AAY Movie Review: ఆయ్ మూవీ రివ్యూ అండ్ రేటింగ్

Rating:
3.0/5

నటీనటులు: నార్నే నితిన్, నయన్ సారిక, వినోద్ కుమార్, మైమ్ మధు, కసిరెడ్డి రాజ్‌కుమార్, అంకిత్ కోయా తదితరులు
బ్యానర్ - GA2 పిక్చర్స్,
సమర్పణ - అల్లు అరవింద్,
నిర్మాతలు - బన్నీ వాస్, విద్యా కొప్పినీడి,
డైరెక్టర్ - అంజి కె.మ‌ణిపుత్ర‌,
సహ నిర్మాతలు - భాను ప్రతాప్, రియాజ్ చౌదరి,
సినిమాటోగ్రఫీ - సమీర్ కళ్యాణి,
సంగీతం - రామ్ మిర్యాల,
ఎడిటర్ - కోదాటి పవన్ కళ్యాణ్
ఆర్ట్ డైరెక్టర్ - కిరణ్ కుమార్ మన్నె,
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - అజయ్ గద్దె,
కాస్ట్యూమ్స్ - సుష్మిత, శిల్ప,
కో డైరెక్టర్ - రామ నరేష్ నున్న
రిలీజ్ డేట్: 2024-08-15

హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేసే కార్తీక్ (నార్నె నితిన్) కరోనా కాలంలో వర్క్ ఫ్రమ్ హోమ్ కోసం తన సొంతూరు అమలాపురానికి వస్తాడు. అక్కడే పల్లవి (నయన్ సారిక)ను తొలి చూపులోనే ప్రేమించేస్తాడు. ఆమె కూడా కార్తీక్ ప్రేమను ఒప్పుకోవడంతో సరదాగా వారి ప్రేమ ప్రయాణం సాగిపోతుంటుంది. అయితే ప్రాణం కంటే కులమే ఎక్కువగా భావించే దుర్గ (మైమ్ మధు) తన కూతురుకి సొంత కులం అబ్బాయితో పెళ్లి ఫిక్స్ చేస్తాడు. అయితే పారిపోయి పెళ్లి చేసుకోవడానికి కార్తీక్, అతడి ఇద్దరు ఫ్రెండ్స్ (అంకిత్ కోయా, కసిరెడ్డి రాజ్‌కుమార్) చేసిన ప్రపోజల్‌ను పల్లవి తిరస్కరిస్తుంది.

AAY Movie Review in Telugu  Emotional youthful emotional love story

తండ్రికి కులం పిచ్చి ఉన్నా వేరే కులం అబ్బాయి ప్రేమ ప్రపోజల్‌ను పల్లవి ఎలా ఒప్పుకొన్నది? కార్తీక్, పల్లవి లవ్ జర్నీ ఎలా సాగింది? దుర్గ తన కులం వారికి ఎలా ఆదరించాడు? కూతురు వేరే కులం అబ్బాయితో ప్రేమలో పడిందని తెలిసిన తర్వాత దుర్గ రియాక్షన్ ఏమిటి? పెళ్లి పీటల మీద పల్లవి కూర్చొని ఉండగా ఆ పెళ్లిని ఆపాలని కార్తీక్ తండ్రి చేసిన ఎలాంటి ఫలితాన్ని ఇచ్చింది? కార్తీక్ తండ్రి కోరికను దుర్గ మన్నించాడా? కార్తీక్, పల్లవి ప్రేమ వికసించి పెళ్లిగా మారిందా? అనే ప్రశ్నలకు సమాధానమే ఆయ్ సినిమా కథ.

ఆయ్ సినిమా రెగ్యులర్ లవ్ స్టోరీగానే మొదలవుతుంది. కానీ గోదావరి జిల్లాల నేటివిటీ చుట్టూ కథను అల్లుకొని ఎక్కడా కథనంపై పట్టు సడలకుండా దర్శకుడు అంజి కే మణిపుత్ర స్టోరిని చెప్పిన విధానమే సినిమాను పరుగులు పెట్టించింది. ఇక కసిరెడ్డి రాజ్ కుమార్ , అంకిత్ కోయతో డైలాగ్ డ్రామాను నడిపించిన విధానం బాగుంది. ఆద్యంతం స్టోరీలో ఫ్లేవర్ మిస్ కాకుండా కామెడీతో లవ్ ట్రాక్‌ను నడిపించిన విధానం దర్శకుడు ప్రతిభకు అద్దం పట్టింది. ఇక క్లైమాక్స్ రొటిన్‌గా ఉంటుందా? అని ఫిక్స్ అయిన ఆడియెన్స్‌కు 25 నిమిషాల ఎమోషనల్ డ్రామాను అద్బుతంగా పడించాడు. లవ్ ట్రాక్‌ను పక్కకు తప్పించి..ఫ్రెండ్ షిప్ ట్రాక్‌ను హైలెట్ చేయడంతో కథ సక్సెస్ జోన్‌లోకి వెళ్లేలా దర్శకుడు తన టాలెంట్‌ను ప్రదర్శించాడు.

AAY Movie Review in Telugu  Emotional youthful emotional love story

ఇక నటీనటుల విషయానికి వస్తే.. పెద్దగా స్టార్లు లేరు.. అలాగని భారీగా రెమ్యునరేషన్లు తీసుకొనే ఆర్టిస్టులు కనిపించరు. లోకల్ ఫ్లేవర్‌ను బలంగా చిన్న చిన్న నటీనటులతో దర్శకుడు సినిమాను రూపొందించిన విధానమే ప్లస్ పాయింట్. నార్నే నితిన్, నయన్ సారిక కథకు ఫేస్ అయితే.. కసిరెడ్డి, అంకిత్ కోయా ఈ మూవీకి బ్యాక్ బోన్‌గా మారారు. ఈ సినిమాకు కసిరెడ్డి రాజ్ కుమార్ హీరో అని చెప్పినా ఎలాంటి సందేహం అక్కర్లేదు. మొదటి సినిమా కంటే నితిన్ మెరుగ్గా నటించాడు. ఇండస్ట్రీలో పోటీని తట్టుకోవాలంటే.. నితిన్ అన్ని రకాలుగా బెటర్ కావాల్సి ఉందనిపిస్తుంది. ఇక మైమ్ మధు గంభీరమైన పాత్రతో ఫెర్ఫార్మెన్స్ చూపించడమే కాకుండా ఎమోషనల్ కంటెంట్‌తో కంటతడి పెట్టించాడని చెప్పాలి. ఇక సీనియర్ హీరో వినోద్ కుమార్ తండ్రిగా చివరి 20 నిమిషాలు తన నటనతో మూవీని మరో మెట్టు ఎక్కించాడు. మిగితా క్యారెక్టర్లలో నటించిన వారందరూ కూడా తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.

ఇక సాంకేతిక విభాగాల పనితీరు విషయానికి వస్తే.. లవ్, ఫ్యామిలీ, యూత్ ఫుల్ కంటెంట్‌తో ఉన్న సన్నివేశాలకు సమీర్ కల్యాణి సినిమాటోగ్రఫి ప్రాణం పోసింది. రామ్ మిర్యాల సంగీతం ఈ సినిమాకు ప్లస్ పాయింట్.ఇక కోదాటి పవన్ కల్యాణ్ ఎడిటింగ్ మరో ప్లస్ పాయింట్.సినిమా క్వాలిటీ విషయంలో రాజీ పడకుండా భన్నీ వాసు,విద్యా కోప్పినీడి అనుసరించిన నిర్మాణ విలువలు బేషుగ్గా ఉన్నాయి.అల్లు అరవింద్ పర్యవేక్షణ సినిమాకు మరింత బలంగా కనిపించింది.

AAY Movie Review in Telugu  Emotional youthful emotional love story

కులం, ప్రేమ కంటే ఫ్రెండ్‌ఫిప్ మించినది ఈ ప్రపంచంలో ఏదీ లేదనే సందేశంతో రూపొందిన చిత్రం ఆయ్. కథ, కథనం, ప్రీ క్లైమాక్స్ నుంచి చివరి సీన్ వరకు 20 ఎమోషనల్ డ్రామా ప్రేక్షకుడిని ఉద్వేగానికి గురి చేయడం ఈ సినిమా సక్సెస్ అని చెప్పడానికి దోహదపడ్డాయి. ఇక ఈ వారం అర్జెంటుగా ఏదైనా సినిమా చూసేయాలంటే.. థియేటర్‌లో ఆయ్ పక్కాగా కేరాఫ్ అడ్రస్ చెప్పవచ్చు. లవ్,యూత్, కామెడీ, ఫ్యామీలి ఎమోషన్స్ అన్ని కలబోసిన సినిమా ఆయ్.. ఫ్యామిలీతోపాటు వెళ్తే బాగా ఎంజాయ్ చేయవచ్చు. డోంట్ మిస్ ఇట్.

More from Filmibeat

Read more about: aay review
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X