Adiparvam Movie Review: ఆదిపర్వం మూవీ రివ్యూ అండ్ రేటింగ్.. మంచు లక్ష్మీ, ఎస్తేర్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉందంటే?

Rating:
2.5/5

నటీనటులు: మంచు లక్ష్మి, ఆదిత్య ఓం, ఎస్తేర్ నోర్హానా, సుహాసిని, శ్రీజిత ఘోష్, శివ కంఠమనేని, వెంకట్ కిరణ్, సత్య ప్రకాష్, సమ్మెట గాంధీ, జెమినీ సురేష్, ఢిల్లీ రాజేశ్వరి, హ్యారీ జోష్, జబర్దస్త్ గడ్డం నవీన్ తదితరులు
రచన, దర్శకత్వం: సంజీవ్ మేగోటి
బ్యానర్: అన్వికా ఆర్ట్స్, అమెరికా ఇండియా (ఏఐ) ఎంటర్‌టైన్‌మెంట్స్
సహ నిర్మాతలు: గోరెంట శ్రావణి, రవి మొదలవలస, ప్రదీప్ కాటకూటి, రవి దశిక, శ్రీరామ్ వేగరాజు
సినిమాటోగ్రఫీ: ఎస్ ఎన్ హరీశ్
మ్యూజిక్: మాధవి సైబ, ఓపెన్ బనాన ప్రవీణ్, సంజీవ్, బి.సుల్తాన్ వలి, లుబెక్ లీ, రామ్ సుధీ (సుధీంద్ర)
ఎడిటింగ్: పవన్ శేఖర్ పసుపులేటి
ఫైట్స్: నటరాజ్
కొరియోగ్రఫీ: సన్ రేస్ మాస్టర్
ఆర్ట్ డైరెక్టర్: కేవీ రమణ
రిలీజ్ డేట్: 2024-11-09

రాయలసీమలోని కడప ప్రాంతంలోని ఎర్రగుడి ప్రాంతాన్ని తన కనుసైగల్లో శాసించే గ్రామ పెద్ద రాయప్ప (హ్యారీ జోష్). కులం పట్టింపు ఉన్న ఆయన తన సామాజిక వర్గం ప్రతిష్టకు భంగం కలిగించకుండా ఆ ప్రాంతాన్ని తన గుప్పిట్లో ఉంచుకొంటాడు. అలాంటి రాయప్పకు కుడిభుజంలా నిజాయితీగా పనిచేసే హనుమంతు (ఆదిత్య ఓం) మధ్య కొన్ని విభేదాల కారణంగా విడిపోయి పగ ప్రతీకారంతో రగిలిపోతుంటారు. అలాంటి వ్యక్తుల ఇద్దరు పిల్లలు శ్రీను (వెంకట్ కిరణ్) బుజ్జమ్మ అలియాస్ మహా (శ్రీజిత ఘోష్) ప్రేమించుకొంటారు. ఇదిలా ఉండగా, ఎర్రగుడి ప్రాంతంలోని మారెమ్మ తల్లి ఆలయంలోని నిధులను కాజేయడానికి ఎమ్మెల్యే నాగమ్మ (మంచు లక్ష్మీ), రాయప్ప ప్రయత్నిస్తుంటారు.

Adiparvam movie Review in Telugu  Manchu Lakshmi  Aditya Om and Ester Noronha s Periodic Drama

రాయప్పకు అతడి వద్ద నమ్మకంగా పనిచేసే హనుమంతుకు మధ్య విభేదాలకు కారణం ఏమిటి? వారిద్దరూ విడిపోయిన తర్వాత ఆ ప్రాంతంలో నెలకొన్న పరిస్థితులు ఏంటి? హనుమంతు కొడుకు శ్రీను తన కూతురు బుజమ్మతో ప్రేమలో పడటంపై రాయప్ప ఎలా స్పందించాడు? రాయప్ప కూతురును శ్రీను లవ్ చేయడంపై హనుమంతు రియాక్షన్ ఏమిటి? కుల పిచ్చి ఉన్న రాయప్ప తన కూతురు పెళ్లి ఎలా జరిపించాడు? శ్రీను, బుజ్జి ప్రేమ కథకు ముగింపు ఏమిటి? నిధుల వేటలో నాగమ్మ, రాయప్ప మధ్య ఘర్షణ ఏమిటి? ఈ కథలో రమణమ్మ (ఎస్తేర్), భైరప్ప (సత్య ప్రకాశ్), కల్పప్ప (జెమిని కిరణ్), రాజమ్మ (ఢిల్లీ రాజేశ్వరి), దుర్గప్ప (సమ్మెట గాంధీ) పాత్రలు ఏమిటనే ప్రశ్నలకు సమాధానమే ఆదిపర్వం సినిమా కథ.

రాయలసీమలో 70వ దశకం నుంచి 90వ దశకం వరకు సాగే కథను దర్శకుడు సంజీవ్ మేగోటి రాసుకొన్న విధానం, పాత్రలను డిజైన్ చేసిన విధానం బాగుంది. ప్రస్తుతం సినిమా ప్రేక్షకుల అభిరుచికి దూరంగా ఉన్న కథగా అనిపిస్తుంది. రూటెడ్ ఎలిమెంట్స్‌తో కథను చెప్పాలనుకొన్న ప్రయత్న్ం బాగుంది. కులాంతర ప్రేమకథ, నిధుల వేట లాంటి పాయింట్‌తో కాకుండా ఏదైనా కొత్త బ్యాక్ డ్రాప్‌తో కథ చెప్పి ఉంటే డెఫినెట్‌గా ప్రేక్షకులు మరింతగా ఆదరించడానికి స్కోప్ ఉండేదనిపిస్తుంది. దర్శకుడిగా సంజీవ్ చేసిన ప్రయత్నం బాగుంది. భారీస్థాయిలో ఉన్న నటుల నుంచి పెర్ఫార్మెన్స్ రాబట్టుకొన్న తీరుకు మెచ్చుకోవాల్సిందే.

Adiparvam movie Review in Telugu  Manchu Lakshmi  Aditya Om and Ester Noronha s Periodic Drama

నటీనటుల పెర్ఫార్మెన్ప్ విషయానికి వస్తే.. ఎమ్మెల్యే నాగమ్మగా మంచు లక్ష్మీ మరోసారి పవర్‌ఫుల్ రోల్‌లో ఆకట్టుకొన్నారు. ఇక రాయప్పగా బాలీవుడ్ నటుడు హ్యారీ జోష్, హనుమంతుగా ఆదిత్య ఓం, ప్రేమికులుగా శ్రీను, బుజ్జమ్మగా శ్రీజిత,వెంకట్ కిరణ్ తమ పాత్రలకు న్యాయం చేశారు. రమణమ్మగా ఎస్తేర్ కీలక పాత్రలో ఆకట్టుకొన్నారు. మిగితా పాత్రల్లో నటించిన వారందరూ కథకు బలంగా నిలిచారు.

ఆదిపర్వం సినిమా టెక్నికల్ అంశాల విషయానికి వస్తే.. హరీష్ అందించిన సినిమాటోగ్రఫి బాగుంది. మ్యూజిక్ ఈ సినిమాకు ప్లస్ పాయింట్. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సీన్లను భారీగా ఎలివేట్ చేసింది. ఎడిటింగ్, ఆర్ట్, ఇతర విభాగాలు పనితీరు బాగుంది. ముఖ్యంగా ఈ చిత్రానికి అన్వికా ఆర్ట్స్, అమెరికా ఇండియా (ఏఐ) ఎంటర్‌టైన్‌మెంట్స్ పాటించిన నిర్మాణ విలువలు బాగున్నాయి. సినిమాపై గోరెంట శ్రావణి, రవి మొదలవలస, ప్రదీప్ కాటకూటి, రవి దశిక, శ్రీరామ్ వేగరాజు కు ఉన్న అభిరుచిని తెలియజెప్పాయి.

Adiparvam movie Review in Telugu  Manchu Lakshmi  Aditya Om and Ester Noronha s Periodic Drama

నటీనటుల ఫెర్ఫ్మారెన్స్, ఫ్యాక్షన్, గ్రామీణ నేపథ్యం, లవ్, ఓ చిన్న మెసేజ్‌తో రూపొందిన చిత్రం ఆదిపర్వం. మంచు లక్ష్మీ, ఆదిత్య ఓం, హ్యారీ జోష్ తదితరుల ఈ మూవీకి ప్లస్ పాయింట్స్. పాతతరం కథ, రెగ్యులర్ ప్యాటర్న్‌లో కథ చెప్పడం మైనస్‌గా అనిపిస్తుంది. ఫ్యాక్షన్, నిధుల వేట తరహా చిత్రాలను ఆదరించే వారికి ఈ సినిమా నచ్చే అవకాశం ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X