twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఫర్వా లేదనిపించే 'అద్భుతం'

    By Staff
    |

    Adbutham
    -జలపతి గూడెల్లి
    చిత్రం: అద్భుతం
    నటీనటులు: అజిత్‌, షాలిని, రఘువరన్‌, నాజర్‌
    సంగీతం: రమణీ భరద్వాజ్‌
    దర్శకత్వం: చరన్‌

    ఇది పక్కా మాస్‌ యాక్షన్‌ చిత్రం. అయితే కాస్తా ప్రేమ కూడా జోడించడంతో యాక్షన్‌, మాస్‌ చిత్రాలు అంటే ఇష్టపడని వారికి సైతం 'అద్భుతం' నచ్చుతుంది. అజిత్‌, రఘువరన్‌ పోటాపోటీగా నటించిన ఈ సినిమా కథ కొత్తది కాకాపోయినా, ప్రేక్షకులు బోర్‌ ఫీలవ్వకుండా చివరి వరకు సస్సెన్స్‌ ఉండేట్లుగా దర్శకుడు చరన్‌ స్క్రీన్‌ ప్లేను రూపొందించారు. చక్కటి ఫోటోగ్రఫీ, మంచి మ్యూజిక్‌ తోడవ్వడంతో సినిమా ఆసక్తికరంగా సాగుతుంది. అయితే చిత్రంలో చాలా లోపాలు కూడా ఉన్నాయి. కొన్ని సన్నివేశాల్లో దర్శకుడు అనుభవరాహిత్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది.

    అజిత్‌ ఒక రౌడీ. డబ్బులు ఇస్తే ఏ పనైనా చేసే అజిత్‌ ఓ డొక్కు సినిమా థియేటర్‌ పైన ఉన్న రూంలో ఉంటాడు. ఆ థియేటర్‌ యాజమాని మిత్రుడు రఘువరన్‌ ఒక స్మగ్లర్‌. తన భార్య(రాధిక)ను వెదుక్కుంటూ తీహార్‌ జైలు నుంచి మద్రాస్‌ వస్తాడు. అజిత్‌ రూంలోనే మకాం వేస్తాడు. ఇరవై ఏళ్ళ క్రితం తనని కాపాడమంటూ మిత్రుడు, పోలీసు కమీషనర్‌ నాజర్‌ దగ్గరికి వస్తే తనని జైలుకు పంపించాడని రఘువరన్‌ అజిత్‌ కు చెపుతాడు. నేరస్థుడని తెలవడంతో తనని అసహ్యించుకుంటూ గర్భవతైన భార్య రాధిక దూరమవుతుంది. తను జైలుకు వెళ్ళేందుకు కారణమైన నాజర్‌ పై పగ తీర్చుకునేందుకు అజిత్‌ సాయం కోరుతాడు రఘువరన్‌. భార్యబిడ్డలు దూరమై తాను అనుభవిస్తున్న క్షోభ నాజర్‌ కూడా అనుభవించాలని, అందుకు అతని కూతురు షాలినిని కిడ్నాప్‌ చేయాలని అజిత్‌ ను అడుగుతాడు.

    సంగీతకళాశాలలో విద్యార్థైన షాలినిని కిడ్నాప్‌ చేసి రెండురోజుల పాటు ఊరికి దూరంగా ఉన్న ఓ కోటలో ఉంచుతాడు. అక్కడ అజిత్‌ పాడిన పాట విని షాలిని ప్రేమలో పడుతుంది. షాలినిని కూడా తను ప్రేమిస్తున్నట్లుగా నటిస్తాడు అజిత్‌- రఘువరన్‌ ఆదేశంతో. అజిత్‌ ను మార్చేందుకు ఆమె ప్రయత్నిస్తుంది. దీంతో హీరో కూడా నిజంగానే ప్రేమించడం మొదలు పెడుతాడు. కానీ షాలిని ఎవరో కాదు, తన కూతురేనని రఘువరన్‌ కు తెలుస్తుంది. ఇక వీరిద్దరి ప్రేమను విడగొట్టేందుకు రఘువరన్‌ ప్రయత్నిస్తాడు. చివరికి వీళ్ళ ప్రేమ ఎలా ఫలిస్తుందనేది చిత్రం ముగింపు.

    రఫ్‌ క్యారెక్టర్‌ ను అజిత్‌ అద్భుతంగా పోషించాడు. ఎలాంటి క్యారక్టర్‌ నైనా సులువుగా చేయగలనని రుజువుచేశాడీ చిత్రంతో. ఇక రఘువరన్‌, నాజర్‌ ల నటన గురించి చెప్పాల్సిందేమీ ఉంది. షాలిని నటన కూడా బావుంది. అన్నింటికన్నా ఈ చిత్రంలో చెప్పుకోవాల్సింది రమణీ భరధ్వాజ్‌ సంగీతం. 'ఏకాంతమైన ఒక్కక్షణాన్ని అడిగా.. అడిగా...' పాట నిజంగా అద్భుతం. పాట ఆసాంతం ఆగకుండా బాలు పాడిన తీరు ముగ్ధుల్ని చేస్తుంది. వేటూరి వారి సాహిత్యమూ తోడవ్వడంతో చిత్రంలో ఈ పాట ప్రత్యేకంగా నిలుస్తుంది. తమిళంలో (అమర్కలం) ఈ చిత్రం ఘనవిజయం సాధించింది. ఈ చిత్రం షూటింగ్‌ సమయంలోనే అజిత్‌, షాలిన్‌లు ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత ఈ మధ్యే పెళ్ళి కూడా చేసుకున్నారు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X