Ace Twitter Review: ఏస్ మూవీ ట్విట్టర్ రివ్యూ
మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి, రుక్మిణి వసంత్ జంటగా నటించిన తాజా చిత్రం ఏస్. యోగిబాబు, దివ్య పిళ్లై, బబ్లూ పృథ్వీరాజ్ తదితరులు నటించిన ఈ చిత్రానికి అర్ముగ కుమార్ స్వయంగా నిర్మించి దర్శకత్వం వహించారు. 7Cs ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై రూపొందిన ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్నది. మే 23వ తేదీన రిలీజైన ఈ సినిమాపై నెటిజన్లు, క్రిటిక్స్ తమ అభిప్రాయాలను, రివ్యూలను వెల్లడించారు. ట్విట్టర్‌లో వెల్లడించిన వివరాల్లోకి వెళితే..

మలేషియాలో జరిగే దోపిడి ఆధారంగా నడిచే కామెడీ ఫన్ సినిమా. విజయ్ సేతుపతి మాస్ క్లాస్ మూమెంట్స్‌తో మెప్పించాడు. యోగిబాబు టాప్ పెర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకొన్నాడు. విజయ్ సేతుపతితో కలిసి ఆయన కామెడీ సీన్లలో అదరగొట్టాడు. రుక్మిణి వసంత్ తన పాత్రకు న్యాయం చేసింది. సామ్ సీఎస్ బీజీఎం బాగుంది.అర్ముగ కుమార్ ఇంటెలిజెంట్ రైటింగ్ బాగుంది అని నెటిజన్ కామెంట్ చేశాడు.
వినోదంతో సాగే ఎంటర్‌టైనర్‌గా ఏస్ సినిమా రూపొందింది. ఈ సినిమా చూసినంత సేపు కడుపుబ్బ నవ్వించింది. యాక్షన్ సీన్లు కూడా బాగున్నాయి. రొమాన్స్, కామెడీ అంశాలు హిలేరియస్‌గా ఉన్నాయి. లైఫ్‌లో అన్ని ఒత్తిళ్లు మరిచిపోయి హ్యాపీగా నవ్వుకొనే విధంగా సినిమా ఉంది. విజయ్ సేతుపతి చాలా స్టైలిష్‌గా కనిపించాడు. యోగిబాబు కామెడీ బాగుంది అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.
ఏస్ మూవీ వేరే లెవెల్‌గా ఉంది. మొదటి 20 నిమిషాలు సినిమాకు హైలెట్. చావు గురించి అమ్మమ్మ మాట్లాడే సీన్లు గుండెను హత్తుకొనేలా ఉంటాయి. జ్యూస్ సీన్, హాస్పిటల్ సన్నివేశాలు, క్లైమాక్స్ బాగున్నాయి. నా రేటింగ్ 4/5 అని ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు.
ఏస్ సినిమా పక్కా కమర్షియల్ ప్యాకేజ్. విజయ్ సేతుపతి, యోగిబాబు కాంబో పెద్ద హిట్. చివరి 40 నిమిషాలు ట్విస్టులు, ఫన్, కామెడీతో అదిరిపోతుంది. ఈ సినిమా ఎంజాయ్ రైడ్, ఈ సినిమా డెఫినెట్‌గా చూడదగిన సినిమా అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.


Click it and Unblock the Notifications











