For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Aha Na Pelanta review ఫీల్‌గుడ్, పక్కా ఫ్యామిలీ వెబ్ సిరీస్.. రాజ్ తరుణ్, శివానీ సరికొత్తగా..!

  |

  Rating: 3/5

  నటీనటులు: రాజ్ తరుణ్, శివానీ రాజశేఖర్, ఆమని, పోసాని కృష్ణ మురళీ, వడ్లమాని శ్రీనివాస్, రఘు, మధు నందన్, దీపాళి శర్మ, తాగుబోతు రమేష్, గెటప్ శ్రీను తదితరులు
  దర్శకత్వం: సంజీవ్ రెడ్డి
  నిర్మాత: సూర్య రాహుల్ తమడ, సాయిదీప్ రెడ్డి బొర్ర
  ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: శ్రీహర్ష బసవ
  స్టోరి, స్క్రీన్ ప్లే: షేక్ దావూద్ జీ
  డీవోపీ: నాగే బానెల్లి, ఆష్కర్ ఆలీ
  మ్యూజిక్ డైరెక్టర్: జుదా శాండీ,
  బ్యాక్ గ్రౌండ్ స్కోర్: పవన్
  ఎడిటర్: మధు రెడ్డి
  డైలాగ్స్: కల్యాణ్ రాఘవ్
  ఓటీటీ రిలీజ్: 2022-11-17

  Aha Na Pelanta Web Series review

  ఓటీటీ రిలీజ్: జీ5శ్రీను (రాజ్ తరుణ్) బాల్యంలో జరిగిన ఓ సంఘటన కారణంగా ఏ అమ్మాయి వెంటపడకూడదు.. ఎవరినీ ప్రేమించ కూడదని తల్లిదండ్రులు సుశీల (ఆమని), నో బాల్ నారాయణ (హర్షవర్ధన్) ఒట్టు వేయించుకొంటారు. యుక్త వయసుకు వచ్చిన శ్రీనుకు పెళ్లి కుదరుతుంది. కానీ పెళ్లికి కొద్ది గంటల ముందు పెళ్లికూతురు లేచిపోతుంది. పెళ్లి ఆగిపోవడంతో ఉద్యోగం కోసం హైదరాబాద్ వెళ్తాడు. అయితే శ్రీనుకు తాను పెళ్లి చేసుకోవాలనుకొన్న అమ్మాయి తండ్రి మహేంద్ర (పోసాని కృష్ణ మురళీ) కలుస్తాడు. తన కూతురు లేచిపోయి నీ పెళ్లి ఆగిపోవడానికి కారణం మహా (శివానీ రాజశేఖర్) అని శ్రీనుకు మహేంద్ర తెలియజేస్తాడు. పెళ్లి ఆగిపోవడం వల్ల అనుభవించిన మానసిక క్షోభకు ఫలితంగా మహాను కిడ్నాప్ చేయాలని శ్రీను, మహేంద్ర ప్లాన్ వేస్తారు.

  శ్రీను బాల్యంలో జరిగిన సంఘటన ఏమిటి? శ్రీను చేత తల్లిదండ్రులు ఎందుకు ఒట్టు వేయించుకొన్నారు? పెళ్లి ఆగిపోయిన తర్వాత శ్రీను పరిస్థితి ఏమిటి? మహాను కిడ్నాప్ చేసిన తర్వాత ఎలాంటి సంఘటనలు చోటు చేసుకొన్నాయి. శ్రీను పెళ్లి జరిగిందా? శ్రీను జీవితాన్ని మహా ఎలా మలుపుతిప్పింది? చివరకు శ్రీను, మహా ప్రేమకు ముగింపు ఎలా దొరికింది అనే ప్రశ్నలకు సమాధానమే అహ నా పెళ్లంట సినిమా కథ.

  అహ నా పెళ్లంట మూవీ కథ కొత్తది కాకపోయినా.. దర్శకుడు సంజీవ్ రెడ్డి రాసుకొన్న స్క్రిప్టు, స్క్రీన్ ప్లే సినిమాకు ఫీల్‌గుడ్‌గా మారాయి. ఇక రాజ్ తరుణ్, శివానీ, ఇతర నటీనటులు పాత్రలను అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకొనేలా తీర్చి దిద్దారు. కిడ్నాప్ డ్రామాను, సెకండాఫ్‌లో కథలోని ట్విస్టులను రివీల్ చేసిన విధానం చాలా బాగుంది. ఇక క్లైమాక్స్‌లో కథలో ఊహించిన ట్విస్టు ఇచ్చి.. సినిమా ముగించిన తీరు సంజీవ్ రెడ్డి ప్రతిభకు అద్దంపట్టింది.

  Aha Na Pelanta Web Series review

  ఇక శ్రీనుగా రాజ్ తరుణ్ నటన సరికొత్తగా ఉంది. ఆ పాత్ర ద్వారా చూపించిన హావభావాలు, బాడీ లాగ్వేజ్ చాలా బాగుంది. ఇంతకు ముందు ఎప్పుడూ చూడని రాజ్ తరుణ్ కనిపిస్తాడు. నటనపరంగా మెచ్యురిటీ ఆకట్టుకొంటుంది. సినిమాలో మొదటి ఫ్రేమ్ నుంచి చివరి ఫ్రేమ్ వరకు వైవిధ్యమైన నటనను చూపించే ప్రయత్నం చేశాడు. ఇక శివానీ రాజశేఖర్ కూడా రాజ్ తరుణ్‌తో కలిసి ధీటుగా నటించింది. ఎమోషనల్ పాత్రలో ఒదిగిపోయిందనే చెప్పాలి. ఫెర్ఫార్మెన్స్ పరంగా శివానీ అద్బుతంగా కనిపించింది. గ్లామర్, యాక్టింగ్‌ను కలిపి.. మహాగా ప్రేక్షకులను ఆకట్టుకొనే ప్రయత్నం చేశారు.

  మిగితా పాత్రల్లో నో బాల్ నారాయణగా హర్షవర్ధన్, సుశీలగా ఆమని తమదైన శైలిలో ఆకట్టుకొన్నారు. వండ్లమాని శ్రీనివాస్, తాగుబోతు రమేష్, పేరయ్యగా భద్రం, దాస్‌గా రవి శివ తేజ, బాలాగా త్రిశూల్ హాస్యం బాగుంది. రాజ్ తరుణ్ స్నేహితులుగా నటించిన రవి శివ తేజ, త్రిశూల్ విభిన్నమైన హాస్యంతో సినిమాను వినోదభరితంగా మార్చారు. మిగితా పాత్రల్లో కనిపించిన వారు తమ పరిధి మేరకు న్యాయం చేశారు.

  సాంకేతిక విభాగాల పనితీరు విషయానికి వస్తే.. కల్యాణ్ రాఘవ్ రాసిన డైలాగ్స్ చాలా బాగున్నాయి. ఈ సినిమాకు డైలాగ్స్ ఒక ప్లస్ పాయింట్. ఇక నాగేశ్ బాన్నెల్, అక్షర్ అలీ అందించిన సినిమాటోగ్రఫి ప్రతీ ఫ్రేమ్‌ను కలర్‌ఫుల్‌గా మార్చింది. ఈ సినిమా కోసం వాడిన కలర్ ప్యాలెట్ మంచి ఫీల్‌ను కలిగించేలా ఉంది. జుడా శాండీ, పవన్ అందించిన మ్యూజిక్ మరో అదనపు ఆకర్షణ. మధు రెడ్డి ఎడిటింగ్, ఇతర విభాగాల పనితీరు మెప్పించేలా ఉంది. తమడా సూర్య రాహుల్, సాయిదీప్ రెడ్డి బొర్రా పాటించిన నిర్మాణ విలువలు హై స్టాండర్డ్‌లో ఉన్నాయి. పాత్రలకు ఎంచుకొన్న నటీనటులను చూస్తే.. సినిమాపై వారికి ఉన్న అభిరుచి ఏమిటో తెలుస్తుంది.

  లవ్, ఫ్యామిలీ వ్యాల్యూస్, ఎమోషన్స్, నటీనటుల ఫెర్ఫార్మెన్స్ లాంటి అంశాలు కలబోసిన వెబ్ సిరీస్ అహ నా పెళ్లంట. కథ, కథనాల పరంగా సాగదీసినట్టు.. కొన్ని చిన్న చిన్న లోపాలు ఉన్నప్పటికీ.. కథలో ఫీల్ గుడ్ అంశాలు, ఎమోషన్స్ వాటిని కప్పిపుచ్చాయని చెప్పవచ్చు. ఎలాంటి అసభ్యత, అశ్లీల కనిపించని పక్కా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అహ నా పెళ్లంట. జీ5లో అందుబాటులో ఉంది... కాబట్టి.. తీరిక వేళలో సకుటుంబంగా ఈ వెబ్ సిరీస్‌ను చూడొచ్చు. మీకు తప్పకుండా మంచి అనుభూతిని అందిస్తుందని చెప్పవచ్చు.

  English summary
  Raj Tarun's Aha Na Pellanta Web series released on 17th November on Zee5. In this occassion, Telugu filmibeat brings exclusive review.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X