Ace Movie Review: ఏస్ తెలుగు మూవీ రివ్యూ అండ్ రేటింగ్

Rating:
2.5/5

నటీనటులు: విజయ్ సేతుపతి, యోగిబాబు, రుక్మిణి వసంత్, దివ్య పిళ్లై, బబ్లూ పృథ్వీరాజ్ తదితరులు
నిర్మాత, దర్శకత్వం: అర్ముగకుమార్
బ్యానర్: 7Cs ఎంటర్‌టైన్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్
సినిమాటోగ్రఫి: కరణ్ బీ రావత్
మ్యూజిక్: జస్టిన్ ప్రభాకర్
మ్యూజిక్: సామ్ సీఎస్
ఎడిటర్: ఫెన్నీ ఆలివర్
ఆర్ట్:ఏకే ముత్తు
డైలాగ్స్: రాకేందు మౌళి వెన్నెలకంటి
కొరియోగ్రఫి: రాజు సుందరం, కల్యాణ్, లీలావతి
రిలీజ్ డేట్: 2025-05-23

జైలు నుంచి విడుదలైన బోల్ట్ కాశీ అలియాస్ కాశీ గత జీవితాన్ని ముగింపు పలికి సాధారణ జీవితాన్ని గడిపేయాలని మలేషియాలో అడుగుపెడుతాడు. ఎయిర్‌పోర్టులో పరిచయమైన జ్ఞానం (యోగి బాబు) ద్వారా కల్పన (దివ్యా పిళ్లై)కి హోటల్‌లో ఉద్యోగం సంపాదిస్తాడు. కౌలాలంపూర్‌లో రుక్మిణి (రుక్మిణి వసంత్)ను చూసి ప్రేమలో పడుతాడు. కానీ ఆర్థికంగా కష్టాల్లో ఉన్న రుక్మిణి ఆదుకొనేందుకు కాసినోలో గ్యాంబ్లర్ అవతారం ఎత్తుతాడు. గ్యాంబ్లింగ్ గేమ్‌లో ధర్మ (బీఆర్ అవినాష్) చేతిలో చీటింగ్‌కు గురి అవుతాడు. ఆ క్రమంలో ఓ బ్యాంక్‌ను దోపిడి చేయడానికి జ్ఞానం, కాశీ ప్లాన్ వేస్తారు.

Ace Movie Review and Rating

కాశీ గత జీవితం ఏమిటి? కాశీకి జ్ఞానంకు ఉన్న సంబంధమేమిటి? రుక్మిణికి ఎదురైన ఆర్థిక సమస్యలు ఏమిటి? తన తల్లికి రెండో భర్త అయిన ఇన్స్‌పెక్టర్ రాజ దురై (బబ్లూ పృథ్వీరాజ్) ద్వారా రుక్మిణికి ఎలాంటి కష్టాలు ఎదురయ్యాయి? రుక్మిణికి రాజ దురై ఇచ్చిన వార్నింగ్ ఏమిటి? కాశీ బ్యాంక్ దోపిడి ప్లాన్ వర్కవుట్ అయిందా? రుక్మిణిని కష్టాల నుంచి గట్టెక్కించాడా? ఇంతకు కాశీ ఎవరు? కాశీ గత జీవితం ఏమిటి? అనే ప్రశ్నలకు సమాధానమే ఏస్ సినిమా కథ.

క్రైమ్ ప్రపంచంతో సంబంధమున్న ఓ వ్యక్తి దానికి దూరంగా జీవితం గడపాలనుకొంటే.. తన లైఫ్‌లో ఎదురైన సమస్యలు, తన జీవితంలోకి వచ్చిన ప్రేయసికి ఉన్న ఇబ్బందులను ఎలా పరిష్కరించారనే సింపుల్ పాయింట్‌తో మూవీని అర్ముగ కుమార్ తెరకెక్కించారు. అయితే ఈ కథను ఎమోషనల్‌గా, ఫన్‌గా చెప్పడానికి చాలా స్కోప్ ఉంది. కానీ ఆ దిశగా ప్రయత్నాలు ఎక్కడా చేసినట్టు కనిపించదు. టేకాఫ్ బాగానే ఉన్నప్పటికీ.. డెస్టినేషన్ చేరుకోవడానికి సాగిన జర్నీ అంతగా ఆకట్టుకోదు. నిస్సారంగా సాగే కథలో యోగిబాబు క్యారెక్టర్‌ను డిజైన్ చేసిన విధానం ఈ మూవీలో హైలెట్‌గా కనిపిస్తుంది. యోగిబాబు కామెడీ కూడా అక్కడక్కడ మాత్రమే వర్కవుట్ అయిందనిపిస్తుంది. కథ, కథనాలు ఈ సినిమాకు మైనస్‌గా మారితే.. నటీనటులు తమ పెర్ఫార్మెన్స్‌తో ఆ లోపాలను సరిద్దిద్దేందుకు ప్రయత్నించారు.

విజయ్ సేతుపతిని కొత్తగా, గ్లామర్ పాత్రలో చూసేందుకు వీలు కలిగింది. ఇప్పటి వరకు రస్టిక్, రా క్యారెక్టర్లలో కనిపించిన సేతుపతి స్టైలిష్‌గా, మాస్ యాక్షన్ బేస్డ్ క్యారెక్టర్‌లో ఆకట్టుకొన్నాడు. యోగిబాబుతో కలిసి కామెడీ సీన్లను బాగా పండించాడు. యోగిబాబు డిఫరెంట్ బాడీ లాగ్వేంజ్‌తో ఆకట్టుకొన్నాడు. రుక్మిణి వసంత్‌ దక్కిన పాత్ర ఇంటెన్సివ్‌గా ఉంటుంది. ఆ పాత్ర చుట్టే కథ తిరుగుతుంది. కానీ ఆమె క్యారెక్టర్‌ ఎలివేట్ కావడానికి స్కోప్ లేకపోవడం వల్ల ఆమె తన పాత్ర పరిధి మేరకు పర్వాలేదనిపించారు. దివ్య పిళ్లై మరోసారి గ్లామర్‌తో మెప్పించారు. బబ్లూ పృథ్వీరాజ్ నెగిటివ్ షేడ్ ఉన్న క్యారెక్టర్‌లో ఫర్వాలేదనించాడు. బీఆర్ అవినాష్ విలన్‌గా ఒకే అనిపించాడు. మిగితా పాత్రల్లో నటించిన వారంతా తమ పాత్రల పరిధి మేరకు ఒకే అనిపించారు.

మలేషియా, ఇతర అందమైన ప్రాంతాల్లో ఈ సినిమాను ఎక్కువ భాగం చిత్రీకరించడంతో మూవీ రిచ్‌ ఫీలింగ్‌ను తెచ్చి పెట్టింది. సినిమాటోగ్రాఫర్కరణ్ బీ రావత్ పనితనం బాగుంది. జస్టిన్ ప్రభాకర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఫర్వాలేదనిపిస్తుంది. ఫెన్నీ ఆలీవర్ ఎడిటింగ్‌కు ఇంకా స్కోప్ ఉంది. 7Cs ఎంటర్‌టైన్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ అనుసరించిన నిర్మాణ విలువలు, అర్ముగ కుమార్ పాటించిన స్టాండర్డ్స్ బాగున్నాయి.

సింపుల్ పాయింట్ కథ, యోగి బాబు కామెడీని బలంగా మార్చుకొని రూపొందించిన యాక్షన్ డ్రామా ఏస్. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నప్పటికీ. కథ, కథనాలు, పాత్రల డిజైన్ గురించి ఇంకా కొంత శ్రద్ద పెట్టాల్సి ఉండాల్సింది. రుక్మిణి వసంత్, దివ్యా పిళ్లై టాలెంట్‌ను వృథా చేశారనిపిస్తుంది. కామెడీ ట్రాక్ ఇంకా బాగా రాయడానికి అవకాశం ఉన్నప్పటికీ.. ఆ దిశగా దృష్టి పెట్టలేదు. ఓవరాల్‌గా ఫన్‌తో సాగే యాక్షన్ డ్రామాను చూసి ఎంజాయ్ చేయాలనుకొనే వారికి ఈ సినిమా నచ్చే అవకాశం ఉంది. విజయ్ సేతుపతిని అభిమానించే వారు కూడా మెచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి ఓ సారి థియేటర్‌లో ఈ వారం ఓ లుక్కేసి మీ అభిప్రాయాన్ని చెప్పండి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X