాడరు.

    ఎవరెవరు..

    ఎవరెవరు..

    సినిమా: చుట్టాలబ్బాయి
    నటీనటులు: ఆది.. నమితా ప్రమోద్‌.. అశుతోష్‌ రాణా.. జయప్రకాష్‌రెడ్డి.. పోసాని కృష్ణమురళి.. బ్రహ్మానందం.. కృష్ణభగవాన్‌.. అభిమన్యుసింగ్‌ తదితరులు
    సంగీతం: ఎస్‌.తమన్‌
    ఛాయాగ్రహణం: ఎస్‌. అరుణ్‌ కుమార్‌
    మాటలు: భవానీ ప్రసాద్‌
    నిర్మాతలు: రామ్‌ తలారి.. వెంకట్‌ తాళ్లూరి
    కథ.. స్క్రీన్‌ప్లే.. దర్శకత్వం: వీరభద్రమ్‌
    నిర్మాణం: శ్రీ ఐశ్వర్య లక్ష్మీ ఫిలింస్‌
    విడుదల: 19-08-2016

    English summary
    Hero Aadi is now back with a commercial entertainer titled Chuttalabbayi. Directed by Veera Bhadram, this film has hit the screens today. Let’s see how it turns out to be.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X