Ace First Review: ఏస్ మూవీ ఫస్ట్ రివ్యూ.. విజయ్ సేతుపతి హిట్ కొట్టాడా?
మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి, రుక్మిణి వసంత్ జంటగా నటించిన తాజా చిత్రం ఏస్. యోగిబాబు, దివ్య పిళ్లై, బబ్లూ పృథ్వీరాజ్ తదితరులు నటించిన ఈ చిత్రానికి అర్ముగ కుమార్ స్వయంగా నిర్మించి దర్శకత్వం వహించారు. 7Cs ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై రూపొందిన ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్నది. ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ రివ్యూ వివరాల్లోకి వెళితే..
ఫన్, ఎమోషన్స్, యాక్షన్, దోపిడి లాంటి అంశాలతో రూపొందిన ఏస్ చిత్రం మలేషియా బ్యాక్ డ్రాప్‌గా జరుగుతుంది. ఈ సినిమాలో గ్యాబ్లింగ్, మాఫియా చుట్టూ తిరిగే కథలో బోల్డ్ కాశీ అనే పాత్రలో విజయ్ సేతుపతి నటించారు. ఆయనకు హీరోయిన్‌గా రుక్మిణి వసంత్ నటించారు. యోగిబాబు కామెడీ ఈ సినిమాకు ప్లస్‌గా మారనున్నదనే సినీ వర్గాల్లో బలంగా ఉంది.

బోల్డ్ కాశీగా విజయ్ సేతుపతి, రక్మిణి వసంత్, యోగిబాబు భారీగా డబ్బు దొంగతనం చేయడానికి మలేషియాలోప్లాన్ చేస్తాడు. కాసినోలో గ్యాంబ్లర్‌గా బోల్డ్ కాశీ లక్ష్యం ఏమిటి? బోల్డ్ కాశీ ఎందుకు మలేషియా వెళ్లాడు? తన గత జీవితాన్ని మార్చుకొన ఎందుకు బతకాలని అనుకొన్నాడు అనేది ఈ సినిమా కథ అని ప్రమోషనల్ కంటెంట్ చెప్పకనే చెప్పింది. ఈ కథ కాకుండా ఇంకా ఏదో బలమైన పాయింట్ స్టోరీలో దాగుందనే లీక్ కూడా డైరెక్టర్ ఇచ్చాడు.
ఏస్ సినిమాను ఇటీవల చెన్నైలో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికెట్ అధికారులు రివ్యూ చేశారు. ఈ సినిమాను చూసిన తర్వాత తమ అభిప్రాయాలను, అభ్యంతరాలను వ్యక్తం చేశారు. అయితే ఈ సినిమాకు చిన్న చిన్న కట్స్‌తోపాటు కొన్ని డైలాగ్స్‌పై ఆరా తీశారు. చివరకు సంతృప్తి చెందిన అధికారులు యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేశారు అని చిత్ర యూనిట్ వెల్లడించింది.
ఇక ఏస్ సినిమా విషయానికి వస్తే.. విజయ్ సేతుపతి, రుక్మిణి వసంత్ మధ్య రొమాంటిక్ సన్నివేశాలు, పూర్తిగా యోగిబాబు పండించిన ఫన్, హై ఓల్టేజ్ యాక్షన్ సన్నివేశాలు ఈ సినిమాకు ప్లస్ అవుతాయి.చివరి 30 నిమిషాలు సినిమా కథ, కథనాలు, యాక్షన్ ఎపిసోడ్స్ గ్రిప్పింగ్‌గా ఉంటాయి. యోగిబాబు కామెడీ ఈ సినిమాకు మరింత బలంగా మారే అవకాశం ఉంది అని సెన్సార్ నుంచి వచ్చిన రిపోర్ట్ అనేది సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నది.
ఇటీవల వరుస విజయాలతో దూసుకెళ్తున్న విజయ్ సేతుపతి భిన్నమైన పాత్రలో కనిపించబోతున్నారు. రుక్మిణి వసంత్ తొలిసారి తమిళంలో అడుగుపెట్టారు. వారిద్దరి కాంబినేషన్, అర్ముగ కుమార్ రైటింగ్, ఆయన కథ చెప్పిన విధానం ఆకట్టుకొనేలా ఉంటుంది అనే టాక్ వినిపడుతున్నది. ఈ సినిమా మే 23వ తేదీన రిలీజ్ అవుతున్నది.కాబట్టి ఈ సినిమాకు సంబంధించిన ఎక్స్‌క్లూజివ్ రివ్యూ కోసం ఫిల్మీబీట్‌ను ఫాలో అవ్వండి


Click it and Unblock the Notifications











