Ahimsa Review ప్రేక్షకులకు చిత్ర హింస.. బాబోయ్ అభిరామ్ దగ్గుబాటి అహింస!

Rating:
2.0/5

నటీనటులు: అభిరామ్ దగ్గుబాటి, గీతికా తివారీ, సదా, రజత్ బేడీ, కమల్ కామరాజు, దేవీ ప్రసాద్, రవి కాలే తదితరులు
దర్శకత్వం: తేజ
నిర్మాత: జెమినీ కిరణ్
సంగీతం: ఆర్పీ పట్నాయక్
సాహిత్యం: చంద్రబోస్
డైలాగ్స్: అనిల్ అచుగట్ల
ఆర్ట్: సుప్రియ
సినిమాటోగ్రఫి: సమీర్ రెడ్డి
ఫైట్స్: రియల్ సతీష్
ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు
బ్యానర్: ఆనంది ఆర్ట్స్ క్రియేషన్స్
రిలీజ్ డేట్: 2023-06-02

రఘు (అభిరామ్ దగ్గుబాటి), అహల్య (గీతిక తివారీ) బావ మరదల్లు. అహల్య అంటే రఘుకు ప్రాణం, బావ రఘు అంటే అహల్యకు చెప్పలేనంత ఇష్టం. స్వతహాగా రఘు హింసకు దూరంగా ఉండే వ్యక్తి. తన జీవితంగా భావించే మరదలు గీతికపై బిజినెస్ మ్యాన్ ధనలక్ష్మి దుష్యంత్ రావు (రజత్ బేడీ) కుమారులు మానభంగానికి పాల్పడుతారు. చావు బతుకుల్లో ఉన్న మరదల్ని బతికించేందుకు రఘు ఓ వైపు ప్రయత్నిస్తుండగా.. మరో వైపు తన కుమారులను రక్షించుకోవడానికి దుష్యంత్ రావు కుట్రలు పన్నుతుంటాడు. కోర్టులో సాక్ష్యం చెప్పకుండా గీతిక, రఘు కుటుంబాలపై దుష్యంత్ దాడులకు దిగుతాడు.

 Ahimsa telugu film Review and Rating: Teja, Abhiram  Daggubati fails to impress with revange drama

మరదలు మానభంగానికి గురైన నేపథ్యంలో రఘు రియాక్షన్ ఏంటి? అహల్యను రక్షించుకునేందుకు రఘు ఏం చేశాడు? తన మరదలిపై అఘాయిత్యానికి పాల్పడిన ఇద్దరు యువకులకు శిక్ష పడేందుకు రఘు ఏ విధంగా ప్రయత్నించాడు. అహల్య రేప్ కేసును లాయర్ లక్ష్మీ (సదా) న్యాయపోరాటం ఫలించిందా? తన కుమారులకు శిక్ష పడేందుకు ప్రయత్నిస్తున్న రఘును అడ్డుకొనేందుకు దుష్యంత్ రావు ఎలాంటి దుష్టపన్నాగాలను పన్నాడు? చివరకు అహల్యపై లైంగిక దాడికి పాల్పడిన నిందితులు, దుష్యంత్ రావుపై రఘు ఎలా ప్రతీకారం తీర్చుకొన్నాడు? ఏ పరిస్థితుల్లో అహింసావాది రఘు హింసను ఆయుధంగా చేసుకొన్నాడు అనే ప్రశ్నలకు సమాధానమే అహింస సినిమా కథ.

అహింస టీజర్, ట్రైలర్లు, ప్రమోషనల్ కంటెంట్ ఫాలో అయ్యేవారికి ఈ సినిమా కథ, కథనాలు, బలాబలాలు ఏంటో ముందే ఊహించడం పెద్దకష్టం కాదు. రెగ్యులర్, రొటీన్ రివేంజ్ డ్రామా అనేది చెప్పడానికి గొప్ప టాలెంట్ అవసరం లేదనిపిస్తుంది. అయితే రెగ్యులర్, రొటీన్ కథతో ఓ కొత్త హీరోను లాంచ్ చేయడానికి అహింసను దర్శకుడు తేజ ఎలా తీశాడు అనేది ఆసక్తికరంగా మారడమే కాకుండా థియేటర్‌కు రప్పించే అంశంగా మారింది. అయితే కథను చాలా పాతరకం స్క్రీన్ ప్లేతో ఎలాంటి ఉత్సాహం, ఆసక్తి లేకుండా తొలి ఫ్రేమ్ నుంచే నిరాసక్తతతో మొదలవుతుంది. అయితే దర్శకుడు లైంగిక దాడి గురైన బాధితురాలి చుట్టూ జరిగే డ్రామాతో ఎలాంటి కొత్తదనం లేకుండా కథను తేజ నడిపించారని చెప్పవచ్చు.

 Ahimsa telugu film Review and Rating: Teja, Abhiram  Daggubati fails to impress with revange drama

ఆసక్తికరంగా లేని కథ, కథనాలతో సాగే అహింసలో కోర్టు డ్రామా ఓ ప్రహసనంలా కనిపిస్తుంది. రకరకాల విన్యాసాలతో తన శక్తి మించిన భారాన్ని అభిరామ్‌తో మోయిస్తూ తొలి భాగం ముగిసిందనిపించేలా తేజ తన పని కానిచ్చాడు. సెకండాఫ్‌లోనైనా ఏదైనా కొత్తగా డీల్ చేస్తాడా? అని ఎదురు చూసిన ప్రేక్షకులకు మరోసారి జయం సినిమాను చూపించే ప్రయత్నం చేశాడు? దాంతో పరమ రొటీన్ సినిమాను చూశామనే ఫీలింగ్ కలుగుతుంది.

నటీనటుల పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే.. అభిరామ్ నటుడు అనిపించుకోవాలంటే.. ఇంకా చాలా చాలా నేర్చుకోవాల్సింది ఉందనే ఫీలింగ్ కలుగుతుంది. నటనలో అభిరామ్‌కు ఓనమాలు తెలియదనే విషయం ఆయన బాడీ లాంగ్వేజ్, హావభావాలు, డైలాగ్ డెలీవరి చూస్తే తెలిసిపోతుంది. అహల్య హాస్పిటల్ బెడ్‌పై మృత్యువుతో పోరాటం చేస్తుంటే.. చుట్టూ బిహేవ్ చేసే పాత్రలు కూడా బలంగా లేకపోయాయి. గీతిక కూడా అంతంత మాత్రంగానే ఆకట్టుకొన్నదని చెప్పవచ్చు.

 Ahimsa telugu film Review and Rating: Teja, Abhiram  Daggubati fails to impress with revange drama

మిగితా పాత్రల విషయానికి వస్తే.. సదా క్యారెక్టర్ పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. విలన్ రజత్ బేడీ అరుపులు తప్ప.. పెర్ఫార్మెన్స్‌కు స్కోప్ లేకపోయింది. రవి కాలే, దేవీ ప్రసాద్, ఇతర క్యారెక్టర్లు కూడా గొప్పగా పండలేదు. ఈ సినిమాలో చాలా పాత్రలు ఉన్నమాటే గానీ.. ఏ ఒక్క పాత్ర కూడా గుర్తుంచుకొనేలా లేకపోవడం ప్రధానమైన లోపంగా చెప్పుకోవచ్చు.

సాంకేతిక విభాగాల పనితీరు విషయానికి వస్తే.. రీ ఎంట్రీతో ఆర్పీ పట్నాయక్ మరోసారి తన ప్రతిభతో ఆకట్టుకొన్నాడు. పేలవమైన సన్నివేశాలను కూడా తన బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌తో అనూప్ ఎలివేట్ చేయడంలో నూటికి నూరు శాతం సక్సెస్ అయ్యాడు. ఆర్పీ రూపొందించిన పాటలు బాగున్నాయి. ముఖ్యంగా ఈ సినిమా షూట్ చేసిన లోకేషన్స్ చాలా అద్బుతంగా ఉన్నాయి. సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫి బాగుంది. ఎడిటింగ్‌కు ఇంకా స్కోప్ ఉంది. సినిమా కథలో బలం లేకపోవడం వల్ల నిడివి చాలా ఎక్కువ అనే ఫీలింగ్ కలిగింది. ప్రొడక్షన్ వ్యాల్యూస్ బాగున్నాయి.

 Ahimsa telugu film Review and Rating: Teja, Abhiram  Daggubati fails to impress with revange drama

దర్శకుడు తేజ మేకింగ్ స్టయిల్‌తో రెగ్యులర్, రొటీన్ రివేంజ్ డ్రామా అహింస. కామెడీ సన్నివేశాలు చాలా నాసిరకంగా ఉంటే.. కథలో పండాల్సిన ఎమోషన్స్ ఎక్కడా కూడా పండినట్టు కనిపించలేదు. కొత్త హీరో, హీరోయిన్లు భారమైన కథను మోయడానికి చాలా ఇబ్బంది పడ్డారనిపిస్తుంది. ప్రేక్షకులు కొత్తదనం కోసం ప్రయత్నిస్తున్న రోజుల్లో తేజ ఇంకా జయం సినిమా వద్దే ఆగిపోయాడా? అనే అభిప్రాయం అహింస కలిగిస్తుంది. సాధ్యమైనంత వరకు ఈ సినిమాకు దూరంగా ఉండటమే ఆరోగ్యానికి మంచిది. సినిమాలో హీరోయిన్ హాస్పిటల్ బెడ్‌పై ఉన్న ఫీలింగే థియేటర్‌లో ప్రేక్షకులకు సినిమా చూసినంత సేపు ఉంటుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X