twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    జీవితానికి అర్ధం 'ఆ నలుగురు'

    By Staff
    |

    Aanaluguru
    చిత్రం: ఆ నలుగురు
    నటీనటులు: రాజేంద్రప్రసాద్‌, ఆమని, రాజా, శుభలేఖ సుధాకర్‌,
    కోట శ్రీనివాసరావు, సుత్తివేలు, ప్రేం కుమార్‌ తదితరులు
    సంగీతం: ఆర్‌పి పట్నాయక్‌
    దర్శకత్వం: చంద్ర సిద్ధార్ధ
    నిర్మాత: శ్రీమతి సరిత

    'అప్పుడప్పుడు' సినిమాతో దర్శకుడిగా పరిచయమైన చంద్ర సిద్ధార్ధ రాజేంద్ర ప్రసాద్‌ను విభిన్న కోణాల్లో ఆవిష్కరిస్తూ మలిచిన చిత్రం 'ఆ నలుగురు'. మనం మరణిస్తే నలుగురు మన మంచి గురించి చెప్పుకుంటారా? మనలోని చెడును గుర్తు పెట్టుకుంటారా? అనే ప్రశ్నలతో ప్రారంభమయ్యే సినిమా ఇది. మనిషిని ప్రేమ నడిపిస్తుందా? డబ్బు ఆడిస్తుందా? వాస్తవాలను మన ముందు నిలిపే ప్రయోగాత్మక చిత్రమిది.

    కథ: రఘురామ్‌ (రాజేంద్ర ప్రసాద్‌) ప్రజావేదిక అనే పత్రిక ఎడిటర్‌. మానవత్వం, నిజాయితీ, విలువలపై నమ్మకం గల వ్యక్తి. ఎదుటివారికి సాయపడడంలో తాను పడిపోయినా ఆ దారి వదలని మహానుభావుడు. అతినికో చిన్న కుటుంబం. భార్య ఆమని, ఇద్దరు కొడుకులు, ఒక కూతురు. తండ్రి ప్రజాసేవలో కుటుంబాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాడని వారికి అనుమానం ఉంటుంది. ఆ సమయంలో రఘురామ్‌కు పరీక్షలా పెద్ద కొడుకు రాజా ఎస్సై పోస్టుకు సెలక్టయినా లంచం ఇవ్వలేక రాకపోవడం, చిన్నకొడుకు ఎంసెట్‌లో సరైన ర్యాంకు రాక డొనేషన్‌ కట్టి చదుతాననడం, అమెరికా వెళ్ళడానికి అల్లుడు, కూతురు డబ్బు అడగడం జరుగుతుంది. లంచాలు, డొనేషన్లు, కట్నాలకు వ్యతిరేకి అయిన రఘురామ్‌ పరిస్ధితులకు తలవంచక అప్పులు చేసి ఆ బాధతో ఆత్మహత్య చేసుకుంటాడు. యమబటులు ఆయనను పైకి తీసుకెళ్తుండగా తన గురించి ఇంట్లో వాళ్ళు, బయటి వాళ్ళు ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలన్పిస్తుంది. మిగితా కథంతా రఘురామ్‌ సిధ్ధాంతం నెగ్గిందా ఓడిందా అంటూ మానవసంబంధాలను విశ్లేషించడం.

    వాస్తవానికి అద్దం పడుతూ హృద్యంగా సాగిన ఈ చిత్రం భమిడిపాటి వారి విజయవంతమైన 'కీర్తి శేషులు' నాటకాన్ని గుర్తుకు తెస్తుంది. నడివయసు వ్యక్తిగా రాజేంద్ర ప్రసాద్‌ నటన ఉన్నతంగా ఉన్నా సబ్జెక్ట్‌ డ్రై కావడం వల్ల, యూత్‌ కావలసిన లవ్‌ ఎలిమెంట్‌ లేకపోవడం వల్ల సినిమా ప్రేక్ష కులను బాగా ఆకర్షించకపోవచ్చు. ఇంటర్వల్‌ వరకు చక్కని సన్నివేశాలతో నడిచినా సినిమాలో మెలో డ్రామా ఎక్కువై ఇబ్బంది పెట్టింది. కోట శ్రీనివాసరావు, శుభలేఖ సుధాకర్‌, సుత్తివేలు చాలా కాలం తర్వాత కన్పించినా సినిమాలో జీవించారు. అప్పడాలు అమ్మే శీను మొక్కలకు నీరు పెడుతున్నప్పుడు ఇంద్ర ధనుస్సు కనపడడం బాగుంది. మధురై స్వామినాధన్‌ మానవతా విలువలను తెలియజేసింది. అమెరికాలో వాస్తవంగా జరిగిన క్యాన్సర్‌ అమ్మాయి ఉదంతాన్ని ఎడాప్ట్‌ చేసుకోవడంతో రాజేంద్రప్రసాద్‌ పాత్ర ఔన్నత్యాన్ని పెంచాయి. కొసమెరుపులో యమదూత లు దేవుళ్ళుగా మారి 'నీలో దుఖం ఉన్నంత వరకు నీకు కనబడేది నరకం. దుఖం వదిలితే అంతా స్వర్గమే' అని చెప్పినప్పుడు ప్రేక్షకులు కరతాళ ధ్వనులు చేస్తారు. మంచి సినిమా అన్న టాక్‌ డెవలప్‌ అయితే బాగా ఆడుతుంది.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X