For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  మాస్ గందరగోళం ('గరం' రివ్యూ)

  By Srikanya
  |

  Rating:
  2.0/5

  ---జోశ్యుల సూర్య ప్రకాష్

  మహేష్, ఎన్టీఆర్, పవన్ వంటి మాస్ లోకి వెళ్ళిపోయిన హీరోలు సైతం ...క్లాస్ గా ఉండేటట్లు బ్రహ్మోత్సవం,నాన్నకు ప్రేమతో , అత్తారింటికి దారిది వంటి క్లాస్ టచ్ ఉన్న ఫ్యామిలీ చిత్రాలకు ప్రయారిటీ ఇస్తూంటే ఇప్పుడిప్పుడే ఎదిగే ప్రయత్నం చేస్తున్న చిన్న హీరోలు మాత్రం మాస్ మత్రం పఠిస్తూ తమ బాడీ లాంగ్వేజ్ కు, తమ ఇమేజ్ కు సంభంధం లేని సినిమాలు చేస్తున్నారు.

  కెరీర్ ప్రారంభం నుంచి సరైన హిట్ లేని ఆది కూడా రఫ్, గరం అంటూ మాస్ జపం చేస్తూ, తన ఆలోచనలకు తగ్గట్లు సెన్సిబుల్ డైరక్టర్ గా పేరున్న మదన్ వంటివారికి సైతం తమ మాస్ మసాలా పైత్యం అంటించి గరం వడ్డించేసాడు. అయితే టైటిల్ లోనే తప్ప ఎందులోనూ ఆ వేడి కనిపించకుండా జాగ్రత్తలు తీసుకుని చేసినట్లు ఉంటుందీ చిత్రం. కథ, కథనం అన్నీ అనాసక్తిగా సాగుతాయి. ముఖ్యంగా ప్లాష్ బ్యాక్ ల విప్పటమే ఈ సినిమా కథ అన్నట్లు తయారైంది.

  అలాగే లోపల బనీను కనపడతూ...మాటి మాటికీ ప్రక్క క్యారక్టర్స్ ని కొట్టడమే మాస్,హీరోయిజం అనుకుంటే ...ఈ సినిమా మాస్ సెంటర్లలలో సిల్వర్ జూబ్లీ చేసుకుంటుంది. సినిమాలో చెప్పుకోదగ్గ అంశం ఏదైనా ఉందీ అంటే అది అగస్త్య ఇచ్చిన సంగీతమే అని చెప్పాలి.

  వరాల బాబు(ఆది) కు చిన్నప్పటి నుంచీ ప్రక్కింటి కుర్రాడు (చైతన్య కృష్ణ)తో అన్ని విషయాల్లో పోటీనే..ఫెయిల్యూరే. దాంతో అన్నిటిలోనూ ఆ కుర్రాడే గెలిచి, పైనల్ గా ఉద్యోగం కోసం హైదరాబాద్ వెళ్లిపోతాడు. దాంతో ఇంట్లో ప్రెజర్ ఎక్కవైపోయిన మన వరాలు బాబు కూడా నేను సాధిస్తా అంటూ సిటీకి సిటీ బస్ ఎక్కేస్తాడు. వెళ్లగానే ఖాళీగా ఉండటం ఎందుకని అక్కడ సమీర(ఆద శర్మ)తో ప్రేమలో పడతాడు. అఫ్ కోర్స్ ఫైల్ పట్టుకుని (ఈ రోజుల్లో ఫైల్ ఏంటని అడగొద్దు) ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూంటాడు. మరో ప్రక్క విలన్ సత్యప్రకాష్ టీమ్..వినాయిక్ సినిమాల్లో లాగ...ఓ ఫొటో పట్టుకుని ఎంక్వైరీ చేస్తూంటుంది. ఈ లోగా.. సమీర కి అక్కడ లోకల్ విలన్ బిజ్జు(కబీర్ దుహన్ సింగ్) నుంచి సమస్య వస్తుంది. ఇంతకీ ఆ సమస్య ఏమిటీ... విలన్స్ కు ఆ ఫొటోలో మనిషి దొరికాడా..ఇంతకీ ఆ మనిషి ఎవరు...విలన్స్ కు హీరోకు లింక్ ఏంటి అనేది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

  స్లైడ్ షోలో మిగతా రివ్యూ

  వినటం, ఫైట్ చేయటం

  వినటం, ఫైట్ చేయటం

  హీరో ఫ్లాష్ బ్యాక్ లు చెప్పటం, వినటం, ఫైట్స్ చేయటం తప్ప ఒరగబెట్టిందేమీ లేదు.

  మార్పేం లేదు...

  మార్పేం లేదు...

  నటుడుగా ఆది ..తన తొలి సినిమాలో ఏం చేసాడో ఇప్పుడు అదే చేసాడు అనిపిస్తుంది. పంచ్ డైలాగులు చెప్పటమే జోష్, మాస్ అనుకుంటే చేసుకుంటూ వెళ్లిపోయాడు.

  అసలు అదే ప్లాబ్లం

  అసలు అదే ప్లాబ్లం

  మంచి రైటర్ అయిన మదన్ ..ఏ అంశానికి కనెక్ట్ అయ్యి ఈ కథ తీసుకున్నాడో అర్దం కాదు.. ఇంత రొట్టకొట్టుడు కథ ని డైరక్ట్ చేస్తాడని ఊహించలేం.

  టెక్నికల్ గా

  టెక్నికల్ గా

  సినిమాటోగ్రఫీ ..మొదట్లో చక్కటి కలర్ టోన్స్ తో చక్కగా మొదలైనా ...తర్వాత కథలాగే అదికూడా డల్ అయ్యిపోయింది. సినిమానే పరమ రొటీన్ గా ఉన్నప్పుడు మనం మాత్రం ఎందుకు డిఫెరెంట్ గా చేయాలి అన్నట్లు ఎడిటింగ్ చేసినట్లు అనిపిస్తుంది.

  పీకే ఫెయిల్యూర్

  పీకే ఫెయిల్యూర్

  ఈ సినిమా పబ్లిసిటీలో బ్రహ్మానందం..పికే గెటప్ ని హైలెట్ గా చూపించారు. కానీ సినిమాలో ఆ ఎపిసోడ్ పరమ బోర్ గా మారింది.

  జయప్రకాష్ రెడ్డి, ఫృద్వీ, తాగుబోతు రమేష్

  జయప్రకాష్ రెడ్డి, ఫృద్వీ, తాగుబోతు రమేష్

  స్టార్ కమిడయన్స్ గా వెలుగుతున్న ఈ ముగ్గురూ సినిమాలో ఉన్నారు.. కానీ వారకూ సినిమాకు కొంచెం కూడా సంభందం ఉండదు. ఎందుకున్నారో కూడా తెలియనట్లుగా వారి సీన్స్ సాగుతాయి.

  విలన్ ఎవరు

  విలన్ ఎవరు

  ఈ సినిమాలో పోసాని, కబీర్ సింగ్, సుప్రీత్, , సత్యప్రకాష్..ఇలా చాలా మంది విలన్స్ సినిమా అంతా కలగాపులగంగా తిరుగుతూంటారు. వాళ్లు ఎందుకు తిరుగుతున్నారో..వాళ్ళకైనా తెలుసా.. అని డౌట్ వస్తుంది.

  సాంగ్స్, రీరికార్డింగ్

  సాంగ్స్, రీరికార్డింగ్

  సినిమాలో పాటలు అన్నీ బాగున్నా...దానికి తగ్గ లీడ్ సన్నివేశాలు లేకపోవటం చేత నిరాస అనిపిస్తుంది.

  ఎవరెవరు..

  ఎవరెవరు..

  బ్యానర్: శ్రీనివాసాయి స్క్రీన్స్
  నటీనటులు:ఆది, అదా శర్మ, బ్రహ్మానందం,నాజర్,తనికెళ్ళ భరణి,నరేష్,పోసాని కృష్ణ మురళి,కబీర్ సింగ్,సుప్రీత్,షకలక శంకర్ తదితరులు
  కథ, మాటలు: శ్రీనివాస్‌ గవిరెడ్డి,
  స్ర్కీన్‌ప్లే: మదన్‌,
  పాటలు: చైతన్యప్రసాద్‌, భాస్కరభట్ల రవికుమార్‌,
  సంగీతం: అగస్త్య,
  ఛాయాగ్రహణం: టి. సురేంద్రరెడ్డి,
  కూర్పు: కార్తీక శ్రీనివాస్‌,
  కళ: నాగేంద్ర,
  ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత:బాబ్జీ,
  సమర్పణ: శ్రీమతి వసంత శ్రీనివాస్
  కో-డైరెక్టర్‌: అనిల్‌,
  స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: మదన్‌.
  నిర్మాత : పి సురేఖ

  పైనల్ గా మీరు ఆది అభిమానులు అయినా, రొటీన్ సినిమాలకు బాగా అలవాటు పడిన వారైనా...ఈ సినిమా ఓ ఆప్షన్.

  English summary
  Garam is a new movie of Aadi released today with divide talk. Music composed by Aagasthya, Produced by Sreenivasa Screens, Story and Dialogues are managed by Srinivas Gavireddy, Madhan operates Screenplay and Direction works.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X