twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అభిమన్యుడు సినిమా రివ్యూ: మనీ, మైండ్ గేమ్!

    By Rajababu
    |

    Recommended Video

    Abhimanyudu Movie Review అభిమన్యుడు మూవీ రివ్యూ

    Rating:
    2.5/5
    Star Cast: విశాల్, సమంత, అర్జున్
    Director: మిత్రన్

    విభిన్నమైన కథాంశాలు, విలక్షణమైన పాత్రలను ఎంపిక చేసుకోవడంలో హీరో విశాల్‌ది ప్రత్యేకమైన శైలి. పందెం కోడి నుంచి గత చిత్రం వరుకు ఆయన అభిరుచిని గుర్తు చేశాయి. ప్రేక్షకులను ఆకట్టుకొన్నాయి. తాజాగా విశాల్ నటించిన చిత్రం అభిమన్యుడు. పీఎస్ మిత్రన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సమంత అక్కినేని, యాక్షన్ కింగ్ అర్జున్ కీలకపాత్రలను పోషించారు. తమిళంలో ఘన విజయం సాధించిన ఇరంబు తిరై చిత్రానికి ఇది డబ్బింది. జూన్ 1వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలాంటి స్పందనను సొంతం చేసుకొన్నదో అనే విషయాన్ని తెలుసుకొవాలంటే కథలోకి వెళ్లాల్సింది.

    ఆర్మీ ఆఫీసర్ కథ

    ఆర్మీ ఆఫీసర్ కథ

    కర్ణ (విశాల్) ఓ ఆర్మీ ఆఫీసర్. కోపం, ఆవేశం ఎక్కువ. పేదరికం, తండ్రి చేసిన అప్పులు, ఇతర కారణాల వల్ల చిన్నతనంలోనే కుటుంబానికి దూరమై ఒంటరిగా పెరుగుతాడు. డాక్టర్ లక్ష్మీదేవి (సమంత) పరిచయం కారణంగా కుటుంబానికి దగ్గరవుతాడు. చెల్లెల్లి పెళ్లి కోసం తీసుకొన్న బ్యాంకు రుణం, తల్లి సంపాదన అంతా కలిసి పది లక్షల రూపాయలు ఉన్నట్టుండి ఖాతా నుంచి మాయమవుతాయి.

     సైబర్ క్రైమ్ నేపథ్యంలో..

    సైబర్ క్రైమ్ నేపథ్యంలో..

    డబ్బుల ఎలా మాయం అయ్యాయనే పరిశోధనలో హ్యాకర్ వైట్ డెవిల్ (అర్జున్) గురించి తెలుస్తుంది. ఎంతో మంది బ్యాంకు అకౌంట్ల నుంచి డబ్బులు దొంగిలిస్తున్న వైట్ డెవిల్ నుంచి తన డబ్బే కాకుండా.. ఇతరుల డబ్బును ఎలా వెనక్కి తెప్పించాడు. వైట్ డెవిల్ వేసే ఎత్తులకు ఎలా పైఎత్తులు వేశాడనే అభిమన్యుడు చిత్ర కథ.

    అక్కడి నుండి కథలో కొత్త మలుపు

    అక్కడి నుండి కథలో కొత్త మలుపు

    ఆర్మీ ఆఫీసర్‌గా విశాల్ క్యారెక్టర్ ఎస్టాబ్లిష్‌మెంట్‌తో సినిమా ప్రారంభవుతుంది. తనలోని ఆవేశం కారణంగా చాలా మంది ఆఫీసర్లు ఆగ్రహానికి గురి అవుతారు. ఆ క్రమంలో సైక్రియాటిస్ట్ (సమంత) పరిచయమవుతుంది. అక్కడ నుంచి కథ ఓ మలుపు తిరుగుతుంది. ఎన్నో ఏళ్లుగా కుటుంబానికి దూరమైన విశాల్ మళ్లీ ఫ్యామిలీకి దగ్గరకావడం లాంటి అంశాలతోపాటు, సమంతతో లవ్ ట్రాక్ కథలో భాగంగా సాగుతుంది. చెల్లి పెళ్లి కోసం అడ్డదార్లు తొక్కి తీసుకొన్న రుణం మాయం కావడం ఫస్టాఫ్‌లో కథను కీలక మలుపు తిప్పుతుంది. ఓ ఇంట్రెస్టింగ్ పాయింట్‌తో తొలి భాగానికి ముగింపు పడుతుంది.

    విశాల్, అర్జున్ మధ్య ఆసక్తికర సన్నివేశాలు

    విశాల్, అర్జున్ మధ్య ఆసక్తికర సన్నివేశాలు

    ఇక రెండో భాగంలో విశాల్, అర్జున్ మధ్య వచ్చే సన్నివేశాలు చాలా ఆసక్తికరంగా ఉంటుంది. సైబర్ క్రైమ్ మాఫియా, డిజిటల్ ఇండియా కాన్సెప్ట్ అమాయకులను, నిరక్ష్య రాస్యులను ఎలా ఇబ్బంది గురిచేస్తుందో అనే అంశాలతో సినిమా స్టోరీ గ్రిప్పింగ్‌గా సాగుతుంది. చివర్లో అర్జున్, విశాల్ మధ్య వచ్చే సన్నివేశాలు హైలెట్‌గా నిలుస్తాయి.

    ప్రేక్షకుడిని ఆలోచింపజేసే కథ

    ప్రేక్షకుడిని ఆలోచింపజేసే కథ

    దర్శకుడు పీఎస్ మిత్రన్ ఎంచుకొన్న విభిన్నమైన కథ ప్రేక్షకుడిని ఆలోచింపజేసేలా ఉంది. ఇంటర్నెట్ యుగంలో సైబర్ క్రైమ్ గురించి ఆసక్తికరమైన రీతిలో కథను రూపొందించుకొన్నారు. ఆధార్ కార్డు లింకింగ్, ఫేస్‌బుక్‌ అప్‌డేట్స్ చేయడం ఎంత అనర్ధాయకమో చెప్పకనే చెప్పారు. టెక్నికల్‌గా మంచి కాన్సెప్ట్‌ను ఎంగేజింగ్‌గా, ఎంటర్‌టైనింగ్‌గా ప్రేక్షకులకు చెప్పడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడని చెప్పవచ్చు. విశాల్, అర్జున్, సమంత పాత్రలు సినిమాకు హైలెట్‌గా నిలుస్తాయి.

    విశాల్ పెర్ఫార్మెన్స్

    విశాల్ పెర్ఫార్మెన్స్

    విశాల్ ఆర్మీ ఆఫీసర్‌ అయినప్పటికీ పెద్దగా ఆ బ్యాక్ డ్రాప్ కథపై పెద్దగా ప్రభావం చూపించదు. తన కుటుంబానికి జరిగిన అన్యాయం అనే అంశమే హైలెట్‌గా నిలుస్తుంది. భావోద్వేగాలు పలికించే పాత్రలో విశాల్ ఒదిగిపోయాడు. పాత్రను తన బాడీ లాంగ్వేజ్‌కు అనుకూలంగా మలుచుకొని ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేశారు. ఓవరాల్‌గా విశాల్‌కు ఇది ఓ డిఫరెంట్ మూవీ.

    ప్రేక్షకుడిని కట్టిపడేసిన అర్జున్

    ప్రేక్షకుడిని కట్టిపడేసిన అర్జున్

    అభిమన్యుడు చిత్రంలో వైట్ డెవిల్‌ అర్జున్ పాత్ర చాలా కీలకమైంది. సెకండాఫ్‌లో ఆయన పాత్ర ప్రేక్షకుడిని కట్టిపడేస్తుంది. ప్రతినాయకుడి పాత్రలో చక్కగా రాణించారు. కీలక సన్నివేశాల్లో అర్జున్ పలికించిన హావభావాలు ఆకట్టుకునేలా ఉంటాయి. ఇన్ఫర్మేషన్ ఈజ్ వెల్త్ అని చెప్పిన డైలాగ్స్ ఆలోచింపజేస్తాయి.

    సమంత మరింత గ్లామరస్‌గా

    సమంత మరింత గ్లామరస్‌గా

    సమంత లక్ష్మీదేవీ అనే డాక్టర్ పాత్రలో కనిపించారు. డాక్టర్‌గా కథలో ఆమె పాత్రకు పెద్దగా స్కోప్ ఉండదు. విశాల్‌కు ఎదురైన సమస్యలను పరిష్కరించే క్రమంలో డాక్టర్ పాత్ర కీలకంగా మారుతుంది. ఈ చిత్రంలో సమంత మరింత గ్లామర్‌‌గా కనిపించింది. నటనపరంగా ఆమె గురించి కొత్తగా చెప్పాల్సిందే ఏమీ లేదు. తన పాత్ర పరిధి మేరకు సినిమాకు పూర్తిస్థాయిలో న్యాయం చేశారు.

    సినిమా అంతా తమిళ ఫ్లేవర్

    సినిమా అంతా తమిళ ఫ్లేవర్

    మిగితా పాత్రల్లో నటించిన వారంతా తెలుగు ప్రేక్షకులకు పరిచయం లేనివారే. తమిళ నటీనటులు పెద్దగా ఆడియెన్స్ చేరుకోలేకపోవడం ఈ సినిమాలో మైనస్.

     సంగీతం, బ్యాగ్రౌండ్ స్కోర్

    సంగీతం, బ్యాగ్రౌండ్ స్కోర్

    అభిమన్యుడు చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు. పాటలు అంతగా ఆకట్టుకోలేకపోయాయి. కానీ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకు జీవం పోసింది. సెకండాఫ్‌లో వచ్చే సన్నివేశాలకు యువన్ సంగీతం బలంగా మారింది.

    సినిమాటోగ్రఫీ హైలెట్

    సినిమాటోగ్రఫీ హైలెట్

    అభిమన్యుడు చిత్రానికి మరో ప్రధానమైన పాజిటివ్ పాయింట్ జార్జ్ సీ విలియమ్స్ అందించిన సినిమాటోగ్రఫి. ఈ చిత్రంలోని టెక్నికల్‌ అంశాలను సాధారణ ప్రేక్షకుడికి అర్థమయ్యేలా తెరకెక్కించడం ఆయన ప్రతిభకు అద్దం పట్టింది.

    నిర్మాణ విలువలు

    నిర్మాణ విలువలు

    అభిమన్యుడు చిత్రానికి విశాల్ నిర్మాతగా కూడా వ్యవహరించారు. నిర్మాణ విలువలు చాలా రిచ్‌గా ఉన్నాయి. టెక్నికల్ బ్యాక్ డ్రాప్ కథను ఖర్చుకు వెనుకాడకుండా, రాజీ పడకుండా అభిమన్యుడిని వైవిధ్యమైన చిత్రంగా రూపొందించారు.

     ఓవరాల్‌గా సినిమా ఎలా ఉందంటే

    ఓవరాల్‌గా సినిమా ఎలా ఉందంటే

    అభిమన్యుడు చిత్రం మనీ, మైండ్ గేమ్ అనే కీలక అంశాలతో తెరకెక్కింది. మిత్రన్ రాసుకొన్న స్క్రీన్ ప్లే ఆసక్తికరంగా సాగుతుంది. అన్నిరకాలుగా ఈ సినిమా బాగున్నప్పటికీ తమిళ నేటివిటీ ఇబ్బందిగా ఉంటుంది. వినోదం ఎబ్బెట్టుగా ఉంటుంది. విశాల్, అర్జున్ కోసం ఈ సినిమాను వీకెండ్ కాలక్షేపంగా ఓ సారి చూడవచ్చు.

    బలం, బలహీనతలు

    బలం, బలహీనతలు

    ప్లస్ పాయింట్స్

    • విశాల్, అర్జున్, సమంత పెర్ఫార్మెన్స్
    • మిత్రన్ కథ, స్క్రీన్ ప్లే
    • సినిమాటోగ్రఫీ
    • బ్యాక్ గ్రౌండ్ స్కోర్
    • మైనస్ పాయింట్స్

      • తమిళ నేటివిటి
      • ఫస్టాఫ్‌లో సాగదీత
      • సామాన్యుడికి అర్థం కాని టెక్నికల్ అంశాలు
      •  తెర వెనుక, తెర ముందు

        తెర వెనుక, తెర ముందు

        నటీనటులు: విశాల్, సమంత, అర్జున్ తదితరులు

        దర్శకత్వం: మిత్రన్
        సంగీతం: యువన్ శంకర్ రాజా
        సినిమాటోగ్రఫీ: జార్జ్ సీ విలియమ్స్
        రిలీజ్ డేట్: జూన్ 1, 2018

    English summary
    Abhimanyudu is a dubbed version of the Tamil action thriller Irumbu Thirai, which was recently released and has become hit at the box office. The movie is released in the Telugu states to cash in on the popularity of actor-cum-producer Vishal. The film has got a U certificate from the censor board and its has a runtime of 2.41 hours.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X