‘ఆచారి అమెరికా యాత్ర’ సినిమా రివ్యూ: ఆకట్టుకోని మంచు విష్ణు, బ్రహ్మీ...

By Bojja Kumar

Recommended Video

Achari america Yatra movie Review

Rating:
1.5/5
Star Cast: మంచు విష్ణు, బ్రహ్మానందం, ప్రగ్యా జైస్వాల్, కోట శ్రీనివాసరావు
Director: జి.నాగేశ్వర్‌రెడ్డి
మంచు విష్ణు, బ్రహ్మానందం ప్రధాన పాత్రల్లో జి నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వంలో గతంలో వచ్చిన 'దేనికైనా రెడీ' చిత్రం మంచి విజయం సాధించింది. తాజాగా ఈ హిట్ కాంబినేషన్లో మరో కామెడీ ఎంటర్టెనర్ 'ఆచారి అమెరికా యాత్ర' పేరుతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. 'దేనికైనా రెడీ' చిత్రంలో పూజారులుగా నటించిన విష్ణు, బ్రహ్మీ మరోసారి ఇలాంటి పాత్రలతోనే ప్రేక్షకులను ఎంటర్టెన్ చేయడానికి రావడం గమనార్హం. మరి ఆచారి అమెరికా యాత్ర వెనక ఉన్న అసలు కథ ఏమిటి? ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించింది అనేది ఓసారి సమీక్షిద్దాం.

 కథ విషయానికొస్తే...

కథ విషయానికొస్తే...

కృష్ణమాచారి(మంచు విష్ణు) పురోహిత్యంలో ఘనాపాటి అప్పలాచారి (బ్రహ్మానందం) వద్ద శిష్యరికం చేస్తుంటాడు. ఓసారి అప్పలాచారి శిష్యబృందంతో కలిసి వేలకోట్ల అధిపతి చక్రపాణి(కోట శ్రీనివాసరావు) ఇంట్లో హోమం నిర్వహించేందుకు వెళతాడు. ఈ క్రమంలోనే కృష్ణమాచారి ఆ ఇంటి వారసురాలైన రేణుక(ప్రగ్యా జైస్వాల్)తో ప్రేమలో పడతాడు. హోమం చేస్తుండగా చక్రపాణి అనుకోకుండా గుండె పోటుతో చనిపోతాడు. అతడి చావుకు కారణం అప్పలాచారి అండ్ కో కారణం అంటూ చక్రపాణి మనుషులు వీరిని చంపేందుకు వెంటపడుతుంటారు. వీరి బారి నుండి తప్పించుకోవడంతో పాటు నాలుగు డబ్బులు వెనకేసుకోవచ్చని చెప్పి గురువుగారిని అమెరికా వెళ్లేందుకు ఒప్పిస్తాడు కృష్ణమాచారి. కాని కృష్ణమాచారి అమెరికా యాత్ర వెనక మరో కారణం ఉంటుంది. చక్రపాణి చావుకు కారకులు ఎవరు? చివరకు కథ ఎలా సుఖాంతం అయింది అనేది తెరపై చూడాల్సిందే.

హీరో హీరోయిన్ పెర్ఫార్మెన్స్

హీరో హీరోయిన్ పెర్ఫార్మెన్స్

పెర్ఫార్మెన్స్ పరంగా చూస్తే కృష్ణమాచారిగా మంచు విష్ణు పర్ఫెక్టుగా నటించారు. తన పాత్రకు పూర్తి న్యాయం చేశారు. హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్‌‌ నటన పరంగా తనను తాను నిరూపించుకునే సీన్లు పడక పోయినా.... అందంతో మెప్పించింది.

ఇతర నటీనటులు

ఇతర నటీనటులు

బ్రహ్మానందం పురోహితుడి పాత్ర వేస్తే తెరపై ఏ స్థాయిలో రెచ్చిపోతారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తనదైన నటనతో బ్రహ్మీ అదరగొట్టారు. కోట శ్రీనివాసరావు, పోసాని, పృథ్వి, ప్రవీణ్‌, విద్యుల్లేఖ రామన్‌, ప్రభాస్‌ శ్రీను, ప్రదీప్‌ రానా, ఠాకూర్‌ అనూప్‌సింగ్‌, సురేఖవాణి తదితరులు తమ తమ పాత్రలకు న్యాయం చేశారు.

టెక్నికల్‌గా

టెక్నికల్‌గా

సిద్ధార్థ్‌ సినిమాటోగ్రఫీ బావుంది. ఎస్‌.ఎస్‌.థమన్‌ అందించిన సంగీతం, బ్యాగ్రౌండ్ స్కోర్ యావరేజ్‌గా ఉంది. డార్లింగ్‌ స్వామి మాటలు అంత గొప్పగా ఏమీ లేవు. ఇతర విభాగాల పని తీరుకూడా జస్ట్ యావరేజ్‌ అనే విధంగా ఉంది. ఎడిటింగ్ మరింత షార్ప్‌గా ఉంటే బావుండేది.

ఆకట్టుకోలేదు కథ, కథనం...

ఆకట్టుకోలేదు కథ, కథనం...

సినిమా కథలో ఏ మాత్రం కొత్తదనం లేదు. రోటీన్ స్టోరికీ కామెడీ, యాక్షన్ లాంటి కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించి ప్రేక్షకులను ఎంటర్టెన్ చేద్దామని ట్రై చేశారు కానీ పెద్దగా వర్కౌట్ కాలేదు. స్క్రీన్‌ప్లే ప్రేక్షకులకు మరింత బోర్ కొట్టించింది.

దర్శకుడు విఫలం

దర్శకుడు విఫలం

సర్వసాధారణంగా తెలుగు సినిమాల్లో ఫస్టాఫ్‌లో కథకు సంబంధించిన పాత్రలను పరిచయం చేస్తూ ప్రేక్షకులను కథలోకి తీసుకెళుతూ కామెడీ సీక్వెన్స్‌తో నవ్వించడం, ఇంటర్వెల్ సమయానికి ఓ చిన్న ట్విస్ట్ ఇచ్చి సెకండాఫ్‌లో అసలు కథలోకి ఎంటరై క్లైమాక్స్‌లో ఒక సొల్యూ‌షన్‌తో కథను ముగించడం లాంటివి చేస్తుంటారు. ‘ఆచారి అమెరికా యాత్ర' విషయంలో దర్శకుడు ఇదే ఫార్మాట్ ఫాలో అయినప్పటికీ ప్రేక్షకులను మెప్పించే విధంగా స్క్రిప్టు డెవలప్ చేయడంలో విఫలం అయ్యాడు. అసలు ఎక్కడా కూడా ప్రేక్షకుడు ఎగ్జైట్మెంటుకు గురయ్యే సీన్లు కానీ, కడుపుబ్బా నవ్వుకునే కామెడీ సీన్లు కానీ లేవు. ఏదైనా ఇంట్రెస్టింగ్ పాయింట్ చూట్టూ ప్రేక్షకుడు ఉత్కంఠకు గురయ్యేలా కథ తిరుగుతుందా? అంటే అదీ లేదు. ఇలా అన్ని విషయాల్లోనూ దర్శకుడు నిరాశ పరిచాడు.

మళ్లీ మళ్లీ అదే అంటే బోరే మరి

మళ్లీ మళ్లీ అదే అంటే బోరే మరి

గతంలో వచ్చిన ‘దేనికైనా రెడీ' చిత్రంలో బ్రహ్మానందం, మంచు విష్ణు కాంబినేషన్, క్యారెక్టరైజేషన్ బాగా వర్కౌట్ అయింది. అలా అని....మళ్లీ మళ్లీ అదే క్యారెక్టరైజేషన్ చూపిస్తే కొత్తదనం లేక బోర్ ఫీలింగ్ వస్తుంది. ‘ఆచారి అమెరికా యాత్ర' విషయంలో దర్శకుడు జి నాగేశ్వర్ రెడ్డి ఈ చిన్న లాజిక్ మిస్సవ్వడం సినిమాకు పెద్ద మైనస్‌గా మారింది.

ప్లస్, మైనస్ పాయింట్స్

ప్లస్, మైనస్ పాయింట్స్

ప్లస్ పాయింట్స్...
మంచు విష్ణు, బ్రహ్మానందం కాంబినేషన్....
సినిమాటోగ్రఫీ

మైనస్ పాయింట్స్

కథ, కథనం
డైరెక్షన్
సంగీతం
లాజిక్ లేని సీన్లు
ఇంకా చాలా అంశాలు

చివరగా...

చివరగా...

మంచు విష్ణు, బ్రహ్మానందం, జి నాగేశ్వర్ రెడ్డి కాంబినేషన్లో వచ్చిన ‘దేనికైనా రెడీ' లాంటి హిట్ చిత్రాన్ని దృష్టిలో పెట్టుకుని థియేటర్‌కు వెళితే ‘ఆచారి అమెరికా యాత్ర' మిమ్మల్ని నిరాశ పరిచే అవకాశం ఉంది.

నటీనటులు, టెక్నీషియన్స్

నటీనటులు, టెక్నీషియన్స్

తారాగణం: మంచు విష్ణు, బ్రహ్మానందం, ప్రగ్యా జైస్వాల్, కోట శ్రీనివాసరావు, పోసాని, పృథ్వి, ప్రవీణ్‌, విద్యుల్లేఖ రామన్‌, ప్రభాస్‌ శ్రీను, ప్రదీప్‌ రావా, ఠాకూర్‌ అనూప్‌సింగ్‌, సురేఖవాణి తదితరులు.
రచన: మల్లాది వెంకటకృష్ణమూర్తి
మాటలు: డార్లింగ్‌ స్వామి
ఛాయాగ్రహణం: సిద్ధార్థ్‌
సంగీతం: ఎస్‌.ఎస్‌.థమన్‌
ఎడిటింగ్‌: వర్మ
యాక్షన్‌: కనల్‌కణ్ణన్‌
ఆర్ట్‌: కిరణ్‌
సమర్పణ: ఎం.ఎల్‌.కుమార్‌చౌదరి
నిర్మాతలు: కీర్తిచౌదరి, కిట్టు,
స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: జి.నాగేశ్వర్‌రెడ్డి
విడుదల తేదీ: ఏప్రిల్ 27, 2018

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X