twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అదే పాతధోరణి

    By Staff
    |

    Abhimanyu
    -జలపతి గూడెల్లి
    చిత్రం: అభిమన్యు
    నటీనటులు: నందమూరి కళ్యాణ్‌ రామ్‌, స్పందన,
    సుహాసిని, పవన్‌ మల్హోత్రా, వేణుమాధవ్‌ తదితరులు
    సంగీతం: మణిశర్మ
    నిర్మాత: టి.ఎన్‌.వెంకటేష్‌
    స్క్రీన్‌ ప్లే, దర్శకత్వం: మల్లికార్జున

    పేరుకు ఈ చిత్రంలో హీరో నందమూరి కళ్యాణ్‌ రామ్‌ అయినా, సినిమాను అధికభాగం నడిపించేదే కమెడీయన్‌ వేణుమాధవే. వేణుమాధవ్‌ హీరోతో కలిసి వేసే జోకులు (కొన్ని నవ్విస్తాయి, చాలా వరకు పాతవే), చేసే చేష్టలతో..సినిమా కథలో ఉన్న చిన్న పాయింట్‌ ను చెప్పాలనే ప్రయత్నం చేశారు. ఇంటర్వెల్‌ వరకు కామెడీతో, పాటలతో సాగదీసి...చిన్న ట్విస్ట్‌ ఇచ్చి సినిమా మీద ఆసక్తిని రేపాడు దర్శకుడు. ఆ తర్వాతే అసలు కథ ప్రారంభం అవుతుంది.

    అదే అమ్మ గొప్పతనం మీద పావుగంట సేపు సీన్‌ పెట్టిన దర్శకుడి గొప్పతనం మనకు తెలుస్తుంది. ఈ గొప్పతనం తెలుసుకొని మనం బోర్‌ ఫీలయిన వెంటనే ఓ పెద్ద ఫైట్‌ ...అనంతరం ముగింపు. కన్నడ చిత్రం 'అభి'కి ఈ సినిమా రీమేక్‌. కళ్యాణ్‌ రామ్‌ నటనలో రాణించాలంటే ఇంకా చాలా కష్టపడాలి. అందుకే, దర్శకుడు వేణుమాధవ్‌ తో కథ నడిపించినట్లున్నాడు.

    ఇది చాలా రోటీన్‌ కథ. దీన్ని కన్నడం నుంచి రీమేక్‌ చేయాలనుకోవడం మనవారి భావదారిద్ర్యానికి నిదర్శనం. యావరేజ్‌ రోటీన్‌ చిత్రం ఇది. కొత్త అమ్మాయి స్పందన ముస్లిం అమ్మాయి పాత్రకు బాగా సరిపోయింది. మణిశర్మ అందించిన పాటలన్నీ బాగున్నాయి. పాటలే వినడమే ఉత్తమం. సీనియర్‌ నటిమణి సుహాసిని చివరి దశలో నటనను 'పండించారు'.

    కళ్యాణ్‌ రామ్‌ యాక్షన్‌ ఇమేజ్‌ కోసమే చేసిన ఈ చిత్రంలో ఆయన తన సోదరుడు ఎన్టీఆర్‌ నడకను, ఇతరత్రా అనుకరించేందుకు ప్రయత్నించి దారుణంగా విఫలమయ్యాడు. సొంత బాణీ ఏర్పాటు చేసుకుంటేనే మంచిదన్న విషయం గ్రహించాలి. 'ఒరిజనల్‌' చూస్తేగానీ కొత్త దర్శకుడు మల్లికార్జున ప్రతిభ ఏమిటో తెలుస్తుంది.

    కథ: అభిమన్యు (కళ్యాణ్‌ రామ్‌), ముస్లిం యువతి సైరాభాను (స్పందన) ప్రేమించుకుంటారు. వీరి ప్రేమ తెలుసుకున్న సైరా తండ్రి (పవన్‌ మల్హోత్రా) అభిపై దాడి చేసి సైరాని తిరిగి కడప తీసుకెళుతాడు. అభిమన్యు తల్లి (సుహాసిని)కి అసలు నిజం తెలుస్తుంది. సైరా తండ్రి ఎవరో కాదు..అభిమన్యుకి మేనమామ అని. అభి అసలు తల్లితండ్రులు ప్రేమించి పెళ్ళిచేసుకుంటారు. ఎదిరించి పెళ్ళిచేసుకున్న ఆ జంటను చంపేస్తాడు. వారికి పుట్టిన బిడ్డ అభిని సుహాసిని దత్తత తీసుకొని పెంచుకుంటుంది. చివర్లో హీరో మేనమామకు బుద్ది చెప్పి సైరాని పెళ్ళిచేసుకోవడంతో ముగుస్తుంది.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X