For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ప్రేమంటే మోహం, స్నేహమంటే సుఖం....( ‘యే దిల్ హై ముష్కిల్’ రివ్యూ)

  By Bojja Kumar
  |

  హైదరాబాద్: ఐశ్వర్యరాయ్, రణబీర్ కపూర్, అనుష్క శర్మ, ఫవాద్ ఖాన్ ప్రధాన పాత్రల్లో ప్రముఖ బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్ తెరకెక్కించిన హిందీ చిత్రం 'యే దిల్ హై ముష్కిల్'. 'యే దిల్ హై ముష్కిల్' అంటే తెలుగు అర్థం.... 'ఈ మనసు చాలా సంక్లిష్టమైనది' అని అర్థం. పరిస్థితుల ప్రభావమో? లేక నిర్మాత తలరాతో తెలియదు కానీ.... సినిమా విడుదల సమయంలో ఎన్ని సంక్లిష్ట పరిస్థితులు ఎదుర్కొందో అందరికీ తెలిసిందే.

  పాక్ నటుల వివాదం కారణంగా ఈ సినిమా అసలు విడుదల అవుతుందా? లేదా? అనే సందేహాలు నిన్నమొన్నటి వరకు ఉండేది. మొత్తానికి అన్ని అండ్డంకులను తొలగించుకుని సినిమా శుక్రవారం విడుదలైంది.

  ఈ సినిమాపై ముందు నుండీ భారీ అంచనాలు ఉండటానికి కారణం కరణ్ జోహార్ దర్శకత్వమే. అద్భుతమైన ప్రేమ కథలను తెరకెక్కించడంలో కరణ్‌ జోహార్‌ది రూటే సపరేటు. గతంలో ఆయన దర్శకత్వంలో వచ్చిన 'కుచ్ కుచ్ హోతా హై' మూవీ ఎంత పెద్ద హిట్టయిందో అందరికీ తెలిసిందే. మళ్లీ ఆ రేంజిలో మళ్లీ కరణ్ జోహార్ దర్శకత్వంలో వస్తున్న మూవీ కావడం.... ఐశ్వర్యరాయ్ తనకంటే పదేళ్లు చిన్నవాడైన రణబీర్ తో రొమాన్స్ లాంటివి సినిమాపై అంచనాలు పెంచాయి. సినిమా ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంది అనేది రివ్యూలో చూద్దాం.

  కథ విషయానికొస్తే...

  కథ విషయానికొస్తే...

  సినిమా మొత్తం అయాన్, అలిజె, సభ అనే పాత్రల చుట్టూ తిరుగుతుంది. అందులో అయాన్‌(రణ్‌బీర్‌ కపూర్‌) బాగా డబ్బున్న కుటుంబానికి చెందిన యువకుడు. సొంతగా నిర్ణయాలు తీసుకోలేని మనస్తత్వం. సింగింగ్ అంటే ప్రాణం. పెద్ద సింగర్‌ని కావాలని కలలు కంటుంటాడు. ఈ క్రమంలో అతడికి బార్లో అలిజె(అనుష్క శర్మ) పరిచయం అవుతుంది. ఇద్దరూ మంచి స్నేహితులవుతారు.

  ప్రేమ...వేదన

  ప్రేమ...వేదన

  అలిజె తనతో చాలా క్లోజ్ గా ఉండటం చూసి దాన్ని ప్రేమ అనుకుంటాడు అయాన్. కానీ అలిజెకి అప్పటికే ప్రియుడు అలీ(ఫవాద్ ఖాన్) ఉంటాడు. వారి ప్రేమ పెళ్లి వరకు వెలుతుంది. ఈ విషయం తెలియక అలిజెను ప్రేమించిన అయాన్‌ తీవ్ర వేదనకు గురవుతాడు.

  ఐశ్వర్యరాయ్

  ఐశ్వర్యరాయ్

  ప్రేమ విఫలమై మనోవేదనలో ఉన్న అయాన్ కు సబా(ఐశ్వర్య రాయ్‌) పరిచయం అవుతుంది. సభ పరిచయం తర్వాత అయాన్ లైఫ్ ఎలా టర్న్ అయింది? అసలు అయాన్ కి? సభకు సంబంధం ఏమిటి? అలిజె-అయాన్ ప్రేమ వ్యవహారం ఏమైంది? అనేది తెరపై చూడాల్సిందే.

  పెర్ఫార్మెన్స్

  పెర్ఫార్మెన్స్

  నటీనటుల పెర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే.... రణబీర్ కపూర్ తన పాత్రలో అదరగొట్టాడు. ఐశ్వర్యరాయ్ హాట్ అండ్ సెక్సీ లుక్ తో అభిమానులను ఆకట్టుకుంది. ఐష్ ను ఫుల్ గ్లామరస్ గా చూపించారు. సినిమాలో ఆమె అందం హైలెట్ గా నిలిచింది. అలిజె పాత్రలో అనుష్క ఆకట్టుకుంది... ఐష్ తో పోలిస్తే అనుష్కను గ్లామర్ గా చూపించలేదు. పాక్ నటుల వివాదంతో ఫవాద్ ఖాన్ పాత్రను కొంత మేర మాత్రమే చూపించారు. పెర్ఫార్మెన్స్ పరంగా ఫవాద్ ఖాన్ ఓకే. ఇతర నటీనటులు వారి వారి పరిధిమేరకు నటించారు.

  ఆకట్టుకునే అంశాలు

  ఆకట్టుకునే అంశాలు

  సినిమాలో రణబీర్ కపూర్, అనుష్క శర్మ మధ్య జరిగే ట్రాక్ ఆకట్టుకుంటుంది. సినిమా ట్రైలర్లు, పోస్టర్లలో ఐశ్వర్యరాయ్-రణబీర్ మధ్య హాట్ సీన్లు ఉన్నట్లు చూపించారు. కానీ సినిమాలో ఊహించిన రేంజిలో అవి లేవు. సెన్సార్ కత్తిరింపులో ఈ సీన్లు లేపేసారని స్పష్టమవుతోంది. ఐశ్వర్యరాయ్ ని అభిమానులు కోరుకున్న విధంగా గ్లామరస్ గా ప్రజెంట్ చేసాడు దర్శకుడు.

  టెక్నికల్ అంశాలు

  టెక్నికల్ అంశాలు

  ప్రీతమ్ సంగీతం ఆకట్టుకుంది. ఆయన అందించిన బాణీలు సినిమాకు ప్లస్ అయ్యాయి. అనిల్ మెహతా సినిమాటోగ్రఫీ సూపర్బ్. సినిమా నిర్మాణ విలువలు రిచ్ గా ఉన్నాయి. ఎడిటింగ్ ఫర్వాలేదు. ఇతర విభాగాలు ఓకే.

  దర్శకుడి పని తీరు

  దర్శకుడి పని తీరు

  కరణ్ జోహార్ ఎంచుకున్న కథ కొత్తగా ఏమీ లేక పోయినా..... అతని మేకింగ్ స్టైల్ ఫ్రెష్ గా అనిపిస్తుంది. స్క్రీన్‌ప్లే ఆకట్టుకునే విధంగా ఉండటంతో ప్రేక్షకలకు బోర్ కొట్టదు. అయితే అక్కడక్కడ కొన్ని సన్నివేశాలు సాగదీసినట్లు అనిపిస్తుంది. టేకింగ్ బావుంది. క్లైమాక్స్ ఎమెషనల్ గా ఉండటం ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.

  చివరగా....

  చివరగా....

  సినిమా మధ్యలో ఓ సన్నివేశంలో ప్రేమంటే మోహం, స్నేహమంటే సుఖం అనే డైలాగ్ ఉంటుంది. ఈ రెండింటిని అందరికీ అర్థమయ్యేలా నేరేట్ చేయడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. ప్రేమకథలు ఇష్టపడే వారికి ‘యే దిల్ హై ముష్కిల్' నచ్చుతుంది. ఫీల్ గుడ్ మూవీ.

  English summary
  Ae Dil Hai Mushkil is one of Ranbir's honest performances where he gives you ample of reasons to love him. 'Ajeeb kahaani hai pyaar aur dosti ke rishtein ki...pyaar hamara hero, dosti hamari heroine' and the actor makes sure to give you lessons in both! This one is worth a watch.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X