Aadikeshava Review ఆకట్టుకొన్న వైష్ణవ్ తేజ్ ఊరమాస్ యాక్షన్.. శ్రీలీల గ్లామర్.. ఆదికేశవ సమీక్ష

Rating:
2.5/5

నటీనటులు: వైష్ణవ్ తేజ్ పంజా, శ్రీలీల, రాధిక శరత్ కుమార్, జోజు జార్జ్, సుమన్, సుదర్శన్, సుధ, జేపీ, ఆనంద్. అపర్ణ దాస్, తదితరులు
రచన, దర్శకత్వం: శ్రీకాంత్ ఎన్ రెడ్డి
నిర్మాతలు: సాయి సౌజన్య, సూర్యదేవర నాగవంశీ
మ్యూజిక్: జీవీ ప్రకాశ్ కుమార్
సినిమాటోగ్రఫి: డూడ్లే, ప్రసాద్ మూరేళ్ల
ఎడిటర్: నవీన్ నూలి
ప్రొడక్షన్ డిజైన్: ఏఎస్ ప్రకాశ్
రిలీజ్ డేట్: 2023-11-24

Recommended Video

Aadhikeshava Review వైష్ణవ్ తేజ్ భలే నారికావయ్యా.. | Telugu OneIndia

అన్యాయం చేస్తే సహించని, తప్పు చేసిన వారిని విచక్షణారహితంగా శిక్షించే యువకుడు బాలు అలియాస్ బాలకోటయ్య (వైష్ణవ్ తేజ్). బాధ్యత లేకుండా బలాదూర్‌గా తిరుగుతుంటే తండ్రి (జేపీ)మందలిస్తే ఉద్యోగం కోసం ఇంటర్వ్యూకు వెళ్తాడు. బాలు చురుకుదనం, టాలెంట్ చూసి కంపెనీ యజమాని చిత్రావతి (శ్రీలీల) ఉద్యోగం ఇస్తుంది. అయితే తొలి చూపులోనే లవ్ పడిన బాలూ ఇష్టాన్ని గ్రహించి చిత్రావతి ఒకే చెబుతుంది. కానీ చిత్రావతి తండ్రి అడ్డంకింగా మారుతాడు. ఆ క్రమంలో తాను తల్లిదండ్రులు (రాధిక శరత్ కుమార్, జేపీ)గా భావించే వారు నిజమైన పేరెంట్స్ కాదని తెలుస్తుంది.

బాల కోటయ్య అలియాస్ బాలు గత జీవితం ఏమిటి? ఇంతకు బాలు తల్లిదండ్రులు ఎవరు? బాలును ఎక్సైజ్ అధికారి కుటుంబం (రాధిక శరత్ కుమార్, జేపీ) ఎందుకు పెంచుతారు? అసలు పేరు రుద్ర కాళేళ్వరరావు అని.. అతడి తండ్రి మహా కాలేశ్వరరావు అని తెలిసిన తర్వాత బాలు ఎలా రియాక్ట్ అయ్యాడు. తండ్రి మరణం తెలుసుకొని వెళ్లిన బాలుకు ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి? తన తండ్రికి శత్రువుగా ఉండే చెంగారెడ్డి (జోజు జార్జ్)కు ఎలాంటి గుణపాఠం చెప్పాడు? తన తండ్రి ఆశయాన్ని ముందుకు తీసుకెళ్లడానికి బాలు అలియాస్ రుద్ర కాళేశ్వరరెడ్డి ఏం చేశాడు? పెంపుడు తల్లిదండ్రుల వద్దకు వచ్చిన బాలుకు తెలిసిన ట్విస్టు ఏమిటి? అనే ప్రశ్నలకు సమాధానమే ఆదికేశవ సినిమా కథ.

Aadikeshava Movie Review

లవ్, ఎమోషన్స్, ఫ్యాక్షన్, మాస్, యాక్షన్, హిందుత్వం లాంటి కలగూర గంపలాంటి కథతో ఆదికేశవతో శ్రీకాంత్ రెడ్డి రాసుకొన్న రెగ్యులర్, రొటీన్ స్టోరీగానే సాగుతుంది. తొలి భాగంలో శ్రీలీల గ్లామర్, వైష్ణవ్ తేజ్ ఎనర్జీ చుట్టు రాసుకొన్న ఫ్యాక్షన్ సన్నివేశాలతో కథను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశాడనిపిస్తుంది. ఫస్టాఫ్‌ వరకు జాలీగా, ఫన్‌తో నడిపించి.. ట్విస్టుతో ఇంటర్వెల్ సీన్‌తో కథను సీరియస్ నోట్‌లోకి తీసుకెళ్లడంతో సెకండాఫ్‌పై ఆసక్తి పెరుగుతుంది.

ఇక సెకండాఫ్‌లో మాంచి యాక్షన్ ఎపిసోడ్స్, ఫ్యామిలీ ఎమోషన్స్‌తో కథను భావోద్వేగంగా మలిచే ప్రయత్నం కనిపిస్తుంది. క్లైమాక్స్‌లో మితిమీరిన హింస తప్ప.. లాజికల్‌గా ఎమోషన్స్ వర్కవుట్ అయినట్టు ఎక్కడా అనిపించదు. చాలా ఆర్టిఫిషియల్‌గా సీన్లు ఉంటాయి. కేవలం వైష్ణవ్‌ను మాస్ హీరోగా చూపించడానికే ఈ సినిమా తీశారా? అనే సందేహం కలుగుతుంది. ఊరమాస్ యాక్షన్ ఎపిసోడ్‌తో సినిమాకు ముగింపు పలకడంతో కొత్తదనం ఏమీ లేదని తేలిపోవడమే కాకుండా.. బీ, సీ సెంటర్ల ప్రేక్షకుల కోసం డిజైన్ చేసిన సినిమాగా అనిపిస్తుంది.

తన కెరీర్‌లో మూడు డిఫరెంట్ కథలను ఎంచుకొన్న వైష్ణవ్ తేజ్‌కు ఆదికేశవ కొత్త జోనర్. మాస్ ఎలిమెంట్స్, లవ్ మిక్స్ చేసిన కథలో బాలూగా డిఫరెంట్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్‌లో ఒదిగిపోయాడు. ఫస్ట్ టైమ్ మ్యాస్ క్యారెక్టర్, యాక్షన్ సీన్లకు పూర్తిగా న్యాయం చేశాడనే చెప్పాలి. ఇక శ్రీలీల విషయానికి వస్తే.. కేవలం గ్లామర్ పరంగానే కాకుండా కొంత యాక్టింగ్‌కు స్కోప్ పాత్రలో మెరిసింది. ఎప్పటిలానే మాస్ పాటల్లో స్టెప్పులతో ఇరుగదీసింది. క్రూరత్వంతో కూడిన విలనిజంతో జోజు జార్జ్ ఆకట్టుకొన్నాడు. సుమన్, జేపీ, రాధిక శరత్ కుమార్ తమ పాత్రలకు న్యాయం చేశారు. సుదర్శన్ కామెడీ అక్కడక్కడా నవ్వించింది.

సాంకేతిక విభాగాల పనితీరు విషయానికి వస్తే.. జీవీ ప్రకాశ్ అందించిన పాటలు బాగున్నాయి. వాటికి శ్రీలీల, వైష్ణవ్ తేజ్ న్యాయం చేశారు. బలంగా ఉన్న కొన్ని సీన్లలోనే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఆకట్టుకొన్నది. డూడ్లే, ప్రసాద్ మూరేళ్ల సినిమాటోగ్రఫి సినిమాను రిచ్‌గా మార్చింది. ఆర్ట్ విభాగం పనితీరు బాగుంది. శ్రీలీలకు సంబంధించిన క్యాస్టూమ్స్ మరింత గ్లామర్‌ను పండించింది. నవీన్ నూలి ఎడిటింగ్ పనితీరు వల్ల సినిమా క్రిస్పీగా పరుగులు పెట్టించింది. ప్రొడక్షన్ వ్యాల్యూస్ బాగున్నాయి.

బలమైన కథ, సన్నివేశాలు లేకుండా రొటీన్, రెగ్యులర్ అంశాలతో రూపొందిన చిత్రం ఆదికేశవ. సినిమాలో ఎమోషన్స్ పండినట్టు ఎక్కడా కనిపించవు. శ్రీలీల గ్లామర్, వైష్ణవ్ ఎనర్జీతో, మాస్ ఎలిమెంట్స్‌తో నెగ్గుకొచ్చే ప్రయత్నం కనిపిస్తుంది. ఊరమాస్ ఎలిమెంట్స్‌కు మంచి కథ ఉండి ఉంటే.. మరో మంచి ఫ్యాక్షన్ డ్రామాగా మారి ఉండేదనిపిస్తుంది. మితిమీరిన హింస ఈ సినిమాను కొంత వెనక్కినట్టు అనిపిస్తుంది. బీ, సీ సెంటర్ల ప్రేక్షకులు ఈ సినిమాకు కనెక్ట్ కావడానికి కొన్ని పాజిటివ్ అంశాలు ఉన్నాయి. దర్శకుడు కొత్తవాడైనా ట్విస్టులను డీల్ చేసిన విధానం బాగుంది. మెగా ఫ్యాన్స్‌కు, పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కు నచ్చే అంశాలు, జోష్ పుట్టించే సీన్లు ఉన్నాయి. ఓవరాల్‌గా మాస్ అంశాలతో ప్యాకేజీగా ఆదికేశవ రూపొందింది. వైష్ణవ్ తేజ్ ఎనర్జీ, శ్రీలీల గ్లామర్ ప్లస్ పాయింట్. అతిగా అంచనాలు పెట్టుకొని వెళితే.. నిరాశ తప్పదు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X