అధోగతి నేత (రివ్యూ)

By Staff
Adhinetha
-జోశ్యుల సూర్య ప్రకాష్
బ్యానర్: శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌
నటీనటులు: జగపతిబాబు, శ్రద్ధాదాస్‌, హంసానందిని, నీలిమ, పరుచూరి గోపాలకృష్ణ,
ఆహుతి ప్రసాద్‌, ఆనంద్‌రాజ్‌, చలపతిరావు, అన్నపూర్ణ, శివపార్వతి తదితరులు.
సంగీతం: శ్రీకాంత్ దేవా
కెమెరా: ప్రసాద్ బాబు
ఎడిటర్: నందమూరి హరి
ఫైట్స్: రామ్ లక్ష్మన్
కథ,మాటలు: పరుచూరి బ్రదర్స్
సమర్పణ: సదాశివుని రవి
నిర్మాత: కె.కె.రాధామోహన్‌
స్క్రీన్ ప్లే..దర్శకత్వం: వి.సముద్ర
రిలీజ్ డేట్: 24/04/2009

హమ్మయ్య...ఎలక్షన్స్ అయిపోయాయి...హోరెత్తిన వాగ్ధానాలకు, బురద జల్లుకోవటాలకు, కోట్లాటలకు ఇక తెరపడినట్లే.. అని కాస్త రిలాక్సు అవుదామని సినిమాకు వెళితే...మళ్ళా అక్కడా అదే సీన్లు..అదే అధినేత ప్రేక్షకుడు పాట్లు. ఓ సామాన్యుడు అనుకోని పరిస్ధితుల్లో సిఎం అయితే ఎలా ఉంటుంది అనే పాయింటుతో వచ్చాం అని పబ్లిసిటీ చేసిన ఈ చిత్రం చివరకు బోర్ మిగుల్చింది. అయినా మల్లెపూవు వంటి చెత్తను తీసిన సముద్ర అంతకు మించి ఆశించటం అనవసరమే అనిపించేలా చేసాడు. ప్రారంభం నుంచి ఎటునుంచి ఎటువెళ్తుందో అర్ధం కాని కథ, సన్నివేశాలు, డైలాగులతో సినిమాని పూర్తిగా నింపేసారు. అప్పటికీ సీనియర్స్ పరుచూరి బ్రదర్స్ సాయం తీసుకన్నా ఫలితం లేకపోయింది. అలాగే 2006 లో వచ్చిన మరాఠి సినిమా Na. Mukhyamantri Ganpya Gawde నుంచి అసలు పాయింట్, మొయిన్ సీన్స్ లిఫ్ట్ చేసినా వర్కవుట్ కాకపోవటం మరో మైనస్.

కథలోకి వెళ్తే సూరిబాబు(జగపతిబాబు) అనే పెళ్ళికాని నిరుద్యోగి ఎక్కడ, ఎవరికి అన్యాయం, అక్రమం జరిగినా తట్టుకోలేడు. ఈలోగా శ్రీరాములు(పరుచూరి గోపాలకృష్ణ) అనే పొలిటికల్ పెద్దాయన రికమెండేషన్ తో ముఖ్యమంత్రి(ఆహుతి ప్రసాద్) పి.ఎ గా జాయిన్ అవుతాడు. అక్కడుండగానే శ్రీరాములు అధికార పక్షం చేత మర్డర్ చేయబడతాడు. అయితే చనిపోయే ముందు శ్రీరాములు తన శిష్యుడు లాంటి సూరిబాబుని పిలిచి ఓ తన రాజకీయ వారసుడువి అవమని ప్రామిస్ చేయించుకుంటాడు. దాంతో స్నేహితుల సాయింతో ఇండిపెండెంట్ గా ఎలక్షన్లో నిలబడి ఎమ్మల్యే అవుతాడు.అనంతరం జరిగిన రాజకీయపరిణామాలతో ముఖ్యమంత్రి అవుతాడు. అక్కడ నుంచి అతను ఏ విధంగా ప్రజలకు తోర్పడ్డాడు...ఎలా ప్రత్యర్ధుల కుట్రకు బలై తిరిగి లేచి నిలబడ్డాడు..తన రాజకీయ గాడ్ ఫాధర్ హత్య ముడి ఎలా విప్పాడు..అనేది మిగతా కథ. అంతేగాక ఇలాంటి కథలో హీరోయిన్ లవ్ ట్రాక్ ఎలా పెట్టారు..కామెడీ ఎక్కడ వచ్చే అవకాశం ఉందన్నది తెలియాలన్నా ఓపిగ్గా సినిమా చూడాల్సిందే.

స్ట్రైయిట్ నేరేషన్లో చెప్పిన ఈ కథలో జగపతిబాబు పాత్ర సెకండాఫ్ సగం దాకా సమస్యలోకి వెళ్ళదు. దాంతో కాంప్లిక్ట్ లేక డ్రామా పుట్టలేదు..అది బోర్ కి దారితీసింది. అలాగే హీరోయిన్ పాత్రని పస్టాఫ్ లో కేవలం డ్రీమ్ సాంగ్స్ కే పరిమితం చేసారు. ఎక్కడా హీరోని ఒక్కసారి కూడా కలవటం కూడా జరగదు..ఇది మరి ఎడిటింగ్ సమస్యో..మరేమో అర్ధంకాదు. అలాగే ఈ సినిమా కోసం తీసుకున్న మరాఠి సినిమా కామెడీ చిత్రం. అందులో హీరో సామాన్యులకు ప్రతినిధి...కాస్త అమాయికత్వం పాళ్ళున్నవాడు. దాంతో అలాంటి వాడు ముఖ్యమంత్రి పీఠం ఎక్కితే ఏం చేస్తాడు..సమస్యలను ఎలా ఎదుర్కొంటాడు అనే ఉత్కంఠ ఏర్పడింది. అదే ఇక్కడకొచ్చేసరికి హీరో చాలా తెలివైన వాడు.. అన్యాయాలు.. అక్రమాలుని చీల్చి చెండాడేస్తూంటాడు. అలాంటి వాడు ఏదైనా చెయ్యగలడనిపిస్తుంది. అలాగే సూపర్ హిట్ ఒకే ఒక్కడు చిత్రంలోంచి అర్జున్ మారువేషం గెటప్, కొన్ని కీలకమైన సీన్లు తీసుకున్నారు. కానీ అవేమీ అందంగా అతకలేదు. పొలిటికల్ చిత్రం అంటున్నారు కాబట్టి సంగీతం వదిలేయవచ్చు.

అంతేగాక సముధ్ర గత చిత్రం ఎవడైతే నాకేంటిలో ముమైత్ లాంటి పోలీస్ పాత్రను మళ్ళీ పెట్టారు..కానీ అదీ కథలో కలవలేదు. ఇలా ఏ సీన్ కా సీన్ విడిగా ఉండటం విసుగు తెప్పించే అంశం. పొలిటికల్ సెటైర్ డైలాగులుకు పెట్టింది పేరైన పరుచూరి బ్రదర్స్ ఈ చిత్రంలోనూ అక్కడక్కడా తమ కలం బలం చూపారు. ఏ ప్రాజెక్టుకీ మన గవర్నమెంట్ తెలుగు లెజెండ్స్ పేరు పెట్టలేదు..అంతా డిల్లీ నాయకుల పేర్లే పెడతారు.కొత్త గవర్నమెంట్ వస్తే ఆ పరిస్దితి మారుస్తారేమో అని అంటారు ఓ చోట..మరో చోట ఉదయించే సూర్యుడు, మార్పు కోరుకుంటున్నాం అంటూ పీఆర్పీ ని గుర్తు చేస్తారు. అలాగే పోగ్రస్ పార్టీ, ఆంధ్ర దేశం పార్టీ, మా దేశం పార్టీ అంటూ పేర్లు పెట్టి పార్టీలపై కొన్ని చురకలు వేసారు. వీటికి తోడు సముద్ర సినిమాలు టెక్నికల్ గా పూర్ గా ఉండంటం, అతి బిల్డప్ లు పాత తమిళ చిత్రాలను గుర్తుకు తెస్తూంటాయి. కెమెరా, ఎడిటింగ్ వంటివి కథకు తగ్గట్లే ఉన్నాయి. అయితే నిర్మాత చేత మాత్రం బాగా ఖర్చు పెట్టించినట్లు తెలిసిపోతూంటుంది.

ఈ సినిమాను ఎలక్షన్స్ తర్వాత రిలీజ్ చేసారంటూ చాలా మంది బాధ పడుతున్నారు..కానీ ఎప్పుడు రిలీజ్ చేసినా దీని ప్రభావం ఏమీ ఉండదని ఖచ్చితంగా చెప్పవచ్చు. ఎందుకంటే ఏ విషయంపైనా స్పష్టమైన సెటైర్స్ గానీ, మెసేజ్ గానీ ఇవ్వలేకపోయారు. ఎవరైనా లీనమై ఈ సినిమా చూస్తే పొరపాటున ముఖ్యమంత్రి కాకూడదని మాత్రం డిసైడ్ అవటం ఖాయం. ఇక ఓటేయని వారని ఈ సినిమాకి పంపితే సరైన శిక్ష వేశినట్లే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X