twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Acharya movie review నిరాశ పరిచిన కొరటాల శివ.. అదరగొట్టిన రాంచరణ్

    |

    Rating:
    2.0/5

    Recommended Video

    Acharya Movie Public Talk మెగా ఫ్యాన్స్ ని మెప్పించిన కొరటాల | Telugu Filmibeat

    నటీనటులు: చిరంజీవి, రాంచరణ్, పూజా హెగ్డే, కాజల్ అగర్వాల్, సోను సూద్, జిషు సేన్ గుప్తా, వెన్నెల కిషోర్, తనికెళ్ల భరణి, సంగీత, రెజీనా కసండ్రా తదితరులు
    రచన, దర్శకత్వం: కొరటాల శివ
    నిర్మాత: నిరంజన్ రెడ్డి
    సినిమాటోగ్రఫి: తిరు
    ఎడిటింగ్: నవీన్ నూలీ
    సంగీతం: మణిశర్మ
    బ్యానర్: కొణిదెల ఎంటర్‌టైన్‌మెంట్
    రిలీజ్ డేట్: 2022-04-29

    ఆచార్య మూవీ కథ..

    ఆచార్య మూవీ కథ..

    ధర్మస్థలి అనే పుణ్యక్షేత్రంలో బసవ (సోనుసూద్) చేస్తున్న అరాచకాలకు ముగింపు పలికేందుకు ఆచార్య ( చిరంజీవి) అక్కడ అడుగుపెడుతాడు. పవిత్ర స్థలంలో డ్రగ్స్, అమ్మాయిలపై అఘాయిత్యాలను సిద్దా (రాంచరణ్) ఎదురిస్తాడు. అయితే అనుకోని పరిస్థితుల్లో సిద్దా నక్సలైట్‌తో కలిసి పనిచేయాల్సిన అవసరం ఏర్పడుతంది. తాను పెరిగిన ఆలయ నగరిలో జరుగుతున్న అన్యాయాలకు ముగింపు పలకాలని ఆచార్యను కోరిక కోరుతాడు.

    ఆచార్య మూవీలో ట్విస్టులు

    ఆచార్య మూవీలో ట్విస్టులు

    ధర్మస్థలి అనే ఆలయ నగరానికి ఉన్న విశిష్టత ఏమిటి? ధర్మస్థలికి సిద్ధాకు ఉన్న అనుబంధం ఏమిటి? ఆలయం నగరంలో ఉంటే సిద్దాకు అడవిలో ఉండే నక్సలైట్ ఆచార్యకు సంబంధం ఏమిటి? సిద్ధా ఏ పరిస్థితుల్లో ఆచార్య సహాయం తీసుకొంటాడు? సిద్దా, నీలాంబరి (పూజా హెగ్డే) మధ్య రిలేషన్ ఏమిటి? ధర్మస్థలిలో అరాచకాలకు ఆచార్య ఎలా ముగింపు పలికాడు. బసవకు ఆచార్య ఎలాంటి గుణపాఠం నేర్పారు అనే ప్రశ్నలకు సమాధానమే ఆచార్య సినిమా కథ.

    ఆచార్య ఫస్టాఫ్ ఎలా ఉందంటే..

    ఆచార్య ఫస్టాఫ్ ఎలా ఉందంటే..

    ఆచార్య కథ, కథనాల విషయానికి వస్తే.. చిరంజీవి ఇమేజ్‌కు భిన్నంగా ఆచార్య మూవీ అతి సాధారణంగా ప్రారంభం కావడమే జీర్ణించుకోలేని విషయంగా మారుతుంది. చిరంజీవి క్యారెక్టర్ కంటే.. చుట్టు ఉన్న క్యారెక్టర్లకే ఎలివేషన్ ఎక్కువగా కనిపిస్తుంది. చిరంజీవి క్యారెక్టర్ ఆసాంతం అండర్ ప్లే కావడం, అది ఏ దశలోను కూడా టేకాఫ్ అయినట్టు కనిపించకపోవడంతో గందరగోళంగా ఫస్టాఫ్ ముగుస్తుంది. ఫస్టాఫ్‌లో అతికించనట్టు ఉండే పాటలు, పాటల కోసమే సీన్లు పెట్టినట్టు స్పష్టంగా అనిపిస్తుంది. ఇక చిరంజీవి మార్క్ డైలాగ్, బిల్డప్ లేకపోవడంతో అభిమానులే నీరుగారిపోయిన పరిస్థితి కనిపిస్తుంది.

    సెకండాఫ్‌లో రాంచరణ్ పెర్ఫార్మెన్స్

    సెకండాఫ్‌లో రాంచరణ్ పెర్ఫార్మెన్స్

    ఇక సెకండాఫ్‌లో రాంచరణ్ క్యారెక్టర్ కొంత జోష్‌గా అనిపించడం కాస్త ఊరటగా అనిపిస్తుంది. చిరంజీవి, రాంచరణ్ ఇద్దరు కలిసి ఉన్న ఫ్రేమ్స్ చాలా ఎనర్జీ కనిపిస్తుంది. భలే భలే బంజారా పాట ఒక్కటే కాస్త జోష్‌ను పెంచి.. ప్రేక్షకుల్లో ఉత్సాహం పెంచేలా చేసిందని చెప్పవచ్చు. ఇక క్లైమాక్స్ మరీ రొటీన్‌గా సాగడంతో సినిమా అత్యంత సాధారణంగా ముగుస్తుంది.

    కొరటాల శివ దర్శకత్వ వైఫల్యమే..

    కొరటాల శివ దర్శకత్వ వైఫల్యమే..

    ఆచార్య సినిమా విషయంలో కొరటాల శివ ఎంచుకొన్న పాయింట్ బాగానే ఉన్నప్పటికీ.. ఎమోషనల్ పాయింట్స్‌తో మంచి కథగా విస్తరించడంలో దారుణమైన వైఫల్యం కనిపిస్తుంది. మెగాస్టార్ కథలో పెట్టుకొని.. సరైన డైలాగ్స్, మంచి సీన్లు రాసుకోలేకపోవడం భారీగా దెబ్బేసిందనే ఫీలింగ్ కలుగుతుంది. ఇక ఏ దశలోను ఇద్దరు సూపర్ స్టార్లకు కావాల్సిన మెటీరియల్ సీన్లలో కనిపించకపోవడం మరీ దారుణంగా అనిపిస్తుంది. ఇద్దరు మెగా హీరోలను ఎలివేట్ చేయడంలో కొరటాల శివ వైఫల్యం భారీగా కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది.

    చిరంజీవి గ్రేస్, స్క్రీన్ ప్రజెన్స్

    చిరంజీవి గ్రేస్, స్క్రీన్ ప్రజెన్స్

    చిరంజీవి యాక్టింగ్ పరంగా కొత్తగా ప్రూవ్ చేసుకోవాల్సన అవసరం లేదు. కానీ ఆచార్య విషయానికి వస్తే.. కథ, కథనాల్లో సరుకు లేకపోవడంతో చిరంజీవి కూడా పెద్దగా చేయడానికి ఏమీ లేకపోయింది. పేలవమైన సీన్లలో తన గ్రేస్, స్క్రీన్ ప్రజెన్స్‌తో నెట్టుకొచ్చే ప్రయత్నం చేశాడు. సెకండాఫ్‌లో చరణ్‌తో ఉన్న సన్నివేశాల్లో మెగాస్టార్ భావోద్వేగమైన నటనను ప్రదర్శించాడు. యాక్షన్ సీన్లు, పాటల్లో పెద్దగా ఆకట్టుకోలేకపోయారని చెప్పవచ్చు.

    రాంచరణ్ మరోసారి అదుర్స్

    రాంచరణ్ మరోసారి అదుర్స్

    ఇటీవల కాలంలో రాంచరణ్ నటుడిగా, స్టార్‌గా జెట్ స్పీడ్‌తో దూసుకెళ్తున్నాడనేది వాస్తవం. RRR మూవీతో ఫెర్ఫార్మెన్స్ విషయంలో ఓ బెంచ్ మార్క్ సెట్ చేసిన చెర్రీ.. ఆచార్యలో మరోసారి భారమైన పాత్రలో మెప్పించాడు. ఆచార్య సినిమాలో కేవలం రాంచరణ్ ఒక్కరే పూర్తి మార్కులు కొట్టేశాడని చెప్పవచ్చు. పాటలు, రొమాంటిక్ సీన్లలో.. ముఖ్యంగా ఫైట్స్ ఓ కసి కనిపిస్తుంది.

    పూజా హెగ్డే, సంగీత, రెజీనా గురించి

    పూజా హెగ్డే, సంగీత, రెజీనా గురించి

    ఆచార్య మూవీలో గ్లామర్ విషయానికి వస్తే.. సంగీత, రెజీనా కసండ్రా, పూజా హెగ్డే తెర మీద అందాల ప్రదర్శన చేశారు. సంగీత, రెజీనా అతిథి పాత్రలకే పరిమితం అయ్యారు. సంగీత లాహే లాహే. రెజీనా స్పెషల్ సాంగ్‌లో మెరిశారు. పూజా హెగ్డే కాస్త బెటర్‌గా ఫెర్ఫార్మ్ చేసే పాత్రలో మెప్పించే ప్రయత్నం చేసింది. అయితే పాత్ర పరిధి పెద్దగా లేకపోవడంతో తన కూడా ఏమీ చేయలేకపోయిందనే పరిస్థితి కనిపిస్తుంది.

    టెక్నికల్‌గా అంతంత మాత్రమే

    టెక్నికల్‌గా అంతంత మాత్రమే

    సాంకేతిక విభాగాల విషయానికి వస్తే.. ఆర్ట్ విభాగం పనితీరు కాస్త బెటర్‌గా అనిపిస్తుంది. ప్రకాశ్ టీమ్ వేసిన సెట్లు బాగున్నాయి. ఇక కథ, సన్నివేశాల్లో పస లేకపోవడం వల్ల మ్యూజిక్, సినిమాటోగ్రఫి విభాగాలు పెద్దగా రాణించినట్టు అనిపించదు. భలే భలే బంజారా పాట మంచి జోష్‌తో సాగుతుంది. మిగితా పాటలు తెర మీద ఆకట్టుకొన్నట్టు అనిపించవు. వీఎఫ్ఎక్స్ మరీ నాసిరకంగా ఉంటుంది. ఓ సీన్‌లో చిరంజీవిని మరీ దిగజార్చి చూపించారనే విషయంపై ఫ్యాన్స్‌ భగ్గుమంటున్నారు.

    ఫైనల్‌గా

    ఫైనల్‌గా


    ఆచార్య విషయానికి వస్తే.. ఇద్దరు మెగా హీరోలకు స్థాయికి తగిన కథ లేకుండా చేసిన సాహసం అనిపిస్తుంది. ఎలాంటి ప్రిపరేషన్‌ లేకుండా వండి వార్చిన వంటకం అవుతుంది. చిరంజీవి, రాంచరణ్ మూడేళ్ల శ్రమ బూడిదలో పోసిన పన్నీరుగా అనిపిస్తుంది. దర్శకత్వం పరంగా కొరటాల శివ వైఫల్యాలే ఎక్కువగా కనిపిస్తాయి. ఫస్టాఫ్ నిదానంగా సాగడం ఓ మైనస్ అనిచెప్పవచ్చు. సెకండాఫ్‌లో ఎమోషన్స్, చిరు, చెర్రీ ఎమోషన్స్ పాజిటివ్‌గా అనిపిస్తాయి. ఫ్యాన్స్‌కు, సగటు ప్రేక్షకుడికి ఒకే అనిపించేలా ఆచార్య ఉంటుంది. మెగా అభిమానులకు మాత్రమే ఆచార్య అనిచెప్పవచ్చు.

    English summary
    Acharya review: Chiraneevi, Ram Charan's Acharya movie hits screen on April 28th. In this occassion, Filmibeat Telugu brings exclusive review.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X