Don't Miss!
- News దేశ రాజకీయాల్లో ఆ ఘనత సాధించిన ఒకేఒక్కడు పవన్ కళ్యాణ్
- Automobiles సేఫ్టీలో మహీంద్రా బొలెరో నియోకు కేవలం 1-స్టార్ రేటింగ్.. దీనిపై కంపెనీ ఏమందంటే??
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
- Sports ఆ చెత్త నిర్ణయమే ఆర్సీబీ కొంపముంచింది- ఫించ్
- Finance Debt Free: అప్పుల ఊబి నుంచి త్వరగా బయటపడాలా..?? ఇవిగో 5 మార్గాలు..
- Lifestyle వేసవిలో కడుపులో చల్లగా ఉంచే కీరకాయ పెరుగుపచ్చడి-అన్నం, రోటీ లేదా చపాతీ దేనికైనా...
- Travel ఏపీలోని రైలు ప్రయాణికులకు శుభవార్త..వేసవి ప్రత్యేక రైళ్లు ఆగే స్టేషన్లివే..!
ఆడుతూ..పాడుతూ
చిత్రం: ఆడుతూ..పాడుతూ
నటీనటులు: శ్రీకాంత్, సునీల్, గాయత్రి, ఎం.ఎస్.నారయణ, రాజ్
సంగీతం: చక్రి
మాటలు: చింతపల్లి రమణ
నిర్మాత: సి.వి.రెడ్డి
స్క్రీన్ ప్లే, దర్శకత్వం: దేవీప్రసాద్
కథ, కథనం విభిన్నంగా ఉన్న చిత్రాలు చాలా అరుదుగా వస్తుంటాయి. ఇలా భిన్నమైన నేపథ్యంలో తీసిన సరదా చిత్రమే - ఆడుతూ..పాడుతూ. ఓ మలయాళ చిత్రం ఆధారంగా రూపొందించిన ఈ చిత్రం ఆసాంతం కామెడీయే. సినిమా టైటిల్ మాదిరే చిత్రం అంతా ఆడుతూ..పాడుతూ తీశారు. కామెడీ ప్రధాన వస్తువైనప్పటికీ, పూర్తిస్థాయిలో కామెడీ లేదు. డైలాగ్స్ లలో మరింత కామెడీ చొప్పించి ఉంటే ఈ సినిమా మరింత రక్తికట్టేది. అయినప్పటికీ, ఈ చిత్రం ఏ మాత్రం నిరాశపర్చదు. కేవలం సరదా కోసమే తీసిన ఈ చిత్రంలో కథే బలం.
శ్రీకాంత్, సునీల్ ప్రాణస్నేహితులు. ఇద్దరూ పెద్దగా చదువుకోలేదు. కాబట్టి ఉద్యోగాలు దొరకవు. శ్రీకాంత్ తండ్రి మిగిల్చిన ఆస్థి - డొక్కు బస్సు. ఈ డొక్కు బస్సే వీరికి ఇళ్ళు, ఆఫీస్...అన్నీ. ఈ బస్సుతో పడే తిప్పలు కడుపుబ్బ నవ్విస్తాయి. ఈ బస్సునే మోబైల్ క్యాంటిన్ గా మార్చాలని శ్రీకాంత్ అనుకుంటాడు. అందుకోసం బ్యాంక్ లోన్ తీసుకుంటాడు. ఇదే సమయంలో ఓ బంజారా అమ్మాయి(గాయత్రి) ఓ రాత్రి బస్సులో తలదాచుకుంటుంది.
శ్రీకాంత్ ఈ బంజారా అమ్మాయి ప్రేమలో పడుతాడు. పెళ్ళి చేసుకుందామని అనుకునే సమయంలో గాయత్రి బంజారా అమ్మాయి కాదనీ, తమిళనాడు సీఎం కూతరని తెలుస్తుంది. జెడ్ కేటగిరీ సెక్యూరిటీలోనే జీవితాన్ని గడపాల్సి రావడంతో, విసిగి పోయి రాజకీయాలకు దూరంగా ఉండేందుకు, గాయత్రి ఇంటి నుంచి పారిపోయి హైదరాబాద్ వస్తుంది. చివరికి శ్రీకాంత్ గాయత్రిని ఎలా పెళ్ళిచేసుకుంటాడనేది క్లైమాక్స్.
కథ చిన్నదే. కానీ బస్సు చుట్టూ జరిగే సీన్స్ బాగా నవ్విస్తాయి. సునీల్ కామెడీ కూడా చాలా బాగుంది. కాకపోతే డైలాగ్స్ లో మరింత కామెడీ ఉంటే, ఇంకా బాగా పండేవి. శ్రీకాంత్ నటన సాధారణం. కొత్త అమ్మాయి గాయత్రి లావుగా ఉన్నా, బాగుంది. నటన కూడా బాగానే చేసింది. చక్రి సంగీతం సాధారణం. రెండు పాటలు మాత్రం వినసొంపుగా ఉన్నాయి. ఫోటోగ్రఫీ బాగుంది. కొత్త దర్శకుడు దేవీప్రసాద్ తొలి చిత్రంతోనే తన టాలెంట్ ను నిరూపించుకున్నాడు.