Aham Reboot Movie Review: అహం రీబ్యూట్ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
మూవీ: అహం రీబూట్
తారాగణం: సుమంత్
దర్శకుడు: ప్రశాంత్ సాగర్ అట్లూరి.
నిర్మాతలు: రఘువీర్ గొరిపర్తి
ఒటిటి ప్లాట్ ఫామ్: ఆహ
రిలీజ్ డేట్: 2024-06-30
స్టోరీ:
నిలై(సుమంత్) హైదరాబాద్ లో ఒక ఆర్జే(రేడియో జాకీ) గా పని చేస్తూ ఉంటాడు. అయితే తనకి గతంలో ఒక దారుణామైన ఇన్సిడెంట్ జరగడం మూలాన తాను అందుకు కుంగిపోతూ దాని నుంచి ఎలా అయినా బయటపడాలి అని డ్రగ్స్ బాట పడతాడు. కానీ ఈ నిర్ణయంతో తాను మరింత ఇబ్బందుల్లో కూరుకుపోయాడు. ఇలా ఆ చిక్కులు ఎదుర్కొంటూనే ఆర్జే గా తన పని తాను చేసుకుంటూ ఉంటాడు. అయితే ఇలా తన పనిలో ఉండగా ఓ రోజు ఒక అనానమస్(అనుమానాస్పద) కాల్ తన రేడియో స్టేషన్ కి ఒకమ్మాయి నుంచి వస్తుంది. ఆమెని ఎవరి కిడ్నాప్ చేశారు అంటూ చీకటి గదిలో ఉన్నాను ఏమి తెలియట్లేదు మా నాన్నకి కాల్ చేస్తే మీకు కలిసింది దయచేసి కాల్ కట్ చెయ్యొద్దు అంటూ ప్రాధేయపడుతుంది. కానీ మొదట్లో ఈ మాటలకి కరగని నిలై తర్వాత నమ్ముతాడు. అక్కడ నుంచి వారి కాల్ సీరియస్ గా మారి పోలీసులు, సైబర్ క్రైమ్ అంటూ ఆమెని రెస్క్యూ చేసే ఆపరేషన్ మొదలవుతుంది. మరి ఆమెని పోలీసులు కాపాడుతారా? ఆమె కాల్ వెనుక ఏమన్నా కోణం ఉందా? అసలు నిలై కి పాస్ట్ లో ఏం జరిగింది అనే వాటికి సమాధానం దొరకాలి అంటే ఆహ లో ఈ సినిమా అందుబాటులో ఉంది అందులో చూసి తెలుసుకోవాలి.

విశ్లేషణ:
టాలీవుడ్ లో మంచి గుర్తింపు ఉన్న హీరో సుమంత్ కెరీర్ ని మధ్యలో బ్రేక్ ఇచ్చి ఇప్పుడిప్పుడే మళ్ళీ టాలీవుడ్ లో బిజీగా మారుతున్నాడు. కేవలం హీరోగానే కాకుండా పలు ముఖ్య పాత్రలు కూడా చేస్తున్న తనకి ఈ సినిమా కూడా ఒక ముఖ్య పాత్రని అందించింది అని చెప్పవచ్చు. అలాగే తన పాత్ర డిజైన్ కూడా బాగానే ఉంది. ఇలాంటి థ్రిల్లర్ సినిమాలు మనం చాలానే చూసాం కానీ ఆ థ్రిల్లర్ లో మెయిన్ థీమ్ పాయింట్ ఏంటి అనేది కూడా ఆ సినిమాకి కీలకంగా మారుతుంది.
అలా ఈ సినిమాలో మెయిన్ పాయింట్ ఏదన్నా ఉంది అంటే కేవలం ఈ సినిమా అంతా ఒక్క నటుడు మీదనే కొనసాగుతుంది. కేవలం ఒక్క మనిషినే చూపిస్తూ కాల్స్ తో మాత్రమే ఒక థ్రిల్లర్ ని డిజైన్ చేయడం బాగుటుంది. కానీ ఈ క్రమంలో చూపించిన సీన్స్ మాత్రం మనకి ఆల్రెడీ పలు థ్రిల్లర్స్ లో చూసినట్టే అనిపిస్తుంది. అలాగే చాలా సేపు వరకు సినిమా చాలా డల్ గా చికాకుగా కొనసాగుతుంది.
వీటితో పాటుగా సినిమాలో అంత హై మూమెంట్స్ కానీ కామెడీ ఎలిమెంట్స్ కూడా ఏమి లేవు. మొత్తం అంతా ఒక సీరియస్ టోన్ లోనే కొనసాగుతుంది. అలాగే ఈ థీమ్ లో కొంచెం గమనిస్తే మహేష్ బాబు 'స్పైడర్' కూడా గుర్తు రాక మానదు. కాకపోతే ఇక్కడ కాల్స్ తో యాక్సిడెంటల్ గా కాపాడాల్సి వస్తే అక్కడ మహేష్ పాత్ర వాంటెడ్ గా కాపాడుతుంది. దీనితో ఈ సిమిలారిటీ కనిపిస్తుంది. అలాగే సినిమా చివరి 10 నిమిషాలు అలా ఓకే అనిపిస్తాయి. ఇచ్చిన డీసెంట్ ముగింపు కూడా బాగానే ఉంది.

నటీనటుల పెర్ఫామెన్స్ లు ఎలా ఉన్నాయ్?
ఈ సినిమాలో నటీనటులు ఎవరు లేరు ఒక్క సుమంత్ తప్ప. సినిమా మొదలైన మొదటి నిమిషం నుంచి సుమన్ ఒక్కడే కనిపిస్తాడు. కేవలం తనతో ఆర్ జె హేమంత్ మిగతా పాత్రలు అంతా కాల్స్ లో కమ్యూనికేట్ అవుతాయి. సో వారు ఎక్కడా కూడా కనిపించరు. సో సుమన్ ఒక్కడి కోసం మాట్లాడుకోవాల్సి వస్తే. ఈ సినిమాకి తనకి డిజైన్ చేసిన లుక్ బాగోలేదు కానీ సుమంత్ మాత్రం తన పెర్ఫామెన్స్ తో కిల్ చేసాడు.
స్టార్టింగ్ మినిట్ నుంచే ఆందోళన, కంగారు, బాధ ఇలా అన్ని ఎమోషన్స్ ని కూడా తాను చక్కగా పండించి సినిమా మొత్తానికి వన్ మ్యాన్ షో గా నిలిచాడు అని చెప్పాలి. అలాగే క్లైమాక్స్ లో కూడా ఒక గిల్ట్ నుంచి బయటకి వచ్చాక ఒక మనిషిలో ఎంత ఆనందం కనిపిస్తుందో ఆ ఎమోషన్స్ తన పెర్ఫామెన్స్ తో తన ఎక్స్ పీరియన్స్ తో చూపించాడు.
టెక్నికల్ గా ఎలా ఉంది?
ఈ సినిమాని అనుకొనే చాలా చిన్న సినిమాగా ప్లాన్ చేసినట్టు ఉన్నారు. సినిమా సుమారు గంటన్నర రెండు గంటల లోపే ఉంది. ఈ విషయానికి టీం ని ప్రైస్ చెయ్యొచ్చు. ఎక్కడా అనవసర సన్నివేశాలు పెట్టి లాగకుండా దర్శకుడు తన పని తాను చేసుకుంటూ వెళ్ళాడు కానీ ఈ థ్రిల్లర్ ఏమి అంత గొప్పగా ఉండదు. కేవలం పాయింట్ ఒక్కటే బాగుంది కానీ ఇంకా ఎంగేజింగ్ గా బెటర్ స్క్రీన్ ప్లే ని డిజైన్ చేయాల్సింది.

ఆ డబ్బింగ్ అయితే కొన్ని పాత్రలకి ఓవర్ డ్రమాటిక్ గా అనిపిస్తాయి. ఇక సినిమాలో వరుణ్ అంకరాల ఇచ్చిన కెమెరా వర్క్ బాగుంది. ఒక్క నైట్ లోనే సినిమా అంతా కనిపిస్తుంది సో డార్క్ మోడ్ లో కొన్ని సీన్స్ లో తన వర్క్ మెప్పిస్తోంది. ఇక శ్రీరామ్ మద్దూరి సంగీతం ఓకే పర్వాలేదు. ఇంకా ఇంట్రెస్టింగ్ అంశం ఈ సినిమాలో టైటిల్ కార్డ్స్ అండ్ ఎండింగ్ టైటిల్ కార్డ్స్ చాలా బాగున్నాయి. ఏదో హాలీవుడ్ సినిమాకి చేసిన రేంజ్ లో యూనిక్ గా కనిపిస్తాయి.
చివరి మాటగా
టాలీవుడ్ నటుడు సుమన్ నటించిన ఈ 'అహం రీబూట్' నేరుగా ఓటిటి ప్లాట్ ఫామ్ లోకి వచ్చింది. అయితే ఓ డిఫరెంట్ థ్రిల్లర్ గా దీనిని దర్శకుడు తెరకెక్కించే ప్రయత్నం చేసాడు. ఇందులో సుమంత్ మాత్రం వన్ మ్యాన్ షో చేసాడు. తన మీదే సినిమా అంతా కనిపిస్తుంది సో ఈ థ్రిల్లర్ కి కావాల్సిన మొత్తం తాను అందించాడు. కానీ సినిమా లైన్ కొన్ని నిమిషాల ఇన్వెస్టిగేషన్ ఎపిసోడ్స్ బాగుంటాయి కానీ పూర్తి స్థాయిలో ఎంగేజింగ్ గా ఈ సినిమా అనిపించదు. బాగా ఖాళీగా ఉండి చాలా రోటీన్ గా ఉండే థ్రిల్లర్ ని చూడాలి అనుకునే వారికి తప్ప ఈ సినిమా ఏమంత గొప్పగా అనిపించకపోవచ్చు. సో ఓటిటిలో ఈ చిత్రంని ట్రై చేయాలి అనుకునేవారు చాలా తక్కువ అంచనాలు పెట్టుకుని ట్రై చేస్తే బెటర్


Click it and Unblock the Notifications











