For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఆకాశం నీ హద్దురా! మూవీ రివ్యూ అండ్ రేటింగ్

  |

  Rating:
  3.0/5
  Star Cast: సూర్య, అపర్ణ బాలమురళి, మోహన్ బాబు, పరేశ్ రావెల్, ఊర్వశి
  Director: సుధా కొంగర

  Aakasam Nee Haddura Review | మొత్తానికి Prime Video లో ఒక హిట్టు సినిమా

  ఒక్క రూపాయికే ప్రతీ పేదను గగన వీధిలో విహరింపచేయాలనే గొప్ప కార్యాన్ని భుజానికి ఎత్తుకొన్న కెప్టెన్ గోపినాథ్ కథను దర్శకురాలు సుధా కొంగర తెలుగులో ఆకాశం నీ హద్దురా! మూవీ రివ్యూ అండ్ రేటింగ్ మూవీగా మలిచారు. విలక్షణ నటుడు సూర్య, మోహన్ బాబు, పరేశ్ రావెల్, అపర్ణ బాల మురళి ప్రధాన పాత్రలు పోషించారు. వాస్తవానికి ఈ చిత్రాన్ని థియేటర్లలో రిలీజ్ ప్లాన్ చేశారు. కానీ కరోనా లాక్‌డౌన్ కారణంగా అమెజాన్ ప్రైమ్ వీడియో ద్వారా ప్రేక్షకుల ముందుు తీసుకురావాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఈ చిత్ర ఎలాంటి అనుభూతిని కలిగించందంటే..

  ఆకాశం నీ హద్దురా కథ ఇలా..

  ఆకాశం నీ హద్దురా కథ ఇలా..

  చుండూరు లాంటి ఓ చిన్న గ్రామానికి చెందిన మహా అలియాస్ చంద్రమహేష్ ఎయిర్‌ఫోర్స్ ఉద్యోగి. తన తండ్రి మాదిరిగానే సమాజం గురించే ఆలోచిస్తుంటాడు. వైమానిక దళంలో పనిచేసే మహాకు ఎప్పటికైనా ఎయిర్‌లైన్స్‌ను ప్రారంభించి అతి సామాన్యుడికి కూడా విమానంలో ప్రయాణించాలనే కోరికను లక్ష్యంగా పెట్టుకొంటాడు. అయితే తన లక్ష్యాన్ని చేరుకోవడానికి ఎలాంటి జీవిత ప్రయాణాంలో పరేష్ గోస్వామి (పరేశ్ రావెల్) నుంచి అనేక ఒడిదుడుకులను ఎదుర్కొంటాడు.

  ఆకాశం నీ హద్దురా ట్విస్టులు

  ఆకాశం నీ హద్దురా ట్విస్టులు

  సొంత విమాన సంస్థను ఏర్పాటు చేయాలనుకొన్న మహాకు రాజకీయ, అధికార వర్గాల నుంచి ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నారు? తన కలను నిజం చేసుకోవాలనే ప్రయత్నంలో రాష్ట్రపతిని ఎలా కలిశాడు. తన కెరీర్‌లోను, లక్ష్య సాధనలో నాయుడు (మోహన్ బాబు) ఎలాంటి పాత్ర పోషించారు. తన జీవిత భాగస్వామి బేబీ (అపర్ణ బాల మురళి) ఎలాంటి పాత్రను పోషించారు. తన గ్రామానికి చెందిన వారు తనపై పెట్టుకొన్న నమ్మకాన్ని ఎలా నిలబెట్టుకొన్నాడనే ప్రశ్నలకు సమాధానమే ఆకాశం నీ హద్దురా మూవీ.

  ఫస్టాఫ్ విశ్లేషణ

  ఫస్టాఫ్ విశ్లేషణ

  చుండూరులోని పేద కుటుంబం అనుభవించే సమస్యలతో కథ మొదలవుతుంది. రైలు ఆపేందుకు ధర్నా లాంటి సన్నివేశాలు ప్రేక్షకుడిని కథలోకి లాగేసేలా ఉంటాయి. గాంధేయ మార్గంలో విధానాలను అనుసరించే తండ్రి, ఉడుకు రక్తం, ఆవేశంతో ఏదైనా సాధించాలనే కొడుకు మధ్య సంఘర్షణ భావోద్వేగం కనిపిస్తుంది. స్కూల్ టీచర్ అయిన తన తండ్రి ఆశయాలను, పద్దతులను ఎదరించిన సూర్య తన దారిని వెతుక్కొంటూ వెళ్తాడు. తండ్రి చావుబతుకుల మధ్య ఉన్నాడనే విషయం తెలిసి విమానం ఎక్కడానికి చేసిన ప్రయత్నాలు ప్రేక్షకుడి హృదయాన్ని పిండేసేలా ఉంటాయి. బడా పారిశ్రామిక వేత్తల ఎత్తులకు చిత్తయిన మహా తొలి భాగంలో కనిపిస్తాడు.

  సెకండాఫ్ విశ్లేషణ

  సెకండాఫ్ విశ్లేషణ

  ఇక సెకండాఫ్‌లో తన జీవిత భాగస్వామితో మహా ప్రయాణం, ఒకరు నిర్ణయాలపై మరొకరు గౌరవించుకొనే అంశాలు సినిమాను మరింత ఎమోషనల్‌గా మారుస్తాయి. ప్రతీ అడుగులో ఎదురైన వైఫల్యాలను ఎదురించిన తీరు తెరపైన అద్భుతంగా ఉంటాయి. సెకండాఫ్‌లో కథను సాగదీసినట్టు మదిలో అనిపించినా.. ప్రీ కైమాక్స్ నుంచి ఎండ్ టైటిల్ వరకు రాసుకొన్న కథ, కథనాలు ఆసక్తిగా ఉండటంతో కొన్ని లోపాలు కనుమరుగైనట్టు కనిపిస్తాయి.

  దర్శకురాలు సుధా కొంగర గురించి

  దర్శకురాలు సుధా కొంగర గురించి


  ధర్శకురాలు సుధా కొంగర కథను ఎత్తుకొన్న తీరు.. దానిని ఓ నోట్‌లో కొనసాగించిన విధానం ఆమె ప్రతిభకు, విజన్‌కు అద్దం పట్టింది. కెప్టెన్ గోపినాథ్ రాసిన సింప్లి ఫ్లై అనే పుస్తకాన్ని తెరపైకి తీసుకొచ్చిన విధానానికి హ్యాట్సాఫ్ అని చెప్పవచ్చు. ఎయిర్‌పోర్టులో సూర్యతో చేయించిన నటన, తండ్రి చనిపోయిన సన్నివేశాలు, సెకండాఫ్‌లో సూర్య, అపర్ణ మధ్య సన్నివేశాలు, అలాగే మోహన్ బాబు పాత్రను రాసుకొన్న విధానం సినిమాకు హైలెట్‌గా మారయని చెప్పవచ్చు.
  ఆకాశమే నీ హద్దురా చిత్రాన్ని అన్ని వర్గాల వారిని మెప్పించేలా తీసిన విధానం అభినందనీయం.

  సూర్య నటన మరోసారి

  సూర్య నటన మరోసారి

  విలక్షణ నటుడు సూర్య గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. కథ, కథనాలు బలంగా ఉంటే సూర్య వాటిని మరో లెవెల్‌కు తీసుకెళ్తారని మరోసారి రుజువైంది. మహా పాత్రలో నటించారని చెప్పడం కంటే.. జీవించారని చెప్పవచ్చు. ఎయిర్ పోర్టు సీన్లు, మరికొన్ని కీలక సన్నివేశాల్లో సూర్య నటన నెక్ట్స్ లెవెల్‌గా ఉంది. పాత్రలో ఉండే వేరియేషన్స్‌కు తగినట్టుగా సూర్య గెటప్స్‌ కూడా ఆకట్టుకొనేలా ఉన్నాయి.

  బేబీగా అపర్ణ బాల మురళి

  బేబీగా అపర్ణ బాల మురళి


  సూర్యకు జోడిగా బేబీ పాత్రలో అపర్ణ బాల మురళి సమాన స్థాయిలో తన యాక్టింగ్‌ను ప్రదర్శించింది. బన్ బేకరి యజమానిగా మహిళా సాధికారితకు సాక్ష్యంగా నిలిచింది. భర్త జీవితంలో భాగమైన స్వతంత్ర మహిళ పాత్రలో ఒదిగిపోయింది. జీవితంలో ఎందరికో స్పూర్తిని కలిగించే పాత్రలో మెప్పించింది. చిలిపిగా, కళ్లతోనే తన నటనను పలికించి తీరు భేష్ అనిపిస్తుంది. కొన్ని సన్నివేశాల్లో ఆమె నటన ప్రేక్షకులకు గిలిగింతలు పెట్టేలా ఉంటుంది. ఇక మిగితా పాత్రలో ఊర్వశి కూడా ఆకట్టుకొన్నారు.

  మోహన్ బాబు, పరేష్ రావల్ పోటాపోటీగా

  మోహన్ బాబు, పరేష్ రావల్ పోటాపోటీగా


  ఆకాశం నీ హద్దురా చిత్రంలో రెండు పాత్రలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఒకటి ఎయిర్‌ఫోర్స్ ఉన్నతాధికారిగా నాయుడు పాత్రలో మోహన్ బాబు హుందాగా కనిపించాడు. మరోసారి తనదైన శైలిలో నాయుడు పాత్రకు ఓ గౌరవాన్ని కల్పించడంలో సక్సెస్ అయ్యారు. ఫస్టాఫ్‌లో కాస్త కరుకుగా కనిపించినా.. చివర్లలో వెన్నలాంటి మనసున్న వ్యక్తిగా ప్రేక్షకులను ఆలరించాడు. ఇక సాఫ్ట్ విలన్‌గా పరేశ్ రావల్ పోటాపోటీగా నటించాడు. పాత్ర నిడివి కొంచెం తక్కువే అయినప్పటికీ గుర్తుండి పోయేలా తన ప్రతిభను చాటుకొన్నారు.

  సాంకేతిక విభాగాల పనితీరు.

  సాంకేతిక విభాగాల పనితీరు.


  సాంకేతిక విభాగంలో ప్రధానంగా మ్యూజిక్ విభాగం ఎక్కువ మార్కులు కొట్టేసింది. భావోద్వేగపూరిత సన్నివేశాలను మరో స్థాయికి తీసుకెళ్లడంలో జీవీ ప్రకాశ్ కుమార్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదనపు ఆకర్షణగా మారింది. పాటలు కూడా ఒకేలా ఉన్నాయి. ఇక సినిమాటోగ్రఫి మంచి ఫీల్‌ను కల్పించిందని చెప్పవచ్చు. అలాగే ఎడిటింగ్, ఇతర విభాగాల పని తీరు సినిమాకు బలంగా నిలిచాయి.

  నిర్మాతగా సూర్య ప్రొడక్షన్ వాల్యూస్

  నిర్మాతగా సూర్య ప్రొడక్షన్ వాల్యూస్

  సుధా కొంగర తీర్చిదిద్దిన కథను సూర్య నమ్మి నిర్మాతగా మారిపోయాడు. ఈ చిత్రానికి బలంగా మారిన పాత్రల కోసం నటులను ఎంపిక చేసుకొన్న విధానం ఆయన అభిరుచికి అద్దంపట్టింది. ప్రొడక్షన్ వ్యాల్యూస్ ఉన్నతంగా కనిపిస్తాయి. కొన్ని పరిస్థితుల కారణంగా ఓటీటీలో రావడం సినీ ప్రేమికులకు కొంత నిరాశే అనిపించినా.. సరైన సమయంలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు రావడానికి చేసిన సాహసాన్ని అభినందించాలి. నిర్మాతగా, నటుడిగా ఓ విభిన్న చిత్రాన్ని ప్రేక్షకులకు అందించారని చెప్పవచ్చు.

  ఫైనల్‌గా

  ఫైనల్‌గా

  తక్కువ ధరకే సామాన్యుడిని విమానంలో ప్రయాణించాలన్న కలగన్న కెప్టెన్ గోపినాథ్ జీవితం తెరమీద స్పూర్తిదాయకంగా ఓ అద్భుతమైన అనుభూతిని పంచుతుంది. కెప్టెన్ గోపినాథ్ పాత్రలో సూర్య పరకాయ ప్రవేశం చేశారనే ఫీలింగ్ కలుగుతుంది. అపర్ణ బాల మురళి, మోహన్ బాబు పాత్రలకు సినిమాకు ప్రత్యేక ఆకర్షణ. సుధా కొంగర దర్శకత్వం ప్రతిభ కథను మరో మెట్టు ఎక్కించేలా చేసింది. లాక్‌డౌన్ కాలంలో వచ్చిన మంచి భావోద్వేగమైన మూవీ అని చెప్పవచ్చు. అన్ని వర్గాల ప్రేక్షకులకు తప్పక నచ్చుతుంది.

  బలం, బలహీనతలు

  బలం, బలహీనతలు

  సూర్య ఫెర్ఫార్మెన్స్

  అపర్ణా బాల మురళి యాక్టింగ్
  కథ, కథనాలు
  మ్యూజిక్
  సినిమాటోగ్రఫి
  ఫస్టాఫ్‌లో ఎమోషన్స్

  బలహీనతలు
  సెకండాఫ్‌లో కాస్త స్లో నేరేషన్

  తెర ముందు, తెర వెనుక

  తెర ముందు, తెర వెనుక

  నటీనటులు: సూర్య, అపర్ణ బాలమురళి, మోహన్ బాబు, పరేశ్ రావెల్ తదితరులు
  దర్శకత్వం, స్టోరి: సుధా కొంగర
  నిర్మాత: సూర్య
  స్ట్రీన్ ప్లే: సుధా కొంగర, షాలిని ఉషాదేవీ, ఆలీఫ్ సుర్తీ, గణేష్, విజయ్ కుమార్
  మ్యూజిక్: జీవీ ప్రకాశ్ కుమార్
  సినిమాటోగ్రఫి: నికేత్ బొమ్మిరెడ్డి
  ఓటీటీ రిలీజ్: అమెజాన్ ప్రైమ్ వీడియో
  ఓటీటీ రిలీజ్ డేట్: నవంబర్ 12, 2020

  English summary
  Suria aka Suriya Sivakumar's latest movie is Aakasham Nee Haddhu Ra which is Soorarai Pottru in Tamil. It is directed by the Guru Fame Sudha Kongara. This movie is set to release on Novemeber 9 on Amazon Prime Video.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X