Adipurush Review విజువల్ వండర్‌గా ఆదిపురుష్.. ప్రభాస్, సైఫ్ పోటాపోటీగా.. ఆదిపురుష్ ఎలా ఉందంటే?
నటీనటులు: ప్రభాస్, కృతిసనన్, సైఫ్ అలీఖాన్, సన్నీ సింగ్, దేవదత్త నాగే, వత్సల్ సేన్, సోనాల్ చౌహాన్ తదితరులు
నిర్మాతలు: టి సిరీస్ భూషణ్ కుమార్, క్రిష్ణకుమార్, ఓం రావత్, ప్రసాద్ సుతారియా, రెట్రోఫిల్స్ రాజేష్ నాయర్, యూవీ క్రియేషన్స్ వంశీ, ప్రమోద్
దర్శకత్వం: ఓం రావత్
ఎడిటర్: అపూర్వ మోతీవాలే సాహై, ఆశిష్ మాత్రే,
డివోపి: కార్తీక్ పల్నాని
సంగీతం: అజయ్ - అతుల్
పాటలు: రామ జోగయ్య శాస్త్రి
పీఆర్వో: జీఎస్కే మీడియా
రిలీజ్ డేట్: 2023-06-16
సీతారామ (ప్రభాస్, కృతిసనన్), లక్ష్మణులు వనవాసం చేస్తున్న సమయంలో శ్రీరాముడిని చూసి శూర్పణఖ మనసు పడుతుంది. అయితే తాను వివాహితుడినని శ్రీరాముడు శూర్పణఖ కోరికను తిరస్కరిస్తాడు. దాంతో సీతపై హత్యా ప్రయత్నం చేయబోయిన శూర్ఫణఖ ముక్కును కోసేస్తాడు. తన చెల్లిలికి జరిగిన అవమానాన్ని తట్టుకోలేక రావణుడు సీతను అపహరిస్తాడు. లంకలో బంధించి పెళ్లాడమని వేధిస్తుంటాడు.

సీతా అపహరణ తర్వాత శ్రీరామచంద్రుడు ఎలాంటి వేదనకు గురయ్యాడు? సీత ఆచూకీ తెలుసుకోవడానికి ఎలా ప్రయత్నించాడు? సీత ఆచూకీని వానరులు చెప్పిన తర్వాత లంక ప్రయాణం ఎలా సాగింది. లంకను చేరుకోవడానికి రామసేతు నిర్మాణం జరిగింది? శ్రీరాముడు, వానర సైన్యంపై రావణసురుడు, ఇంద్రజిత్, కుంభకర్ణుడు ఎలా మాయలు చేసి ముప్పు తిప్పలు పెట్టారు. రావణ సంహారం ఎలా జరిగిందనే ప్రశ్నలకు సమాధానమే ఆదిపురుష్ సినిమా కథ.

రావణసురుడు అమరత్వం కోసం తపస్సు చేసే ఎపిసోడ్‌తో కథ మొదలవుతుంది. రావణసుర క్యారెక్టర్‌ను పవర్‌పుల్‌గా చూపించి కథపై ఆసక్తిని రేపడంలో ఓం రావత్ సక్సెస్ అయ్యాడు. ఆ తర్వాత మంచి యాక్షన్ ఎపిసోడ్ ప్రభాస్ ఎంట్రీ సినిమా మొదలైన 15 నిమిషాల తర్వాత జరుగుతుంది. సీతను రావణసురుడు అపహరించడంతో అసలు కథ మొదలువుతుంది. తొలి భాగంలో సీతాఅపహరణ సమమంలో జాటయువుతో ఫైట్, ఆ ఎసిసోడ్‌లో గ్రాఫిక్ వర్క్ ఆకట్టుకొనేలా ఉంటుంది. వాలి, సుగ్రీవ మధ్య ఫైట్, రామసేతు నిర్మాణ ఎపిసోడ్ ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్‌గా కనపడుతాయి. ఫస్టాఫ్ కాస్త నిదానంగా నడిచినప్పటికీ దర్శకుడు సినిమాను టెక్నికల్‌గా బాగా డీల్ చేశాడనే చెప్పాలి. కాకపోతే కథలో ఎక్సైట్‌మెంట్ లేకపోవడం కొంత నిరాశగా ఉంటుంది.

ఇక సెకండాఫ్‌లో రామసేతు నిర్మాణం సమయంలో సముద్రుడు, రాముడు మధ్య నడిచే సీన్ ప్రేక్షకులకు గ్రాఫిక్ వర్క్ పరంగా కొత్త అనుభూతిని కలిగిస్తుంది. సంజీవని పర్వతాన్ని అంజనేయుడు తీసుకు రావడం, అలాగే ఇంద్రజిత్తు, కుంభకర్ణుడితో పోరాటాలు ఆసక్తికరంగా చిత్రీకరించారు. రాముడు, రావణుడు తొలిసారి కలుసుకొనే సీన్ కొత్తగా, ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. టెక్నికల్‌గా సినిమాను డీల్ చేసే క్రమంలో కథపరంగా జాగ్రత్తలు తీసుకోవడంలో తడబాటు కనిపించింది. కథ కంటే టెక్నికల్ అంశాలే డామినేట్ చేశాయనిపిస్తుంది. ఓవరాల్‌గా కథలో ఎమోషన్స్, ఎక్సైట్‌మెంట్ పెద్దగా కనిపించవు.

శ్రీరాముడిగా కొత్త లుక్‌లో ప్రభాస్ కనిపించారు. అయితే మనకు రాముడంటే నీలమేఘశ్యాం అనే మనసులో ముద్ర పడింది. శ్రీరాముడిని బాడీ కలర్ నీలంలో లేకపోవడంతో కొంత కనెక్ట్ కావడానికి ఇబ్బందిగా అనిపిస్తుంది. శ్రీరాముడిగా ప్రభాస్ తెర మీద అద్బుతంగా కనిపించాడు. సీతగా కృతిసనన్‌కు పెద్దగా ఫెర్ఫార్మెన్స్ చేయడానికి స్కోప్ లేకపోయింది. ఇక ఈ సినిమాలో పూర్తిగా డామినేట్ చేసినది రావణుడిగా సైఫ్ ఆలీఖాన్ అని చెప్పుకోవాల్సిందే. లంకేశ్వరుడిగా సైఫ్ నటన బాగుంది. అతడి ఆహార్యం, హావభావాలు కొత్తగా ఉన్నాయి. మండోదరిగా సొనాల్ చౌహాన్, శూర్పణఖగా తృప్తి తొడర్‌మల్, హనుమంతుడిగా దేవదత్త నాగే, లక్ష్మణుడిగా సన్నీసింగ్ ఫర్వాలేదనిపించారు.

ఇక సాంకేతిక విభాగాల పనితీరు విషయానికి వస్తే..ఆదిపురుష్ సినిమాకు మొత్తంగా ప్రాణం పోసింది మ్యూజిక్. అజయ్ అతులు అందించిన పాటలు సినిమా చూసిన ్తర్వాత కూడా వెంటాడుతుంటాయి. ఇక బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకు అత్యంత బలమైన అంశంగా మారిందని చెప్పవచ్చు. సినిమాను ఓ రేంజ్‌లో నిలబెట్టడంలో బీజీఎం వర్క్ చాలా బాగుంది. ఇక వీఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్ హాలీవుడ్ రేంజ్‌కు మించి ఉన్నాయని చెప్పవచ్చు. ఇటీవల కాలంలో 3డీ ఫార్మాట్‌కు సంబంధించి బెస్ట్ గ్రాఫిక్ వర్క్ జరిగిన సినిమాగా ఆదిపురుష్‌ను చెప్పుకోవచ్చు. చాలా చోట్ల 3డీ ఎఫెక్ట్స్ థ్రిల్లింగ్‌ను కలిగిస్తాయి. సినిమాటోగ్రఫి విజువల్ ఫీస్ట్‌గా అనిపిస్తుంది. సెకండాఫ్‌లో కొన్ని చోట్ల గ్రాఫిక్ వర్క్ నాసిరకంగా అనిపిస్తుంది. ఆర్ట్ విభాగం (వీఎఫ్ఎక్స్) పనితీరు స్పెషల్ ఎట్రాక్షన్ అని చెప్పవచ్చు.

వాల్మీకి రామాయణం ఆధారంగా శ్రీరాముడి జీవిత కథను ఆదిపురుష్‌గా తెరకెక్కించారు. అయితే కథపై కంటే టెక్నికల్ అంశాలపైనే దృష్టిపెట్టడం కొంత అసంతృప్తిని కలిగిస్తుంది. అయితే రామాయణాన్ని క్రియేటివ్ లిబర్టిని వాడుకొని నేటి తరం ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా మోడర్న్‌గా, టెక్నికల్‌గా చెప్పిన ప్రయత్నం అనిపిస్తుంది. పెద్దలకు రామాయణం రకరకాల చూసిన అనుభూతి ఉంది. కాబట్టి వారికి ఈ సినిమా పెద్దగా ఇంప్రెస్ చేయలేకపోవచ్చు. కానీ పిల్లలను విపరీతంగా ఆలరించే అంశాలు ఎక్కువగానే ఉన్నాయి. కథకు సంబంధించిన ఎమోషనల్, ఎక్సైట్‌మెంట్ కంటే టెక్నికల్‌గా ఈ సినిమా బాగా ఇంప్రెస్ చేస్తుంది. కాబట్టి అంచనాలు లేకుండా వెళ్లితే మంచి అనుభూతిని పంచే సినిమా ఆదిపురుష్. ఇక కలెక్షన్ల పరంగా ఈ సినిమా ఇప్పటికే మంచి జోష్‌లో ఉంది. రానున్న రోజుల్లో వచ్చే వసూళ్లు ఈ సినిమా రేంజ్‌ను, హిట్ స్టాటస్‌ను డిసైడ్ చేస్తుంది.


Click it and Unblock the Notifications











