ఫర్వాలేని..టైప్‌..

By Staff

Adente Ado Type
-జలపతి గూడెల్లి
చిత్రం: ఆడంతే..అదో టైప్‌
నటీనటులు: ఆర్యన్‌ రాజేష్‌, అనిత, శివాజీ, సింధు,
చంద్రమోహన్‌, అలీ, గిరిబాబు, సన, తదితరులు..
సంగీతం: యువన్‌ శంకర్‌ రాజా
నిర్మాత: అంబికా కృష్ణ
స్క్రీన్‌ ప్లే, దర్శకత్వం: ఇవివి సత్యనారయణ

ఇవివి సత్యనారయణ చిత్రాలంటే కామెడీ తప్పకుండా ఉంటుందనే నమ్మకం చాలా మందిలో ఉంది. కానీ కొద్ది కాలంగా ఆయన రూపొందిస్తోన్న చిత్రాల్లో అదే కొరవడింది. తాజాగా రూపొందించిన 'ఆడంతే..అదో టైప్‌'లోనూ అంతే కామెడీ పెద్దగా లేకపోవడం, సినిమా ఫర్వాలేదన్న రీతిలోనే సాగింది. తమిళ చిత్రం మౌనం పేసియదే..కు రీమేక్‌ ఈ చిత్రం.

అయితే, ఎక్కడా విసుగురాకపోవడం, బోర్‌ కొట్టకపోవడం ఒక ప్లస్‌ పాయింట్‌. ఆర్యన్‌ రాజేష్‌ ను యాక్షన్‌ హీరోగా చూపించాలన్న తాపత్రయంలోనే ఫైట్స్‌ పెట్టినట్టుగా కన్పిస్తుంది. పాటలు బాగున్నాయి. క్లైమాక్స్‌ వీక్‌. కథలో కొత్తదనం ఏమీ లేదు.

ఆర్యన్‌ రాజేష్‌, శివాజీ ఇద్దరు ప్రాణ స్నేహితులు. శివాజీ కోసం ఏమైనా చేస్తాడు ఆర్యన్‌. శివాజీ సింధును ప్రేమిస్తాడు. కానీ ఆర్యన్‌ కు ప్రేమ, దోమ మీద నమ్మకం ఉండదు. అసలు అవి అంటేనే పడదు. కారణం తెలీదు. రచయితకు కూడా తెలియకపోవచ్చు. కానీ, శివాజీ మరదలు అనిత అంటే గౌరవం. ఆమె కూడా ఆర్యన్‌ పట్ల 'ప్రేమ'గానే ఉంటుంది.

శివాజీ, సింధుల పెళ్ళి ఫిక్స్‌ అయ్యాక, ఆర్యన్‌ అనిత తనను ప్రేమిస్తుందని భావిస్తాడు. కానీ ఆమె సాయికిరణ్‌ ను ప్రేమిస్తున్నట్లు, తమ పెళ్ళికి సాయం చేయమని ఆర్యన్‌ ను అడుగుతుంది. మనవాడికి షాక్‌. మరి నిత్యం ఫోన్‌ చేసి, ప్రేమిస్తున్నట్లుగా మాట్లాడే భామ ఎవరని ఫరేషాన్‌. అది క్లైమాక్స్‌ లో దర్శకుడు ఇంటర్‌ కట్‌ లో చూపిస్తాడు. అదన్నమాట.

సినిమా కథలో పెద్దగా నవ్యత లేదు. ఏదో..అలా నడుచుకుంటూ సాగుతుంది. ఆర్యన్‌ గత చిత్రాల కన్నా కాస్తా ఇందులో ఇంప్రూవ్‌ అయ్యాడు. శివాజీ సినిమా ఆసాంతం రాజేంద్రప్రసాద్‌ ను అనుకరించాడు. రాజేంద్రప్రసాద్‌ లోటును ఈ తరంలో శివాజీ భర్తీ చేద్దామని ప్రయత్నిస్తున్నాడేమో తెలియదు. అనిత, సింధులకు గ్లామర్‌ లేదు. ఆకట్టుకునే నటనా కాదు. అలీ కామెడీ మరీ రోటీన్‌. కృష్ణభగవాన్‌ కామెడీ ట్రాక్‌ కాస్తా ఫర్వాలేదు. ఇవివి అర్జెంట్‌ గా తన రైటర్‌ జనార్థన్‌ మహర్షిని మార్చుకోకపోతే..అంతే. ఈజిప్ట్‌ లో తీసిన..ఒక పాట చిత్రీకరణ బాగుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X