twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమా రివ్యూ అండ్ రేటింగ్

    |

    Recommended Video

    Agent Sai Srinivasa Athreya Movie Review And Rating || Filmibeat Telugu

    Rating:
    2.5/5
    Star Cast: నవీన్ పొలిశెట్టి, శ్రుతి శర్మ, సుహాస్
    Director: స్వరూప్ ఆర్ఎస్‌జే

    ఇటీవల టాలీవుడ్‌లో రిలీజ్‌కు ముందు సందడి చేసిన చిత్రాల్లో ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ మూవీ ఒకటి. మళ్లీ రావా నిర్మాత రాహుల్ యాదవ్ నక్కా నిర్మించిన ఈ సినిమా టీజర్లు, ట్రైలర్లు సోషల్ మీడియాలో క్రేజ్‌ను క్రియేట్ చేశాయి. హీరో నవీన్ పొలిశెట్టి‌ ఎవరా అంటూ ఆరా తీయడమే కాకుండా సినిమాపై భారీ అంచనాలు పెంచాయి. స్వరూప్ ఆర్ఎస్‌జే రూపొందించిన ఈ చిత్రం రిలీజ్‌కు ఏర్పడిన అంచనాలను అందుకొందా? టాలెంటెడ్ యాక్టర్ అని ప్రశంసలందుకొంటున్న నవీన్ పొలిశెట్టి ఏ మేరకు మెప్పించాడనే విషయాన్ని తెలుసుకోవాలంటే ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమా కథలోకి వెళ్లాల్సిందే.

    ఏజెంట్ సాయి స్టోరీ

    ఏజెంట్ సాయి స్టోరీ

    డిటెక్టివ్‌గా పేరు సంపాదించాలన్న లక్ష్యంతో సాయి శ్రీనివాస ఆత్రేయ (నవీన్ పొలిశెట్టి) నెల్లూరులో ఎఫ్‌బీఐ (ఫాతీమా బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్) బ్రాంచీని తెరుస్తాడు. ఆత్రేయకు అసిస్టెంట్‌గా స్నేహ (శృతిశర్మ) చేరుతుంది. వీరిద్దరూ కలిసి చిన్న చితకా కేసులను పరిశోధిస్తుంటారు. ఈ క్రమంలో నెల్లూరు రైల్వేట్రాక్ పక్కన అనుమానాస్పద శవం ఉందనే సమాచారం తెలుసుకొని అక్కడికి వెళ్తాడు. ఆ వ్యవహారంలో అనుమానితుడిగా ఆత్రేయను అరెస్ట్ చేస్తారు. మర్డర్ కేసు నుంచి బెయిల్‌పై బయటకు వచ్చిన ఆత్రేయపై మరో మర్డర్ కేసులో ఇరుక్కొంటాడు. ఇలా పరిశోధన జరుగుతుండగా వసుధ అనే మహిళ కేసులో కీలకంగా మారుతుంది. అనాథ శవాల విషయం కథను మలుపు తిప్పుతుంది.

     ఏజెంట్ సాయి.. ట్విస్టులు

    ఏజెంట్ సాయి.. ట్విస్టులు

    ఇలా రెండు మర్డర్ కేసుల్లో ఇరుక్కుపోయిన ఆత్రేయ వాటి గుట్టు విప్పడానికి ఎలాంటి పరిశోధన చేశాడు. మర్డర్ కేసులకు ఆత్రేయకు ఉన్న సంబంధమేమిటి? కథలో వసుధ క్యారెక్టర్‌ కీలకంగా మారడానికి కారణమేమిటి? గోపాలం అనే వ్యక్తి కథను మలుపు తిప్పాడు? మర్డర్ కేసుల నుంచి ఆత్రేయ ఎలా బయటపడ్డాడు? అసలు ఈ కథలో అనాథ శవాల అంశం ఎలా ట్విస్టు చేసింది అనే ప్రశ్నలకు సమాధానమే ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ.

     ఫస్టాఫ్‌ అనాలిసిస్

    ఫస్టాఫ్‌ అనాలిసిస్

    ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ చిత్రం ఎమోషనల్ పాయింట్‌తో నేరుగా కథలోకి వెళ్తుంది. డిటెక్టివ్ ఆత్రేయ పాత్ర చుట్టు అల్లిన సున్నితమైన కామెడీ అలా సాగిపోతుంటుంది. తొలి మర్డర్ కేసుతో కథలో కొంత సీరియస్ నెస్ రావడం సినిమాపై ఇంట్రెస్ట్ పెరుగుతుంది. ఇంకా రెండో మర్డర్ కేసు కథను మరి కాస్త ముందుకు తీసుకెళ్తుంది. కొన్ని సన్నివేశాలు సాగదీతగా ఉన్నప్పటికీ.. నవీన్ పొలిశెట్టి తన ఫెర్ఫార్మెన్స్‌తో ఆ లోటును భర్తీ చేయడం తొలి భాగానికి సానుకూలంగా అనిపిస్తుంది. ఫస్టాఫ్ మొత్తాన్ని నవీన్ వన్ మ్యాన్ షోగా ముందుకు తీసుకు వెళ్లాడని చెప్పవచ్చు

     సెకండాఫ్ అనాలిసిస్

    సెకండాఫ్ అనాలిసిస్

    ఇక సెకండాఫ్‌కు వస్తే, మర్డరీ మిస్టరీ, శవాల ఎపిసోడ్స్ కొంత అసహనానికి గురిచేస్తుంది. మర్డర్ గుట్టు తేల్చడానికి తీసుకొన్న సమయం మరీ సాగదీతగా అనిపిస్తుంది. సెకండాఫ్‌లో అనాథ శవాల గోల ఎక్కువై తల్లి సెంటిమెంట్‌ను నీరుగార్చిందనే ఫీలింగ్ కలుగుతుంది. ఇక నిడివి బాగా పెరిగిపోవడం రెండో భాగానికి మరో మైనస్. రెండో భాగంలో నిడివి తగ్గినట్లయితే ఎమోషన్స్ బాగా వర్కవుట్ అయ్యే అవకాశం ఉండేది. భావోద్వేగమైన కథను సాగదీత అంశం దెబ్బ తీసిందనే ఫీలింగ్ కలుగుతుంది.

    నవీన్ పొలిశెట్టి ఫెర్ఫార్మెన్స్

    నవీన్ పొలిశెట్టి ఫెర్ఫార్మెన్స్

    లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్, 1 నేనొక్కడే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు నవీన్ పొలిశెట్టి సుపరిచితుడు. కాకపోతే బాలీవుడ్‌కు ఎక్కువ కనెక్ట్ కావడం, ముంబైలో ఏఐబీ (ఆల్ ఇండియా బక్‌చోద్) కార్యక్రమాలతో విశేష ప్రజాదరణ పొందడమే కాకుండా టాలెంటెడ్ నటుడిగా గుర్తింపు పొందాడు. తాజాగా ఈ చిత్రంతో ఏజెంట్ అవతారం ఎత్తి మరోసారి ఆత్రేయగా ఆకట్టుకొన్నాడు. సున్నితమైన హాస్యాన్ని, భావోద్వేగమైన సన్నివేశాలను బాగా పండించాడు. డైలాగ్ డెలివరీలో కూడా సత్తా చాటుకొన్నాడు.

    హీరోయిన్ టాలెంట్ గురించి

    హీరోయిన్ టాలెంట్ గురించి

    స్నేహగా శృతిశర్మ ఫర్వాలేదనిపించింది. కథలో సపోర్టింగ్ క్యారెక్టర్‌గా కనిపిస్తుంది. కాబట్టి నటనకు, గ్లామర్ పరంగా రాణించడానికి స్కోప్ లేకపోయింది. నవీన్ జోరు ముందు పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఇక ఈ సినిమాలో మిగితా క్యారెక్టర్లు అంతగా పండలేదని చెప్పవచ్చు. సినిమాలో పెద్దగా పేరు లేని నటులు ఉండటం పాత్రలు ఎలివేట్ కాలేకపోయాయనే ఫీలింగ్ కలుగుతుంది.

     టెక్నికల్‌ అంశాలు

    టెక్నికల్‌ అంశాలు

    ఇక టెక్నికల్‌గా, మార్క్ కే రాబిన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోరు సినిమాకు ప్లస్ అనిచెప్పవచ్చు. ఈ సినిమాకు ప్రధానమై లోపం ఎడిటింగ్. సినిమా నిడివి పెరిగిపోవడం కథను బలహీన పరిచింది. కొన్ని సన్నివేశాలను, రిపీట్‌గా వచ్చే సీన్లపై కత్తెర వేస్తే సినిమాలో వేగం పెరిగే అవకాశం ఉంది. సినిమాటోగ్రఫి బాగుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. నటీనటుల ఎంపిక ప్రధానమైన లోపమని చెప్పవచ్చు.

     ఫైనల్‌గా

    ఫైనల్‌గా

    డిటెక్టివ్ పాత్రలు, మర్డర్ మిస్టరీ, నేర పరిశోధన లాంటి అంశాలతో కథను ఆసక్తికరంగా చెప్పడం కత్తిమీద సామే. ఈ విషయంలో ఎజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ కొంత మెరుగ్గానే కనిపిస్తుంది. కాకపోతే ఆసక్తికరంగా కథనం లేకపోవడం, నిడివి పెరిగిపోవడం సినిమాకు మైనస్‌గా మారాయి. ముఖ్యంగా సెకండాఫ్ ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టేలా ఉందనే అభిప్రాయం కలుగుతుంది. బీ, సీ సెంటర్లలో ఈ సినిమాకు ఆదరణ దక్కితే కమర్షియల్‌గా ఈ సినిమా సక్సెస్ సాధించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

     పాజిటివ్ పాయింట్స్

    పాజిటివ్ పాయింట్స్

    నవీన్ పొలిశెట్టి
    మ్యూజిక్
    సినిమాటోగ్రఫి

    మైనస్ పాయింట్స్
    కథనం
    నిడివి
    నటీనటులు ఎంపిక

    తెర ముందు, తెర వెనుక

    తెర ముందు, తెర వెనుక

    నటీనటులు: నవీన్ పొలిశెట్టి, శ్రుతి శర్మ, సుహాస్
    డైరెక్టర్: స్వరూప్ ఆర్ఎస్‌జే
    నిర్మాత: రాహుల్ యాదవ్ నక్క
    మ్యూజిక్: మార్క్ కే రాబిన్
    సినిమాటోగ్రాఫర్: సన్ని కురపాటి
    ఎడిటర్: అమిత్ త్రిపాఠి
    రిలీజ్: 2019-06-21

    Read more about: review
    English summary
    Agent Sai Srinivasa Athreya is an authentic humorous investigative thriller revolving around the adventures of a detective based out of Nellore. This movie is released on June 21st. In this occassion, Telugu filmibeat brings exclusive review.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X