For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

హా... ( 'ఆహా కళ్యాణం' రివ్యూ)

By Srikanya
|

Rating:
2.0/5
మరో భాష నుంచి తెలుగుకి రీమేక్ లేదా డబ్బింగ్ అవుతోందంటే ఆ చిత్రంలో బోల్డ్ విషయం ఉందని చాలా మంది నమ్మకాలు పెట్టేసాకుంటారు. అయితే చాలా సార్లు అక్కడ హిట్టవటానికి ఉన్న కారణాలు ఏవీ ఇక్కడ ఆహా ఓహో అనిపించేవు కాదని,తెలుగులో తీసేటంత సీన్ ఉన్న సినిమా కాదని రిలీజయ్యాక మాత్రమే అర్దమవుతుంది. దానికి తోడు ఆ ఒరిజనల్ కంటెంట్ మరో విధంగా ఇక్కడకి ఆల్రెడీ దిగుమతి అయ్యిపోతే...తెలిసిన కథే మళ్లీ చూడటం పరీక్షే. ఈ చిత్రంలో నాని వైపు నుంచి వంక పెట్టటానికి ఏమీ లేదు. హిందీ క్యారెక్టర్స్ , తమిళ సీన్స్,తెలుగు నటన ప్రదర్శనా చిత్రంగా తయారై అలా అలా గడిచిపోతుంది.

వెడ్డింగ్ ప్లానర్ గా ఎదగాలనుకునే శక్తి సుబ్రమణ్యం(వాణి కపూర్)కి గాలికి తిరిగే శక్తి(నాని) తారసపడతారు..వెంటబడతాడు. మొదట్లో ఒప్పుకోకపోయినా తర్వాత అతతో కలిసి గట్టిమేళం అని వెడ్డింగ్ ఫ్లానింగ్ ఆఫీస్ ఓపెన్ చేస్తుంది. కష్టపడి,ఇష్టపడి చేయటంతో వీరి కంపెనీ త్వరలోనే ఎదుగుతుంది. ఆ ఉత్సాహంలో ..ఆ సెలబ్రేషన్ మూడ్ లో అనుకోని విధంగా ఇద్దరూ శారీరకంగా ఒకటవుతారు. అయితే అతనికి రిలేషన్ షిప్స్ లో ఇరుక్కోవటం ఇష్టం ఉండదు. అక్కడ నుంచివీరిద్దరివి వేరే దారులు అవుతాయి. చివరకు వీరిద్దరూ ఒకటి ఎలా అయ్యారు అనేది మిగతా కథ.

Aaha Kalyanam Telugu movie review

రొమాంటిక్ కామెడీలు చెప్పేవిధంగా చెప్తే ఎప్పుడూ బాగానే ఉంటాయి. అందులోనూ ఒక చోట ప్రూవ్ అయిన కథ కూడా కావటంతో కథా పరంగా పొరపాట్లు ఏమీ కనపడవు. అయితే దర్శకుడు ఒరిజనల్ బ్యాండ్ బజా భరత్ చిత్రాన్ని ఉన్నదున్నట్లు మక్కీ కి మక్కీ దింపేసి ప్రయత్నం చేసాడు. అక్కడక్కడా నేటివిటీ అద్దాననుకున్నాడు కానీ అది తమిళ అతి అయి కూర్చుంది. దాంతో అసలే రీమేక్ ..ఆపే డబ్బింగ్ అన్నట్లై కూర్చుంది. అయితే హిందీలో వర్కవుట్ అయ్యింది అనుష్క శర్మ అద్వితీయమైన నటనా సామధ్యం, ఆమె గ్లామర్. అదే ఇక్కడ కొరవడింది. హీరో,హీరోయిన్స్ కెమిస్ట్రీ చాలా చోట్ల మిస్సైంది. కొన్ని సన్నివేశాల్లో నాని..ఆమె ప్రక్కన తమ్ముడులా కనిపించాడంటే అది దర్సకుడు తప్పే. అలాగే సెకండాఫ్ లో ఎమోషనల్ డెప్త్ కొరవడింది. హిందీలో వర్కవుట్ అయ్యిందే సెకండాఫ్ లో సన్నివేశాలు.

టెక్నకల్ గా ఈ చిత్రం మంచి స్టాండర్డ్స్ లో ఉంది. సినిమా మొత్తం కలర్ ఫుల్ గా చూపించటంతో అంతా తమ ప్రతిభ చూపెట్టారు. ముఖ్యంగా ఆర్ట్ డిపార్టమెంట్ ని మెచ్చుకోవాలి. సంగీతం విషయానికి వస్తే జస్ట్ ఓకే. నటీనటుల్లో నాని తప్ప పెద్దగా మనను ఎవరూ ఇంప్రెస్ చేయరు. సిమ్రాన్ ఉన్నది కాసేపయినా బాగుంది. దర్శకుడుగా ఇది తొలిప్రయత్నాన్ని తనదైన శైలిలో ఈ రీమేక్ ని మలచటానికి ప్రయత్నిస్తే బాగుండేది. జెరాక్స్ తీయటమే దర్శకత్వ ప్రతిభ కాదు కదా. నిర్మాణ విలువలు విషయంలో ఎక్కడా యష్ రాజ్ ఫిల్మ్స్ వారు కాంప్రమైజ్ కాలేదు.

ఏదైమైనా హిందీ చిత్రం బ్యాండ్ బాజా బారాత్ ని చూడని వాళ్లకి ఈ చిత్రం బాగుందనిపిస్తుంది. జబర్ధస్త్ చూడనివారికి మరీ నచ్చుతుంది. ఈ రెండు ఆల్రెడీ చూసిన వారికి..నాని ఈ సారి ఈ వెర్షన్ లో ఎలా చేసాడు అని పోల్చుకుంటూ కూర్చోవటమే మిగులుతుంది.

బ్యానర్: యశ్‌రాజ్‌ ఫిలింస్

చిత్రం:ఆహా కళ్యాణం

నటీనటులు: నాని,వాణీకపూర్‌,సిమ్రాన్, బడవ గోపి, ఎం.జె. శ్రీరామ్ తదితరులు

కెమెరాః లోకనాధన్ శ్రీనివాసన్,

సంగీతం:ధరణ్ కుమార్,

డైలాగ్స్: శశాంక్ వెన్నెలకంటి,

కథ:మనీష్ శర్మ,

ఎడిటింగ్:భవన్‌కుమార్

సాహిత్యం: కృష్ణచైతన్య, రాఖేందు మౌళి

స్ర్కీన్ ప్లే: హబీబ్ ఫైజల్

క్రియేటివ్ ప్రొడ్యూసర్: విజయ్ అమృతరాజ్,

నిర్మాతః ఆదిత్య చోప్రా,

దర్శకత్వం: గోకుల్ కృష్ణ.

విడుదల తేదీ: 21,ఫిభ్రవరి 2014

English summary
Aha Kalyanam...the movie is the official remake of Band Baaja Baarat relesed today with divide talk. Vaani Kapoor who is making her Telugu debut with this movie will be having similar hopes from this movie. Aha Kalyanam also has Nani in the lead role.
 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more