Aaryan Movie Review: ఆర్యన్ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
నటీనటులు: విష్ణు విశాల్, సెల్వ రాఘవన్, శ్రద్దా శ్రీనాథ్, మానస చౌదరీ తదితరులు
దర్శకత్వం: ప్రవీణ్ కే
నిర్మాతలు: విష్ణు విశాల్, కేవీ దురై
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సీతారాం
క్రియేటివ్ ప్రొడ్యూసర్: స్రవంతి సాయినాథ్
మ్యూజిక్: సామ్ సీఎస్
సినిమాటోగ్రాఫర్: హరీష్ కన్నన్
ఎడిటర్: సాన్ లోకేష్
బ్యానర్: విష్ణు విశాల్ స్టూడియోస్
రిలీజ్ డేట్: 2025-11-07
ఆత్రేయ (సెల్వ రాఘవన్) ఓ ఫెయిల్యూర్ రైటర్. యాంకర్ నయన (శ్రద్దా శ్రీనాథ్) నిర్వహించే ఓ టాక్ షోలో ఆత్రేయ పాల్గొని.. అందులోని గెస్ట్‌ను కాల్చి చంపుతాడు. ఆ సందర్భంగా ఓ థ్రిల్లింగ్ కథను చెబుతానంటూ.. చనిపోయిన వ్యక్తి ఐదుగురిని చంపుతాడు. చంపే ముందు వారి పేర్లు చెప్పి పోలీసులకు ఛాలెంజ్ విసురుతాడు. అందర్నీ భయభ్రాంతులకు గురి చేసి తాను సూసైడ్ చేసుకొంటాడు అని ఆత్రేయ చెబుతాడు. ఈ వార్త సంచలనం రేపడంతో పోలీసులు అప్రమత్తం అవుతారు. ఈ కేసును సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ నంది (విష్ణు విశాల్)కు అప్పగిస్తారు.

ఐదుగురి హత్యలు చేస్తానని ఎందుకు సవాల్ విసిరాడు? హత్య చేయాలనుకొన్న ఆ ఐదుగురు ఎవరు? వారిని ఎందుకు హత్య చేయాలని అనుకొన్నాడు? ఆ హత్యలను డీసీపీ నంది అడ్డుకొన్నాడా? సీరియల్ కిల్లర్ చేసే హత్యలు ఎలా ఉన్నాయి? వరుస హత్యల విషయంలో ట్విస్ట్ ఏమిటి? డీసీపీ వ్యక్తిగత, ప్రొఫెషనల్ విషయాలు ఎలా సాగాయి? అనే ప్రశ్నలకు సమాధానమే ఆర్యన్ మూవీ కథ.
సాధారణంగా సీరియల్ కిల్లింగ్ స్టోరీలతో రూపొందే సినిమాల్లో హంతకుడు ఎవరు? అనేది సస్పెన్స్‌గా కనిపిస్తుంది. కానీ ఈ కథలో హంతకుడు ఎవరో ముందే తెలిసి.. హత్యలు ఎందుకు చేస్తున్నాడనేది మిస్టరీ. క్యాట్ అండ్ మౌస్ బేస్డ్ కాన్సెప్ట్‌తో హంతకుడు, పోలీసుల మధ్య చోటు చేసుకొనే సవాళ్లు, ప్రతి సవాళ్లతో దర్శకుడు ప్రవీణ్ రాసుకొన్న పాయింట్ బాగుంది. ఆ పాయింట్‌ను విస్తరించడంలో కూడా ఆయన తన హస్తలాఘవాన్ని చూపించాడు. రేసీ స్క్రీన్ ప్లే.. క్యూరియాసిటీని కలిగించే మర్డర్స్ సినిమాకు ఈజీగా కనెక్ట్ అయి.. పాత్రలతో ట్రావెల్ అయ్యేలా చేస్తాయి. కాకపోతే ఈ చిత్రంలో కొత్తదనం, సినిమాను నెక్ట్స్ లేవెల్‌కు తీసుకెళ్లే పాయింట్స్ లేకపోవడం మైనస్‌గా అనిపిస్తుంది.
ఇక నటీనటులు పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే.. ఈ సినిమాలో పూర్తిగా విష్ణు విశాల్‌దే వన్ మ్యాన్ షో. సీరియస్, స్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో పరకాయ ప్రవేశం చేశాడనేంతగా లీనమై నటించాడు. పోలీస్ ఆఫీసర్‌గా లుక్, యాటిట్యూడ్, బాడీ లాగ్వేంజ్ కొత్తగా ఉంది. సెల్వ రాఘవన్ విలన్ షేడ్ ఉన్న క్యారెక్టర్‌లో హుందాగా కనిపించారు. శ్రద్దా శ్రీనాథ్, మానస చౌదరీ ఇద్దరూ కూడా ప్రాధాన్యం లేని పాత్రల్లో గెస్ట్ ఆర్టిస్టులుగా మారిపోయారు. ఇంకా ఈ సినిమాలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన రోల్స్ ఏవీ కనిపించావు.
సాంకేతిక విభాగాల విషయానికి వస్తే.. క్రైమ్, సస్పెన్స్ థ్రిల్లర్ మూవీకి కావాల్సిన మూడ్‌ను క్రియేట్ చేయడానికి వాడుకొన్న లైటింగ్, కలర్ ప్యాటర్న్‌తో సినిమా రిచ్‌గా కనిపించింది. పలు సీన్లను సామ్ సీఎస్ తన మ్యూజిక్‌తో ఎలివేట్ చేశారు.సాన్ లోకేష్ ఎడిటింగ్ పక్కాగా, పర్‌ఫెక్ట్‌గా ఉంది. విష్ణు విశాల్ స్టూడియోస్ అనుసరించిన ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.
ఆర్యన్ సినిమా విషయానికి వస్తే.. వరుస హత్యలతో గ్రిప్పింగ్‌గా, రేసీ స్క్రీన్ ప్లేతో సాగే మర్డర్ మిస్టరీ. AARYAN అని టైటిల్ పెట్టడం వెనుక ఓ ట్విస్ట్ ఉంటుంది. చిన్న చిన్న ట్విస్టులతో మూవీ ఆసక్తికరంగా సాగుతుంది. అంచనాలు లేకుండా వెళితే డిఫరెంట్ ఎక్స్‌పీరియెన్స్ అందించే అంశాలు ఈ సినిమాలో ఉన్నాయి. ముఖ్యంగా మర్డర్ మిస్టరీలు, సస్పెన్స్, థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే వారికి ఆర్యన్ తప్పకుండా నచ్చుతుంది. ఈ వారం చూడాలనుకొన్న మీ సినిమాల జాబితాలో ఈ మూవీని కూడా చేర్చుకోవచ్చు.


Click it and Unblock the Notifications











