twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అడవిలో తప్పిపోయిన వర్మ

    By Staff
    |

    Adavi
    చిత్రం: అడవి
    నటీనటులు: ఫర్దీన్‌ ఖాన్‌, ఊర్మిళా, సుషాంత్‌, సునీల్‌ శెట్టి, కాశ్మీర్‌ షా
    సంగీతం: సందీప్‌ చౌతా
    ఫోటోగ్రఫీ: విజయ్‌ అరోరా
    సమర్పణ: వైజయంతీ మూవీస్‌
    దర్శకత్వం: రాంగోపాల్‌ వర్మ

    రాంగోపాల్‌ వర్మ చిత్రం అనగానే సహజంగానే అందులో ఏదో ఒక విశేషం ఉంటుందనుకుంటాం. సాంకేతిక పరమైన మ్యాజిక్కో, అద్భుతమైన నటనో ఏదో ఒకటి ఆకట్టుకునే అంశం ఉంటుంది. వర్మ తాజా చిత్రం అడవిలో సైతం అబ్బురపరిచే కెమెరా వర్క్‌, మంచి కథనం ఉన్నా ప్రేక్షకులను ఆకర్షించే స్థాయిలో మాత్రం లేదు. శివ, సత్య, రంగీలా వంటి అద్భుతమైన చిత్రాలను అందించిన వర్మ ఈ సారి సాధారణ చిత్రాన్ని రూపొందించాడు. కాకపోతే దౌడ్‌, మస్త్‌ ల కన్నా అడవి బెటరే. మామూలు ప్రేమ కథకు కాస్త అడ్వెంచర్‌ ను జోడించి తీసిన ఈ చిత్రం చాలా తెలుగు సినిమాల కన్నా నయం. ప్రతి సీన్‌ లోనూ వైవిధ్యం కోసం వర్మ తపించాడు.

    అనూ(ఊర్మిళా), రఘు(ఫర్దీన్‌ ఖాన్‌) ప్రేమలో పడుతారు. కానీ ఊర్మిళా తండ్రి మాత్రం ఆమెకు వేరే సంబంధం చూస్తాడు. తన స్నేహితుడు కొడుకు హిమాంశ్‌ తో పెళ్ళి కుదుర్చుతాడు. వీరందరూ ఒక రోజు అడవిలోకి విహారయాత్రకు బయలు దేరుతారు. అడవిలో ఉన్న రిసార్ట్‌ లో హాయిగా గడిపేందుకు వెళ్ళిన ఊర్మిళా కుటుంబాన్ని అనుసరిస్తూ హీరో ఫర్దీన్‌ ఖాన్‌ కూడా బయలు దేరుతాడు. అడవిలో క్రూర మృగాలున్నట్లే- క్రూరమైన మనుషులూ ఉంటారు. దుర్గ నారయణ అనే ఓ బందీపోటు ఉంటాడు. ఊర్మిళాతో పాటు, ఇతర గెస్ట్‌ లను బందీస్తాడు. దాంతో ప్రేమికులిద్దరు విడిపోతారు.

    ఈ దుర్గనారయణను పట్టుకునేందుకు స్పెషల్‌ టాస్క్‌ ఫోర్స్‌ ఆఫీసర్‌ సునీల్‌ శెట్టి వస్తాడు. కానీ తమ గ్యాంగ్‌ లోని ఒకడ్ని విడిపిస్తేనే బందీలను విడుదల చేస్తానని దుర్గనారయణ డిమాండ్‌ చేస్తాడు. రాజకీయనాయకుల ఒత్తిడి వల్ల(రోజా చిత్రం గుర్తుకు వస్తుంది కదూ) సునీల్‌ శెట్టి అందుకు అంగీకరిస్తాడు. సో.. దుర్గనారయణ బందీలను విడుదల చేస్తాడు- ఒక్క ఊర్మిళాను తప్ప. ఊర్మిళా అంటే వాడికి పిచ్చి ప్రేమ కలుగుతుంది. అందుకని ఆమెను విడుదల చేయడు. ఇక ప్రియసఖిని రక్షించేందుకు హీరో ఫర్దీన్‌ ఖాన్‌ స్వయంగా రంగంలోకి దిగుతాడు. మిగతా కథ మీరు ఊహించిందే.

    ఊర్మిళా నటన బావున్నా, సుషాంత్‌ నటనే చిత్రంలో బాగా ఆకట్టుకుంటుంది. వీరప్పన్‌ తరహా పాత్రను సుషాంత్‌ అవలీలగా పోషించాడు. ఫర్దీన్‌ ఖాన్‌ కు ఇది రెండో చిత్రం. మొదటి చిత్రం కన్నా ఫర్దీన్‌ నటన ఇందులోనే బావుంది. అడవిలోని పాములు, సింహాలు తదితర దృశ్యాలను కెమెరామెన్‌ విజయ్‌ అరోరా అద్భుతంగా చిత్రీకరించాడు. సందీప్‌ చౌతా సంగీతం ఫర్వాలేదు. రెండు పాటలు మినహా పెద్దగా చెప్పుకోదగ్గవి కాదు. పాటల కన్నా నేపథ్య సంగీతం బావుంది. వర్మకు ఇది మరో చిత్రమే తప్ప పేరు తెచ్చే చిత్రం మాత్రం కాదు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X