ముగిసింది... (‘ఆట ఆరంభం’రివ్యూ)
---సూర్య ప్రకాష్ జోశ్యుల
'తను ఎందుకెలా మారాడో తెలుసా? ...అసలు అతని జీవితంలో ఏం అన్యాయం జరిగిందా తెలుసా?' ... అంటూ హీరో రివేంజ్ ఫ్లాష్ బ్యాక్ ని హీరోయిన్ ఉద్వేగంగా చెప్పటం ప్రారంభిస్తుంది....సెకండాఫ్ లో వచ్చే ఈ సన్నివేశాన్ని మనం ఇప్పటివరకూ ఎన్ని సినిమాల్లో చూసి ఉంటాం...అయినా మరో సారి చూడాలంటే 'ఆట ఆరంభం'థియోటర్ లోకి దూకాల్సిందే. పవన్ తో పంజా చిత్రం రూపొందించిన దర్శకుడు విష్ణు వర్ధన్ రీసెంట్ తమిళ హిట్ ఆరంభం ను తెలుగులో 'ఆట ఆరంభం' పేరుతో డబ్ చేసారు. అయితే తమిళంలో అజిత్ కి ఉన్న క్రేజ్ వేరు. నయనతార తో వచ్చి సూపర్ హిట్టైన బిళ్లా కాంబినేషన్ రేంజి వేరు. అదే తెలుగుకు వచ్చేసరికి ఇక్కడ కథ,కథనమే డబ్బింగ్ సినిమాలకు దిక్కు. భాషా టైప్ ఫ్లాష్ బ్యాక్ చిత్రాలు ఎన్నో చూసిన మనకు ఆ అంశమే ఈ చిత్రంలో బాగా రొటీన్ గా అనిపిస్తుంది. అదే ఈ చిత్రం ఫేట్ ని డిసైడ్ చేస్తుంది.
అర్జున్(ఆర్య) ఓ కంప్యూటర్ హ్యాకర్. అశోక్(అజిత్),మాయ(నయనతార) కలిసి అతన్ని కిడ్నాప్ చేసి బెదిరించి...అతని చేత హై సెక్యులర్ సిస్టమ్స్ ని హాక్ చేయిస్తూంటారు. ఆర్య గర్ల్ ప్రెండ్ అనిత(తాప్సి) ఓ జర్నలిస్ట్. ఆమె కూడా ఈ క్రైమ్ లో తెలియకుండానే ఇరుక్కుంటుంది. అశోక్,మాయ నుంచి వారిద్దరూ తప్పించుకుందామని చూస్తారు. ఈ లోగా పోలీస్ డిపార్టమెంట్ సైతం వీరిని పట్టుకోవటానికి విశ్వప్రయత్నం చేస్తూంటుంది. వాళ్లకి అర్జున్ ఓ క్లూ ఇచ్చి...వీరిని పట్టుకునేలా చేసి తను బయిటపడదామనుకుంటాడు. ఈ క్రమంలో అర్జున్ కి..మాయ ఓ నిజం చెప్తుంది. అశోక్ ఎందుకు లా బ్రేకర్ గా మారాడు...అతని అసలు లక్ష్యం ఏమిటన్నది వివరిస్తుంది. ఇంతకీ అశోక్ ప్లాష్ బ్యాక్ ఏమిటి... కథలో సంజయ్(రానా) పాత్ర ఏమిటి...చివరకు వారు సాధించే లక్ష్యం ఏమిటి అనే విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.
మొదటే చెప్పుకున్నట్లు ఈ సినిమాలో బిల్డప్ ఎక్కువ బిజెనెస్ తక్కువ అన్నట్లు ..దర్శకుడు షాట్స్ తో హడావిడి చేస్తూ బిజిగా ఉంటాడు. కానీ కథ మాత్రం ఇంచె కూడా కదలకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకుంటాడు. అయితే ఈ చిత్రం ఫస్టాఫ్ మాత్రం బాగా టైట్ స్క్రీన్ ప్లే తో డిజైన్ చేసారు. సెకండాఫ్ దాదాపు నలభై నిముషాల పాటు ఫ్లాష్ బ్యాక్ చెప్పి విసిగిస్తాడు. ఫ్లాష్ బ్యాక్ అయ్యాక మొయిన్ విలన్ ని మట్టుపెట్టడంతో కథ పూర్తవుతుంది. దాదాపు అంతా ప్రెడిక్టుబుల్ గానే సా....గుతుంది. ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్ ముందు టెక్నికల్ డిటేల్స్ తో మన మైండ్స్ పై దాడి చేసిన ఫీలింగ్ కలగచేస్తాడు. ఫస్టాఫ్ లో ఉన్నట్లుగానే కథనం ..సెకండాఫ్ లో కూడా టెన్షన్ తో ముందుకు వెళితే బాగుండేది. అలాగే... తెలుగు ప్రేక్షకులు ఎక్కువగా ఇష్టపడే ఫన్ కూడా ఈ సినిమాలో లేకుండాపోయింది.
మిగతా రివ్యూ స్లైడ్ షో లో...

హాలీవుడ్ స్పూర్తి...
హాలీవుడ్ చిత్రం Sword Fish పోలికలతో వచ్చిన ఈ చిత్రంలో తమిళ ఆడియన్స్ తగినట్లు కొంత అతి కూడా బాగా ఉంది. అది ముఖ్యంగా పాటల్లో బాగా కనపడుతుంది. రాజకీయాలు,మీడియా, పోలీస్ లలో కరప్షన్ వల్ల బలైపోయిన ఓ వ్యక్తి కథ ఇది.

రంగదే బసంతి
అలాగే ఈ చిత్రం హిందీ సినిమా రంగ్ దే బసంతిని కూడా గుర్తు చేస్తుంది. అందులో మెయిన్ పాయింట్ పూర్తిగా ఈ చిత్రం మూలాన్ని పోలి ఉంటుంది. బుల్లెట్ ఫ్రూఫ్ స్కామ్ చుట్టూ ఈ కథ అల్లబడింది. పూర్తి రివేంజ్ గా అల్లబడిన ఈ కథ కాస్త ప్రెడిక్టబులిటి తగ్గించి స్క్రిప్టు రాస్తే బాగుండేది.

అజిత్
అజిత్ ఈ చిత్రం కోసం ప్రత్యేకంగా వర్కవుట్స్ చేసారు. చాలా స్ట్రిక్ట్ గా చేసిన వర్క్ అవుట్స్ బాడీని ఈ సినిమాలో చూపలేదు. డాన్స్ లలో కూడా విజువల్ గా ఇంపాక్ట్ చూపలేకపోయారు. కొన్ని సీన్స్ లలో డైలాగులలో తప్పిస్తే..అజిత్ ఓ నార్మల్ హ్యూమన్ బీయింగ్ కనపడటం సినిమాకు ప్లస్ అయ్యింది.

నయనతార
నయనతారకు దాదాపు హీరోకు ఇచ్చినంత ఇంపార్టెన్స్ ఇచ్చారు. అయితే నయనతార,అజిత్ మధ్య ఏ రిలేషన్ ఉందో ఎస్టాబ్లిష్ చేయలేదు. భార్యభర్తలా లేక లవర్స్ అనేది తేల్చలేదు. కొన్ని చోట్ల నయనతార చాలా గ్లామర్ గా కనిపించి ఫ్యాన్స్ కు పండుగ చేసింది.

ఆర్య,తాప్సి
సినిమాలో ఉన్న కొద్దో గొప్పో ఎంటర్టైన్మెంట్ సీన్స్ వీరిద్దరి మధ్యనే ఉన్నాయి. వీరి మధ్య వచ్చే కాలేజి సీన్స్ బాగున్నాయి. తాప్సీ చాలా క్యూట్ గా ఉంది. ఆర్య కూడా ఎప్పటిలాగే చాలా బాగా చేసాడు.

కీ రోల్స్ ...
మహేష్ ముంజ్రేకర్, అతుల్ కులకర్ణి, కిషోర్ వంటి పాత్రధారులు బెస్ట్ ఫెరఫార్మెన్స్ ఇచ్చారు. సుమన్ రంగనాధన్, అక్షర గౌడ తో ఉన్న సీన్స్ కూడా ఓకే. దగ్గుపాటి రానా యావరేజ్ అనిపిస్తాడు.అజిత్ ముందు దగ్గుపాటి రానా పూర్తిగా తేలిపోయాడు.

కాస్టూమ్స్..
దర్శకుడు విష్ణు వర్ధన్ భార్య అను డిజైన్ చేసిన కాస్టూమ్స్ సినిమాకు బాగా ప్లరస్ అయ్యాయి. లీడ్ యాక్టర్స్ కి ఆమె చాలా జాగ్రత్తగా సీన్స్ ని అర్దం చేసుకుని డిజైన్ చేసారు. అయితే అజిత్ కి మరింత బాగా నప్పేలా డిజైన్ చేస్తే బాగుండేది అని కొందరు కామెంట్ చేస్తున్నారు. కొరియోగ్రఫి.. ఈ సినిమాకు పెద్ద మైనస్.

ఎడిటింగ్
శ్రీకర్ ప్రసాద్ లాంటి స్టార్ ఎడిటర్ ..కత్తెర మొద్దుబారిందేమో అనిపిస్తుంది. ఆయన స్టాండర్డ్స్ కు తగ్గట్లుగా ఉండదు. చాలా సీన్స్ డ్రాగ్ చేస్తూ...పనికిరానివి ఉంటాయి. వాటిని ఎడిట్ చేస్తే మరింత బాగుండేది.

టెక్నికల్ గా...
ఈ చిత్రం వీడియో సాంగ్స్, ట్రైలర్స్ చూస్తేనే...మనకి ఓం ప్రకాష్ సినిమాటోగ్రఫి పై ఓ నమ్మకం వచ్చేస్తుంది మనకి. ఈ చిత్రంలో పెద్ద ప్లస్ పాయింట్ కెమెరా వర్క్. అవట్ స్టాండింగ్ గా ఉంది. చాలా స్టైలిష్ గా షాట్స్ ని కంపోజ్ చేసారు. విజువల్స్ ..అజిత్ ఫ్యాన్స్ పండుగ చేసుకునేలా ఉంటాయి.

ట్విస్ట్ లు..టర్న్ లు
ఈ సినిమాలో బోల్డు ట్విస్ట్ లు టర్న్ లు ఉన్నాయి. అయితే చాలా జాగ్రత్తగా సినిమాపై పూర్తి దృష్టి చూస్తేనే వాటిని ఎంజాయి చేయగలం. అలాగే..అజిత్ ని ఎప్పటిలాగే సూపర్ హీరోలాగ చూపించకపోవటం సినిమాకున్న మరో ప్లస్ పాయింట్

రీరికార్డింగ్..సాంగ్స్
పాటలు మాత్రం చాలా డల్ గా ఉన్నాయి. సినిమా పాటలు పెద్ద ఉపయోగపడకపోయినా..బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం అదిరిపోయింది. యవన శంకర్ రాజా మాత్రం రీరికార్డింగ్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుని డిజైన్ చేసారు.

ఎవరెవరు
బ్యానర్ : ఓమిక్స్ క్రియేషన్స్
నటీనటులు : అజిత్, ఆర్య , నయనతార, తాప్సీ, దగ్గుబాటి రానా తదితరులు
సంగీతం: యువన్‌శంకర్‌రాజా,
ఫొటోగ్రఫీ: ఓంప్రకాశ్,
నిర్మాత: డా.శ్రీనుబాబు జి., స్క్రీన్ ప్లే, దర్శకత్వం: విష్ణువర్థన్.
ఫైనల్ గా ఇదే కాంబినేషన్ లో గతంలో బిళ్లా అనే స్టైలిష్ ఎంటర్టైనర్ వచ్చిన సంగతి తెలిసిందే. అదే దృష్టిలో పెట్టుకుని మాత్రం థియేటర్స్ కు వెళ్లకండి. అలాగే తమిళంలో పెద్ద హిట్టైంది కదా..చాలా బాగుంటుందని కూడా హై ఎక్సపెక్టేషన్స్ పెట్టుకుని వెళ్లకుండా ఉంటే ఓకే అనిపిస్తుంది.
(గమనిక: వినోదం, అసభ్యం లేకపోవటం, సాంకేతిక విలువలు, కథన నైపుణ్యం తదితర అంశాల ఆధారంగా మా రేటింగ్ ఉంటుంది)


Click it and Unblock the Notifications











