twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆటగదరా శివ మూవీ రివ్యూ: మానవీయ విలువలే..

    By Rajababu
    |

    Recommended Video

    Aatagadharaa Siva Movie Review.ఆటగాదరా శివ మూవీ రివ్యూ

    టాలీవుడ్‌‌లో కాన్సెప్ట్ చిత్రాల జోరు పెరిగింది. కథాబలం ఉన్న చిత్రాలకు ఆదరణ పెరుగుతున్నది. కథా, కథనాలు చక్కగా ఉంటే పెద్ద చిత్రాలా? చిన్న చిత్రాలా? అనే తేడా లేకుండా సినిమాను ప్రేక్షకుడు భుజాన ఎత్తుకొని ఊరేగిస్తున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో వచ్చిన ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ఆటగాదరా శివ. చక్కటి టైటిల్‌కు ఆ నలుగురు లాంటి గొప్ప చిత్రాన్ని రూపొందించిన చంద్ర సిద్ధార్థ తోడయ్యాడు. టీజర్లు, ఫస్ట్‌లుక్‌, ట్రైలర్ లాంటివి చిత్రంపై అంచనాలు పెంచాయి. రామ రామ రా అనే కన్నడ చిత్రం ఆధారంగా రూపొందిన ఆటగాదరా శివ చిత్రం ఎలా ఉందో తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే.

    ఆటగదరా శివ స్టోరి

    ఆటగదరా శివ స్టోరి

    ఉరిశిక్ష పడి నాలుగు రోజుల్లో చావుకు దగ్గరైన ఖైదీ బాబ్జి (ఉదయశంకర్). బాబ్జిని ఉరితీయాలని జంగయ్య (దొడ్డన్న)కు అధికారులు ఆదేశాలు జారీ చేస్తారు. ఈ క్రమంలో సెంట్రీపై దాడి చేసి బాబ్జి జైలును పారిపోతాడు. ఊహించని పరిస్థితుల్లో జంగయ్య జీపులోనే బాబ్జి ప్రయాణించాల్సి వస్తుంది.

    ఆటగదరా శివ శివ‌లో ట్విస్టులు

    ఆటగదరా శివ శివ‌లో ట్విస్టులు

    బాబ్జీ హంతకుడని జంగన్న ఎలా గుర్తించాడు? ఈ ప్రయాణంలో బాబ్జి పరిస్థితి ఏంటి? బాబ్జిని జంగన్న ఉరి తీశాడా? లేదా బాబ్జి ఉరిశిక్ష నుంచి తప్పించుకొన్నాడా? అనే ప్రశ్నలకు సమాధానమే అటగదరా శివ చిత్ర కథ.

    ఫస్టాఫ్ అనాలిసిస్

    ఫస్టాఫ్ అనాలిసిస్

    రామ రామ రా అనే చిత్రం ఆధారంగా తెలుగు నేటివిటికి దగ్గరగా కొన్ని మార్పులు చేసి తెరకెక్కించారు దర్శకుడు చంద్ర సిద్ధార్థ. బాబ్జికి ఉరిశిక్ష పడటంతో కథలోకి నేరుగా ప్రేక్షకుడిని తీసుకెళ్తారు. జైలు నుంచి తప్పించుకొన్న బాబ్జి ఏకంగా జంగన్న జీపులోకి ఎక్కడంతో కథ ఆసక్తికరంగా మారుతుంది. ఈ మధ్యలో హైపర్ ఆది లవ్ ఎపిసోడ్ ఎంట్రీ ఇవ్వడం కథలోని ఇంటన్సెటీకి బ్రేక్ పడుతుంది. వినోదాన్ని రుద్దే ప్రయత్నంలో అసలు విషయం మరుగునపడినట్టు కనిపిస్తుంది. ఓ మంచి ట్విస్టుతో తొలి భాగం ముగుస్తుంది.

    సెకండాఫ్ రివ్యూ

    సెకండాఫ్ రివ్యూ

    ఇక సెకండాఫ్‌లోనైనా భావోద్వేగంతో కథ ముందుకెళ్తుందా అనే ఎదురు చూసిన ప్రేక్షకులకు చంటి, భద్రం తాగుడు వ్యవహారం కంట్లో నలుసులా మారిపోతుంది. గర్భిణి ప్రసవం తర్వాత వచ్చే కొన్ని సీన్లు ఎమోషనల్‌గా సాగుతాయి. క్లైమాక్స్‌లో ఉరి తీసే సన్నివేశం ఊహించని ట్విస్ట్‌గా అనిపిస్తుంది.

    చంద్ర సిద్ధార్థ్ డైరెక్షన్

    చంద్ర సిద్ధార్థ్ డైరెక్షన్


    మానవ విలువలను తెరకెక్కించడంలో దర్శకుడు చంద్ర సిద్ధార్థ్ సిద్ధహస్తుడనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. ప్రేక్షకుడు థియేటర్‌కు రావడానికి అదే భరోసా కారణమైందని చెప్పవచ్చు. కానీ జంగన్న, బాబ్జీ మధ్య బంధాన్ని ప్రభావవంతంగా చూపలేక పోయాడనే చెప్పవచ్చు. అలాగే ఆది ప్రేమకథపై మరింత దృష్టిపెట్టాల్సింది. కథ, పాత్రల తీరు తెన్నుల్ని మార్చే కీలకమైన గర్భిణి ప్రసవం చాలా పేలవంగా సాగుతుంది. కనీసం క్లైమాక్స్‌లోనైనా జంగన్న, బాబ్జీ పాత్రలపై సానుభూతి కలిగేలా సన్నివేశాలను రాసుకొంటే సినిమా మరోస్థాయికి వెళ్లే అవకాశం ఉండేది.

    దొడ్డన్న పాత్రే బలంగా

    దొడ్డన్న పాత్రే బలంగా

    ఆటగదరా శివ చిత్రానికి బలం దొడ్డన్న పాత్రే. చాలా హుందాగా, గంభీరంగా ఆ పాత్రకు ప్రాణం పోశారు. సినిమా భారాన్ని ఏకంగా తన భుజానికి ఎత్తుకోవడంలో సఫలమయ్యారు. దొడ్డన్న గెటప్ ప్రేక్షకులను ఆకట్టుకొంటుంది. ఆయన పాత్రకు తగినట్టు కొన్ని భావోద్వేగమైన డైలాగ్స్ ఉంటే ప్రేక్షకుల మదిలో నిలిచిపోయేందుకు ఛాన్స్ ఉండేది.

    ఉదయ్ శంకర్ యాక్టింగ్

    ఉదయ్ శంకర్ యాక్టింగ్

    ఉదయశంకర్‌ది అదే పరిస్థితి. చేయని నేరానికి శిక్ష పడితే ఆ ఖైదీలో ఉండే ఆవేదన ఆ పాత్రలో ఏ కోశాన కనిపించదు. నటనకు స్కోప్ ఉన్నప్పటికీ ఆయన పాత్ర చాలా పరిమితులకు లోనైనట్టు కనిపిస్తుంది. ప్రసవం సీన్‌లో హైలెట్‌గా మారే బాబ్జీ పాత్ర ఆకట్టుకునేలా ఉండదు. గెటప్ పరంగా సీరియస్ లుక్‌తో ఆకట్టుకొన్నాడు.

    రొటీన్‌ హైపర్ ఆది

    రొటీన్‌ హైపర్ ఆది

    బుల్లితెరపై కనిపించే మాదిరిగానే హైపర్ ఆది పాత్ర రొటీన్‌గా సాగింది. హడావిడి తప్ప మరే కనిపించదు. పంచ్ డైలాగ్స్ కోసం పాకులాడటమే కనిపిస్తుంది. సీరియస్‌గా సాగే కథలో ప్రేక్షకుడికి కాస్త వినోదం కల్పించడానికి చేసిన ప్రయత్నం వికటించిందనే చెప్పాలి.

    రెగ్యులర్ కామెడీ

    రెగ్యులర్ కామెడీ

    కామెడీ బృందంలో చమ్మక్ చంద్ర, చంటి, భద్రం పాత్రలు చాలా రొటీన్‌గా సాగుతాయి. వీరి హాస్యం కాస్త అపహాస్యం పాలైందనే చెప్పవచ్చు. కథా వేగానికి కళ్లెం వేసినట్టు అనిపిస్తుంది.

    మ్యూజిక్ గురించి

    మ్యూజిక్ గురించి

    ఆటగదరా శివ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణ సంగీతం. నొవిన్ పాల్, వాసుకీ అందించిన మ్యూజిక్ బాగుంది. ముఖ్యంగా రీరికార్డింగ్ సన్నివేశాలకు బలం చేకూర్చింది. చైతన్య ప్రసాద్, పులగం చిన్నారాయణ రాసిన పాటల్లో సాహిత్య విలువలు మెరుగ్గా ఉన్నాయి.

    లవిత్ సినిమాటోగ్రఫీ

    లవిత్ సినిమాటోగ్రఫీ

    బీజాపూర్, మహారాష్ట్ర సరిహద్దులో లవిత్ చిత్రీకరించిన సన్నివేశాలు హైలెట్ అనిచెప్పవచ్చు. వైడ్ షాట్స్ కనువిందుగా ఉన్నాయి. మైదాన ప్రాంతంలో సన్నివేశాలు ఆంగ్ల చిత్రాల్లో ఉండే ఫీల్‌ను గుర్తు చేశాయి. నవీన్ నూలి ఎడిటింగ్ షార్ప్‌గా, క్రిస్పీగా ఉంది.

    ప్రొడక్షన్ వ్యాల్యూస్

    ప్రొడక్షన్ వ్యాల్యూస్

    భజరంగీ భాయ్‌జాన్ లాంటి ఎన్నో సంచలన విజయాలను అందించిన రాక్‌లైన్ వెంకటేష్ ఈ చిత్రానికి నిర్మాత. నిర్మాణ విలువలు ఆయన స్థాయికి తగినట్టు ఉన్నాయి. సాంకేతికంగా విలువలు ప్రతీ ఫ్రేమ్‌లో కొట్టొచ్చినట్టు కనిపిస్తాయి.

    ఫైనల్‌గా

    ఫైనల్‌గా

    మానవ విలువలను, బంధాలు, అనుబంధాలు బలంగా చూపించే ప్రయత్నమే ఆటగదురా శివ. బీ, సీ సెంటర్లలో ఆదరణే ఈ సినిమాకు సక్సెస్ మంత్రంగా మారే అవకాశం ఉంది. అందరి బంధువయ్యా, ఆ నలుగురు చిత్రాల్లో ఉండే ఎమోషనల్ కంటెంట్ ఆటగదురా శివ లేకపోవడం ప్రేక్షకకులను నిరాశ పరిచే అంశం అని చెప్పవచ్చు. పాత్రలను ప్రభావవంతంగా చూపించడంలో తడబాటు కనిపిస్తుంది. బీ, సీ సెంటర్లలో ఆదరణే ఈ సినిమాకు సక్సెస్ మంత్రంగా మారే అవకాశం ఉంది.

    బలం, బలహీనతలు

    బలం, బలహీనతలు

    ప్లస్ పాయింట్స్
    స్టోరి లైన్
    సంగీతం
    సినిమాటోగ్రఫీ
    దొడ్డన్న యాక్టింగ్
    నిర్మాణ విలువలు

    మైనస్ పాయింట్స్
    కథనం
    నటీనటుల ఎంపిక

    తెర ముందు, తెర వెనుక

    తెర ముందు, తెర వెనుక

    నటీనటులు: ఉదయశంకర్, దొడ్డన్న, హైపర్ ఆది, చమ్మక్ చంద్ర, చలాకీ చంటి, భద్రం తదితరులు.
    దర్శకత్వం: చంద్ర సిద్ధార్థ్
    నిర్మాత: రాక్‌లైన్ వెంకటేష్
    సినిమాటోగ్రఫి: లవిత్
    మ్యూజిక్ డైరెక్టర్: నొవిన్ పాల్, వాసుకి వైభవ్
    రిలీజ్ డేట్: 2018-07-20

    English summary
    Aatagadharaa Siva movie review: Critically acclaimed filmmaker Chandra Siddhartha, who directed Aa Naluguru, is now all set to create another interesting attempt with titled as Aatagadara Siva. Uday Shankar, Hyper Aadi, Chamak Chandra are in lead. This film released on July 20th. In this occassion Telugu Filmibeat brings review exclusively
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X