Soppana Sundari Review: అదిరిపోయే కామెడీ ట్విస్టులతో తల్లీకూతుళ్ల కథ.. ఐశ్వర్య రాజేశ్ అలా!

రేటింగ్: 3/5

టైటిల్: స్వప్న సుందరి
నటీనటులు: ఐశ్వర్య రాజేశ్, లక్ష్మీ ప్రియ చంద్రమౌళి, దీపా శంకర్, కరుణాకరన్, మైమ్ గోపి, సతీష్ కృష్ణన్, సునీల్ రెడ్డి, షా రా, రెడిన్ కింగ్ స్లీ తదితరులు
సినిమాటోగ్రఫీ: బాలమురుగన్, విఘ్నేష్ రాజగోపాలన్
సంగీతం: అజ్మల్ తాసీన్ పాటలు, విశాల్ చంద్రశేఖర్ (బీజీఎం)
నిర్మాతలు: బాలాజీ సుబ్బు వివేక్, రవిచంద్రన్
కథ, దర్శకత్వం: జీఎస్ చార్లెస్
థియేటర్ విడుదల తేది: ఏప్రిల్ 14, 2023
ఓటీటీ విడుదల తేది: మే 12, 2023
ఓటీటీ వేదిక: డిస్నీ ప్లస్ హాట్‌స్టార్

'కౌసల్య కృష్ణమూర్తి' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన తమిళ బ్యూటి ఐశ్వర్య రాజేశ్ అనేక చిత్రాలతో అలరించింది. ముఖ్యంగా ఫీమెల్ సెంట్రిక్ సినిమాలు చేస్తూ సత్తా చాటుతోంది. ఇప్పటికే ఆమె 'డ్రైవర్ జమున', 'రన్ బేబీ రన్', 'ది గ్రేట్ ఇండియన్ కిచెన్' సినిమాలతో ఆకట్టుకుంది. ఇవన్నీ ఈ ఏడాది విడుదల అయినవి కావడం విశేషం. ఇటీవలే మే 12న 'ఫర్హానా' అనే మూవీతో థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అలాగే బాక్సాఫీస్ వద్ద మంచి టాక్ తెచ్చుకున్న 'స్వప్న సుందరి' సినిమాతో అదే మే 12న ఓటీటీలో సందడి చేయడానికి వచ్చేసింది. ఈ డార్క్ కామెడీ థ్రిల్లర్ గా వచ్చిన ఈ మూవీ (Soppana Sundari Telugu Review) ఎలా ఉందో చూద్దామా!

కథ: అహల్య (ఐశ్వర్య రాజేశ్) మధ్య తరగతి కుటుంబానికి చెందినది. ఆమె తండ్రి అనారోగ్యంతో మంచాన పడతాడు. అక్క (లక్ష్మీ ప్రియ చంద్రమౌళి) మూగది. అన్నయ్య దొర (కరుణాకరన్) ప్రేమించి పెళ్లి చేసుకుని కుటుంబానికి దూరంగా వేరే కాపురం పెడతాడు. ఫ్యామిలీ చూసుకునేందుకు నగల దుకాణంలో పని చేస్తుంటుంది అహల్య. ఈ క్రమంలో వారికి లక్కీ డ్రాలో రూ. 10 లక్షల విలువ చేసే కారు బహుమతిగా వస్తుంది. ఆ కారు వల్ల అహల్య అక్కకు మంచి పెళ్లి సంబంధం వస్తుంది. దీంతో అంతా సంతోషిస్తారు.

Soppana Sundari Review

ఆసక్తికర అంశాలు: ఇలా సంతోషంగా ఉన్న సమయంలో కారు పగిలిపోయి పోలీస్ స్టేషన్ లో ఉంటుంది. కారు పోలీస్ స్టేషన్ కు ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? కారు విషయం తెలుసుకున్న అహల్య అన్నయ్య దొర తన బావ డేంజర్ మామ (మైమ్ గోపీ)తో కలిసి ఎందుకు గొడవకు దిగాడు? పోలీస్ స్టేషన్ నుంచి కారును విడిపించుకునేందుకు అహల్య, దొర ఎలాంటి ప్రయత్నాలు చేశారు? అహల్యపై కన్నేసిన ఎస్సై ఏం చేశాడు? చివరికి ఆ కారు ఎవరి చెంతకు చేరింది? వంటి ఆసక్తికర విషయాలు తెలియాలంటే స్వప్న సుందరి (Soppana Sundari Movie) చూడాల్సిందే.

Soppana Sundari Review

విశ్లేషణ: మధ్యతరగతి కుటుంబాలకు కాలం వెల్లదీయడమే పెద్ద సవాల్ గా ఉంటుంది. అలాంటిది లక్కీ డ్రాలో రూ. 10 లక్షల కారు వస్తే.. ఇక వాళ్ల సంతోషం ఎలా ఉంటుందో చెప్పాల్సిన పని లేదు. ఈ కాన్సెప్టునే ఆద్యంతం కామెడీ, థ్రిల్లింగ్ అంశాలతో సక్సెస్ ఫుల్ గా తెరకెక్కించారు డైరెక్టర్. లక్కీ డ్రాలో కారు రావడంతోనే సినిమా స్టార్ట్ అవుతుంది. మొదటి నుంచి కామెడీ సీన్లు పడి తెగ నవ్వించేస్తాయి. తర్వాత కారు పోలీస్ స్టేషన్ లో ఉండటం చూపించి మరింత ఆసక్తి పెంచారు. అలా ఎందుకు జరిగిందనే విషయాలను చూపిస్తూ మూవీపై ఇంట్రెస్ట్ క్రియేట్ చేశారు.

Soppana Sundari Review

నవ్వు తెప్పించే ట్విస్టులు: కారు పోలీస్ స్టేషన్ లో ఉండటం, దానికోసం ఎందుకు టెన్షన్ పడుతున్నారో అనే విషయాలు సీరియస్ అయినప్పటికీ మనకు మాత్రం చాలా నవ్వు తెప్పిస్తాయి. ఆ సన్నివేశాల్లో వచ్చే బీజీఎమ్, పాత్రల నటన మనల్ని నవ్వేలా చేస్తుంది. ఇక కారు కోసం అహల్య, అన్న దొర చేసే ప్రయత్నాలు కూడా ఆకట్టుకుంటాయి. సినిమాలో కొన్ని చోట్ల సీన్లు ఊహించవచ్చు. కనీ చాలా వరకు వచ్చే ట్విస్టులు మాత్రం ఆశ్చర్యపరచడమే కాదు నవ్వు తెప్పిస్తాయి.

Soppana Sundari Review

థ్రిల్లింగ్ క్లైమాక్స్..: గంట తర్వాత సినిమా కాస్తా సీరియస్ ట్రాక్ లోకి వెళ్లి థ్రిల్లింగ్ గా ఉంటుంది. అహల్య పాత్ర వేసే ప్లాన్స్ సస్పెన్సింగ్ గా ఆకట్టుకుంటాయి. అయితే కొన్ని సీన్ల వద్ద సినిమా లిబర్టీ తీసుకున్నారు. అలాగే కొన్ని విషయాల్లో లాజిక్ మిస్ అయ్యారు. క్లైమాక్స్ లో ఒక పాత్ర చెప్పే విషయం థ్రిల్లింగ్ గా ఉంటుంది. స్క్రీన్ ప్లే చాలా బాగుంది. దాని వల్లే ట్విస్టులు, కామెడీ జెనరేట్ అయ్యాయి. జీఎస్ చార్లెస్ కథ, దర్శకత్వంలో సక్సెస్ అయ్యారనే చెప్పవచ్చు. పాటలు పర్వాలేదు. బీజీఎమ్ మాత్రం ఆకట్టుకుంటుంది. మిగతా సాంకేతిక అంశాలు, నిర్మాణ విలువలు అంతా బాగున్నాయి.

ఎవరెలా చేశారంటే?: ఐశ్వర్య రాజేశ్ మరోసారి తన నటనతో ఆకట్టుకుంది. ఓవైపు అమాయకత్వంగా ఉంటూనే మరోవైపు ఫ్యామిలీ కోసం ఏమైనా చేసే యువతిగా అలరించింది. ఇక దీపా శంకర్, లక్ష్మీ ప్రియల నటన కూడా సినిమాకు చాలా ప్లస్ అయింది. ముఖ్యంగా దీపా శంకర్ నటన చాలా వరకు హైలెట్ అవుతుంది. మిగతా నటీనటులందరూ అదరగొట్టారు.

ఫైనల్ గా చెప్పాలంటే?: ఒక లక్కీ డ్రాలో వచ్చిన కారును కాపాడుకునేందుకు తల్లీ కూతుళ్లు చేసిన ప్రయత్నమే స్వప్న సుందరి. రెండు మూడు అంశాలు తప్పితే 2 గంటల సినిమా మొత్తం అలా ఫ్లోలో వెళ్లిపోతూ కామెడీ పంచుతుంది. సినిమా చూశాకా మాత్రం ఈ అహల్య అమాయకురాలు (అత్తారింటికి దారేది సినిమాలో పవన్ కల్యాణ్ డైలాగ్) కాదనిపిస్తుంది. ఇక దురాశ దుఃఖానికి చేటు అన్న సందేశాన్ని కామెడీతో చూపించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X