For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఐతే..బావుంది

  By Staff
  |

  Aithey
  - జలపతి
  చిత్రం: ఐతే
  నటీనటులు: మోహిత్‌, మరికొందరు కొత్త కుర్రాళ్లు, పవన్‌ మల్హోత్రా, శివాజీరాజా
  సంగీతం: కళ్యాణీ మాళిక్‌
  నిర్మాతలు: గుణ్ణం గంగరాజు, వెంకట్‌ డేగా
  కథ, స్క్రీన్‌ ప్లే, దర్శకత్వం: చంద్రశేఖర్‌ ఏలేటి

  టీనేజ్‌ ప్రేమకథలు, ఫ్యాక్షన్‌ కథలు, సెంటిమెంట్‌ దృశ్యాల చిత్రాలకు...భిన్నంగా అప్పుడప్పుడు మాత్రమే కొన్ని చిత్రాలు తళుక్కున టాలీవుడ్‌ తెరపై మెరుస్తుంటాయి. 'ఐతే' అనే ఈ చిత్రం అలాంటిదే. సినిమా ప్రక్రియ (Genre) రాంగోపాల్‌ వర్మ నిర్మించిన 'మనీ' చిత్రం ప్రక్రియే (కిడ్నాప్‌ డ్రామా) ఐనప్పటికీ, స్టైల్‌ గా సినిమాతీయడం, కథనంలో అనవసరమైన గందరగోళం, డిస్ట్రాక్షన్స్‌ లేకపోవడంతో సినిమా విభిన్నంగా, కొత్తగా అన్పిస్తుంది. ఐతే అన్ని సినిమాలు ఒకేలా ఉంటాయని రుజువు చేస్తూ ఈ సినిమాల్లోనూ హీరోల కిడ్నాప్‌ నకు పులికొల్పే కారణాలు, దృశ్యాలు పాతవాటినే ఎన్నుకున్నారు.

  నలుగురు కొత్త కుర్రాళ్ళ నటనలో ఈజ్‌, హిందీ నటుడు పవన్‌ మల్హోత్రా చక్కటి నటన, సెంథిల్‌ కుమార్‌ అద్భుతమైన ఫోటోగ్రపీతో సినిమా ఆద్యంతం ఆకట్టుకొంటుంది. అసలు బోరంటూ లేని ఈ సినిమాకు మరో ప్లస్‌ పాయింట్‌ కళ్యాణీ మాళిక్‌ అందించిన బ్యాక్‌ గ్రౌండ్‌ సంగీతం, సహజమైన డైలాగ్స్‌. దాదాపు అంతా హైదరాబాద్‌, పరిసర ప్రాంతాల్లోనే తీసినప్పటికీ ఒక్క లోకేషన్‌ 'పాత'గా అన్పించకుండా, స్టైల్‌ గా తీశారీ సినిమాను.

  సినిమా ప్రదానంగా కిడ్నాప్‌ డ్రామా అయితే, ఈ సినిమాలో కొత్త కోణం ఏమిటంటే తమను రిక్రూట్‌ చేసుకున్నవాడినే 'కాకతాళీయం'గా కిడ్నాప్‌ చేయడం. హైదరాబాద్‌ లోని ఓ నలుగురు కుర్రాళ్ళు మంచి స్నేహితులు. వారిలో ఒక్కోక్కరిది ఒక్కో మనస్థత్వం. ఒక్కోరకమైన కష్టాలు వారివి. అయితే, వీరందరికి కామన్‌ గా డబ్బే ప్రధాన సమస్య. ఈజీ మనీ కోసం ప్రయత్నిస్తున్న సమయంలో మాఫియా లీడర్‌ ఇర్ఫాన్‌ ఖాన్‌ (పవన్‌ మల్హోత్రా)పై ప్రభుత్వం 50 లక్షల రివార్డు ప్రకటించిన విషయం తెలుస్తుంది. మరోవైపు, ఇర్ఫాన్‌ ఖాన్‌ తన అనుచరులతో ఈ నలుగురు కుర్రాళ్ళను ప్లైట్‌ హైజాక్‌ చేసేందుకు రిక్రూట్‌ చేసుకుంటాడు. కానీ వీరు ఇర్ఫాన్‌ ను కిడ్నాప్‌ చేసి అడవుల్లోకి తీసుకువెళుతారు. అక్కడి నుంచి వీరు రివార్డు మనీ కోసం పడే పాట్లు, దానికి కౌంటర్‌ ప్లాన్‌ లతో...సినిమా సాగుతుంది.

  నూతన దర్శకుడు చంద్రశేఖర్‌ ఏలేటి ప్రతిభ ఉన్నవాడని ఈ సినిమాతో రుజువు చేసుకున్నాడు. పకడ్బందీ స్క్రీన్‌ ప్లే, కొత్త తరహా చిత్రీకరణతో ఆయన ఆకట్టుకుంటాడు. గుణ్ణం గంగరాజు మాటలు బాగున్నాయి. సహజంగా ఉన్నాయి. విలన్‌ కు కూడా ఆయనే డబ్బింగ్‌ చెప్పారు. ఇంతకుముందు అమ్మాయిలు, అబ్బాయిలు చిత్రంలో నటించిన మోహిత్‌ ఈ సినిమాలో మరింత పరిణితి కన్పించగా మిగతా ముగ్గురు కుర్రాళ్ళు తమ పాత్రలకు న్యాయం చేశారు. స్థూలంగా స్టైలిష్‌ గా తీసిన థ్రిల్లర్‌ చిత్రం. ఐతే, సినిమా టైటిల్‌ మాత్రం బాగాలేదనే చెప్పాలి.

   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X