Aakhri Sawal First Review: అఖరీ సవాల్ మూవీ ఫస్ట్ రివ్యూ

బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం అఖరీ సవాల్. ఇందిరా గాంధీ, బాబ్రీ మసీద్ కూల్చివేత, రాష్ట్రీయ స్వయం సేవక్ లాంటి వివాదాస్పద అంశాలను ఆధారంగా చేసుకొని నిర్మించిన ఈ చిత్రంలో నమషి చక్రవర్తి, అమిత్ సద్, సమీరా రెడ్డి, నీతూ చంద్ర, త్రిధ చౌదరీ, మృణాల్ కులకర్ణి, నిఖిల్ నందా తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని స్వయంగా సంజయ్ దత్ నిర్మించారు. నిఖిల్ నందా సహ నిర్మాతగా వ్యవహరించారు. నిఖిల్ నందా మోషన్ పిక్చర్స్, నీమ్ ట్రీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లపై రూపొందిన ఈ చిత్రానికి అభిజిత్ మోహన్ వారంగ్ దర్శకత్వం వహించారు.

ఈ సినిమా సాంకేతిక విభాగాల విషయానికి వస్తే.. సినిమాటోగ్రఫి: స్టాన్లీ ముద్దా, ఎడిటర్: సంజయ్ సంక్లా, మ్యూజిక్: మాంటీ శర్మ, ప్రొడక్షన్ డిజైనర్: కేశవ్ థాకూర్, ఆర్ట్: రాకేష్ సుతార్ తమ బాధ్యతలు నిర్వర్తించారు. మే 15వ తేదీన రిలీజ్ కానున్న ఈ చిత్రం ఇటీవల సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకొన్నది. ఈ చిత్రం గురించి సెన్సార్ నుంచి వచ్చిన రిపోర్ట్ ఏమిటి? ఈ సినిమాకు జారీ చేసిన సర్టిఫికెట్ ఏంటి? ఈ సినిమా రన్ టైమ్ ఎంత? అనే వివరాల్లోకి వెళితే..

Aakhri Sawal  Review by Censor Board

వికీ హెగ్డే (నమాషి చక్రవర్తి) భావోద్వేగాలు, దూకుడు స్వభావం కలిగిన యూనివర్సిటీ స్కాలర్. ఎమర్జెన్సీ, బాబ్రీ మసీద్ కూల్చివేత లాంటి అంశాల్లో ఆరెస్సెస్ అనుసరించిన విదానాలపై పరిశోధన చేసి థీసిస్ రాస్తాడు. ఆ థీసిస్‌ను ప్రొఫెసర్ గోపాల్ నాదకర్ణి తిరస్కరిస్తాడు. దాంతో వారి మధ్య వాగ్వాదం, అభిప్రాయ బేధాలు, మానసిక సంఘర్షణ చోటు చేసుకొంటుంది. ఈ క్రమంలో పలు అంశాలపై వారి మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్లు చెలరేగుతాయి. ఈ క్రమంలో ప్రొఫెసర్, స్టూడెంట్ మధ్య చోటు చేసుకొన్న అఖరీ సవాల్ ఏమిటి? అనే ప్రశ్నకు సమాధానమే ఈ సినిమా కథ.

సమాజాన్ని ఆలోచనల రేకెత్తించే అంశాలు, చరిత్రలో మరుగున పడిన వివాదాలను కథగా చేసుకొని రూపొందించిన చిత్రాన్ని ఇటీవల సెంట్రల్ బోర్డు ఆఫ్ ఫిలిం సర్టిఫికెట్ (CBFC) అధికారులు, ప్రతినిధులు వీక్షించారు. ఈ సినిమాలోని అంశాలు, సన్నివేశాలు వివాదాస్పదంగా ఉండటంతో అభ్యంతరాలు భారీగానే వ్యక్తం చేశారు. కొన్ని సన్నివేశాలను తొలగించాలని, మరికొన్ని డైలాగ్స్‌ను మ్యూట్ చేయాలని సూచించారు. అయితే నిర్మాత, దర్శకులు తమ కథ, కథనాల గురించి వివరణ ఇచ్చి వారిని సంతృప్తి పరిచే ప్రయత్నం చేశారు. కొన్ని సన్నివేశాలను, డైలాగ్స్‌ను తగ్గించారు. దాంతో ఈ సినిమా ఇరు పక్షాలకు ఎలాంటి అభ్యంతరాలు లేకపోవడంతో విడుదలకు మార్గం సుగమమైంది.

అఖరీ సవాల్ సినిమాకు క్లీన్ సర్టిఫికెట్ ఇవ్వడంలో సెన్సార్ అధికారులు, ప్రతినిధులు తమ మార్కు చూపించారు. ఈ చిత్రానికి యూ (UA16+) సర్టిఫికెట్‌ను జారీ చేశారు. దాంతో 16 ఏళ్లు నిండిన ప్రేక్షకులు ఎలాంటి అభ్యంతరాలు లేకుండా సినిమాను చూడొచ్చు. అంతకంటే తక్కువ వయసు ఉన్న వారు తల్లిదండ్రుల పర్యవేక్షణలో చూడాల్సి ఉంటుంది అని సర్టిఫికెట్‌లో స్పష్టం చేశారు.

అఖరీ సవాల్ చిత్రంలో భావోద్వేగాలు, ఉద్వేగ భరితమైన సన్నివేశాలు ప్రమోషనల్ కంటెంట్‌లో స్పష్టం కనిపించాయి. సెన్సిటివ్ కంటెంట్‌ను డీల్ చేశారనేది వాస్తవంగా కనిపించింది. దాంతో ఈ సినిమాను పరిమితమైన రన్‌టైమ్‌తో జాగ్రత్తలు తీసుకొన్నారు. సెన్సార్ సర్టిఫికెట్ అనుసరించి ఈ సినిమా నిడివి 1 గంట 57 నిమిషాలు. అంటే ఈ చిత్రం 117 నిమిషాల రన్‌టైమ్‌ను ఫిక్స్ చేశారు. ఏ మాత్రం సాగదీయకుండా ఈ సినిమా కథను చెప్పే ప్రయత్నం చేశారనే విషయం స్పష్టమైంది. ఈ చిత్రంలో సంజయ్ దత్ ఎమోషనల్ పాత్రలో కనిపించారు. సంజయ్‌ దత్‌ను ఎదురించే పాత్రలో నమాషి నటించారు. ఇద్దరి పాత్రలకు బాగా ఎలివేట్ అయ్యాయి. సమీరా రెడ్డి, అమిత్ సద్ పాత్రలు కూడా ఎమోషనల్‌గా సాగుతాయని తెలిసింది. ఈ సినిమా ఎక్స్‌క్లూజివ్ రివ్యూ, బాక్సాఫీస్ నంబర్ల కోసం ఫిల్మీబీట్‌ను ఫాలో అవ్వండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X