twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Aasha Encounter review.. ఆర్జీవి మార్కు కనిపించని ఆశ.. ఓవరాల్‌గా ఎలా ఉందంటే?

    |

    Rating:
    2.0/5

    నటీనటులు: శ్రీకాంత్ అయ్యంగార్, సోనియా ఆకుల, కే శేఖర్ రాజు
    సమర్పణ: రాంగోపాల్ వర్మ
    దర్శకత్వం: ఆనంద్ చంద్ర
    నిర్మాత: అనురాగ్ కంచర్ల
    సినిమాటోగ్రఫి: జగదీష్ చీకటి, కల్యాణ్ సమీ
    ఎడిటింగ్:
    మ్యూజిక్: డీఎస్ఆర్
    బ్యానర్: అనురాగ్ కంచర్ల ప్రొడక్షన్స్
    రిలీజ్: 2022-012-01

    దేశవ్యాప్తంగా నిర్భయ, దిశా సంఘటనలు దిగ్బ్రాంతికి గురిచేశాయి. యువతలపై పైశాచికంగా జరిగిన లైంగిక దాడి ఘటనలను ముక్తకంఠంతో దేశం ఒక్కటై ఖండించాయి. ఢిల్లీ, హైదరాబాద్, దేశంలోని పలు ప్రాంతాల్లో జరిగిన లైంగిక దాడి ఘటనలు ఆధారంగా చేసుకొని రూపొందించిన చిత్రం ఆశ ఎన్‌కౌంటర్. రాంగోపాల్ వర్మ సమర్పణలో, దర్శకత్వ పర్యవేక్షణలో రూపొందిన ఈ చిత్రం కోర్టు వివాదాల్లో చిక్కుకొని తాజాగా జనవరి 1వ తేదీ, 2022న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం ఎలా ఉంది? సినిమాను ప్రేక్షకుల మెప్పించేలా చేసిన వర్మ ప్రయత్నాలు సఫలమయ్యాయా? అనే విషయాల్లోకి వెళితే..

    Aasha Encounter movie review and Rating

    ఆశ ( సోనియా ఆకుల) సామాజిక సేవ చేసే యువతి. తల్లిదండ్రులు, చెల్లితో సంతోషంగా కాలం గడుపుంటారు. తన విధి నిర్వహణ కారణంగా రాత్రి సమయంలో బయటకు వెళ్లాల్సి వస్తుంది. అయితే తాను బైక్ పార్క్ చేసిన చోటు వద్ద లారీని నడిపే నలుగురు చేతిలో ఆశ చిక్కుకుంటుంది. ఆమె నలుగురు దారుణంగా లైంగిక దాడి చంపేస్తారు.

    ఆశపై లైంగిక దాడి, హత్య తర్వాత ప్రజలు, న్యాయ నిపుణులు, మానవ హక్కుల అధికారులు, పోలీసులు ఎలా స్పందించారు? ఆశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై మానవ హక్కుల సంస్థ అధికారి (శ్రీకాంత్ అయ్యాంగర్) స్పందన ఏమిటి? అనే కాల్పనిక ప్రశ్నలకు యదార్థ రూపమే ఆశ చిత్రం.

    దేశంలో అతి దారుణంగా జరిగిన లైంగిక దాడి ఘటనలో కామాంధుల వికృతరూపానికి ఎందరో అమ్మాయిలు బలయ్యారు. ఈ చిత్రంలో ఆశ అనే అమ్మాయిపై జరిగిన పాశవిక ఘటనను దర్శకుడు ఆనంద చంద్ర ఎమోషనల్‌గా తెరకెక్కించారు. అమ్మాయిని నలుగురు ట్రాప్ చేయడం, ఆ తర్వాత బలవంతంగా బంధించిన అత్యాచారం చేసిన సన్నివేశాలు అత్యంత జుగప్సకరంగా, మనసును కకావికలం చేస్తాయి.

    ఆశ రేప్ ఘటన తర్వాత ప్రజల్లో వ్యక్తమైన ఆగ్రహం.. నిందితులను పోలీసులు ట్రేస్ చేసిన సన్నివేశాలు అత్యంత వాస్తవంగా కనిపిస్తాయి. నిందితులను పట్టుకొన్న విధానం, వారిని ఆ తర్వాత ఎలాంటి పరిస్థితుల్లో ఎన్‌కౌటర్ చేయాల్సి వచ్చిందనే అంశాలు కన్విన్సింగ్‌గా ఉంటాయి. అయితే సినిమాలో డ్రామా ఎక్కువ కావడంతో సహజత్వం లోపించిందనిపిస్తుంది. కథలో బాధితురాలి కుటుంబ ఎమోషన్స్ ఎక్కడా పట్టించుకోలేదనే ఫీలింగ్ కలుగుతుంది. అలాగే సంచలన అంశాలనే టార్గెట్ చేయడం వల్ల పూర్తిస్థాయి సినిమాగా తెరకెక్కలేదనే ఫీలింగ్ కలుగుతుంది.

    దర్శకుడు ఆనంద్ చంద్ర రాసుకొన్న పాయింట్స్, వాటిని తెరకెక్కించిన విధానం బాగానే ఉంది. కానీ ప్రేక్షకులను థియేటర్‌కు రప్పించేంతగా అంశాలు లేకపోవడం కొంత మైనస్ అనిపిస్తాయి. నటీనటులు పెద్దగా పెర్ఫార్మ్ చేయడానికి పాత్రల్లో స్కోప్ లేకపోయిందని చెప్పవచ్చు. ఇక సాంకేతిక అంశాలు చాలా రిచ్‌గా ఉండటం ఆశ సినిమాలో కొంత ఉపశమనంగా చెప్పుకోవచ్చు. సినిమాటోగ్రఫి, రీరికార్డింగ్ చాలా బాగున్నాయి.

    దేశవ్యాప్తంగా సంచలనం రేపిన దిశ సంఘటన ఆధారంగా తెరకెక్కిందనే విషయం అందరికి తెలిసిందే. అయితే ఈ సినిమాలో ఎమోషనల్ పాయింట్స్ లోపించడం మైనస్. ఈ షార్ట్ ఫిలింకు ఎక్కువ, సినిమాకు తక్కువ అనే విధంగా ఉంటుంది. కేవలం ఒక గంట నిడివితో ఆశను ప్రేక్షకుల ముందుకు తెచ్చారు. ఎమోషనల్ సీన్లను రాసుకొని మరికొంత నిడివిని పెంచి ఉంటే మంచి చిత్రమే అయి ఉండేదనిపిస్తుంది. దిశ సంఘటనను తెర మీద నాటకీయంగా చూడాలనుకొనే వారికి ఆశ కేరాఫ్ అడ్రస్ అని చెప్పవచ్చు.

    ట్యాగ్ లైన్: షార్ట్ ఫిలింకు ఎక్కువ.. సినిమాకు తక్కువ

    English summary
    RGV's latest movie Aasha Encounter hits theatres on January 2022. Sonia Akula is the lead in the movie. Directed by Aanand Chandra and Ram Gopal Varma. Here is the Aasha movie review.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X