For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Ammu Movie Review: చిత్రహింసలు పెట్టే భర్తను భార్య భరించాలా? 'అమ్ము'గా ఐశ్వర్య లక్ష్మీ ఆకట్టుకుందా?

  |

  రేటింగ్: 2.75/5

  టైటిల్: అమ్ము
  నటీనటులు: ఐశ్వర్య లక్ష్మీ, నవీన్ చంద్ర, బాబీ సింహా, రఘుబాబు, సత్య కృష్ణన్, ప్రేమ్ సాగర్ తదితరులు
  రచన-దర్శకత్వం: చారుకేష్ శేఖర్
  సంగీతం: భరత్ శంకర్
  సినిమాటోగ్రఫీ: అపూర్వ సాలిగ్రామ్
  క్రియేటివ్ ప్రొడ్యూసర్ కార్తీక్ సుబ్బరాజ్
  నిర్మాతలు కల్యాణ్ సుబ్రమణియన్, కార్తికేయన్
  ప్రొడక్షన్ హౌజ్: అమెజాన్ స్టూడియోస్
  విడుదల తేది: అక్టోబర్ 19, 2022
  ఓటీటీ: అమెజాన్ ప్రైమ్ వీడియో

  విభిన్నమైన కథలతో సినీ కేరీల్ లో ముందుకు సాగుతున్న నవీన్ చంద్ర, గాడ్సే మూవీతో తెలుగు తెరకు పరిచయమై, సాయి పల్లవి గార్గి చిత్రంతో ఆకట్టుకున్న ఐశ్వర్య లక్ష్మీ, పాపులర్ కోలీవుడ్ యాక్టర్ బాబీ సింహా ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం అమ్ము. ఇందులో భర్త పెట్టే చిత్రహింసలను ఎదుర్కొనే భార్య పాత్రలో ఐశ్వర్య లక్షీ నటించినట్లు ట్రైలర్ చూస్తే తెలుస్తుంది. అమెజాన్ స్టూడియోస్ ప్రొడక్షన్ లో డొమెస్టిక్ వయోలెన్స్ (గృహ హింస) నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీ నేరుగా ఓటీటీల అక్టోబర్ 19న ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలైంది. మరి ఈ చిత్రం ఎంతవరకు ఆకట్టుకుందో ఇవాళ్టి రివ్యూలో చూద్దాం!

  కథ:

  కథ:

  రవింద్రనాథ్ (నవీన్ చంద్ర) ఒక సీఐ. తన పొరుగుంటి అమ్మాయి అమ్ము.. అముధను (ఐశ్వర్య లక్ష్మీ) వివాహం చేసుకుని వేరే కాపురం పెడతారు. పెళ్లయిన మొదట్లో అంతా సవ్యంగా హ్యాపీగా సాగుతుంది వీరిద్దరి ప్రయాణం. కానీ కొన్ని రోజులకు రవిలో చాలా మార్పులు చూస్తుంది అమ్ము. చీటికిమాటికి అరవడం, కొట్టడం, తిట్టడం వంటి పనులు చేస్తాడు రవి. భర్త బాధను భరించలేక వెళ్లిపోదామని అనుకుని మళ్లీ వెనక్కి వెళుతుంది అమ్ము. చిత్రహింసలకు గురి చేసే భర్త దగ్గరికి మళ్లీ అమ్ము ఎందుకు వెళ్లింది? అతన్ని మార్చాలనుకుందా? లేదా గుణపాఠం చెప్పాలనుకుందా? అందుకోసం ఎవరెవరు సహాయం చేశారు ? అనేదే ఓ భార్య కథ 'అమ్ము'.

  విశ్లేషణ

  విశ్లేషణ

  ఈ గృహహింస నేపథ్యంలో ఇటీవల కాలంలో ఎక్కువగానే సినిమాలు వస్తున్నాయి. ఇదివరకు హిందీలో తాప్సీ తప్పడ్, అలియా భట్ డార్లింగ్స్ చిత్రాలు వచ్చి సందేశాత్మకమైన ముగింపును ఇచ్చాయి. అయితే తెలుగులో మాత్రం ఈ మధ్య కాలంలో వచ్చింది మాత్రం అమ్ము చిత్రమే. ఇలాంటి చిత్రాలు ఎన్ని వచ్చిన వారు ఉద్దేశం మాత్రం గృహహింస తప్పు, దాని నుంచి గృహినిలు ఎలా ఎదుర్కోవాలనేదే. అయితే ఈ సినిమాతో ఆ విషయాన్ని బాగానే చెప్పారు డైరెక్టర్ చారుకేష్ శేఖర్. భర్త అన్నాక భరించాలి, సర్దుకుపోవాలి వంటి విషయాలను ఎప్పటినుంచో వినిపిస్తున్న మాట. కానీ ఒక సగటు గృహిణి మాత్రం కోరుకునేది ఒక భర్త తన భార్యపై చేయి ఎత్తకూడదు, అలా ఎత్తితే అతనితో ఒక్క క్షణం కూడా ఉండకూడదు అని. కానీ అదంతా సులభం కాదు అనే విషయాన్ని ఎంతో చక్కగా చూపించారు దర్శకుడు చారుకేష్.

  ప్రతి గృహిణి చేయాలనే సందేశాన్ని

  ప్రతి గృహిణి చేయాలనే సందేశాన్ని

  తన భర్త ఏకారణం లేకుండా కొట్టాడని, ఇక అతనితో ఉండకూడదని వెళ్లిన అమ్ముకి మళ్లీ తనపైన ఆమె భర్తకు ప్రేమ ఉందని, దాన్ని అలాగే నిలుపుకోవాలనే ఉద్దేశంతో అతనిచెంతకే చేరుతుంది. భర్త నుంచి విడిపోడానికి ఆ భార్యకు ప్రేమ, భయం, బంధాన్ని కాపాడుకోవాలనే ఆలోచన వంటి తదితర విషయాలు అడ్డంకిగా మారతాయి. అలా ఓపిక పట్టిన భార్య.. భర్తకు గుణపాఠం చెప్పాలనుకోవడం, అతని గురించి అందరికి తెలియాలని చేసే ప్రయత్నం ధైర్యంగా ప్రతి గృహిణి చేయాలనే సందేశాన్ని ఇచ్చారు. అయితే అప్పుడే కొట్టడం, మళ్లీ ప్రేమ చూపించడం, మళ్లీ వెంటనే కొట్టడం వంటి భర్త పాత్రను ఇదివరకు డార్లింగ్స్ లో చూపించారు. అబ్యూస్ చేసే భర్తకు ఉండే సన్నివేశాలు అలాగే ఉంటాయి కాబట్టి, వాటిని తప్పుపట్టలేం. అయితే అమ్ము పాత్ర తీరు సగటు గృహిణిలా చాలా బాగా మలిచారు. సినిమాలో పెద్దగా లొకేషన్లు ఉండకపోయిన, సన్నివేశాలు, డైలాగ్స్ ఆకట్టుకుంటాయి. నిర్మాణ విలువలు అంతంతా మాత్రంగానే ఉన్నాయి. ఓటీటీకి అయితే బెస్ట్ ఆప్షన్.

  ఎవరెలా చేశారంటే

  ఎవరెలా చేశారంటే

  గృహిణి అమ్ము పాత్రలో ఐశ్వర్య లక్ష్మి జీవించిందనే చెప్పవచ్చు. భర్తకు భయపడటం, తనపై చేయిచేసుకోవడాన్ని సహించలేకపోవడం, కోపం, నిస్సాహాయత, బాధ అన్ని హావాభావాలను చాలా చక్కగా చూపించారు. ఇక భర్తగా, పోలీసుగా నవీన్ చంద్ర ఆకట్టుకున్నాడు. నెగెటివ్ పాత్ర నవీన్ చంద్రకు కొత్త కాదు. కానీ క్లైమాక్స్ సీన్లలో నవీన్ చంద్ర ఇచ్చే ఎక్స్ ప్రెషన్ హైలెట్ అయింది. ఇక బాబీ సింహా తన పరిధిమేర ఆకట్టుకున్నాడు. కానీ అతని పాత్రకు అంత ఎఫెక్టివ్ సీన్లు మాత్రం పడలేదు. బెగ్గర్ గా రఘుబాబు కనిపించేది రెండు సన్నివేశాలైన చాలా బాగా ఆకట్టుకుంటాయి. తప్పు అయిన రైట్ అయిన నీ నీర్ణయం నువ్వే తీసుకోవాలని అమ్మాయిలకు ఒక మెస్సేజ్ ను ఆయన పాత్ర ద్వారా ఇప్పించారు. సినిమా నేపథ్యం, సన్నివేశాలకు వచ్చే తగినట్లు పాటలు, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగా సెట్ అయ్యాయి.

  ఫైనల్ గా చెప్పాలంటే..

  ఫైనల్ గా చెప్పాలంటే..

  అమ్ము పాత్ర, సినిమా కథ కొత్తేం కాదు. ఇలాంటి అమ్ము పాత్రలు మనకు నిజ జీవితంలో చాలా సార్లు కనిపిస్తుంటాయి. భర్త, బంధాలతో నరకం అనుభవించే ఇలాంటి గృహిణీలు తమకు తాము వేసుకున్న అడ్డుగోడలు పగులగొట్టి ధైర్యంగా బయటకు స్వేచ్ఛగా రావాలని చెప్పే ప్రయత్నమే ఈ అమ్ము. కొన్నిలోటుపాట్లు ఉన్నప్పటికీ ఈ విషయాన్ని అర్థమయే విధంగా చూపించారు. నటీనటులు హావాభావాలు, ఎమోషన్స్ తో ఆకట్టుకున్న అమ్ము చిత్రాన్ని ప్రతి యువతి చూడాల్సిందే.

  English summary
  Aishwarya Lekshmi Naveen Chandra Bobby Simha Starrer Ammu Movie Review And Rating In Telugu.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X