»   » ఆనందం సినిమా రివ్యూ: 1 టూర్.. 4 రోజులు.. 3 ప్రేమకథలు

ఆనందం సినిమా రివ్యూ: 1 టూర్.. 4 రోజులు.. 3 ప్రేమకథలు

Posted By:
Subscribe to Filmibeat Telugu
Ananadam Movie Review ఆనందం మూవీ రివ్యూ..!

review :2/5

ఫీల్‌గుడ్ చిత్రాలకు ఇటీవల మలయాళ చిత్ర పరిశ్రమ కేరాఫ్ అడ్రస్‌గా మారుతున్నది. మలయాళంలో రూపొందిన ప్రేమమ్ లాంటి చిత్రాలకు భారీ ఎత్తున్న తెలుగు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఇలాంటి పరిస్థితుల్లో మలయాళంలో చిన్న చిత్రంగా రూపొంది 30 కోట్లకుపైగా వసూళు చేసిన చిత్రం ఆనందం. 2016లో రూపొందిన ఈ చిత్రాన్ని నిర్మాత ఎ గురురాజ్‌ తెలుగులోకి అనువదించారు. అంతా నూతన, యువ నటులు నటించిన ఈ చిత్రాన్ని మార్చి 23న రిలీజ్ చేశారు. ఈ చిత్రం ఎలాంటి ఏ మేరకు ఆకట్టుకొన్నదనే విషయాన్ని తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే.

 ఆనందం చిత్ర కథ..

ఆనందం చిత్ర కథ..

ఏడుగురు ఇంజినీరింగ్ విద్యార్థులు జీవితంలో చోటుచేసుకొన్న కొన్ని సంఘటనల సమాహారమే ఆనందం సినిమా కథ. 1 ఇండస్ట్రియల్ టూర్‌ లో 4 రోజులపాటు 3 ప్రేమజంటల లైఫ్‌లో చోటుచేసుకొన్న సంఘటనలే ఈ చిత్రానికి మూలకథ. హంపీతో ప్రారంభమైన టూర్ గోవాలో న్యూ ఇయర్ రోజున ముగియడం ఈ కథలో సరికొత్త పాయింట్.

ఏడుగురు విద్యార్థుల జీవితాల్లో

ఏడుగురు విద్యార్థుల జీవితాల్లో

ఏడుగురు ఇంజినీరింగ్ విద్యార్థుల్లో మూడు ప్రేమజంటల మధ్య చోటు చేసుకొన్న ప్రేమ, స్నేహం, ఫ్రెండ్‌షిప్, ఎమోషన్స్ వారిలో ఎలాంటి మార్పులు తీసుకొచ్చాయి? వారి తమకు తాము ఎలా మారారు? ఎలాంటి త్యాగాలకు సిద్ధపడ్డారనే ప్రశ్నలకు సమాధానమే ఆనందం సినిమా కథ.

స్టోరి, స్క్రిప్టు అనాలిసిస్

స్టోరి, స్క్రిప్టు అనాలిసిస్

భావోద్వేగంగా సాగిన కథలో చిలిపి సంఘటనలు, అల్లరి పనులు అన్నీ అలరించేలా ఉంటాయి. టూర్‌లో చోటుచేసుకొనే సరదా సంఘటనలు ఆసక్తికరంగా ఉంటాయి. కాకపోతే తెలుగు ప్రేక్షకులకు ఇలాంటి చిత్రం కొత్తేమీ కాదు. ప్రేమదేశం, హ్యాపీడేస్, ఈ మధ్య వచ్చిన కిరిక్ పార్టీ లాంటి యూత్, కాలేజ్ రోమాన్స్ సినిమాలు మన ప్రేక్షకులను ఎప్పుడో ఆనందానికి గురిచేశాయి. ఈ చిత్రంలో పెద్దగా ఆకట్టుకొనే పాయింట్లు లేకపోవడం కొంత నిరాశ కలిగించే అంశం.

 స్టోరి, స్క్రిప్టు అనాలిసిస్ - 1

స్టోరి, స్క్రిప్టు అనాలిసిస్ - 1

రాక్‌స్టార్ గౌతమ్, కుప్పి, దియా, వరుణ్, అక్షయ్ లాంటి పాత్రలు మన కళ్ల ఎదుట కనిపించే పాత్రలే. కాకపోతే తెలుగు నేటివిటి కొంత కరువు కావడమనే ప్రేక్షకులకు కనెక్ట్ కాని అంశంగా మారుతుంది. ఓవరాల్‌గా సినిమాను పరిశీలిస్తే ఓ కథగా కాకుండా ఓ ట్రావెల్ జర్నీలా ఉంటుంది. కథకు కీలకమైన ఆరంభం, ఓ సమస్య, పరిష్కారం లేద ముగింపు అనే అంశాలు ఎక్కడా కనిపించవు. ఏదో బస్సు ప్రయాణం మాదిరిగా ఉంటుందే తప్ప ఓ కథతో ట్రావెల్ చేస్తున్నామనే భావనను ఎక్కడ కలిగించలేకపోయిందని చెప్పవచ్చు.

 నివీన్ పాల్ ఎంట్రీ

నివీన్ పాల్ ఎంట్రీ

ఎలాంటి ట్విస్టులు లేకుండా ఫ్లాట్‌గా సాగుతున్న కథలో ప్రేమమ్ ఫేం నివీన్ పాల్ ఎంట్రితో కాస్త జోష్ పెరుగుతుంది. కానీ అది ఎక్కువ సేపు నిలువదు. అంతేగాక సినిమాకు నివీన్ పాల్ పాత్ర పెద్దగా ఉపయోగపడలేకపోయింది. నివీన్ ఎంట్రీ రొటీన్ వ్యవహారంగానే సాగింది.

 ఆకట్టుకొనే డైలాగ్స్

ఆకట్టుకొనే డైలాగ్స్

తెలుగు వాతావరణానికి, ప్రేక్షకుల అభిరుచికి తగినట్టుగా రాజశేఖరరెడ్డి రాసిన మాటలు కొన్నిచోట్ల ఆకట్టుకొనేలా ఉన్నాయి. అలాగే వనమాలి రాసిన పాటలు మలయాళ వాసన నుంచి బయడపడలేకపోయాయి. సచిన్ వారియర్ అందించిన రీరికార్డింగ్ ఓకేగా ఉంది.

సినిమాటోగ్రఫీ

సినిమాటోగ్రఫీ

ఆనంద్‌. ఈ. చంద్ర‌న్‌ అందించిన సినిమాటోగ్రఫీ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణ. గోవా, హంపీ ప్రదేశాలను అందంగా చూపించారు. సుఖీభవ బ్యానర్‌పై నిర్మాత గురురాజ్ రూపొందించిన సినిమా నిర్మాణ విలువలు ఆకట్టుకునేలా ఉన్నాయి. తెలుగు నేటివిటీకి మార్చడంలో నిర్మాత దాదాపు సఫలయ్యారని చెప్పవచ్చు.

బలం, బలహీనతలు

బలం, బలహీనతలు

ప్ల‌స్ పాయింట్లు
యాక్టర్ల టాలెంట్
సినిమాటోగ్రఫీ
డైలాగ్స్
నివిన్ పాల్ పాత్ర‌

మైన‌స్ పాయింట్లు
కథ, కథనాలు
నేటివిటీ లోపించడం
తెలిసిన నటీనటులు లేకపోవడం

 తెర వెనుక, తెర ముందు

తెర వెనుక, తెర ముందు

న‌టీన‌టులు: ప్రేమమ్ ఫేం నివిన్ పాల్‌, అరుణ్ కురియ‌న్‌, థామ‌స్ మాథ్యూ, రోష‌న్ మాథ్యూ, విశాఖ్‌ నాయ‌ర్‌, సిద్ధి మ‌హాజ‌న‌క‌ట్టి, అన్ను ఆంటోని, అనార్క‌ళి మ‌రిక‌ర్‌, రెంజి ఫ‌ణిక్క‌ర్ త‌దిత‌రులు
డైరెక్టర్: గ‌ణేశ్ రాజ్‌
డైలాగ్స్: ఎం.రాజ‌శేఖ‌ర రెడ్డి
లిరిక్స్: వ‌న‌మాలి
మ్యూజిక్: స‌చిన్ వారియ‌ర్‌
సినిమాటోగ్రఫీ: ఆనంద్‌. ఇ. చంద్ర‌న్‌
కో ప్రొడ్యూసర్స్: రవివర్మ చిలువూరి, వీరా వెంకటేశ్వర రావు (పెదబాబు ), వీఆర్బీ రాజు,
స‌మ‌ర్ప‌ణ‌: ఆర్‌. సీతారామ‌రాజు
బ్యాన‌ర్‌: సుఖీభ‌వ మూవీస్‌

English summary
Aanandam is a 2016 romantic comedy film written and directed by Ganesh Raj in his directorial debut. A Guru Raj producing this movie in as Telugu dubbing for Malayalam. V Venkateshwara Rao, VRB Raju, Ravi Varma Ch are the co producers for the movie. Aanandam follows the life of 7 second year engineering students as they embark on their very first college tour. This movie set to release on March 23. In this occassion, Telugu Filmibeat brings exclusive review for..
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X